For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు పొట్టలో ఎసిడిటీ వుంటే ఈ ఆహారాలు తినడం మానేయండి !!

దాదాపు 92% మంది గుండె మంటతో బాధపడేవారికి వారు తీసుకొనే ఆహారమే ప్రధాన కారణమని ఈమధ్య అధ్యయనంలో తేలింది. ఈ అంశంలో, మీకు కడుపు అసిడిటీ ఉంటె తీసుకోకూడని ఆహార పదార్ధాల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. మీకు

By Lakshmi Bai Praharaju
|

కడుపులో అసిడిటీ లేదా ఆసిడ్ ప్రతివారికీ ఉండే ఒక సాధారణమైన సమస్య. ఇది సరైన ఆహరం తీసుకోకపోవడం వల్ల ప్రధానంగా వస్తుంది. అసిడిటీ కి సాధారణ లక్షణం గుండెల్లో మంటగా ఉండడం.

కొన్నిసార్లు, రాత్రిపూట మీకు గుండెల్లో మంటగా అనిపించి నిద్ర లేస్తారు. కొన్నిసార్లు మీకు ఈ నొప్పి గుండెపోటు వచ్చిందా అనేంత ఎక్కువగా ఉంటుంది.

దీనివల్ల కేవలం అసౌకర్యంగా ఉండడమే కాకుండా రాత్రులందు మీకు నిద్ర లేకుండా చేస్తుంది, అందువల్ల మీరు రొజులోని దైనందిన కార్యక్రమాలకు కూడా అడ్డుపడుతుంది.

stomach acidity causes

ఇప్పుడు, తరచుగా గుండెల్లో మంట ఎందుకు వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒసోఫాగాస్ చివరలో ఉండే కండరాల రింగు, సాధారణంగా కడుపు ఆసిడ్ కడుపు ప్రారంభంలో ఉంటుంది, అది కడుపులోనే ఉంటుంది.

కానీ గుండె మంట ఉన్నవాళ్లు, ఈ రకం కాదు. కాబట్టి, దీనర్ధం మీరు కడుపు అసిడిటీ, గుండె మంటను వదిలేసి భరించాల్సిన అవసరం ఉందా. అస్సలు లేదు.

దాదాపు 92% మంది గుండె మంటతో బాధపడేవారికి వారు తీసుకొనే ఆహారమే ప్రధాన కారణమని ఈమధ్య అధ్యయనంలో తేలింది.

ఈ అంశంలో, మీకు కడుపు అసిడిటీ ఉంటె తీసుకోకూడని ఆహార పదార్ధాల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. చదువుతూనే ఉండండి...

1. ప్రాసెస్ చేసిన పదార్ధాలు:

1. ప్రాసెస్ చేసిన పదార్ధాలు:

చిప్స్, క్రాకర్స్, ధాన్యాలు వంటి ప్రాసెస్ చేసిన పదార్ధాలలో ఉప్పు, మొక్కజొన్న, బంగాళదుంప అధిక స్థాయిలో ఉంటాయి. సోడియం అధికంగా ఉండే ప్రాసెస్ చేసిన, పాకేజ్ పదార్ధాలు తీసుకునే వారికి అసిడిటీ తేలికగా వస్తుందని స్వీడిష్ అధ్యయనం నిరూపించింది.

2. ఆల్కాహాల్:

2. ఆల్కాహాల్:

అన్ని మత్తు పానీయాలు సాధారణంగా ఎక్కువ అసిడిటీని కలిగి ఉండవు. అయితే, బీర్, లిక్కర్, వైన్ వల్ల అసిడిటీ రావొచ్చని కనుగొన్నారు. ఎందుకంటే కడుపు వద్ద ఉన్న ఆసిఫగాస్ దిగువున ఉన్న వాల్వ్ కి ఆల్కాహాల్ విశ్రాంతిని కలిగిస్తుందని నమ్మకం, దానివల్ల రోగం వస్తుంది. దీన్ని ఉపయోగించకుండా మీరు దూరంగా ఉన్నా, లేకపోతే, మీరు రోజుకు కేవలం ఒక గ్లాసు కాక్టెయిల్ లేదా ఒక గ్లాసు వైన్ తీసుకుంటే పర్లేదు.

మీరు ఆరంజ్ జ్యూస్ లేదా సోడా వంటి ఏదైనా అసిడిక్ ని కలపకుండా ఉండాలి. మీరు ఖచ్చితంగా లేరు అంటే మీకు ఆల్కాహాల్ వల్ల అసిడిటీ వస్తుంది, మీరు తక్కువ మోతాదులో మందు తీసుకుని అదే సమయంలో ఎక్కువ నీరు తీసుకుంటే మీ శరీరం ఎలా స్పందిస్తుంతో చూడండి. అంతేకాకుండా, పడుకునే సమయంలో మీరు ఆల్కాహాల్ తీసుకోక పోవడం కూడా చాలా మంచిది.

3. పాలు:

3. పాలు:

పాలు, పాల పదార్ధాలు కొవ్వు ఎక్కువగా కలిగి ఉంటాయి, అధిక కొవ్వు కలిగిన ఇలాంటి ఆహారం వల్ల అసిడిటీ రావొచ్చు. అయితే, పాలు, ఇతర పాల పదార్ధాల వల్ల ప్రతి వ్యక్తిలో ప్రతికూల ప్రభావాలు జరగవు. మీరు కొద్దిగా కొవ్వు ఉన్న పదార్ధాలను తీసుకోవడం ముఖ్యమైతే, మీ కడుపుకు అసిడిటీ గురించిన ఆలోచన కూడా ఇవ్వండి. కాబట్టి, పాలు, పాల పదార్ధాలు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. తక్కువ కొవ్వు ఉన్న పదార్ధాలను తీసుకోడం ఎల్లప్పుడూ మంచిది.

4. కోడిగుడ్లు:

4. కోడిగుడ్లు:

కోడిగుడ్లు ఆరోగ్యానికి మంచివి, కానీ మీకు అసిడిటీ ఉంటె, గుడ్డులోని పచ్చ సోనలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మీరు తినకపోవడమే మంచిది. ఎగ్ వైట్ లో కొవ్వు తక్కువ ఉంటుంది, కాబట్టి మీరు ఆహారంలో దీనిని తప్పక తీసుకోవచ్చు.

5. కెఫీన్ తో కూడిన పానీయాలు:

5. కెఫీన్ తో కూడిన పానీయాలు:

రోజుకు ఒక కప్పు కాఫీ తాగడం మంచిదే కానీ రోజులో కాఫీ ఇతర కెఫీన్ తో కూడిన పదార్ధాలను అనేకసార్లు తీసుకోవడం వల్ల కడుపులో అసిడిటీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అసిడిటీ ఉన్న వారు కెఫీన్ తో కూడిన పదార్ధాలను ఎక్కువగా తీసుకుంటే పరిస్ధితి చాలా తీవ్రంగా ఉంటుంది. భోజనం అయిన తరువాత ఒక పెద్ద కప్పు కాఫీ లేదా కెఫీన్ తో కూడిన పానీయాలను తీసుకుంటే, వారి అసిడిటీ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. ఈ పరిస్ధితి రాకుండా ఉండాలి అంటే గ్రీన్ టీ లేదా చమోమిల్ టీ తాగడం మంచిది.

6. కృత్రిమ పంచదార:

6. కృత్రిమ పంచదార:

చక్కర, కృత్రిమ తీపి కలిగిన వస్తువుల వల్ల అనేక కేసులలో మంట రావొచ్చు దీనివల్ల ఎక్కువగా తినడం, హడావిడిగా తినడం, బరువు పెరగడం జరిగి దీని ఫలితంగా కడుపులో అసిడిటీ వస్తుంది.

7. పీనట్:

7. పీనట్:

పీనట్, పీనట్ బటర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వు గా పరిగణించబడే సాచురేటెడ్ కొవ్వును కలిగి ఉంటాయి. ఇది అన్నిటికీ వర్తించకపోయినా, కొంతమందిలో అధిక కొవ్వును కలిగి ఉండే వాటివల్ల అసిడిటీ పెరిగే అవకాశం ఉంది.

8. వేపుడు పదార్ధాలు:

8. వేపుడు పదార్ధాలు:

అసిడిటీకి కారణమయ్యే పదార్ధాల జాబితాలో ముందు ఉండేది వేపుడు పదార్ధాలు. గుండె మంటకు ఇది అత్యంత సాధారణ కారణంగా గుర్తించబడింది, ఒసోఫజిల్ నుండి గుండేనోప్పికి దారితీస్తుంది. ఈ పదార్ధాలు ఎప్పుడూ చెడు పదార్ధాల జాబితాలోనే ఉంటాయి ఎందుకంటే వీటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇలాంటి కొవ్వు పదార్ధాలు పొట్టలో ఎక్కువ సమయం ఉండి, అరుగుదల కష్టమౌతుంది. దీని ఫలితంగా, అదనపు ఆసిడ్ ఉత్పత్తి అయ్యే ప్రమాదం ఉంది.

9. పాస్తా:

9. పాస్తా:

పాస్తాలను సాధారణంగా గోధుమ లేదా ఇతర సహజంగా అసిడిక్ ఉండే గింజలతో తయారుచేస్తారు. అంతేకాకుండా, సాస్ లతో కలిసిన పాస్తా అధిక కొవ్వును కలిగి ఉండి, దాని ఫలితంగా అసిడిటీ రావొచ్చు.

10. గోధుమ ఉత్పత్తులు:

10. గోధుమ ఉత్పత్తులు:

మన ఆహారంలో చాలా భాగం గోధుమ ;వంటి తృణధాన్యాలు ఉంటాయి, ఇవి సహజంగా అధిక కొవ్వును కలిగి ఉంటాయి. గోధుమ, గోధుమతో కూడిన పదార్ధాలను తక్కువగా తీసుకోవడం మంచిది. ఈ పదార్ధాలను తినే ముందు నానపెట్టడం, మొలకలు వచ్చేట్టు చేయడం వల్ల ఈ ధాన్యాలలో అసిడిటీ స్వభావాన్నితగ్గిస్తుంది.

కడుపు అసిడిటీ కి కారణమయ్యే ఇతర సాధారణ పదార్ధాలు చాకొలెట్లు, సోడాలు, మాంసము.

English summary

Avoid These Foods If You Have Stomach Acidity

Stomach acidity occurs due to an improper diet consumption. This is not just a small inconvenience but it can affect your sleep at night and also prevent you from doing your regular activities during the day. There are certain foods that aggravate the condition and hence need to be avoided..
Story first published:Thursday, November 30, 2017, 18:21 [IST]
Desktop Bottom Promotion