For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుదీనా ఆవిరితో జలుబు మాయం! మరికొన్ని ఉపయోగాలు కూడా..!

|

పుదీనా గురించి మనందరికీ తెలుసు. ప్రకృతి అందించిన ఆరోగ్య వరాలు.. ఆకు కూరలు.. ఇవి కల్గించే ప్రయోజనం అంతా ఇం తా కాదు. ఆకుకూరలు శరీరానికి కావల్సిన అనేక రకాల ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీ న్లు అందిస్తాయి. మనిషి జీవనశైలినే మార్చే సత్తా ఆకుకూరలకు ఉంది. అందులో పుదీనాది ప్రత్యే కమైన స్థానం.

ఈ పుదీనాను కూరల్లో వేసుకున్నా దీనితో విడి వంటకాన్ని తయారు చేసుకున్నా ఆ రుచే వేరు. పుదీనా పచ్చడి, పుదీనా రైస్, పుదీనాతో ఆహారాలపై గార్నిష్ ఇలా ఏదోఒక రూపంలో పుదీనాను ఆహారంలో చేర్చుకుంటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

చైనీయులు దీన్ని అందానికి ఔషధంలా ఉపయోగిస్తారు. అందుకే దీన్ని చిన్న చిన్ని సమస్యలకు ఎలా ఔషధంగా వాడకోవచ్చో నిపుణులు సూచిస్తున్నారు.

పెప్పర్ మింట్ టీ లో గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఈ ఆకుల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌ సి, డి, ఇ-లతోపాటు తక్కువ మొత్తంలో విటమిన్‌ బి కాంప్లెక్స్‌ ఉంటుంది. ఇవన్నీ మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

పుదీనా జీర్ణక్రియకు తోడ్పడుతుంది.

పుదీనా జీర్ణక్రియకు తోడ్పడుతుంది.

కడుపు నొప్పి, మంటను తగ్గిస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారు పుదీనాను తరచూ తీసుకోవడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది. భోజనం తర్వాత ఓ కప్పు పుదీనా టీ తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య ఎదురుకాదు.

దంత క్షయాన్ని నివారిస్తాయి.

దంత క్షయాన్ని నివారిస్తాయి.

పుదీనాలో యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఎక్కువ. ఇవి రకరకాల ఇన్ఫెక్షన్లూ, నొప్పుల నుంచి మనల్ని కాపాడతాయి. దంత క్షయాన్ని నివారిస్తాయి. దంతాలూ, నాలుకనూ శుభ్రం చేసి నోటి దుర్వాసనను పోగొడతాయి. ప్రతిరోజూ కొన్ని పుదీనా ఆకులను నమలడం వల్ల దంత సమస్యలు రాకుండా నిరోధించవచ్చు.

పుదీనా ఇలా తీసుకుంటే మరింత ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు

జలుబూ, దగ్గు నివారిస్తుంది

జలుబూ, దగ్గు నివారిస్తుంది

జలుబూ, దగ్గుతో బాధపడుతున్నప్పుడు వేడినీటిలో పుదీనా ఆకులను వేసి ఆవిరి పట్టి చూడండి. అలాగే ఈ వేడి ఆవిరిని నోటితో పీల్చి ముక్కుతో వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ముక్కు, నోరు, గొంతు శుభ్రపడతాయి. గాలి పీల్చడానికి ఇబ్బంది ఉండదు.

 అలర్జీలనూ, ఆస్తమానూ తగ్గిస్తాయి.

అలర్జీలనూ, ఆస్తమానూ తగ్గిస్తాయి.

పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లూ రకరకాల అలర్జీలనూ, ఆస్తమానూ తగ్గిస్తాయి.

 నెలసరి సమయంలో వచ్చే నొప్పులను పుదీనా నియంత్రిస్తుంది.

నెలసరి సమయంలో వచ్చే నొప్పులను పుదీనా నియంత్రిస్తుంది.

నెలసరి సమయంలో వచ్చే నొప్పులను పుదీనా నియంత్రిస్తుంది. గర్భిణులకు ఉదయం పూట ఎదురయ్యే బడలికనూ, అసౌకర్యాన్నీ నివారించడంలోనూ పుదీనా అద్భుతంగా పనిచేస్తుంది.

సమ్మర్ లో ఉదయాన్నే పుదిన వాటర్ తాగడం వల్ల పొందే హెల్త్ బెన్ఫిట్స్

మెమరీ పెంచుతుంది:

మెమరీ పెంచుతుంది:

పుదీనా రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే బ్రెయిన్ అలర్ట్ నెస్ పెరుగుతుంది, మతిమరుపు తగ్గిస్తుంది. అందువల్ల పుదీనాను ఏదో ఒక రకంగా రోజువారి ఆహారాల్లో చేర్చుకోవడం, లేదా మింట్ రిఫ్రెష్ నెస్ చూయింగ్ గమ్ నమలడం కూడా మంచిదే.

English summary

Amazing Ways Mint or Pudina Keeps You Healthy

Amazing Ways Mint or Pudina Keeps You Healthy,Mint is a herb and its medicinal properties were discovered several hundreds of years ago. Today, mint is used in many products like inhalers, pastes, gums and it is also available as an essential oil. It can prevent so many disorders and it can treat some health
Story first published: Wednesday, August 2, 2017, 19:00 [IST]