For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పైల్స్ ను పర్మనెంట్ గా నివారించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!!

పైల్స్ చికిత్సకోసం.. కొంత మందికి హాస్పటల్ కు వెళ్లాంటే భయం..అలాంటి వారు ఇంట్లోనే పర్మనెంట్ గా పరిష్కారం కోసం వెదుకుతుంటారు. అలాంటి వారికోసం ఈ క్రింది సూచించిన కొన్ని హోం రెమెడీస్ నయం చేస్తాయి

|

హెమరాయిడ్స్ లేదా పైల్స్ అనేది ప్రస్తుత కాలంలో సర్వసాధరణమైన అనారోగ్యపు సమస్యగా మారింది. అందుకు కారణం ప్రస్తుతం మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు వల్ల అనేక రకాలైన అనారోగ్యాల భారీన పడుతున్నారు. అధిక బరువు, తలనొప్పి, బ్యాక్ పెయిన్ వంటి సాధారణ సమస్యలతో పాటు మరొకటి పైల్స్. సాధారణంగా ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాదే అయినప్పటికి.. జీవన శైలిలో మార్పుల వల్ల పైల్స్ ఏర్పడుతున్నాయి. హెమరాయిడ్స్‌ని సామాన్య పరిభాషలో పైల్స్ అంటారు. మనం తెలుగులో వీటిని మొలలు అని అంటాం.

ఇది సర్వసాధారణమైన సమస్య. కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారికి తరచుగా వచ్చే సమప్య పైల్స్‌. అందుకు కారణం సరియైనా ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, మలబద్ధకం వంటి వాటితోనే ఈ సమస్య ఏర్పడుతుంది. నీరు తక్కువగా త్రాగడం, మద్యం అతిగా సేవించుటం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుళ్లు అతిగా తినడం, మాంసాహరం తరుచుగా తినటం- వీటన్నింటి వలన పైల్స్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

లక్షణాలు: మల విసర్జన సాఫీగా జరుగదు. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, మంట వుంటాయి. అప్పుడప్పుడు రక్తం పడుతుంది. మల విసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి మంట రెండు గంటల వరకు ఉంటుంది. విరోచనం కాకపోవడం వీరికి బాధ కలిగిస్తుంది. సుఖ విరోచనం కాకపోవడంతో చిరాకుగా కోపంగా ఉంటారు. మల విసర్జన సమయంలో మొలలు (పైల్స్‌) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి. ఒకసారి వస్తే చాలాకాలంపాటు వేధించే సమస్య ఇది. ముఖ్యంగా జీవనశైలి, ఆహారం, కూర్చుని చేసే ఉద్యోగం- ఈ వ్యాధికి కారణం అవుతాయి. మనుషులు చురుకుగా ఉండలేరు. ఎక్కడికంటే అక్కడికి ప్రయాణాలు చేయలేరు. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.

అయితే కొంత మందికి హాస్పటల్ కు వెళ్లాంటే భయం..అలాంటి వారు ఇంట్లోనే పర్మనెంట్ గా పరిష్కారం కోసం వెదుకుతుంటారు. అలాంటి వారికోసం ఈ క్రింది సూచించిన కొన్ని హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా నయం చేస్తాయి. లైఫ్ ను మరింత బెటర్ గా సంతోషంగా మార్చుతాయి. మరి అవేంటో తెలుసుకుందాం..

 బ్లాక్ జీలకర్ర:

బ్లాక్ జీలకర్ర:

జీలకర్ర జీర్ణశక్తిని పెంచుతుంది. ఆపాన వాయువు నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీలకర్రలో ఉండే ముఖ్యమైన కాంపోనెంట్ థైమోల్ . ఇది గ్రంథులను క్రమబద్దం చేస్తుంది.జీర్ణవ్యవస్థ జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తుంది. ఒక స్పూన్ జీలకర్ర ను ఒకగ్లాసు నీళ్ళ వేసి వేడి చేసి గోరువెచ్చగా తాగాలి. లేదా ఒక స్పూన్ జీలకర్ర పొడిని నీళ్ళలో కలిపి తాగాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

 ఐస్ క్యూబ్స్:

ఐస్ క్యూబ్స్:

పైల్స్ నివారించడంలో ఒక సింపుల్ హోం రెమెడీ ఐస్. ఐస్ క్యూబ్స్ మర్దన వల్ల అక్కడ వాపు తగ్గిస్తుంది. బయటకు పొడుచుకొచ్చిన బ్లడ్ వెసల్స్ ష్రింక్ అవుతాయి. అలాగే నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.. క్లాత్ లో ఐస్ క్యూబ్స్ ను చుట్టి, పైల్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 10నిముషాల తర్వాత తిరిగి అలాగే చేయాలి. ఇలా రెగ్యులర్ గా కొన్ని రోజుల పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఎర్రముల్లంగి రసం:

ఎర్రముల్లంగి రసం:

ఎర్రముల్లంగి జ్యూస్ నేచురల్ ల్యాక్టేటివ్ గా పనిచేస్తుంది. కిడ్న మరియు లివర్ నుండి వేస్ట్ ను తొలగిస్తుంది. పైల్స్ ను ఇంట్లోనే క్యూర్ చేసుకోవడానికి ఒక ఉత్తమ మార్గం.. పైల్స్ కు ఒక గ్లాసు ముల్లంగి రసం చాలా అద్భుతంగా చేస్తుంది. ముందుగా 1/4కప్పుతో ప్రారంభించి, రోజు రోజుకూ అరకప్పు రసంను పెంచుకుంటూ పోవాలి.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్లో యాంటీ ఆన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఎక్సటర్నల్ హెమరాయిడ్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించడంతో పాటు, బ్లడ్ వెజల్స్ లోని ఎలాసిటిని తగ్గిస్తుంది. రోజూ ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ తినడం వల్ల పైల్స్ సమస్య నయం అవుతుంది.

అంజూర:

అంజూర:

అంజీర లేదా ఫిగ్స్ లాక్సేటివ్ గుణాలు కలిగి ఉంది. ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంది. ఇందులో ఉండే ఆప్రోడిజాయిల్ లక్షణాలు , పొటాసిం, మెగ్నీషియం, పైల్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అంజీర పండు రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయం పరగడుపును తింటే మలబద్ధకం పోయి పైల్స్ వ్యాధి నయమైపోతుంది. ఆ నీటిని సగభాగం ఉదయం, సగభాగం సాయంత్రం తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. నొప్పి, వాపులను తగ్గిస్తుంది.

బ్లాక్ టీ:

బ్లాక్ టీ:

బ్లాక్ టీలో టానిక్ యాసిడ్స్ ఉంటాయి. పైల్స్ కు సంబంధించిన నొప్పి వాపును తగ్గించడంలో ఇది నేచురల్ పదార్థంగా పనిచేస్తుంది. పైల్స్ నివారించడంలో ఇది బెస్ట్ హోం రెమెడీగా పనిచేస్తుంది. హాట్ వాటర్ లో బ్లాక్ టీ బ్యాగ్ డిప్ చేసి, 10 నిముషాల తర్వాత తొలగించాలి. తర్వాత టీబ్యాగ్ ను వాపు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. లేదా 10 నిముషాలు ఉంచి తీసేయాలి.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

బాగా పండిన అరటిపండ్లలో ఉండే షుగర్ కంటెంట్ హెమరాయిడ్స్ ను నివారిస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీబయోటిక్ లక్షణాలు ఎఫెక్టెడ్ ఏరియాలో రక్షణ కల్పిస్తుంది. బాగా పండిన అరటిపండ్లలను ఒక కప్పు పాలలో వేసి బాగా మెత్తగా కలిపి రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.

కాకరకాయ రసం:

కాకరకాయ రసం:

పైల్స్ ను నివారించడంలో కాకరకాయ రసం గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. పైల్స్ ను నివారిచండలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మూడు స్పూన్ల కాకరకాయ రసాన్ని ఒక గ్లాసు బట్టర్ మిల్క్ లో మిక్స్ చేసి తాగాలి.. పరగడపున తాగడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

బట్టర్ మిల్క్ :

బట్టర్ మిల్క్ :

బట్టర్ మిల్క్ లో ఆస్ట్రిజెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. పైల్స్ కారణంగా వచ్చిన వాపును తగ్గించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది ఒక బెస్ట్ హోం రెమెడీగా పనిచేస్తుందిజ వాపు, చీకాకును తగ్గిస్తుంది. ఒక గ్లాసు బట్టర్ మిల్క్ లో కొద్దిగా సాల్ట్ మిక్స్ చేసి రోజూ తాగాలి. ఇలా చేయడం వల్ల పైల్స్ తగ్గుతాయి.

యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ : పైల్స్ ను తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ గ్రేట్ రెమెడీ. ఇందులో మలబద్దకాన్ని తగ్గించే లక్షణాలు అధికంగా ఉన్నాయి. కాటన్ ప్యాడ్ తీసుకుని వెనిగర్ లో డిప్ చేసి, ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.

English summary

Get Rid Of Piles Naturally With These Top 10 Home Remedies

Cure piles permanently with the help of these best home remedies! Read this article to know the different remedies.
Desktop Bottom Promotion