For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమితంగా త్రాగడం అనేది మీ మెదడుకి చాలా హానిచేస్తుంది & ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది

By R Vishnu Vardhan Reddy
|

అప్పుడప్పుడు ఎప్పుడైనా రెండు పెగ్గుల మందు త్రాగడం వల్ల ఆరోగ్యానికి మంచి జరగవచ్చేమో గాని ఎప్పుడైతే మీరు పరిమితికి మించి త్రాగుతారో మరియు అమితంగా త్రాగడం మొదలు పెడతారో ఇక అప్పటి నుండి మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి.

ఒక నూతన అధ్యయనం ప్రకారం యువకులు ఎవరైతే అమితంగా మందు త్రాగుతున్నారో అటువంటి వ్యక్తుల యొక్క మెదడు పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ అధ్యయనంలో రెండు గంటలలోపు ఐదు లేదా అంతకు మించి బీర్లు త్రాగిన పురుషులు లేదా నాలుగు కి మించి త్రాగిన స్త్రీల మెదడు పనితీరులో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనే విషయాన్ని గుర్తించారు.

binge-drinking-is-harmful-for-brain-research

ఈ అధ్యయనాన్ని పోర్చుగల్ కి చెందిన ఆక ప్రముఖ విశ్వవిద్యాలయం వాళ్ళు చేశారు. ఈ అధ్యయనంలో భాగంగా ఒక విశ్వ విద్యాలయానికి చెందిన 80 మంది మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి విద్యార్థినిలను తీసుకొని వారి మెదడులో జరిగే విద్యుత్ ప్రక్రియలను క్షుణ్ణంగా పరిశీలించారు శాస్త్రవేత్తలు మరియు వారి యొక్క మందు త్రాగే అలవాట్ల గురించి ప్రత్యేకంగా కొన్ని ప్రశ్నలు అడిగారు.

ఈ అధ్యయనం ప్రకారం పరిశోధకులు ఏమి కనుగొన్నారంటే ఏ వ్యక్తులైతే అమితంగా త్రాగుతున్నారో వారి యొక్క మెదడు పనిచేసే పనితీరు మిగతా వారి కంటే పూర్తిగా మారిపోయిందని గుర్తించారు. ప్రముఖంగా ఎక్కువ తీవ్రతలలో మెదడు లో జరిగే కొన్ని ముఖ్యమైన విద్యత్ ప్రక్రియలకు సంబంధించిన తేడాను గమనించారు. ముఖ్యంగా ఈ తేడా ఎక్కువగా మెదడు భాగాలలో ఉండే కుడి టెంపోరల్ లోబ్ మరియు ద్వైపాక్షిక అనుబంధ వల్కలం లో కనపడింది.

ఎవరైతే విపరీతంగా త్రాగుడుకి బానిసలు అయ్యారో అటువంటి వ్యక్తుల మెదడులో కూడా ఇటువంటి మార్పులే కనపడ్డాయి. ఆంటే దీనర్ధం చాలా త్వరగా వారి యొక్క మెదడు తీవ్రంగా నష్టపోతోంది అన్నమాట.

అమితంగా త్రాగడం వల్ల మరికొన్ని తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వికారం మరియు వాంతులు :

వికారం మరియు వాంతులు :

అమితంగా త్రాగే అలవాటు వల్ల మీకు చాలా వికారంగా మరియు వాంతులు వచ్చే విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మీ లోపల ఉన్న వ్యవస్థ తాగుడు వల్ల కలిగే అనూహ్య మార్పులను తట్టుకోలేదో, అటువంటి సమయంలో మీరు విపరీతమైన వికారం తో బాధపడతారు మరియు వాంతులు కూడా అవుతాయి.

తలనొప్పి :

తలనొప్పి :

త్రాగిన మత్తు దిగకపోవడం ఒక ఎత్తు అయితే అమితంగా త్రాగడం వల్ల మీకు విపరీతమైన తలనొప్పి కలిగే అవకాశం ఉంది. అందువల్ల మీ యొక్క ఆలోచనా సామర్ధ్యం తగ్గిపోతుంది. మీరు చేసే పనులకు తీవ్ర అవరోధాలు ఎదురవుతాయి. ఇది మీ లక్ష్యాలను చేరుకోనివ్వకుండా దెబ్బతీస్తుంది.

కాలేయ సమస్యలు :

కాలేయ సమస్యలు :

అమితంగా పరిమితికి మించి మద్యం త్రాగడం వల్ల రక్త ప్రసరణ పై ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. దీని ఫలితంగా అది వారి యొక్క కాలేయం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మీరు గనుక త్రాగుడికి బానిసై ఉంటే మీ కాలేయం ప్రమాదంలో పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అంతేకాకుండా కాలేయ సమస్యలు తలెత్తుతాయి. చివరికి లివర్ క్యాన్సర్ కు దారి తీసే ప్రమాదం ఉంది.

 మీ గుండె పై ప్రభావం చూపుతుంది :

మీ గుండె పై ప్రభావం చూపుతుంది :

మీరు గనుక తరచూ అమితంగా త్రాగుతున్న వ్యక్తులైతే ఈ త్రాగుడు మీ యొక్క గుండె పై దుష్ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఈ వ్యవహార శైలి వల్ల మీకు అనూహ్యంగా గుండె పోటు రావొచ్చు లేదా గుండె పనిచేయడం ఆగిపోవచ్చు.

త్రాగుడు వల్ల ఇన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి కాబట్టి మద్యపానాన్ని నిషేధించండి మీ జీవితాన్ని కాపాడుకోండి.

English summary

Binge Drinking Is Harmful For The Brain As Per Research; Other Major Health Effects

A new study shows that binge drinking can lead to brain damage. Know the details here on Boldsky.
Desktop Bottom Promotion