For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్ట దిగువ భాగంలో ఒక చిన్న మసాజ్ తో ఉపయోగాలేంటో తెలుసా?

పొట్ట దిగువన ఒక చిన్న మసాజ్! ఎందుకు అంటారా? చేసి చూడండి ఎన్ని ఉపయోగాలో మీకే తెలుస్తుంది నిద్ర లేచిన వెంటనే . పొట్ట ఉదరం క్రింది బాగంలో సుతి మెత్తగా మసాజ్ చేయాలి.

|

పొట్ట దిగువన ఒక చిన్న మసాజ్! ఎందుకు అంటారా? చేసి చూడండి ఎన్ని ఉపయోగాలో మీకే తెలుస్తుంది నిద్ర లేచిన వెంటనే . పొట్ట ఉదరం క్రింది బాగంలో సుతి మెత్తగా మసాజ్ చేయాలి. కొంత మందికి నిద్ర లేచిన వెంటనే టాయిలెట్ సమస్య. కొంత మందికి కొంచె దూరం నడిచినా, లేదా వేడినీళ్ళు తాగినా మలమూత్ర విసర్జన సాఫీ జరుగుతుంది. కానీ కొంత మందికి ఇలాంటి చిట్కాలు ఏమాత్రం పనిచేయవు.

అలాంటి వారు పొట్ట ఉదరంలో చిన్న పాటి మసాజ్ చేయడం వల్ల పొట్ట కండరాలు వదులవుతాయి. జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. ప్రేగుల్లోని వ్యర్థాలు వేగంగా ముందుకు నెట్టబడుతాయి.

 పొట్ట దిగువ భాగంలో ఒక చిన్న మసాజ్ తో ఉపయోగాలేంటో తెలుసా?

మీకు నచ్చిన మసాజ్ ఆయిల్ ను కొబ్బరి నూనెతో మిక్స్ చేయాలి. దీన్ని గోరువెచ్చగా చేసి ప్లోర్ మీద నిటారుగా పడుకుని, పొట్ట ఉదరం మీద గోరువెచ్చని నూనె వేసి సున్నితంగా కొన్ని నిముషాలు మసాజ్ చేయాలి. ఈ మసాజ్ పొట్ట ఉదరం బొడ్డు నుండి క్రింది బాగం వరకూ సర్క్యులర్ మోషన్ లో రెండు చేతులను ఉపయోగించి చేయాలి. ఇలా 50 నిముషాలు చేయడం వల్ల పొందే ఉపయోగాలేంటో తెలుసుకుందాం...

బొజ్జతో అనర్థాలు: బొజ్జ తగ్గించే చిట్కాలు బొజ్జతో అనర్థాలు: బొజ్జ తగ్గించే చిట్కాలు

1. మలబద్దకం నివారిస్తుంది:

1. మలబద్దకం నివారిస్తుంది:

నిద్రలేచిన వెంటనే పొట్ట ఉదరం నూనెతో మసాజ్ చేయడం వల్ల పొట్ట కండరాలు వదలై మలబద్దక సమస్యను నివారిస్తుంది. ప్రేగుల్లో వ్యర్థాలను తొలగించడానికి జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది.

2. గ్యాస్ట్రో ఇన్టెన్సినల్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

2. గ్యాస్ట్రో ఇన్టెన్సినల్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

పొట్ట ఉదరం క్రింది భాగంలో సున్నితమైన మసాజ్ ను రెగ్యులర్ గా చేయడం వల్ల గ్యాస్ట్రో ఇన్ టెన్సినల్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పొట్ట ఉదరంలో రక్త ప్రసరణ మెరుగుపడటం వల్ల ప్రేగులు చురుకుగా పనిచేస్తాయి.

 మ్యాజికల్ ఐడియా: బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి విక్స్ చెప్పే సీక్రెట్ !! మ్యాజికల్ ఐడియా: బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి విక్స్ చెప్పే సీక్రెట్ !!

3. మజిల్ టోన్ మెరుగవుతుంది :

3. మజిల్ టోన్ మెరుగవుతుంది :

పొట్ట ఉదరంలో రోజూ ఉదయం చిన్న పాటి మసాజ్ చేయడం వల్ల మజిల్ టోన్ మెరుగ్గా ఉంటుంది. నడుము చుట్టు చర్మం కాంతివంతంగా, టైట్ గా కనబడతుంది.

4. మెనుష్ట్రువల్ క్రాంప్స్ తగ్గిస్తుంది:

4. మెనుష్ట్రువల్ క్రాంప్స్ తగ్గిస్తుంది:

మహిళల్లో పొట్ట ఉదరంలో మసాజ్ చేయడం వల్ల రుతుక్రమ సమయంలో వచ్చే పొట్ట తిమ్మెర్లను, పొట్ట నొప్పిని తగ్గిస్తుంది. అలాగే రక్తస్రావం సమస్యలను నివారిస్తుంది. పీరియడ్స్ ప్రారంభం అవ్వడానికి 7, 8 రోజుల ముందు నుండి ఇలా మసాజ్ చేయడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది.

5. స్ట్రెస్ తగ్గిస్తుంది:

5. స్ట్రెస్ తగ్గిస్తుంది:

ఆబ్డామినల్ మసాజ్ వల్ల శారీరక ఉపయోగాలు మాత్రమే కాదు, మానసికంగా కూడా ఉపయోగపడుతుంది. మసాజ్ వల్ల స్ట్రెస్ తగ్గి, విశ్రాంతి పొందుతారు.

6. కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది:

6. కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది:

పొట్ట ఉదరం క్రింది భాగంలో నూనెతో మసాజ్ చేయడం వల్ల కడుపుబ్బరం తగ్గుతుంది. పొట్టలో వ్యర్థాలు ఎక్కువ చేరకుండా నివారిస్తుంది. ఎప్పటికప్పుడు పొట్టను శుభ్రపరుస్తుంది.

ఎక్సర్ సైజ్ చేస్తున్నా బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా ? ఎందుకు ? ఎక్సర్ సైజ్ చేస్తున్నా బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా ? ఎందుకు ?

7. హెచ్చరిక :

7. హెచ్చరిక :

కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారు, ఇన్ఫ్లమేషన్, అల్సర్, హెర్నియా, ఇంటర్నల్ బ్లీడింగ్ వంటి సమస్యలతో బాధపడే వారు ఆబ్డామినల్ ( పొట్ట ఉదరం) మసాజ్ చేసుకోకూడదు. అలాగే గర్భిణీలు కూడా ఖచ్చితంగా ఆబ్డామినల్ మసాజ్ కు దూరంగా ఉండాలి.

English summary

Benefits Of Lower Abdominal Massage

Benefits Of Lower Abdominal Massage, Here are some abdominal massage benefits
Desktop Bottom Promotion