For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెవిలోని గులిమి రంగును బట్టి మీరు ఏ వ్యాధితో బాధపడుతున్నారో తెలుసుకోవొచ్చు

చెవుల్లో ఏర్ప‌డే గులిమి సాధారణ రంగుల్లో కాకుండా ఇతర రంగుల్లో ఉంటే మీరు కొన్ని రకాల వ్యాధులతో ఇబ్బందులుపడుతున్నట్లు సూచన. మరి ఏయో రంగు ఏ రకం వ్యాధిని సూచిస్తుందో తెలుసుకోండి.

|

చెవులు వాటినంతటికీ అవే శుభ్రపరుచుకుంటూ ఉంటారు. దీంతో గులిమి ఏర్పడుతుంది. ఇది సాధారణంగా దానితంటికీ అదే చెవిలో నుంచి బయటకు వెళ్తుంది. అయితే మనం కాటన్ బడ్స్ ద్వారా చెవులను క్లీన్ చేసుకుంటూ ఉంటాం. దీనివల్ల ఎలాంటి సమస్య లేదు. చెవిలో ఉండే గులిమి వ‌ల్ల అస్త‌మానం దుర‌ద పెడుతూ ఉంటే మీకు ఇన్‌ఫెక్ష‌న్ సోకింద‌ని అర్థం. ఇక గులిమి చెమ‌ట రూపంలో వ‌స్తుంటే మీరు చెవి సమస్యలతో ఇబ్బందిపడున్నట్లు సూచన.

చెవుల్లో ఏర్ప‌డే గులిమి సాధారణ రంగుల్లో కాకుండా ఇతర రంగుల్లో ఉంటే మీరు కొన్ని రకాల వ్యాధులతో ఇబ్బందులుపడుతున్నట్లు సూచన. ఇలా ఉంటే మీరు వెంటే డాక్టర్ని సంప్రదించాలి. మరి ఏయో రంగు ఏ రకం వ్యాధిని సూచిస్తుందో తెలుసుకోండి.

1. గ్రే కలర్ లో గులిమి ఉంటే

1. గ్రే కలర్ లో గులిమి ఉంటే

మీ గులిమి గ్రే కలర్ లో ఉంటే మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చెవుల్లోకి వెళ్లిన దుమ్ము ధూళి ఇలాంటి రంగులో బయటకు వస్తుంది. అందువల్ల దీని గురించి మీరు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా బయట తిరిగే వారిలో ఎక్కువగా ఇలాంటి రంగులో ఉండే గులిమి కనపడుతుంది. అయితే దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి అనారోగ్యానికి బారిన పడలేదనడానికి ఇది సూచన.

2. గులిమితో పాటు రక్తం

2. గులిమితో పాటు రక్తం

మీ చెవులను శుభ్రపరుచుకునేటప్పడు కాటన్ బడ్స్ వెంట మీ గులిమితో పాటు కాస్త రక్తంలాంటిది వస్తే మీరు కాస్త జాగ్రత్తపడాలి. మీ చెవిలోని గూబకు సంబంధించిన సమస్యతో మీరు బాధపడుతున్నట్లు దీని అర్థం. దీని వల్ల చెవిలో ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓటిటిస్ బారిన మీరు పడతారు. తర్వాత చెవికి సంబంధించిన సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందువల్ల మీరు వెంటనే చెవి డాక్టర్ని సంప్రదించాలి.

3. బ్రౌన్ కలర్ లో చెవి గులిమి

3. బ్రౌన్ కలర్ లో చెవి గులిమి

మీ చెవిగులిమి బ్రౌన్ కలర్ లో ఉంటే మీరు చాలా ఒత్తిడికి గురువుతున్నారని అర్థం. మీరు రోజూ ఏదో పనుల వల్ల ఒత్తిడికి గురువుతుంటారు. ఆ ప్రభావం మీ బాడీపై పడుతుంది. మీ చెవిలో నుంచే వచ్చే ఈ రంగు గులిమి మీరు బాగా స్ట్రైస్ కు గురువుతున్నారని తెలియజేస్తుంది. అందువల్ల మీరు ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వకుండా జాగ్రత్తపడితే చాలు.

4. గులిమి న‌ల్ల‌గా ఉంటే

4. గులిమి న‌ల్ల‌గా ఉంటే

సాధారణంగా ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుంటుంది. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ చెవులు దురద పెడితే మాత్రం మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలాగే వ‌య‌స్సు పెరుగుతున్న కొద్దీ కూడా చెవిలో ఉండే గులిమి రంగు మారుతుంది. స్థితి కోల్పోతుంది. అయితే యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా గులిమి న‌ల్ల‌గా, పొడిగా ఉంటే అప్పుడు అనుమానించాల్సిందే. వెంట‌నే వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం మంచిది.

5. తెలుపు రంగులో ఉంటే

5. తెలుపు రంగులో ఉంటే

కొన్ని పోషకాల లోపం వల్ల మీ గులిమి తెలుపు రంగులోకి మారుతుంది. ఇలాంటి గులిమి కొన్ని విషయాలను సూచిస్తుంది. మీ శరీరానికి సరిపడ విటమిన్లు, సూక్ష్మపోషకాలు మీలో లేవని దీని అర్థం. ఐరన్, రాగి వంటివి మీ బాడీలో తగ్గినట్లుగా లేవని సూచన. అందువల్ల, మీరు మీ ఆహారంలో ఎక్కువగా బీన్స్, వోట్ మీల్స్ ను తీసుకుంటూ ఉండాలి.

6. దుర్వాస‌న‌గా ఉంటే..

6. దుర్వాస‌న‌గా ఉంటే..

గులిమి నుంచి బాగా దుర్వాస‌న వ‌స్తుంటే చెవి ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చినట్లు అర్థం. అలాగే మీకు మధ్యలో మధ్యలో చెవులు డిమ్ అయిపోతుంటాయి. ఉండవచ్చు. మీ గులిమి ఒకవేళ దుర్వాసనతో ఉంటే మాత్రం మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించండి.

7. ద్రవ రూపంలో ఉంటే

7. ద్రవ రూపంలో ఉంటే

మీ గులిమి ద్రవ రూపంలో ఉంటే మీ చెవి వాపున కు గురైనట్లు సూచన. మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించి వాపు నకు గురైందో లేదో తెలుసుకోవొచ్చు. దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

8. పొడిగా ఉంటే

8. పొడిగా ఉంటే

గులిమి పొడిగా ఉంటే మీ శరీరంలో లీన్ ఫ్యాట్స్ సరిగ్గా లేవని అర్థం. లేదంట మీ చర్మం పొడిబారిపోయిందని సూచన. ఇలాంటి గులిమి నుంచి వస్తే మీరు వెంటనే చర్మ వైద్యుడిని సంప్రదించి ట్రీట్ మెంట్ తీసుకోవాలి.

English summary

colour of your earwax can determine your health condition read to know

People are usually bothered with the question 'does the colour of ear wax mean anything'. Read further to know what does the colour of your earwax mean.
Desktop Bottom Promotion