For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరివేపాకు టీ లో మైండ్ బ్లోయింగ్ హెల్త్ బెనిఫిట్స్: ఎలా తయారుచేయాలో తెలుసుకోండి..!

వంటల్లో కరివేపాకు పడందే కొంత మందికి ముద్ద దిగదు. కొంత మందైతే కరివేపాకే కదాని అని ఎత్తి పక్కన పెట్టేస్తుంటారు. కానీ అందులోని మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్ తెలుసుకుంటే కరివేపాకు తినకుండా ఉండలేరు.

By Mallikarjuna
|

కర్రీ లీవ్స్ తెలుగులో కరివేపాకు అని పిలుస్తారు, హిందిలో ఖాది పట్టా అని పిలుస్తారు, ఇది వేప చెట్టు ఫ్యామిలికి చెందిందని, ఇది ఎక్కువగా సౌత్ ఇండియా మరియు శ్రీలంకలో ఈ మొక్కలను పెంచుతారు.

వంటల్లో కరివేపాకు పడందే కొంత మందికి ముద్ద దిగదు. కొంత మందైతే కరివేపాకే కదాని అని ఎత్తి పక్కన పెట్టేస్తుంటారు. కానీ అందులోని మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్ తెలుసుకుంటే కరివేపాకు తినకుండా ఉండలేరు. కరివేపాకు వంటలకు సువాన మాత్రమే కాదు, ఔషధగుణాలుండటం వల్లే దీన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీన్ని వంటలకు మాత్రమే కాదు, టీలు తయారీలో కూడా పురాతన కాలం నుండి వాడుతున్నారు. ముఖ్యంగా మార్నింగ్ సిక్ నెస్, డయాబెటిస్ నివారణకు కరీలీవ్స్ టీ తయారుచేసి తీసుకునే వారు.

12 Health Benefits of Curry Leaves Tea for Weight Loss + How to Make it

కరివేపాకు గురించి ఈ వ్యాసం ద్వారా ఖచ్చితంగా ఏమి తెలియజేయాలనుకున్నామంటే-కర్రీ లీఫ్స్ టీలో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలు , ముఖ్యంగా బరువు తగ్గడానికి ఈ టీ ఎలా సహాయపడుతుంది, ఇందులో ఉన్న శక్తిసార్థ్యాలేంటి, దీన్ని ఇంట్లో స్వయంగా ఎలా తయారుచేసుకోవాలి అన్నదే. టీని తయారుచేయడానికి కంటే ముందుగా కరివేపాకులో దాగున్న మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం..

జుట్టు పెరుగుదలకు కరివేపాకును ఎలా ఉపయోగించాలి? జుట్టు పెరుగుదలకు కరివేపాకును ఎలా ఉపయోగించాలి?

#1 కరివేపాకు టీ శరీరాన్ని శుద్ది చేస్తుంది

#1 కరివేపాకు టీ శరీరాన్ని శుద్ది చేస్తుంది

ఎక్కువ ఆహారాలు తినడం, అనారోగ్యకరమైన ఆహారాలు తినడం, మరియు ప్రొసెస్ చేసిన ఫుడ్స్ తినడం, డైజెస్టివ్ ట్రాక్ట్ వ్యాధులు, బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం, ఇంకా శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం మొదలగువన్నీ బరువు పెరగడానికి కారణమని అంటారు.

బరువు పెరుగడానికి కారణం ఏదైనా కరివేపాకు టీ శరీరంలో చేరిన అన్ని రకాల టాక్సిన్స్ ను డిటాక్సిఫై చేస్తుంది. శరీరంలోని ఫ్యాట్ ను ఎక్కువగా కరిగించి, క్రమంగా బరువు తగ్గిస్తుంది.

#2 జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది:

#2 జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది:

కరివేపాకుతో తయారుచేసిన టీని తాగడం వల్ల ఇందులో ఉండే హెర్బల్ మరియు మెడికల్ కాంపోనెంట్స్ వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. డయోరియాను నివారిస్తుంది.

కొబ్బరి నూనె + కరివేపాకు వేడి చేసి తలకు అప్లై చేస్తే: అద్భత లాభాలుకొబ్బరి నూనె + కరివేపాకు వేడి చేసి తలకు అప్లై చేస్తే: అద్భత లాభాలు

#3 బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది

#3 బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది

మీరు ఎక్కువ షుగర్ ఫుడ్స్ మరియు డ్రింక్స్ తీసుకున్నప్పుడు, సెడన్ గా బ్లడ్ షుగర్స్ పెరుగుతాయి. అయితే మీ శరీరానికి అంత షుగర్ అవసరం ఉండదు. శరీరంలో చేరే ఎక్స్ ట్రా షుగర్ ఫ్యాట్ గా మారుతుంది. అది శరీరంలో నిల్వ చేరి అధిక బరువుకు కారణం అవుతుంది.

కరివేపాకును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బ్లడ్ షుగర్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది, దాంతో శరీరంలో ఫ్యాట్ పెరగకుండా నివారిస్తుంది. డయాబెటిస్ వల్ల వచ్చే జబ్బులను దూరం చేస్తుంది.

#4 ఇది పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్

#4 ఇది పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్

కరివేపాకులో కార్బోజోల్ ఆల్కలాయిడ్ అనే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల, శరీరంలో ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. అలాగే శరీరం ఎలాంటి ఇన్ఫ్లమేషన్స్ మరియు ఇన్ఫెక్షన్స్ కు గురి కాకుండా బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

కరివేపాకులో ఉండే ఇతర కాంపౌండ్స్ లో లినోలూల్ అనే కంటెంట్ మంచి అరోమా వాసనను అందిస్తుంది.

#5 కరివేపాకు గాయాలను, కాలిన గాయాలను నయం చేస్తుంది.

#5 కరివేపాకు గాయాలను, కాలిన గాయాలను నయం చేస్తుంది.

టీకోసం ఉడికించిన కరివేపాకును పేస్ట్ లా చేసి గాయాల మీద, కాలిన గాయాల మీద, పుండ్లు మీద, తెగిన గాయల మీద అప్లై చేయవచ్చు.

ఇలా ఉడికించి పేస్ట్ చేసిన కరివేపాకులో మహానింబిసిన్ అనే కంటెంట్ ఉండటం వల్ల గాయలను త్వరగా మాన్పుతుంది. అలాగే గాయల వద్ద తిరిగి హెయిర్ ఫాలీసెల్స్ ను పుననిర్మితమవడానికి సహాపడుతుంది.

#6 బరువు పెరగకుండా నివారిస్తుంది.

#6 బరువు పెరగకుండా నివారిస్తుంది.

రోజూ ఉదయం ఒక కప్పు కరివేపాకు టీ తాగడం వల్ల బరువు పెరగకుండా కంట్రోల్లో ఉంటుంది, ఇందులో ఉండే మెడికల్ మహానింబిన్, కార్బోజోలే ఆల్కలాయిడ్ కాంపౌండ్స్ వల్ల బరువు పెరగడకుండా ఉంటారు.

#7 మలబ్దకం, డయోరియా సమస్యలను నివారిస్తుంది.

#7 మలబ్దకం, డయోరియా సమస్యలను నివారిస్తుంది.

ముందు పాయింట్ లో తెలిపిన విధంగా, కరివేపాకు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణవాహికను బలోపేతం చేస్తుంది, ముఖ్యంగా ప్రేగులను స్ట్రాంగ్ గా మార్చుతుంది. అయితే అన్ని రకాల కరివేపాకులు అలా చెయ్యవు.

కరివేపాకులో కొన్ని లాక్సేటివ్ లక్షణాలుండటం వల్ల మలబద్దకం నివారిస్తుంది. డయోరియా నయం చేస్తుంది. ఫుడ్ పాయిజనింగ్ ను నయం చేస్తుంది. కరివేపాకు టీ తాగడం వల్ల గౌట్ లో హానికరమైన సూక్ష్మ క్రిములను నాశనం చేస్తుంది.

#8 స్ట్రెస్ తగ్గిస్తుంది

#8 స్ట్రెస్ తగ్గిస్తుంది

కరివేపాకులో ఉండే సువాసన భరితమైన ఆరోమా వాసన (లినోలూల్) శరీరాన్ని విశ్రాంతి పరుస్తుంది మరియు ఒత్తిడి తగ్గిస్తుంది. కాబట్టి, స్ట్రెస్ ఫుల్ గా ఉన్న పనిరోజుల్లో మీరు తప్పకుండా కరివేపాకు టీ తాగడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

చర్మ నిగారింపు కోసం, చర్మం మెరిసేలా చేసే కర్రీ లీవ్స్ (కరివేపాకు) ఫేస్ ప్యాక్..!చర్మ నిగారింపు కోసం, చర్మం మెరిసేలా చేసే కర్రీ లీవ్స్ (కరివేపాకు) ఫేస్ ప్యాక్..!

#9 ఇది జ్ఝాపక శక్తిని మెరుగుపరుస్తుంది

#9 ఇది జ్ఝాపక శక్తిని మెరుగుపరుస్తుంది

రెగ్యులర్ గా కరివేపాకును ఆహారాల్లో లేదా టీ రూపంలో తీసుకోవడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది. మతిమరుపు తగ్గిస్తుంది.

వాస్తవానికి, కరివేపాకులోని విలువైన కాంపౌండ్స్ అన్ని అమ్నేషియాను వ్యతిరేకించి, ఆల్జైమర్స్ ను వ్యాధిని నివారిస్తుందని పరిశోధనల్లో కనుగొనడం జరిగింది.

#10 మార్నింగ్ సిక్ నెస్, వికారం తగ్గిస్తుంది

#10 మార్నింగ్ సిక్ నెస్, వికారం తగ్గిస్తుంది

ఉదయం మార్నింగ్ సిక్ నెస్ తో బాధపడుతుంటే కరివేపాకు టీ తాగడం మంచిది. ముఖ్యంగా గర్భిణీలు మార్నింగ్ సిక్ నెస్ తో బాధపడే వారు కూడా కరివేపాకు టీ తాగొచ్చు. అయితే పరిమితంగా తీసుకోవాలి.

#11 కంటి చూపును మెరుగుపరుస్తుంది

#11 కంటి చూపును మెరుగుపరుస్తుంది

కరివేపాకులో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది, ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి చూపును మెరుగుపడాలంటే రోజు ఒక కప్పు కరివేపాకు టీ తాగాలి. కరివేపాకు టీ తాగడం వల్ల కళ్ళు పొడి బారడం తగ్గుతుంది, కళ్ళు ఒత్తిడి తగ్గుతుంది.

#12 క్యాన్సర్ తో పోరాడుతుంది

#12 క్యాన్సర్ తో పోరాడుతుంది

జపాన్ లోని మిజియో యూనివర్సిటీ పరిశోధన ప్రకారం కరివేపాకులో ఉండే కార్బోజోల్ ఆల్కలాయిడ్ క్యాన్సర్ సెల్స్ తో పోరాడే గుణాలు స్ట్రాంగ్ గా ఉన్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా కొలెరెక్టల్ క్యాన్సర్, లుకేమియా మరియు ప్రొస్టేట్ క్యాన్సర్ నివారించే గుణాలు కరివేపాకు టీలో ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.

కరివేపాకు పొడి, తేనె మిశ్రమంతో పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!కరివేపాకు పొడి, తేనె మిశ్రమంతో పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!

మరి కరివేపాకులో ఇన్ని అద్భుత ప్రయోజనాలున్న కరివేపాకు టీని ఎలా తయారుచేయాలో ఎలా వాడాలో తెలుసుకుందాం..

కరివేపాకు టీ తయారు చేయడం ఎలా

కరివేపాకు టీ తయారు చేయడం ఎలా

మీకు కావల్సినవి:-

1 కప్పు నీళ్ళు

30-45 కరివేపాకు ఆకులు

పద్దతి:-

1. సాస్ పాన్ లో నీళ్ళు పోసి బాగా మరిగించాలి.

2. తర్వాత స్టౌ ఆఫ్ చేసి మరుగుతున్న నీటిలో 30-45 కరివేపాకు ఆకులను వేయాలి. తర్వాత కరివేపాకు నీళ్ళు కలర్ మారే వరకు అలాగే ఉండనివ్వాలి.

3. తర్వాత నీటిని గోరువెచ్చగా ఉన్నట్లే వడగట్టి తాగాలి. చల్లా అయున్నట్లైతే రీహీట్ చేసుకుని తాగొచ్చు.

4. ఒక స్పూన్ తేనె మరియు ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తాగొచ్చు.

English summary

12 Health Benefits of Curry Leaves Tea for Weight Loss + How to Make it

Curry leaves contain powerful carbazole alkaloids in them that can help you lose weight by detoxifying your body, improving your digestive tract, relieving constipation, reducing your cholesterol level, and preventing diabetes. Plus, learn how to make curry leaves tea with just water and curry leaves.
Story first published:Thursday, December 14, 2017, 18:53 [IST]
Desktop Bottom Promotion