For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉల్లి, కాకరకాయ రసంలో దాగున్న అద్భుత ప్రయోజనాలు..!

By Lekhaka
|

ఆలస్యంగా అయినా నేచురల్ లేదా హెర్బల్ రెమెడీస్ బాగా ప్రసిద్ది చెందుతున్నాయి. అనేక వ్యాధులను నివారించడంలో హెర్బల్ రెమెడీస్ బాగా పాపులర్ అవుతున్నాయి. పండ్లు, కూరగాయల గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవడం, వాటిలోని ఆరోగ్య ప్రయోజనాల పట్ల అవాగాహన చేసుకోవడం మంచిది.

రీసెంట్ గా జరిపిన పరిశోధనల ప్రకారం కొన్ని రకాల వెజిటేబుల్స్, పండ్లు వ్యాధులను నివారించడంలో మెడిసిన్స్ కంటె ఎఫెక్టివ్ గా పనిచేసి వ్యాధులను నిర్మూలిస్తాయని కనుగొన్నారు.

నేచురల్ మెడిసిన్స్ తో బాధపడాల్సిన అవసరం లేదు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదనంగా సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు, పండ్లు మన శరీరానికి కావల్సిన పోషణను అందివ్వడంతో పాటు, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాధులను నివారిస్తాయి.

మీకు తెలుసా కాకరకాయ మరియ ఉల్లిపాయల రెండింటి మిశ్రమంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నయా.ఈ హెల్తీ డ్రింక్ తాగడం వల్ల మంచి అనేక హెల్త్ బెనిఫిట్స్ పొందుతారు.

ఈ హెల్త్ డ్రింక్ తయారుచేయు విధానం

కావల్సినవి:

కాకరకాయ : 1

ఉల్లిపాయ : 1/2

తయారుచేయు విధానం:

కాకరకాయను పైపై చెక్కు తియ్యాలి. తర్వాత ఉల్లిపాయ పొట్టు తీసి, ఇవి రెండూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, బ్లెండర్లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. కొద్దిగా నీళ్ళు పోసి, గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చెయ్యగా వచ్చిన జ్యూస్ ను ఒక కప్పులోకి వంపుకోవాలి. ఈ జ్యూస్ ను రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఈ కాంబినేషన్ జ్యూస్ తాగడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

1. టైప్ 2 డయాబెటిస్ ను ను నివారిస్తుంది

1. టైప్ 2 డయాబెటిస్ ను ను నివారిస్తుంది

ఈ కాకరకాయ, ఉల్లిపాయ జ్యూస్ కాంబినేషన్ లో యాంటీఆక్సిడెంట్స్ అదికంగా ఉంటాయి. దీన్నే పాలి పెప్టైడ్ అని పిలుస్తారు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దాంతో టైప్ 2 డయాబెటిస్ తగ్గిస్తుంది.

2. ఫీటల్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

2. ఫీటల్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

గర్భిణీలు ఈ హెల్త్ డ్రింక్ తీసుకోవడం వల్ల ఫీటస్ అబ్ నార్మలిటీస్ తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫొల్లెట్ పుట్టబోయే బిడ్డలో కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.

3. సెల్ ఏజింగ్ ప్రొసెస్ ను తగ్గిస్తుంది:

3. సెల్ ఏజింగ్ ప్రొసెస్ ను తగ్గిస్తుంది:

ఉల్లిపాయ, కాకరకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్స్,మరియ విటమిన్ ఎ వయస్సు పెరగడానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ తో పోరాడే సెల్స్ ను రక్షణ కల్పిస్తుంది.

4. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది:

4. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది:

ఉల్లిపాయ, కాకరకా జ్యూస్ లో ఉండే ఔషధ గుణాలు తపొట్టలో యాసిడ్స్ ను ఉత్పత్తి చేస్తుంది. దాంతో మలబద్దకం, ఎసిడిటి తగ్గిస్తుంది.

5. ఇన్ఫెక్షన్ నివారిస్తుంది:

5. ఇన్ఫెక్షన్ నివారిస్తుంది:

కాకరకాయ ఉల్లిపాయ కాంబినేషన్ జ్యూస్ లో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు గుణాలు ఇన్ఫ్లమేషన్ మరియు ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది.

6. బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

6. బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

ఈ నేచురల్ హెల్త్ డ్రింక్ కొలెస్ట్రాల్ లెవ్లస్ ను తగ్గిస్తుంది. ధమనుల్లోరక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

7. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:

7. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:

కాకరకాయల మరియు ఉల్లిపాయల విటమిన్స్, మినిరల్స్ వ్యాధినిరోధకతను పెంచి ఆరోగ్యంగా స్ట్రాంగ్ గా ఉండటానికి సహాయపడుతుంది.

English summary

Health benefits of drinking Karela and onion juice..!

Did you know that the mixture of karela (bitter gourd) and onion can treat up to 7 disorders? Well, here's a look at how you can prepare and consume this health drink.
Desktop Bottom Promotion