For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ రెండింటితో క్యాన్స‌ర్ ముప్పు! 10 చేదు నిజాలు

మీరు మీ శరీర బరువును కోల్పోవడానికి మరియు ఫిట్ గా ఉండటానికి గల మార్గాలను మొదలు పెట్టినవారయితే, అప్పుడు మీరు తప్పనిసరిగా, కొన్ని రకాల ఆహార పదార్థాలను విడిచిపెట్టవలసి ఉంటుంది, అవునా ?

By Sujeeth Kumar
|

ఒబేసిటీ, డ‌యాబెటిస్‌.... ఈ రెండు రుగ్మ‌త‌లు ఇప్పుడు ప్ర‌పంచ జ‌నాల‌ను పీడిస్తున్నాయి. జీవ‌న‌శైలికి సంబంధించిన ఈ వ్యాధుల బారిన ప‌డుతున్నవారు కోకొల్ల‌లు.

ఒకే చోట కూర్చొని ప‌నిచేయ‌డం, త‌గిన శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, స‌రైన పోష‌కాహార లేమి ఇత్యాది కార‌ణాల‌తో డ‌యాబెటిస్‌, ఒబేసిటీ బారిన ప‌డుతున్న‌వారెంద‌రో. కొంద‌రికి ఇవి వార‌స‌త్వంగాను సంత‌రిస్తున్నాయి.

1. స‌రైన స‌మ‌యంలో చెక‌ప్‌

1. స‌రైన స‌మ‌యంలో చెక‌ప్‌

స‌రైన స‌మ‌యంలో వీటికి చెక‌ప్ చేయించుకోవ‌డం, మంచి వైద్యం పొంద‌డం ద్వారా ఇలాంటి వ్యాధుల బారి నుండి ప‌డే అవ‌కాశాన్ని త‌గ్గించుకోగ‌లుగుతాం. వీటికి స‌రైన చికిత్స చేయించ‌కోకపోతే క్లిష్ట‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఒక్కోసారి ప్రాణాల మీద‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది..

2. షాకింగ్ నిజాలు

2. షాకింగ్ నిజాలు

లాన్సెట్ అనే ప్ర‌ఖ్యాత అంత‌ర్జాతీయ మెడిక‌ల్ జ‌ర్న‌ల్ ఇచ్చిన తాజా నివేదిక‌లో షాకింగ్ నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అధిక‌ బాడీ మాస్ ఇండెక్స్(బీఎమ్ఐ) , డ‌యాబెటిస్ ఉన్న‌వాళ్లల్లో 5.6శాతం మంది క్యాన్స‌ర్ బారిన‌ప‌డుతున్నార‌ట‌.

3. ప‌రిశోధ‌న‌లో తేలిన నిజాలు

3. ప‌రిశోధ‌న‌లో తేలిన నిజాలు

ప‌రిశోధ‌న‌లో భాగంగా ప‌రిశోధ‌కులు 7,92,600 క్యాన్స‌ర్ కేసుల‌ను ప‌రిశీలించారు. వీటిలో 5,44,300 మందికి అధిక బీఎమ్ఐ ఉండ‌డం కార‌ణంగానే 18 ర‌కాల క్యాన్స‌ర్ బారిన ప‌డ్డారు. ఇది అన్ని ర‌కాల క్యాన్స‌ర్ల‌కు 3.9శాతానికి స‌మానం. డ‌యాబెటిస్ వ‌ల్ల సంక్ర‌మించిన 2,80,100 (2శాతం) కేసుల‌తో పోలిస్తే ఇది రెండింత‌లుగా న‌మోదు అయ్యింది.

4. ఇలా లెక్కించారు

4. ఇలా లెక్కించారు

ప‌రిశోధ‌న కోసం రీసెర్చ‌ర్లు ప్ర‌తి ఒక్క‌రి బీఎమ్ఐ లేదా బాడీ మాస్ ఇండెక్స్‌ను లెక్కించారు. ఇది ఎలా లెక్కిస్తారంటే... ముందు ఒక వ్య‌క్తి ఎత్తు కొలుస్తారు. దాన్ని రెండింత‌లు చేస్తారు. దీన్ని ఆ వ్య‌క్తి బ‌రువుతో భాగిస్తారు. అప్పుడు వ‌చ్చే విలువే బీఎమ్ఐ. ఒబేసిటీని కొలిచేందుకు ఈ ప్ర‌మాణాన్నే ప్ర‌పంచ‌మంత‌టా వాడ‌తారు.

ప‌రిశోధ‌న కోసం రీసెర్చ‌ర్లు ప్ర‌తి ఒక్క‌రి బీఎమ్ఐ లేదా బాడీ మాస్ ఇండెక్స్‌ను లెక్కించారు. ఇది ఎలా లెక్కిస్తారంటే... ముందు ఒక వ్య‌క్తి ఎత్తు కొలుస్తారు. దాన్ని రెండింత‌లు చేస్తారు. దీన్ని ఆ వ్య‌క్తి బ‌రువుతో భాగిస్తారు. అప్పుడు వ‌చ్చే విలువే బీఎమ్ఐ. ఒబేసిటీని కొలిచేందుకు ఈ ప్ర‌మాణాన్నే ప్ర‌పంచ‌మంత‌టా వాడ‌తారు.

5. కార‌ణాలు అవే..

5. కార‌ణాలు అవే..

లివ‌ర్ క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్న 7.66ల‌క్ష‌ల మందిలో 24.5శాతం, ఎండోమెట్రీ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న 3.17ల‌క్ష‌లలో 38.4శాతం మందికి క్యాన్స‌ర్ రావ‌డానికి కార‌ణాలు ఒబేసిటి, డ‌యాబెటిస్‌లేన‌ని ప‌రిశోధ‌కులు క‌నుగొన్నారు.

6. 1980 నుంచి 2002 మ‌ధ్య‌..

6. 1980 నుంచి 2002 మ‌ధ్య‌..

26.1శాతం క్యాన్స‌ర్ కేసులు డ‌యాబెటిస్ వ‌ల్లే సంక్ర‌మించాయ‌ని, 31.9శాతం అధిక బీఎమ్ఐ వ‌ల్లే వ‌చ్చాయ‌ని తేల్చారు. 1980 నుంచి 2002 వ‌ర‌కు ఇలాంటి కేసులు మ‌రింత ఎక్కువ‌య్యాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో వెల్లడ‌య్యింది.

7. 2030నాటికి 8కోట్ల చేరువ‌లో...

7. 2030నాటికి 8కోట్ల చేరువ‌లో...

మ‌న దేశంలో 6.2కోట్ల మంది జ‌నాభా డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇది మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంది. 2030నాటికి 7.94కోట్ల మంది ఈ వ్యాధితో బాధ‌ప‌డుతుంటార‌ని ఓ అంచ‌నా.

8. బీఎమ్ఐ స్టాండ‌ర్డ్ త‌గ్గించారు

8. బీఎమ్ఐ స్టాండ‌ర్డ్ త‌గ్గించారు

బీఎమ్ఐ ఒబేసిటీ క‌ట్ ఆఫ్ స్టాండ‌ర్డ్‌ను 25 kg/m2 నుంచి 22 kg/m2 కి త‌గ్గించారు. ట్రంక‌ల్ ఒబేసిటీకి భార‌తీయులు ఎక్కువ‌గా గుర‌వుతున్నారు. దీనివ‌ల్ల అనేక రుగ్మ‌త‌లు ద‌రిచేరుతున్నాయి.

9. 14.5ల‌క్ష‌ల క్యాన్స‌ర్ బాధితులు

9. 14.5ల‌క్ష‌ల క్యాన్స‌ర్ బాధితులు

సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ సేక‌రించిన స‌మాచారం మేర‌కు భార‌త్‌లో 2012లో 10,57,204 క్యాన్స‌ర్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. నేష‌న‌ల్ క్యాన్స‌ర్ రిజిస్ట‌రీ 14.5ల‌క్ష‌ల క్యాన్స‌ర్ కేసుల‌ను 2016-17లో న‌మోదు చేసుకొంది.

10. ప‌రిశోధ‌న‌లో పాల్గొన్న‌వారు..

10. ప‌రిశోధ‌న‌లో పాల్గొన్న‌వారు..

ఈ ప‌రిశోధ‌న‌లో... లండ‌న్ ఇంపీరియ‌ల్ కాలేజీ, యూనివ‌ర్సిటీ ఆఫ్ కెంట్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ ఏజెన్సీ ఫ‌ర్ రీసెర్చ్ ఆన్ క్యాన్స‌ర్ స‌భ్యులు దాదాపు 175 దేశాల్లో 18 ర‌కాల క్యాన్స‌ర్ల‌పై 1980 నుంచి 2002 మ‌ధ్య ఉన్న కేసుల‌ను తీసుకొని ప‌రిశోధించారు. దీన్ని బ‌ట్టే డ‌యాబెటిస్‌, అధిక బీఎమ్ఐ వ‌ల్ల క్యాన్స‌ర్ ముప్పు పెరిగే అవ‌కాశ‌ముంద‌ని తేల్చారు.

ఈ ప‌రిశోధ‌న‌కు సంబంధించిన వివ‌రాలు ది లాన్సెట్ డ‌యాబెటిస్ అండ్ ఎండొక్రైనాల‌జీ లో ఇటీవ‌లె ప్ర‌చురిత‌మైంది.

మ‌రి క్యాన్స‌ర్‌కు నివార‌ణ మార్గ‌మేంటి? క్యాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మంచిది. అవేమిటంటే...

11. ఆరోగ్య‌క‌ర‌మైన డైట్‌

11. ఆరోగ్య‌క‌ర‌మైన డైట్‌

డైట్‌లో భాగంగా ఎక్కువ మోతాదులో కూర‌గాయ‌లు, పండ్లు, తృణ‌ధాన్యాలు తీసుకోవాలి. మ‌ద్యం, ప్రాసెస్డ్ ఫుడ్స్ కు వీలైనంత దూరంగా ఉండ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ ముప్పు నుంచి కాస్త‌యినా త‌ప్పించుకోవ‌చ్చు.

12. క్ర‌మమైన వ్యాయామం

12. క్ర‌మమైన వ్యాయామం

ఆరోగ్య‌క‌ర బ‌రువును మెయింటెయిన్ చేయ‌డం చాలా ముఖ్యం. బ‌రువు నియంత్ర‌ణ వ‌ల్ల చాలా రోగాల నుంచి క్యాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా ఉండ‌గ‌లం. రోజుకు క‌నీసం 30 నిమిషాలు వ్యాయామం చేస్తే చాలు ఆరోగ్యం మ‌న సొంతం.

(ఏజెన్సీ ఇన్‌పుట్స్‌)

English summary

Know How Diabetes & Obesity Can Cause Cancer!

In a shocking revelation, Lancet, the medical journal, in its new study has found that diabetes and high BMI (more than 25kg/m2) were the cause of 5.6 per cent of the new cancer cases around the globe. The study was recently published in The Lancet Diabetes and Endocrinology.
Desktop Bottom Promotion