For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెలసరి నొప్పులను ఆపటానికి పాటించాల్సిన ఆయుర్వేద సూచనలు

By Deepti
|

నెలసరి సమయంలో స్త్రీలకు అసౌకర్యం, నొప్పి కలగటం సహజమే. నెలసరిలో అవకతవకలు కూడా స్త్రీలలో చాలా సహజం.

ఈ సామాన్య సమస్యకు పరిష్కారాన్ని ఆయుర్వేద కోణంలో అర్థం చేసుకుందాం. ఆయుర్వేదం ప్రకారం, నెలసరి నెప్పులు వాయుశక్తికి సంబంధించినవి. నెలసరిలో వచ్చే రక్తం ఒక ఆరోగ్య గర్భానికై సేకరింపబడేది; కానీ గర్భధారణ జరగకపోవటంతో అది ప్రతినెలా నెలసరిగా బయటకి వస్తుంది.

గర్భాశయంలోని లోపలిపొరను తొలగించి బహిష్టును సృష్టించటంలో వాత స్థితి సాయపడుతుంది.

ayurvedic remedies for menstrual cramps

మెనుస్ట్రువల్ క్రాంప్స్ అండ్ పెయిన్ నివారించే ఉత్తమ హోం రెమెడీలు మెనుస్ట్రువల్ క్రాంప్స్ అండ్ పెయిన్ నివారించే ఉత్తమ హోం రెమెడీలు

మీ నెలసరి మొదలయ్యేముందు,మీ శరీరం వాత స్థితిలో ఉంటుంది, అందువల్ల మీరు దాన్ని పెంచే పనులు ఏవీ చేయరాదు. మీ నెలసరి మొదలయ్యేముందు మీ ఆహారంలో అనేక వేడి పదార్థాలు,ద్రవాలు తీసుకోటం మంచిది. చియా విత్తనాలు, అవకాడోలు, హెంప్ విత్తనాల వంటి ఆరోగ్యకర కొవ్వులను కూడా జతచేయవచ్చు.

ఈ వ్యాసంలో మేము మీ కోసం నెలసరి సమస్యలకు మేటి ఆయుర్వేద పరిష్కారాలను అందించాం. వాటికోసం ఇకపై చదవండి.

1.అల్లం

1.అల్లం

అల్లం పై తొక్కును తీసేసి సన్న ముక్కలుగా తరిగి తేనెలో నానబెట్టండి. ఇది అల్లానికి ఊరగాయ ప్రభావాన్ని అందిస్తుంది. ఈ అల్లం స్వీట్లను ఉపాహారం ముందు, మధ్యాహ్న భోజనం ముందు తీసుకోండి. ఇది మీ నెలసరి సమస్యల ప్రభావం తగ్గించటంలో సాయపడుతుంది.

2.జీలకర్ర

2.జీలకర్ర

ఒక చెంచాడు జీలకర్రను వేడి టీలో కలిపి తీసుకుంటే మీ నెలసరిని, లింఫ్ వ్యవస్థను సరిచేసి అది సరిగా నియంత్రిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, జీలకర్ర ఆరోగ్యాన్ని పెంచుతుంది. నెలసరి అసౌకర్యాలకి ఇదే మంచి పరిష్కారం.

3. డ్రై ఫ్రూట్స్

3. డ్రై ఫ్రూట్స్

కిస్మిస్ లు, ఫిగ్స్, ప్రూన్స్ వంటి డ్రైఫ్రూట్లను మీ దైనందిక ఆహారంలో తీసుకోటం వల్ల మీ నెలసరి అవకతవకలు సరి అవుతాయి. ఇవి మీ శరీరంలో మెత్తదనాన్ని పెంచి, శక్తిని ‘అపానవాయు'గా కిందవైపు వెళ్ళేట్లు చేస్తాయి. ఇది నెలసరికి సంబంధించినది.

4. అవిసె గింజలు

4. అవిసె గింజలు

అవిసె గింజలు కూడా నెలసరి సమస్యలకు మంచి చిట్కాగా పనిచేస్తుంది. మీ నెలసరి సమయంలో రెండు చెంచాల అవిసె గింజలను తినడం మంచిది. ఇవి శరీరంలో ప్రోస్టాగ్లాండిన్ స్థాయిలను తగ్గించటంలో సాయపడతాయి.

5.తేనె, నిమ్మ టీ

5.తేనె, నిమ్మ టీ

బ్లాక్ టీలో అర చెంచాడు తరిగిన అల్లం కలపండి. రెండు చెంచాల నిమ్మరసాన్ని ఒక చెంచాడు తేనెను జతచేయండి. ఈ టీని రోజంతా తీసుకోండి. ఇది కూడా నెలసరి నెప్పికి మంచి ఆయుర్వేద పరిష్కారం.

పీరియడ్స్ లో పొట్టనొప్పి, తిమ్మెర్లను నివారించే 7 హోం రెమెడీస్పీరియడ్స్ లో పొట్టనొప్పి, తిమ్మెర్లను నివారించే 7 హోం రెమెడీస్

6. తులసి ఆకులు

6. తులసి ఆకులు

చేతినిండా తులసి ఆకులను ముక్కలుచేసి, రసాన్ని బయటకి తీయండి. రెండు చెంచాల ఈ రసాన్ని వేడి నీటి గ్లాసులో కలిపి రోజుకు మూడుసార్లు తాగండి. ఇది నెలసరి సమస్యకు అత్యధిక ప్రభావాన్ని చూపే చిట్కా.

7. వెల్లుల్లి

7. వెల్లుల్లి

వెల్లుల్లి తొక్క తీసి 5-7 రెమ్మలను ప్రతిరోజూ తీసుకోండి. వీటిని మజ్జిగ లేదా నిమ్మరసంతో తీసుకోవచ్చు.

8.ఇంగువ

8.ఇంగువ

ఇంగువ పొడిని ఒక చెంచా మీ ఆహారంలో కాని మజ్జిగలో కానీ తీసుకోండి. ఆయుర్వేదం ప్రకారం, అపానవాయు లోపం వల్ల నెలసరి సమస్యలు వస్తాయి. ఇంగువ తీసుకోవడం వల్ల నొప్పి, బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది.

9. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారం

9. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారం

కడుపునొప్పి వంటి లక్షణాలకు, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపను తీసుకోవటం మంచిది. ఇది ఉపశమనం ఇచ్చి ప్రోస్టాగ్లాండిన్స్ పనితీరును మెరుగుపర్చి నెప్పి, వాపులను తగ్గించే కారణాలను తొలగేలా చేస్తుంది.

10. కలబంద

10. కలబంద

కలబంద రుతుక్రమాన్ని సరిచేసి, కండరాల నొప్పులను తగ్గిస్తుంది. దాని గుజ్జు నుంచి రసాన్ని తీసి ఆరు చెంచాలు నీటితో కలిపి, ప్రతిరోజు రెండుసార్లు ఆహారం తర్వాత తీసుకోండి.

11.అశోకరిష్టా

11.అశోకరిష్టా

భారీ రుతుస్రావాన్ని, దాని నొప్పిని చికిత్స చేయటానికి దీన్ని ఆయుర్వేద మందుగా వాడతారు. 20మిలీ ల అశోకరిష్టం, దానికి సమానమైన నీటితో కలిపి ఆహారం తిన్న అరగంట తర్వాత 2-3నెలలు తీసుకోండి.

12. సూచించే కూరగాయలు

12. సూచించే కూరగాయలు

ఈ స్థితికి సూచించబడ్డ కూరగాయల్లో తెల్ల గుమ్మడి, బొప్పాయి, ములక్కాడలు, పొట్లకాయలు, కాకర మరియు దోసకాయలు మంచివి. బంగాళదుంపలు,పసుపు గుమ్మడి,వంకాయలకు దూరంగా ఉండండి.

English summary

Ayurvedic Guidelines To Be Followed To Prevent Menstrual Cramps

Ayurvedic remedies for menstrual cramps include ginger, cumin, dry fruits, etc. Read to know the best ayurvedic remedies for menstrual cramps.
Story first published:Saturday, July 8, 2017, 11:20 [IST]
Desktop Bottom Promotion