For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యోని రింగ్(వెజీనల్ రింగ్) అమ్మాయిలను HIV నుండి కాపాడుంతుందని చెబుతున్న అధ్యయనాలు

శృంగారం లో పాల్గొన్నప్పుడు గర్భ నిరోధక చర్యల్లో భాగంగా పురుషులు కండోమ్స్ ని వాడతారు.అలానే మహిళలు కూడా యోని ఉంగరాన్ని(వెజీనల్ రింగ్)వాడతారు.

By :r Vishnu Vardhan Reddy
|

శృంగారం లో పాల్గొన్నప్పుడు గర్భ నిరోధక చర్యల్లో భాగంగా పురుషులు కండోమ్స్ ని వాడతారు.అలానే మహిళలు కూడా యోని ఉంగరాన్ని(వెజీనల్ రింగ్)వాడతారు.యోని ఉంగరాన్ని(వెజీనల్ రింగ్) వాడటం ద్వారా శృంగారంలో పాల్గొన్నప్పుడు మహిళలు గర్భం దాల్చకుండా ఉండే అవకాశాలు ఎక్కువ.

హెచ్ఐవీ వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా అరికట్టడానికి దాపివిరినే(టీఎంసీ-120) అనే ఔషధం బాగా పనిచేస్తుంది.దాపివిరినే(టీఎంసీ-120) అనే రోగనిరోధక ఔషధం కలిగిన యోని ఉంగరాన్ని(వెజీనల్ రింగ్) వాడటం ద్వారా 18 నుండి 45 సంవత్సరాల వయస్సు మహిళలు తమను తాము ఎయిడ్స్ వ్యాధి భారి నుండి రక్షణ పొంద వచ్చని ఇంతక మునుపే పరిశోధకులు చెప్పారు.ఇప్పుడు వారి పరిశోధనల్లో మరొక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

పురుషుల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ కు మెయిన్ రీజన్స్ ....!!పురుషుల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ కు మెయిన్ రీజన్స్ ....!!

 వెజైనా రింగ్ HIV నుండి కాపాడుతుంది: స్టడీస్

హెచ్ఐవి వైరస్ కి వయస్సుతో సంభంధం లేదు, ఎవరినైనా ఈ మహమ్మారి కబళించేస్తోంది.స్త్రీలను ఈ భయంకర వైరస్ నుండి కాపాడాలనే ఉద్దేశ్యంతో పరిశోధకులు 18 సంవత్సారాల వయస్సుకంటే తక్కువ వయస్సున్న అమ్మాయిలలో కూడా ఈ ఔషధం ఎలా పని చేస్తోంది అనే విషయం తెలుసుకోవడానికి పరిశోధనలు జరిపారు. వారి పరిశోధనలో 18 సంవత్సారాల వయస్సు కన్నా తక్కువ ఉన్న అమ్మాయిలలో కూడా ఈ దాపివిరినే(టీఎంసీ-120) ఔషధం కలిగిన యోని ఉంగరం(వేగేనల్ రింగ్)అద్భుతంగా పనిచేస్తోందని పరిశోధనల్లో తేలిందట.అందుకు తగ్గ ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయని పరిశోధకులు ఘంటాపదంగా చెబుతున్నారు.

వెజైనా రింగ్ HIV నుండి కాపాడుతుంది: స్టడీస్

దాపివిరినే(టీఎంసీ-120) ఔషధం కలిగిన యోని ఉంగరం(వెజీనల్ రింగ్) వాడటం చాలా సులభంగా ఉందని, అసలు యోనిలో అమర్చుకున్నామనే భావనే కలగటం లేదని చెప్పారు ఈ పరిశోధనలో భాగంగా పాల్గొన్న చాలా మంది అమ్మాయిలు.

యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారనడానికి ఖచ్చితమైన లక్షణాలు...!! యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారనడానికి ఖచ్చితమైన లక్షణాలు...!!

హెచ్ఐవి వైరస్ బారి నుండి యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని, కాబట్టి ప్రభుత్వాలు, వ్యవస్థలు, నియంత్రణ అధికారులు మంచి భద్రతనిచ్చే ఈ దాపివిరినే(టీఎంసీ-120) ఔషధం కలిగిన యోని ఉంగరాన్ని 18 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న అమ్మాయిలు కూడా వాడేలా నియమాలను సవరించాలని, ఆవైపుగా అడుగులు వేయాలని కోరారు పరిశోధకులు.

ఈ విషయాలన్నింటిని పారిస్ లో జరిగిన ఐఏఎస్ కాన్ఫరెన్స్ హెచ్ఐవి 2017 లో వెల్లడించారు.

With Inputs From IANS

English summary

HIV-Preventing Vaginal Ring Found Safe For Girls: Study

HIV-Preventing Vaginal Ring Found Safe For Girls: Study, vaginal ring that contains an experimental antiretroviral (ARV) drug, previously found to provide protection against HIV infection in women, has been found safe and acceptable in teenage girls, researchers claim.
Desktop Bottom Promotion