For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూత్రంలో రక్తం ఈ వ్యాధికి సంకేతం కావొచ్చు, పరిశీలించండి!

By Gandiva Prasad Naraparaju
|

మీ మూత్రాన్ని గమనించడం అనేది చాలా భయంకరమైన విషయం, కానీ ఇది తప్పక చేయాల్సిన విషయం. మీ మూత్రంలో వచ్చే మార్పులు – రంగు అలాగే ప్రవాహం అనేది మీ ఆరోగ్యం గురించి ఎంతో తెలియచేస్తుంది. దీనికంటే ముందు మీరు మీ మూత్రంలో రక్తం రావడం గమనిస్తే మీరు శ్రద్ధ తీసుకుని, వెంటనే వైద్యుని వద్ద పరీక్ష చేయించుకోవాలి.

మూత్రంలో రక్తం రావడం అనేది ప్రోస్టేట్ క్యాన్సర్ కి ప్రారంభ దశకు సూచన అని ఈమధ్య జరిగిన పరిశోధనలో తేలింది.

మీ మూత్రంలో రక్తం గ్రహించిన వెంటనే, దీన్ని స్ధూలంగా హేమటురియా అని పిలుస్తారు, అది గులాబీ, ఎరుపు లేదా కోలా రంగులోకి మారుతుంది.

అయితే, మూత్రంలో రక్తం కనిపించిన ప్రతి వారికీ ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుందని అర్ధం కాదు. కాకపోతే, త్వరగా పరీక్షచేయించుకోవడం మంచిదని సూచన.

Blood In Urine Can Be A Sign Of Prostate Cancer

ఎక్కువసేపు మూత్రం రావడం లేదా మూత్రం తక్కువగా రావడం రెండూ ప్రోస్టేట్ క్యాన్సర్ కు ఇతర సంకేతాలు.

తరచుగా మూత్రానికి ఎక్కువగా వెళ్ళాలి అనిపించిన వాళ్ళు, లేదా మీరు మూత్రానికి వెళ్ళిన తరువాత కూడా ఇంకా మూత్రాశయం ఖాళీ కాలేదు అనిపించడం కూడా జరుగుతుంది.

ప్రాణాంతక ప్రొస్టేస్ట్ క్యాన్సర్ హెచ్చరిక సంకేతాలు....

అంగస్తంభన సమయంలో కష్టంగా ఉండడం లేదా నిర్వహించడం అనేది కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ కి సంకేతం. అయితే, ప్రోస్టేట్ క్యాన్సర్ కి కారణం ఎక్కువగా తెలీదు. కానీ, వయసు మీద పడ్డ తరువాత ఈ వ్యాధి పెరిగే అవకాశం ఉంది.

Blood In Urine Can Be A Sign Of Prostate Cancer

ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా నిదానంగా పెరుగుతుంది, ప్రజలు కొన్ని దశాబ్దాలుగా ఎటువంటి లక్షణాలు లేదా చికిత్స లేకుండా జీవిస్తున్నారు.

ఈ క్యాన్సర్ ని శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు, దీనికి రేడియో థెరపీ లేదా హార్మోన్ థెరపీ ద్వారా చికిత్స చేస్తారు.

మరోవైపు, ప్రోస్టేట్ క్యాన్సర్ తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహరం గురించి కింద జాబితా ఇవ్వబడింది. ఒకసారి చూడండి.

1.బ్రోకోలి:

1.బ్రోకోలి:

బ్రోకోలి అనేది క్రుసిఫెరాస్ అనే కూరగాయ కుటుంబానికి చెందింది, ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడే కూరగాయలలో ఒకటిగా చెప్పబడుతుంది. బ్రోకోలి లో క్యాన్సర్ తో అనుసంధానమైన కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి, ఇవి యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉంటాయి, ఇవి క్యాన్సర్ ప్రమాదానికి దారితీసే కణాలలో మార్పులను నిరోధిస్తాయి.

2.దానిమ్మ రసం:

2.దానిమ్మ రసం:

దానిమ్మ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ దానిమ్మ రసం తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాల కదలికలను నిరోధించి, ఎముకకు ప్రోస్టేట్ క్యాన్సర్ సంక్రమించే రసాయనిక సంకేతాలను పెంచే ఆకర్షణను తగ్గించడానికి సహాయపడుతుంది.

పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు: నివారణ చర్యలు

3.సోయా:

3.సోయా:

సోయా ప్రోస్టేట్ క్యాన్సర్ ని నిరోధించడానికి సహాయపడుతుందని అనేక అధ్యయనాలు తెలియచేశాయి. సోయా ప్రోస్టేట్ క్యాన్సర్ లో ఉన్న మార్గాలను జోక్యం చెసుకుణే ఐసోఫ్లేవన్స్ ని కలిగి ఉంటుంది, ఇది మంటకు సంబంధించినవి. అందువల్ల క్యాన్సర్ పెరుగుదల, వ్యాప్తి నిరోధించాబడతాయి. మీరు ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో సోయాని జోడించడం అనేది అవసరమైన వాటిలో ఒకటి.

4.క్యారెట్లు:

4.క్యారెట్లు:

ప్రోస్టేట్ ఆరోగ్యానికి మంచిదైన మరో ముఖ్యమైన కూరగాయలలో క్యారెట్ ఒకటి. క్యారెట్ బీటా కేరొటీన్ కి ఎక్కువ పేరుగాంచింది, ఈ కేరోటినాయిడ్లు విటమిన్ Aగా మార్చబడతాయి. అంతేకాకుండా క్యారెట్లు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలకు కూడా పేరుగాంచినవి. ఈ పదార్ధాలు అన్నిటివల్ల, క్యారెట్లు ప్రోస్టేట్ క్యాన్సర్ ని నిరోధించడానికి సహాయపడతాయి. మీ దైనందిన ఆహార౦లో క్యారెట్లను జోడిస్తే అవి సహాయకారిగా పనిచేస్తాయి.

 5.వాల్నట్స్:

5.వాల్నట్స్:

ప్రోస్టేట్ క్యాన్సర్ ని నిరోధించే అత్యంత పేరుగాంచిన నట్స్ లో వాల్నట్స్ ఒకటి. వాల్నట్స్ తక్కువ కార్బోహైడ్రేట్ లను, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు అధికంగా కలిగి ఉంటాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ కు సంబంధం ఉన్న IGF – 1 అనే ప్రధానమైన హార్మోన్ స్థాయిని తగ్గించడానికి వాల్నట్స్ సహాయపడతాయి. గుప్పెడు వాల్నట్స్ తినండి.

(With Agency Inputs)

English summary

Blood In Urine Can Be A Sign Of Prostate Cancer

If you notice blood in your urine then you should be all the more careful and check it with a doctor immediately. As a recent research has revealed that blood in the urine could be an early sign of prostate cancer.
Story first published: Wednesday, December 6, 2017, 8:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more