For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు, ఆర్థ్రైటిస్ నొప్పులను తగ్గించే ఆముదం నూనె

By R. Bharat Kumar Reddy
|

ఆముదం ఎంతో ఆరోగ్యకారిణి. ఆముదం విత్తనాల నుంచి తీసే ఈ నూనె చిక్కగా, ఘాటుగా ఉంటుంది. ఆముదం ప్రయోజనాలు బోలెడన్ని ఉన్నాయి. ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందేందుకు ఇది చేసే మేలు చాలానే ఉంది. ఆముదంలో ఉండే యాంటీ ఇన్ల్పమేటరీ కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది. అలాగే అన్ని పెయిన్స్ నుంచి గొప్ప ఉపశమనం కలుగుతుంది.

ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ లేదా కీళ్లకు సంబంధించిన ఇతర 100 రకాల వ్యాధుల్లో నొప్పి, వాపు అనేది కచ్చితంగా ఉంటుంది. ఆర్థరైటిస్ అనేది కీళ్ళు వాటి చుట్టూ ఉన్న కణజాలాలను ప్రభావితం చేసే ఒక స్థితి. శరీరంలో బాక్టీరియా ప్రవేశించినప్పుడు జాయింట్స్ లలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దీనివల్ల జాయంట్స్ దెబ్బతింటాయి. ఒకసారి జాయింట్ పెయిన్స్ వస్తే కనుక తిరిగి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది.

ఈ వ్యాధి వచ్చినవారు చాలా అలసటకు గురవుతారు. ఉదయం పూట జాయంట్స్ లో భరించరాని నొప్పి వస్తుంది. ఆహారపు అలవాట్లు, జీవన మార్పులు చేయడం ద్వారా కీళ్లనొప్పులనుండి ఉపశమనం పొందొచ్చు. కీళ్ల నొప్పులకు కారణాలు ఎన్నైనప్పటికీ వాటిని నుంచి ఉపశమనం పొందడానికి అందరూ తంటాలుపడుతుంటారు.

1. ఆర్థరైటిస్ కోసం ఆముదాన్ని ఎలా ఉపయోగించాలి?

1. ఆర్థరైటిస్ కోసం ఆముదాన్ని ఎలా ఉపయోగించాలి?

మనం ఏదైనా మెడిసిన్ ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. మీకు ఎక్కడైతే నొప్పి ఉంటుందో ఈ ప్రాంతంలో ఆముదంతో మర్దన చేస్తే ఫలితం ఉంటుంది. త్వరగా ఉపశమనం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఆముదాన్ని వివిధ రకాలుగా ఉపయోగించే విధానాలను మీరూ తెలుసుకోండి.

ఆముదం రబ్

కావాల్సిన పదార్థాలు : ఆముదం, పత్తి మెత్తలు

ప్రిపరేషన్ సమయం : 5 నిమిషాలు

తయారు చేసుకునే విధానం :

ఆముదాన్ని కాస్త వేడి చేయాలి. ఎక్కువగా వేడి చేయకుండా గోరువెచ్చగా చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత దాన్ని ఎక్కడైతే నొప్పి ఉంటుందో ఆ ప్రాంతంలో మసాజ్ చేయాలి. ఇలా తరచూ చేస్తుండడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందగలుగుతారు.

2. ఎన్ని సార్లు ఉపయోగించాలి ?

2. ఎన్ని సార్లు ఉపయోగించాలి ?

వెన్నెముక, మెడ లేదా మోకాలి నొప్పులకు సంబంధించి ఈ నూనెను వారానికి ఒకసారి ఉపయోగిస్తే సరిపోతుంది. ఆర్థరైటిస్ కోసమైతే వారంలో కనీసం రెండుసార్లు ఉపయోగించండి. దీని ద్వారా ఆయా నొప్పుల బారీ నుంచి విముక్తి పొందుతారు. ఆర్థరైటిస్ ఉన్నవారు ఎక్కువగా వాపుల ద్వారా బాధపడుతుంటారు. వీటిని తగ్గించడానికి ఆముదం బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల వీలైనంత వరకు వేడిచేసిన ఆముదం నూనెను ఉపయోగించడం చాలా మేలు.

3. ఆముదం నూనె ప్యాక్

3. ఆముదం నూనె ప్యాక్

మీకు కావాల్సినవి : ఆముదం, వేడి నీటి ప్యాక్, పత్తి మెత్తలు.

తయారు చేసే విధానం : రెండు చుక్కల ఆముదంలో ఒక పత్తి ప్యాడ్ ని ముంచండి. దాంతో మీరు నొప్పి ఉన్న ప్రాంతంలో కాస్త రుద్దుకోండి. ఆ తర్వాత వేడినీటి ప్యాక్ తో మసాజ్ మాదిరిగా చేసుకోండి. ప్రతి రోజు రాత్రిపూట ఇలా చేయడం మంచిది. దీర్ఘకాలిక ఆర్థరైటీస్ నొప్పులతో బాధపడేవారు వీటి ద్వారా ఈజీగా ఉపశమనం పొందొచ్చు.

ఎన్నిసార్లు ఇలా చేయాలి ?

మీ నొప్పి, వాపును బట్టి వారానికొకసారి, లేదా రెండు వారాలకొకసారి ఇలా చేయడం మంచిది. హాట్ ప్యాక్స్ అనేవి నొప్పిని సులభంగా దూరం చేసేందుకు ఉపయోగపడతాయి. ఇక ఆముదం వాపుని తగ్గించేందుకు ఎంతో సహాయపడుతుంది. ఈ విధానంతో మీరు ఈజీగా నొప్పి బారి నుంచి బయటపడొచ్చు.

4. ఆముదం, ఆరెంజ్ జ్యూస్

4. ఆముదం, ఆరెంజ్ జ్యూస్

కావాల్సినవి : ఆముదం, ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్.

తయారు చేసుకునేందుకు పట్టే సమయం : 5 నిమిషాలు

తయారు చేసుకునే విధానం : ముందుగా రెండు టేబుల్ స్పూన్ల ఆముదాన్ని తీసుకోండి. దాన్ని కాస్త వేడి చేయండి. తాజాగా తయారుచేసుకున్నటువంటి ఓ గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ లో మీరు సిద్ధం చేసుకున్న ఆముదాన్ని కలపండి.

ఎలా ఉపయోగించాలి : 3 నుంచి 5 వారాల పాటు ఉదయం అల్పాహారం తీసుకునే ముందు దీన్ని తీసుకోండి. అలాగే మధ్యలో కనీసం 3 వారాల పాటు బ్రేక్ ఇవ్వండి. తర్వాత మళ్లీ ప్రారంభించండి. అయితే ఈ విషయంలో మీరు డాక్టర్ని సూచన కూడా తీసుకోవాలి. ఆరెంజ్ పండ్లలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపునకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ను తగ్గించటానికి సహాయపడతాయి. ఆర్థరైటిస్ రోగులు ఆరెంజ్ లేదా యాంటీఆక్సిడెంట్స్ లేదా విటమిన్ సీ కలిగి ఉన్న పండ్లను, పండ్ల రసాలను తీసుకోవడం చాలా మంచిది.

5. ఆముదం, అల్లం టీ

5. ఆముదం, అల్లం టీ

మీకు కావాల్సినవి : అల్లం, టీ పొడి, ఆముదం, నీరు.

తయారు చేయడానికి పట్టే సమయం : 5 నిమిషాలు

తయారు చేసే విధానం : నీళ్లలో కాస్త టీ పౌడర్ వేసి దాన్ని వేడి చేయండి. ఆ వేడి నీటిలో కాస్త అల్లం వేసి 5 నుంచి 10 నిమిషాల పాటు మరిగించండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి దాన్ని కిందకు దించి తర్వాత అల్లం టీలో రెండు టీ స్పూన్ల ఆముదం వేయండి.

ఎన్నిసార్లు తీసుకోవాలి ?

మీ నొప్పిని బట్టి దీన్ని వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు తీసుకోండి. దీంతో మీరు నొప్పి నుంచి విముక్తి పొందొచ్చు.

అతిసారం తదితర వ్యాధులతో బాధపడేవారు దీన్ని తీసుకోకపోవడం ఉత్తమం. అలాగే దీన్ని తీసుకునే విషయంపై డాక్టర్లను సంప్రదించడం కూడా మంచిది. ఇక మీకు టీ తాగే అలవాటు బాగా ఉన్నట్లయితే మీరు దీన్ని బాగా తాగడానికి ఇష్టపడతారు. ఉదయం పూట దీన్ని తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యల నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది. అలాగే మంచి నిద్రకు కూడా ఉపయోగపడుతుంది.

6. ఆముదం, ఫ్లానెల్ ప్యాక్

6. ఆముదం, ఫ్లానెల్ ప్యాక్

కావాల్సిన పదార్థాలు : ఫ్లాన్నెల్ క్లాత్, ఆముద, టవల్, వేడి నీటి బాటిల్ లేదా వేడి నీటి ప్యాక్, దీన్ని తయారు చేసుకునేందుకు 5 నిమిషాలు సమయం పడుతుంది.

తయారు చేసుకునే విధానం : 20 మి.లీటర్ల ఆముదాన్ని తీసుకోండి. దాన్ని స్టవ్ మీద లేదా మైక్రోవేవ్ లో వేడి చేయండి. ఫ్లాన్నెల్ ను ఆముదంలో ముంచండి. అది పూర్తిగా ఆముదాన్ని పీల్చుకునేందుకుగాను 20 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలివేయండి. మీకు ఎక్కడైతే నొప్పి ఉంటుందో ఆ ప్రాంతంలో ఆముదంలో నానబెట్టిన ఫ్లానేల్ ఉంచడండి. దాన్ని స్లింగ్ వ్రాప్ తో కట్టివేయండి. 30 నుంచి 45 నిమిషాలు దాన్ని అలాగే వదిలేయండి. కనీసం 2 నుంచి మూడు రోజుల పాటు దీన్ని పాటించడం మంచిది. ఇక మూడో రోజు మీరు మంచి ఉపశమనం పొందుతారు. నొప్పిని తగ్గించడంలో ఈ విధానం బాగా సహాయపడుతుంది.

English summary

How To Use Castor Oil To Treat Arthritis?

Let’s quickly look at what this is and see how/why castor helps. Arthritis in layman terms is a condition that affects your joints and the connective tissues around them. The first common kind which is called – osteoarthritis is due to the wear and tear of the tissue or cartilage around your joints, degenerative and usually comes with age.
Story first published:Saturday, November 4, 2017, 11:44 [IST]
Desktop Bottom Promotion