For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాదం, జీడిప‌ప్పు, కిస్‌మిస్ తినే స‌రైన స‌మ‌యం ఏదో తెలుసా?

By Sujeeth Kumar
|

స్నాక్స్‌గా తినేందుకు మంచి ఆహారం ఏదంటే న‌ట్స్‌, డ్రైఫ్రూట్స్ అని చెప్పొచ్చు. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులు వీటిని తిన‌డం వ‌ల్ల చాలా ప్ర‌యోజ‌నాలున్నాయ‌ని ఢంకా మోగించి మ‌రీ చెబుతారు. ఈ చిన్న చిన్న న‌ట్స్ శ‌రీరంలో అద్భుత ఫ‌లితాలు ఇస్తాయ‌ని అంటారు.

ఒక‌ప్పుడు అలా అనుకునేవారు...

ఒక‌ప్పుడు న‌ట్స్‌లో కొవ్వు ప‌దార్థాలు ఎక్కువుంటాయ‌ని, చ‌క్కెర శాతం అధికంగా ఉంటుంద‌ని, కెలోరీలు భారీ స్థాయిలో ఉంటాయ‌ని అనేవారు. అయితే ఇప్పుడు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారంలో న‌ట్స్‌దే అగ్ర‌భాగం. న‌ట్స్‌లో కొవ్వు ప‌దార్థాలు ఉంటాయ‌న్న‌ది వాస్త‌వ‌మే. అయితే దాన్ని మంచి కొవ్వుగా తేల్చి అది శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు.

health benefits of nuts

జీడిపప్పులోని పవర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ జీడిపప్పులోని పవర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్

న‌ట్స్‌లో ఐర‌న్‌, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి పోష‌కాలుంటాయి. విట‌మిన్లు, ఫైబ‌ర్‌, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ పుష్క‌లంగా ఉంటాయి.

ఈ కొవ్వులు శరీరానికి త‌క్ష‌ణ శ‌క్తినిస్తే.. వీటిలోని మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్ దేహంలో వివిధ ప‌నులు స‌మ‌ర్థంగా జ‌రిగేందుకు తోడ్ప‌డ‌తాయి.

health benefits of nuts

మితిమీరి తింటే...
న‌ట్స్ తిన‌డం వ‌ల్ల చాలా ప్ర‌యోజ‌నాల‌నే ఉండు గాక‌! అయితే ఏదైనా మితిమీరి తింటే అన‌ర్థం. ఒంటికి ఏదైనా అతి మంచిది కాదు.

న‌ట్స్ తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయ‌న్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాగ‌ని వాటిని పరిమితికి మించి తింటే మాత్రం అన‌ర్థాలు ఎదురుకోవాల్సి ఉంటుంది. న‌ట్స్‌లో కొవ్వు శాతం బాగా ఎక్కువ‌. వీటిని ఎక్కువ‌గా తింటే శ‌రీరంలో కొవ్వు బాగా నిల్వ ఉండిపోతుంది. త‌ద్వారా బ‌రువు బాగా పెరిగే అవ‌కాశ‌ముంది.

అధిక కొవ్వు జీర్ణ శ‌క్తిని మంద‌గించ‌గ‌ల‌దు. వీటిని ఎక్కువ‌గా స్నాక్స్‌గా తీసుకుంటే బీపీ పెరిగే అవ‌కాశ‌ముంది. వీటిలో ఉండే హై ఫైబ‌ర్ వ‌ల్ల గ్యాస్‌, డ‌యారియా లాంటి ఇబ్బందులు ఏర్ప‌డ‌వ‌చ్చు.

health benefits of nuts

స‌రైన స‌మ‌యంలోనే..
న‌ట్స్ నుంచి అధిక ప్ర‌యోజ‌నాలు పొందేందుకు వాటిని స‌రైన స‌మ‌యంలో తీసుకోవ‌డం మేలు. మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్ ఎక్కువ‌గా న‌ట్స్‌ను ఉద‌యం పూట‌, అలాగే జీర్ణ‌క్రియ‌ను వేగ‌వంతం చేయ‌గ‌ల న‌ట్స్‌ను సాయంత్రం తీసుకుంటే ఒంటికి మంచిది.

న‌ట్స్ దేహానికి కావాల్సిన పోష‌కాలు అందించి రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది. ఎండు ఫ‌లాలు లేదా న‌ట్స్‌ను ఏ స‌మ‌యంలో తీసుకుంటే ఆరోగ్య‌క‌ర‌మో వివ‌రంగా ఇస్తున్నాం... వాటిని అదే స‌మ‌యంలో తిని ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు అందుకోండి.

డ్రైఫ్రూట్స్ ను తినడానికి ముందు ఎందుకు నానబెట్టాలి? లాభాలేంటి..?డ్రైఫ్రూట్స్ ను తినడానికి ముందు ఎందుకు నానబెట్టాలి? లాభాలేంటి..?

ప‌రిమాణ‌మూ ముఖ్య‌మే...
టైమింగ్‌తో పాటు తినాల్సిన ప‌రిమాణ‌మూ చాలా ముఖ్యం. ఎప్పుడు, ఏ స‌మ‌యంలో ఎలాంటి న‌ట్స్ ఎంత తీసుకోవాల‌న్న విష‌యాన్ని వివ‌రంగా ఇస్తున్నాం.

మీ వీలును బ‌ట్టి దీన్ని పాటించండి.

ఉద‌యం

బాదం

ఉద‌యం పూట చాలా ప‌నులతో స‌త‌మ‌త‌మ‌వుతుంటాం. చాలా మందికి ఉద‌యం పూట బాదం తినే అల‌వాటు ఉంటుంది. అది మంచిది కూడా. బాదంలో విట‌మిన్ ఇ పుష్క‌లంగా ఉంటుంది. అలాగే రైబోఫ్లావిన్‌, మాంగ‌నీస్ ఉంటాయి. ఇవి రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. ఇన్ఫెక్ష‌న్ల‌తో పోరాడేందుకు మ‌రింత స‌హాయ‌ప‌డ‌తాయి.

శ‌రీరాన్ని మంచి కండిష‌న్‌లో ఉంచ‌డంలో బాదంలు కీల‌క పాత్ర పోషిస్తాయి. బాదంల‌ను రాత్రి ప‌డుకునే ముందు నీళ్ల‌ల్లో నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే తొక్క తీసి తినాలి. తొక్క‌తో తింటే స‌రైన పోష‌కాలు అంద‌వు అని పోష‌కాహార నిపుణులు అంటారు. రోజుకు 10 బాదం గింజ‌లు తింటే ఎంతో ఆరోగ్య‌క‌రం. అంత‌కు మించి తింటే దుష్ప్ర‌భావాలు ఉండొచ్చు.

health benefits of nuts

సాయంత్రం

జీడిప‌ప్పు, పిస్తా

జీడిప‌ప్పులో మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి తక్ష‌ణ శ‌క్తినందిస్తాయి. పైగా వీటిని తింటే నోటిలో ఉన్న చెడు బ్యాక్టీరియా న‌శిస్తుంది. పంటి నొప్పిని అరిక‌డుతుంది. ఇందులో ఉండే మాంగ‌నీస్ అధిక బీపీ రాకుండా చూస్తుంది. అంతే కాకుండా కండ‌రాల స‌త్తువ త‌గ్గ‌కుండా చూస్తుంది.

మ‌రో వైపు పిస్తా పప్పు గుండెకు చాలా మంచిది. జీడిప‌ప్పు, పిస్తా రెండు ఆరోగ్యానికి చాలా మంచివి. త‌క్ష‌ణ శ‌క్తినిస్తాయి. వీటిని సాయంత్రం పూట తింటే అల‌సిన శరీరానికి శ‌క్తి వ‌స్తుంది. రోజుకు 3 జీడిప‌ప్పు, 3 పిస్తాలు తిన‌మ‌ని పోష‌కాహార నిపుణులు సూచిస్తారు.


రాత్రి

వాల్‌న‌ట్స్‌, ఖ‌ర్జూరాలు, ఎండు ద్రాక్ష‌
వాల్‌న‌ట్స్ లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్క‌లంగా ఉంటాయి. ఎండు ద్రాక్ష‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఈ మూడు ఫ‌లాలు జీర్ణ‌క్రియ‌ల‌ను వేగ‌వంతం చేస్తాయి. చాలా మందికి వాల్‌న‌ట్స్ ఎప్పుడు తినాల‌న్న దానిపై స‌రైన అవ‌గాహ‌న లేదు. వీటిని రాత్రి పూట తిన‌డం చాలా మంచిది.

ఈ వాల్ న‌ట్స్ మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని నిరోధిస్తుంది. వీటిలో మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్ ఉంటాయి. ఇవి శ‌రీరాన్ని రాత్రంతా రిపేర్ చేసి పొద్దున్న క‌ల్లా చ‌ర్మాన్ని తాజాగా చేయ‌గ‌ల‌వు. అందుకే వీటిని రాత్రి పూట సేవించ‌డ‌మే చాలా మంచిది. రోజు ప‌డుకునే ముందు రాత్రి ఒక ఖ‌ర్జూరం, రెండు ఎండు ద్రాక్ష‌, 3 లేదా 4 వాల్‌న‌ట్స్ తింటే మంచి ఫ‌లితాల‌ను చూడ‌వ‌చ్చు.

English summary

Know The Best Time To Consume Nuts

Nuts when consumed at the right time can be beneficial for your health. Know about the right time to consume nuts here on Boldsky.
Story first published:Friday, November 3, 2017, 15:40 [IST]
Desktop Bottom Promotion