For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైపెర్టెన్షన్ చాలా ప్రమాదమైనది! ఇది ఈ సీరియస్ సమస్యకు దారితీస్తుంది.

By Ashwini Pappireddy
|

ఆరోగ్యకరంగా ఉండడానికి ఒక సాధారణ రక్తపోటు స్థాయిలను కలిగి ఉండటం ఎంతో అవసరం. రక్తపోటు లో ఏదైనా హెచ్చుతగ్గులు - ఇది తక్కువ లేదా అధికమవడం, ఇందులో ఏదయినా అది ప్రమాదకరమైనది.

అధిక రక్తపోటు లేదా రక్తపోటు ఉన్న వ్యక్తులు సాధారణ హృదయ కవాట క్రమరాహిత్యం అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఒక కొత్త పరిశోధన లో తేలింది. ఈ పరిశోధన ప్రకారం, ప్రారంభ జీవితంలో అధిక రక్తపోటు మిట్రాల్ రెగర్జిటేషన్ యొక్క గణనీయమైన భవిష్యత్తు ప్రమాదానికి అనుబంధంగా ఉందని కనుగొనబడింది.

హై టెన్షన్ లేదా హైపర్ టెన్షన్ తగ్గించే ఈ పవర్ ఫుల్ ఫుడ్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోండి..హై టెన్షన్ లేదా హైపర్ టెన్షన్ తగ్గించే ఈ పవర్ ఫుల్ ఫుడ్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోండి..

మిట్రాల్ రెగ్యుర్గేషన్ అనేది శరీరమంతా రక్తాన్ని పంపిణీ చేసే గుండె సమర్థతను తగ్గిస్తుంది.మరియు ఇది ఒక్కొక్కసారి తీవ్రమైన సందర్భాల్లో గుండె వైఫల్యానికి కూడా దారితీస్తుంది. ఇది గుండె వెనుక భాగం నుండి రక్తం ప్రవహించడం వంటి తీవ్రమైన హృదయ పరిస్థితులకు దారితీస్తుంది, ఇది శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండటం , అలసిపోవటం, మైకము మరియు ఛాతీ నొప్పి వంటి లక్షణాలను కలిగిస్తుంది.

అధ్యయనం కోసం, UK లో సుమారు 5.5 మిలియన్ల యువకులను 10 సంవత్సరాలుగా పరిశీలించారు.

"మా పరిశోధన ప్రకారం, ఈ సాధారణ మరియు డిస్బలింగ్ వాల్వ్ డిసార్డర్ అనేది వయస్సు పెరిగేకొలది గతంలో ఊహించినట్లుగా అనివార్య పరిణామం కాదు, కానీ నివారించవచ్చు" అని ప్రధాన విశ్వవిద్యాలయం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ నుండి ప్రొఫెసర్ కసెం రాహిమి చెప్పారు.

ఉల్లిపొట్టు హైపర్ టెన్షన్, అధికబరువు తగ్గిస్తుందన్న విషయం మీకు తెలుసా?ఉల్లిపొట్టు హైపర్ టెన్షన్, అధికబరువు తగ్గిస్తుందన్న విషయం మీకు తెలుసా?

"ప్రపంచవ్యాప్తంగా వృద్ధాప్య మరియు జనాభా పెరుగుదల తో పాటు, మేము ఈ పరిస్థితి యొక్క కేసులు కూడా పెరిగే అవకాశం ఉంది," ఆమె తెలిపారు.

ఈ అధ్యయనం ఇటీవల PLOS మెడిసిన్ పత్రికలో ప్రచురించబడింది.

హైపర్ టెన్షన్ నిరోధించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకొని ఇది రాకుండా జాగ్రత్తపడండి.

ఆరోగ్యకరమైన ఆహారం:

ఆరోగ్యకరమైన ఆహారం:

మీ రక్తపోటు ని నియంత్రణలో ఉంచడానికి మీరు తినే ఆహరం మీద శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. మీ రోజువారీ ఆహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు జోడించడం ద్వారా అధిక రక్తపోటును నివారించడంలో సహాయపడుతుంది.

శరీరంలో మంచి మొత్తంలో పొటాషియం ని కలిగివుండటం వలన రక్తపోటుపై సోడియం యొక్క ప్రభావాలను తగ్గించటానికి సహాయపడుతుంది, అందువలన ఇది రక్తపోటును చెక్ కింద ఉంచుతుంది.

వెయిట్ ని కంట్రోల్ చేయడం:

వెయిట్ ని కంట్రోల్ చేయడం:

ఊబకాయం ఉన్నవారిలో అధిక రక్తపోటు ఉండటం సాధారణం. అందువల్ల రక్తపోటు నివారించడానికి ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం చాలా ముఖ్యం. మీరు ఊబకాయలు అయితే అది నిద్ర సమస్యకు కారణమవుతుంది. కాబట్టి మీరు సరిగ్గా నిద్రించలేకపోయినప్పుడు రక్త ప్రవాహంపై ప్రభావం చూపుతుంది మరియు రక్తపోటులో ఒక స్పైక్కి దారి తీయవచ్చు.

సోడియం వాడకాన్ని తగ్గించండి:

సోడియం వాడకాన్ని తగ్గించండి:

చాలా వరకు ఉప్పును తీసుకోవడం వలన శరీరంలో నీటిని నిలుపుకోవటానికి దారితీస్తుంది. శరీరంలో నిల్వ ఉన్న అదనపు నీరు రక్తపోటు స్థాయిలను పెంచుతుంది. ఒకవేళ మీరు ఇప్పటికే అధిక రక్తపోటు కలిగి వుండి, మెడికేషన్ ని తీసుకుంటున్నప్పుడు మరియు ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వలన ఇది

మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.అందువల్ల రక్తపోటు నివారించడానికి మీరు తినే సోడియం మొత్తాన్ని పరిశీలించడం చాలా ముఖ్యం.

పరిమిత ఆల్కహాల్ తీసుకోవడం:

పరిమిత ఆల్కహాల్ తీసుకోవడం:

మద్యం రక్తపోటుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మితంగా తాగడం వలన రక్తపోటును అభివృద్ధి చేయగల ప్రమాదం ఏర్పడుతుంది. అందువల్ల, అధిక రక్తపోటు నిరోధించడానికి మద్యాన్ని లిమిట్ గా తీసుకోవడం తప్పనిసరి.

సాధారణ వ్యాయామం:

సాధారణ వ్యాయామం:

రెగ్యులర్ వ్యాయామం చేయాలి అంటే మిమల్ని జిమ్ కి వెళ్ళమని కాదు మరియు బలమైన,శక్తివంతమైన వ్యాయామం చేయాలి. ప్రతిరోజూ అరగంట రెగ్యులర్ లైట్ వ్యాయామం చాలు హైపర్ టెన్షన్ నిరోధించడానికి సరిపోతుంది. సాధారణ వాకింగ్, జాగింగ్ లేదా ఈవెంట్ సైక్లింగ్ రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.

English summary

Hypertension Can Be Dangerous, It Can Cause This Serious Problem

A new research has found that people with high blood pressure or hypertension may be at an increased risk of developing common heart valve disorder.
Desktop Bottom Promotion