గ్రీన్ టీతో మతిమరుపు మాయం, జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందంటున్న నిపుణులు

Posted By:
Subscribe to Boldsky

గ్రీన్ టీతో మతిమరుపు మాయం, జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందంటున్న నిపుణులు..

ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్ లో నిరంతరం పని ఒత్తిడి కారనంగా ప్రతి ఒక్కరూ నీరసించిపోతుంటారు. ఉదయం చురుగ్గా ఉన్నప్పటికీ, సాయంతానికల్లా పూర్తిగా డీలా పడిపోతుంటారు. అలాంటి సమయాల్లో మొదడు చురుగ్గా పనిచేయదు. కేవలం ఇటువంటి వారే కాదు...మరికొందరు తమకు జ్ఝాపకశక్తి లోపించిందంటూ భాదపడుతుంటారు. విద్యార్థుల నుంచి మధ్యవయస్కుల వారి దాకా ఈ తరహా సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారి కోసం నిపుణులు ఓ మెరుగైన సలహా ఇస్తున్నారు. ప్రతి రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

గ్రీన్ టీతో మతిమరుపు మాయం, జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందంటున్న నిపుణులు

గ్రీన్‌ టీ తాగితే బరువు తగ్గడమే కాదు జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందిట కూడా. ఇటీవల చేసిన ఒక స్టడీలో ఈ విషయం వెల్లడైంది. పాశ్చాత్య ఫుడ్స్‌ తినడం వల్ల జ్ఞాపకశక్తి సన్నగిల్లుతోందని కూడా ఇందులో తేలింది.

ముఖ్యంగా బాగా ఫ్యాట్‌ ఉన్న ఫుడ్స్‌ జ్ఞాపకశక్తి మీద తీవ్ర ప్రభావం చూపుతాయట. షుగర్‌ ఎక్కువగా ఉన్న ఫుడ్స్‌ తినడం వల్ల న్యూరో-ఇన్‌ఫ్లమేషన్‌ వంటి సమస్యలూ తలెత్తుతాయట. వీటిని తగ్గించడంలో గ్రీన్‌ టీ ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తల స్టడీలో తేలింది. గతంలో చేసిన అధ్యయనాల్లో కూడా ఆరై్త్రటిస్‌, కీళ్లనొప్పులను గ్రీన్‌ టీ తగ్గిస్తుందని తేలింది.

గ్రీన్ టీతో మతిమరుపు మాయం, జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందంటున్న నిపుణులు

గ్రీన్‌ టీలోని కాట్‌చిన్‌, బయొలాజికల్‌ కాంపొనెంట్‌ల వల్ల హై-ఫ్యాట్‌, హై-ఫ్రూక్టోస్‌ డైట్‌ ఇండ్యూస్డ్‌- ఇన్‌సులిన్‌ రెసిస్టెన్స్‌, జ్ఞాపకశక్తిలోపం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే ఊబకాయం, జ్ఞాపకశక్తి తరుగుదల, ఇన్సులెన్స్‌ రెసిస్టెన్స్‌లకు ప్రత్యామ్నాయ మెడిసెన్‌గా కూడా గ్రీన్‌ టీ ఉపయోగపడుతుందంటున్నారు. గ్రీన్ టీతో మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం...

1. నోటి క్యాన్సర్ :

1. నోటి క్యాన్సర్ :

గ్రీన్ టీతో క్యాన్సర్ నివారణ: మానవ శరీరంలోని క్యాన్సర్ కారక కణాలని నాశనం చేసే పదార్ధాలు గ్రీన్ టీలో ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. గ్రీన్ టీ పై జరిపిన అధ్యయనంలో.. దీనివల్ల శరీరానికి ఉపయోగపడే ఇతర కణాలకి ఎలాంటి హాని లేదని తేలింది. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్కి కారణమయ్యే కణాలు మాత్రమే నశిస్తాయని, ఆరోగ్యకరమైన ఇతర కణాల మీద మాత్రం ఎలాంటి ప్రభావం ఉండబోదని పెన్ స్టేట్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫేసర్ జషువా లాంబర్ట్ తెలిపారు.

2. బ్రెస్ట్ క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్ నివారణకు గ్రీన్ టీ :

2. బ్రెస్ట్ క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్ నివారణకు గ్రీన్ టీ :

గ్రీన్ టీ కాన్సర్ ప్రమాదాన్ని చాలామటుకు తగ్గిస్తుంది. జపాన్ లో షుమారు అయిదు వందల మంది మహిళలపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. రొమ్ము కాన్సర్ తో పాటు ఊపిరితిత్తుల కాన్సర్ తీవ్రతను తగ్గించే శక్తీ ఈ టీకి ఉంది. రోజూ రెండు కప్పులు అలవాటుగా తీసుకుంటే అందులోని సుగుణాలు కాన్సర్ కణాలను నశింపచేస్తాయని నిపుణులు అంటున్నారు.

3. గ్రీన్ టీ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది :

3. గ్రీన్ టీ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది :

ఈ టీ కొలెస్ట్రాల్ ను సులువుగా తగ్గిస్తుంది. దాంతో గుండె సమస్యలు అదుపులో ఉంటాయి. కొన్నేళ్ళపాటు నిర్వహించిన ఓ అధ్యయనంలో రోజుకు అయిదు కప్పుల చొప్పున గ్రీన్ టీ తీసుకునే వారిలో గుండెజబ్బుల వల్ల మరణించే పరిస్థితి దాదాపు ఇరవై శాతం తగ్గిందని పేర్కొన్నారు అధ్యయనకర్తలు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు అందుకు కారణమని వెల్లడించారు.

4. అధిక బరువు తగ్గిస్తుంది :

4. అధిక బరువు తగ్గిస్తుంది :

రోజూ గ్రీన్ టీని తీసుకోవడం వల్ల కొవ్వు కరిగి అధిక బరువు తగ్గిస్తుంది. అధిక బరువును తగ్గించుకోడానికి చాలా మంది రోజూ గ్రీన్ టీ తాగుతారు. గ్రీన్ టీ తీసుకుంటే బరువు తగ్గడమే కాదు, గుండె జబ్బుల ముప్పు కూడా తగ్గుతుందట. దీంతోపాటు చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయట. అలాగే ఎముకల మజ్జకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీ తాగితే దాన్ని ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని అమెరికాకు చెందిన ఓ అధ్యయనం వెల్లడించింది. ఎపిగాల్లోకాటెచిన్-3-గాల్లెట్ (ఈజీసీజీ) అనే ఫాలిఫినాల్‌ను గ్రీన్ టీ ఆకుల్లో గుర్తించారు.

చర్మ సౌందర్యం రెట్టింపు చేసే గ్రీన్ టీ -హానీ ఫేస్ ప్యాక్

5. దంత సమస్యలను నివారిస్తుంది

5. దంత సమస్యలను నివారిస్తుంది

ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ సుగుణాలు దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రతి కప్పూ తాగినప్పుడల్లా చిగుళ్ళు ఆరోగ్యంగా మారుతూ ఉంటాయి. గ్రీన్ టీ లో ఉండే ఫ్లోరైడ్ దంతాలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పుదీనాతో కలిపి తీసుకుంటే దీని సుగుణాలు రెట్టింపు అవుతాయి. తాగేప్పుడు తాజా పరిమళం కూడా ఉంటుంది.

6. అలర్జీలకు మంచి ఔషదం గ్రీన్ టీ:

6. అలర్జీలకు మంచి ఔషదం గ్రీన్ టీ:

అదే పనిగా తుమ్ములు, దగ్గు లేదా దద్దుర్లు, కళ్ళ వెంట నీరు కారడం.. వంటివన్నీ అలేర్జీకి సంకేతం. ఇలాంటి సమస్యలు తరచూ వస్తుంటే కొన్నాళ్ళు గ్రీన్ టీని తీసుకొని చూస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. వయసుతో పాటు వచ్చే సమస్యల్లో అల్జీమర్స్ ఒకటి. దీనిని నివారించాలంటే నిత్యం గ్రీన్ టీని తాగాలంటున్నరు నిపుణులు. కారణం ఈ టీ జీర్ణమయ్యే క్రమంలో కొన్ని ఎంజైముల్ని విడుదల చేస్తుంది. అవి వ్యాధిని నివారిచడంలో సహకరిస్తాయి.

7. కంటి ఆరోగ్యం మెరుగుపరుస్తుంది:

7. కంటి ఆరోగ్యం మెరుగుపరుస్తుంది:

పలు అధ్యయనాల్లో గ్రీన్ టీ అనేది కంటి ఆరోగ్యంపై ప్రయోజనకరమైన అంశాలు అలాగే గ్లాకోమా మరియు కంటి యొక్క ఇతర రోగాల వ్యతిరేకంగా దాని నిజమైన సంరక్షణ పాత్ర నిరూపించబడ్డాయి.

గ్లాకోమా (Glaucoma): కనుగుడ్డుపై ఒత్తిడి వలన సంభవిస్తుంది మరియు క్రమక్రమంగా కంటి చూపు పోతుంది. ప్రయోగాత్మక ఆధారాలు గ్రీన్ టీ భాగాలు కడుపు నుండి నేరుగా మీ కంటి వరకు చేరుకుంటాయని మరియు కంటిలోని కటకాలు, రెటీనా మరియు ఇతర కణజాలాలచే శోషించబడతాయని నిరూపించాయి. ఈ భాగాలు గ్రీన్ టీ తాగిన తర్వాత 20 గంటలపాటు కంటిలోని ఈ భాగాల్లో ఉంటాయని నివేదించారు. గ్రీన్ టీ తాగడం వలన ఆక్సిడేటివ్ ఒత్తిడికి వ్యతిరేకంగా సంరక్షణ లభిస్తుందని పరిశోధకులు నిర్ధారించారు.

ఆరోగ్యానికి ‘గ్రీన్ టీ' కంటే ‘బ్లాక్ టీ' మంచిదా...?

భవిష్యత్తులో మధుమేహం, ఇతర సమస్యలు రాకుండా చేస్తుంది

భవిష్యత్తులో మధుమేహం, ఇతర సమస్యలు రాకుండా చేస్తుంది

8. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. రోజూ కనీసం రెండు, మూడు సార్లు సేవిస్తే ఆరోగ్యంతోపాటు అందం కూడా సొంతమవుతుంది.

ఇంకా భవిష్యత్తులో మధుమేహం, ఇతర సమస్యలు కూడా కొంతవరకు రాకుండా నియంత్రించవచ్చు.

English summary

Can green tea boost your brainpower and treat disease

Can green tea boost your brainpower and treat disease?