For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉపయోగాలు తెలుసుకుంటే ఇక మీదట మీరు ఉల్లిపాయ పొట్టును పారేయరు!

|

ఉల్లిపాయ‌ల‌ను నిత్యం మ‌నం వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తామ‌నే సంగ‌తి తెలిసిందే. ఉల్లిపాయ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కొంద‌రు వీటిని పెరుగు, మ‌జ్జిగ వంటి ప‌దార్థాల్లో వేసుకుని తాగుతారు. ఇక కొంద‌రు ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌ను మాంసాహారం, ప‌ప్పు వంటి వాటితో నంజుకుని తింటారు. ఈ క్ర‌మంలో ఎలా తిన్నా ఉల్లి పాయ‌లు మ‌న‌కు ఆరోగ్యాన్ని క‌లిగించేవే. అయితే ఉల్లిపాయ‌లే కాదు, వాటిపై ఉండే పొట్టు వ‌ల్ల కూడా అనేక ప్రయోజనాలున్నాయి..

ఉపయోగాలు తెలుసుకుంటే ఇక మీదట మీరు ఉల్లిపాయ పొట్టును పారేయరు!

మ‌న శ‌రీరానికి కావల్సిన కీల‌క పోష‌కాలు ఉల్లిపాయ‌ల్లో ల‌భిస్తాయి. అయితే మీకు తెలుసా..? కేవ‌లం ఉల్లిపాయ‌లే కాదు, వాటిపై ఉండే పొట్టు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌క‌ర‌మే. చాలా మంది ఉల్లిపాయ‌ల‌ను పొట్టు తీసి వాడుకుంటారు. అయితే ఆ పొట్టు వ‌ల్ల కూడా మ‌న‌కు ఎన్నో ఉప‌యోగాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చేతి పై ఉల్లిపాయను రుద్దడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు..! చేతి పై ఉల్లిపాయను రుద్దడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు..!

1. ఈ నీటిని నొప్పులు, వాపులున్న చోట రాసుకుంటే నొప్పులు, వాపులు త‌గ్గుతాయి.

1. ఈ నీటిని నొప్పులు, వాపులున్న చోట రాసుకుంటే నొప్పులు, వాపులు త‌గ్గుతాయి.

ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే పొట్టు తీసేస్తే ఆ నీటిని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ నీటిని నొప్పులు, వాపులున్న చోట రాసుకుంటే నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి.

2. దోమలు, ఈగలు రావు

2. దోమలు, ఈగలు రావు

ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో ఉల్లిపాయ పొట్టును వేయాలి. అనంత‌రం ఆ పాత్ర‌ను కిటికీలు లేదా గుమ్మం వ‌ద్ద పెడితే ఇంట్లోకి దోమ‌లు, ఈగ‌లు రావు. ఉల్లిపాయ పొట్టు నుంచి వచ్చే వాస‌న వాటికి న‌చ్చ‌దు. అందుకే అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

జుట్టురాలడాన్ని తగ్గించి పెరుగుదలకు సహాయపడే ఉల్లిజుట్టురాలడాన్ని తగ్గించి పెరుగుదలకు సహాయపడే ఉల్లి

3. వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది

3. వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది

త‌ల‌స్నానం చేసేట‌ప్పుడు జుట్టును నీటితో క‌డిగి షాంపూ పెట్ట‌క‌ముందే ఉల్లిపాయ పొట్టుతో బాగా మ‌ర్ద‌నా చేయాలి. దీంతో వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు దృఢంగా పెరుగుతుంది. చుండ్రు, ఇత‌ర స‌మ‌స్య‌లు పోతాయి.

4. శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు న‌య‌మ‌వుతాయి

4. శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు న‌య‌మ‌వుతాయి

పైన చెప్పిన విధంగా ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగితే దాంతో శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు న‌య‌మ‌వుతాయి. ఎందుకంటే ఆ సూప్ యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్ ఏజెంట్‌గా ప‌నిచేస్తుంది. అందుకే ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి.

5. కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి

5. కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి

ఉల్లి పొట్టులో ఉండే మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి, బి6లు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతాయి,.

6. రక్తపోటు సమస్యలు, గుండె పోటు సమస్యలు , అజీర్ణ సమస్యలు తగ్గుతాయి

6. రక్తపోటు సమస్యలు, గుండె పోటు సమస్యలు , అజీర్ణ సమస్యలు తగ్గుతాయి

ఉల్లిపొట్టుతో ఒక రకమైన డ్రింక్ తయారుచేసుకుని రోజుకు రెండు సార్లు తాగితే రక్తపోటు సమస్యలు, గుండె పోటు సమస్యలు , అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. అందుకు చేయాల్సిందల్లా

ఒక ఉల్లిపాయ ముక్కను పాదంపై రాత్రంతా ఉంచి చూడండి ఏమవుతుందో!ఒక ఉల్లిపాయ ముక్కను పాదంపై రాత్రంతా ఉంచి చూడండి ఏమవుతుందో!

7. మీ ఆహారం బాగా జీర్ణం అవుతుంది

7. మీ ఆహారం బాగా జీర్ణం అవుతుంది

ఒక ఉల్లిగడ్డ తీసుకుని ఆ పొట్టు అంతా తీసి, రెండు కప్పుల నీటిలో వేసి బాగా నానబెబ్టాలి. తర్వాత ఈ నీటిని పొట్టుతో సహా మరిగించాలి. అలానే ఓ ఇరవై నిముషాలు ఉంచాలి. 10 నిముషాల తర్వాత పొట్టును నీటిలోంచి బయటకు తీసి గోరువెచ్చగా ఉండగా తాగాలి. ఇలా పొద్దున్న రాత్రి రెండు సార్లు చేస్తే మంచిది.

ఇలా చేయడం వల్ల రక్త పోటు సమస్య తగ్గుతుంది, మీ ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ఫ్యాట్ కరిగించి, మెటబాలిజం రేటు పెంచుతుంది.

8. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.

8. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.

ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగుతుంటే శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. త‌ద్వారా అధిక బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు, గుండె స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి.

9. పలు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా నివారిస్తుంది

9. పలు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా నివారిస్తుంది

ఉల్లిపాయ పొట్టుకు చెందిన సూప్ లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. దీనికి తోడు అందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. క్వ‌ర్సెటిన్ అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన యాంటీ ఆక్సిడెంట్ ఇందులో ఉంటుంది. అందుక‌ని ఆ సూప్ తాగితే పలు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి. క్యాన్స‌ర్ క‌ణ‌తుల వృద్ధిని త‌గ్గించే గుణం ఉల్లిపాయ పొట్టు సూప్‌లో ఉంది.

English summary

Health Benefits Of Onion Peels

here are the some benefits of Onion Peels
Desktop Bottom Promotion