For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరటి తొక్కతో అదిరిపోయే ప్రయోజనాలు

By Y. Bharath Kumar Reddy
|

అరటిపండు తొక్కే కదా అని తీసి పారేయకండి. పండుకంటే దానితోనే చాలా ప్రయోజనాలున్నాయి. అరటిపండు తొక్కలో అధిక శాతంలో విటమిన్లు, ఖనిజాలు, బి6 , బీ12, ఏ, సి విటమిన్లు, మాంగనీస్, పొటాషియం, అరిగే పీచు పదార్ధాలు, ప్రొటీన్లు, మెగ్నీషియం, తదితర ప్రోటీన్లు ఉంటాయి. తొక్కతో మొటిమల మీద రుద్దితే ఒక్క రాత్రిలో మటుమాయం అవుతాయి. అలాగే ఎగ్‌‌వైట్‌‌లో అరటిపండు తొక్కతో గుజ్జుగా చేసి ముఖానికి పట్టిస్తే ముడుతలు మటుమాయం అయిపోతాయి. నొప్పులు, వాపులు ఉన్న చోట అరటిపండు తొక్క గుజ్జుగా చేసి దానికి వెజిటబుల్ ఆయిల్ కలిపి మసాజ్ చేస్తే అవి మాయం అవుతాయి. అంతే కాదు సోరియాసిస్ వ్యాధితో వచ్చే దురదలతో బాధపడేవారు కూడా అరటిపండు తొక్క గుజ్జును దురదల ప్రాంతంలో పట్టిస్తే రిలీఫ్ ఉంటుంది. అలర్జీలు, దురదలు వచ్చేచోట అరటిపండు తొక్క గుజ్జును రాస్తే ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు.. ఇంకా చాలా ప్రయోజనాలు అరటి తొక్క ద్వారా ఉన్నాయి. వాటన్నింటినీ తెలుసుకోండి మరి.

1. డిప్రెషన్ తగ్గుతుంది

1. డిప్రెషన్ తగ్గుతుంది

డిప్రెషన్‌తో బాధపడుతున్న వారు రోజుకు రెండు అరటి పండు తొక్కలను తినాలి. దీంతో వాటిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలో సెరటోనిన్ స్థాయిలను పెంచుతాయి. సెరటోనిన్ పెరిగితే డిప్రెషన్ తగ్గుతుంది. మానసిక సమస్యలతో బాధపవడేవారు అరటి పండు తొక్కలను రెగ్యులర్‌గా తింటే మంచి ఫలితం ఉంటుంది. డిప్రెషన్‌, డల్‌ తదితర సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.

2. మంచి నిద్ర వస్తుంది

2. మంచి నిద్ర వస్తుంది

ట్రిప్టోఫాన్ అనే రసాయనం అరటి పండు తొక్కలో ఉంటుంది. అందువల్ల తొక్కను తింటే ఆ రసాయనం మన శరీరంలోకి చేరుతుంది. అప్పుడు నిద్ర బాగా వస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు అరటి పండు తొక్కలను తింటుంటే ప్రయోజనం ఉంటుంది. అలాగే క్యాన్సర్‌ కణతులు రాకుండా రక్షించే సమ్మేళనాలు అరటితొక్కలో ఉన్నాయి.

3. కొలెస్ట్రాల్ తగ్గుతుంది

3. కొలెస్ట్రాల్ తగ్గుతుంది

అరటి పండులో కన్నా దాని తొక్కలోనే ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్)ను తగ్గిస్తుంది. హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్)ను పెంచుతుంది. దీని వల్ల గుండె సంబంధ సమస్యలు రావు.

4. కంటిచూపు పెరుగుతుంది

4. కంటిచూపు పెరుగుతుంది

వయసు పెరిగే కొద్దీ కంటి చూపు మందగిస్తుంది. అరటి పండు తొక్క లోపలి భాగాన్ని తినడం వల్ల దృష్టి సంబంధ సమస్యలు తగ్గుతాయి. అరటి తొక్కలో ల్యూటిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి కంటిని కాపాడుతుంది. లుటీన్ దృష్టి సమస్యలను పోగొడంతో పాటు రేచీకటి, శుక్లాలు రాకుండా చేస్తుంది.

5. చర్మ సమస్యలు నయం అవుతాయి

5. చర్మ సమస్యలు నయం అవుతాయి

అరటి పండు, తొక్కలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అరటి తొక్కను ముఖంపై రుద్ది.. అర గంటయ్యాక కడిగేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖంపై ముడతలు తగ్గుతాయి.దెబ్బలు, గాయాలు, పుండ్లు, దురదలు, పురుగులు, కీటకాలు కుట్టిన చోట అరటి పండు తొక్కను రుద్దితే ఉపశమనం లభిస్తుంది. దోమలు లేదా ఏదైనా ఇతర కీటకాలు కుట్టినప్పుడు చాలా మంటగా ఉంటుంది. అవి కుట్టిన చోట అరటి తొక్కతో రుద్దడం వల్ల దురద తగ్గుతుంది.

అలర్జీ నుంచీ అరటి తొక్కలు ఉపశమనం కలిగిస్తాయి.రాత్రి పడుకునే ముందు సమస్య ఉన్న చోట రాస్తే ఫలితం ఉంటుంది. ఏదైనా గాయం తగిలినప్పుడు యాంటీసెప్టిక్ క్రీం అందుబాటులో లేకపోతే అరటి పండు తొక్కతో గాయం చుట్టు పక్కల రాయండి. ఇది గాయం మానడానికి ఉపకరిస్తుంది.

6. కాలిన గాయాలు తగ్గుతాయి

6. కాలిన గాయాలు తగ్గుతాయి

కాలిన గాయాలకు అర‌టి పండు తొక్క ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. స‌మ‌స్య ఉన్న ప్రాంతంపై అర‌టి పండు తొక్క‌ను ఉంచి క‌ట్టు క‌ట్టాలి. రాత్రంతా దాన్ని అలాగే ఉంచాలి. రోజూ రాత్రి ఇలా చేస్తే ఒక‌టి, రెండు రోజుల్లోనే దెబ్బ‌లు మానిపోతాయి.

7. గుండెకు ఎంతో ఆరోగ్యం

7. గుండెకు ఎంతో ఆరోగ్యం

అరటికన్నా అరటితొక్కలో ఎక్కువగా జీర్ణం చేసుకునే పీచు పదార్థాలు ఉంటాయి. అందువల్ల కొవ్వుపదార్థాల స్థాయి తగ్గి, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ కరిగిపోవడంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

8. దంతాలు తెల్లగా అవుతాయి

8. దంతాలు తెల్లగా అవుతాయి

దంతాల సంర‌క్ష‌ణ‌కు అర‌టి పండు తొక్క బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అర‌టి పండు తొక్క లోప‌లి భాగాన్ని దంతాల‌పై రోజూ రుద్దాలి. క‌నీసం ఇలా వారం పాటు చేస్తే దంతాలు తెల్ల‌గా మెరుస్తాయి. అలాగే దంతాలు దృఢంగా, తెల్లగా మారుతాయి. చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. అరటి తొక్కతో వారానొకొకసారి పళ్ల మీద రుద్దితే పలువరుస నిగనిగలాడిపోతుంది.

9. వృద్ధాప్యం కార‌ణంగా వ‌చ్చే ముడ‌త‌లు పోతాయి

9. వృద్ధాప్యం కార‌ణంగా వ‌చ్చే ముడ‌త‌లు పోతాయి

అరటిపండు తొక్క చ‌ర్మాన్ని ర‌క్షిస్తుంది. అంతేకాదు యాంటీ ఏజింగ్ గుణాలు కూడా అర‌టి పండు తొక్క‌లో ఉన్నాయి. దీని వ‌ల్ల వృద్ధాప్యం కార‌ణంగా వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గిపోతాయి. చ‌ర్మం కాంతివంత‌మ‌వుతుంది. అర‌టి పండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై రుద్ది అర‌గంట సేపు ఆగాక గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని క‌డిగేయాలి. చ‌ర్మం ఆరోగ్యాన్ని సంత‌రించుకుంటుంది.

10. సొరియాసిస్‌ను తగ్గిస్తుంది

10. సొరియాసిస్‌ను తగ్గిస్తుంది

అరటి తొక్క సొరియాసిస్‌ని తగ్గించడంలో ఎంతో సాయపడుతుంది. సొరియాసిస్ సోకిన చోట అరటిపండు తొక్కతో రుద్దితే ఫలితం ఉంటుంది. రుద్దేప్పుడు చర్మం ఎర్రగా మారుతుంది. కానీ తరవాత చక్కటి ఫలితం ఉంటుంది.

11. పులిపిర్లు తగ్గిపోతాయి

11. పులిపిర్లు తగ్గిపోతాయి

పులిపిర్లు మిమ్మల్ని వేధిస్తున్నాయా? అరటి తొక్క పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతుంది. కొత్తవి రాకుండా చేస్తుంది. దీనికోసం, పులిపిర్లు ఉన్న ప్రాంతాన్ని అరటితొక్కతో రుద్దండి లేదా ఆ ప్రాంతం మీద రాత్రంతా అరటితొక్కను కట్టండి. పులిపిర్లపై అరటి తొక్కను ఉంచి దానిపై బ్యాండ్ ఎయిడ్‌తో పట్టీలా వేయండి. ఇలా కొద్ది రోజులు చేయడం వల్ల పులిపిర్లు రాలిపోతాయి.

12. స్లిమ్ గా ఉంటారు

12. స్లిమ్ గా ఉంటారు

అరటితొక్కలో పోషకాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీని కారణంగా బరువు ఒకే విధంగా ఉంటూ మీరు ఆరోగ్యంగా, స్లిమ్‌గా, ఫిట్‌గా ఉంటారు. ఇందులో ఇందులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉండటం వలన మన శరీరంలో ఆమ్ల నియంత్రణను బ్యాలెన్స్ చేస్తుంది.

13. జీర్ణ సమస్యలు తగ్గుతాయి

13. జీర్ణ సమస్యలు తగ్గుతాయి

అరటి పండు తొక్కను రెగ్యులర్‌గా తినడం వల్ల జీర్ణ సమస్యలు పోతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండదు. శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి.

14. మొటిమలు తగ్గిపోతాయి

14. మొటిమలు తగ్గిపోతాయి

మొటిమలకూ ఇది చక్కటి పరిష్కారం. మొటిమలున్న చోట అరటి తొక్కతో కొన్ని నిమిషాలు రాసి, తరవాత కడిగేయాలి. రాత్రి పడుకునే ముందు తొక్కతో రుద్దినా సరిపోతుంది. ఇలా రెగ్యులర్ గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

15. క్యాన్సర్ ను దూరం చేస్తుంది

15. క్యాన్సర్ ను దూరం చేస్తుంది

క్యాన్సర్ కణితులు రాకుండా రక్షించే సమ్మేళనాలు అరటితొక్కలో ఉన్నాయి. అలాగే ఎర్రరక్త కణాలను నిరోధించడానికి ఉపయోగడపడతాయి. ఎర్రరక్త కణాలు శరీరంలోకి ఆక్సిజన్ చేరవేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అరటితొక్కను తీసుకోవడం వలన ఎర్రరక్త కణాలు నిరోధించవచ్చు. అలాగే అరటి పండు తొక్క మంచి ప్రొబయోటిక్‌గా పనిచేస్తుంది. దీన్ని తినడం వల్ల పేగుల్లో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అరటి పండు తొక్కనే నేరుగా తినలేమని అనుకునేవారు వాటిని జ్యూస్‌లా పట్టి కూడా తాగవచ్చు. లేదంటే అరటి పండు తొక్కను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని కూడా తాగవచ్చు. దీంతో పైన చెప్పిన అన్ని లాభాలు కలుగుతాయి.

16. ముడతలు తొలగిపోతాయి

16. ముడతలు తొలగిపోతాయి

మీ శరీరం హైడ్రేట్ అవటానికి అరటితొక్క సహాయపడుతుంది. అరటితొక్కను మెత్తగా చేసుకోండి. ఈ మిశ్రమానికి గుడ్డు సోనను కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మీద రాసి, ఐదు నిముషాలు అలానే వదిలేయండి. ఐదు నిముషాల తరువాత కడగండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే ముడతలు తొలిగిపోతాయి.

17. నొప్పి నివారిణి

17. నొప్పి నివారిణి

నొప్పిగా ఉన్న ప్రాంతంలో అరటితొక్కతో రాయండి. నొప్పి నుంచి ఉపశమనం వచ్చే వరకు ముప్ఫై నిముషాల వరకు అలానే వదిలేయండి. అరటి తొక్కతో కూరగాయల నూనె మిశ్రమం కలిపి రాస్తే, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

English summary

Did You Know That Banana Peels Can Solve These Top Health Problems?

All are aware about the properties of banana. But did you know that the banana peel which we throw away is no less than important? The flesh of the banana is rich in many nutrients and carbohydrates. It is also high in vitamins B6, and B12, magnesium and potassium. The sugar content is highest when the banana peel turns black. Here, we have listed some of the best benefits of banana peel that you can make use of to improve your health.
Story first published:Tuesday, November 14, 2017, 9:52 [IST]
Desktop Bottom Promotion