For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రివేళల్లో వచ్చే ముక్కు దిబ్బడకు 10 అద్భుతమైన ఇంటి చిట్కాలు !

మీరు ముక్కు దిబ్బడను కలిగి ఉన్నారా, అయితే మీరు చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. ముఖ్యంగా మీరు సుదీర్ఘమైన పని వేళల నుండి మగత నిద్రతో ఇంటికి చేరుకున్న తర్వాత, మీ ముక్కు దిబ్బడ కారణంగా సరిగ్గా శ్వాసక్రియ ఆడకపో

|

మీరు ముక్కు దిబ్బడను కలిగి ఉన్నారా, అయితే మీరు చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. ముఖ్యంగా మీరు సుదీర్ఘమైన పని వేళల నుండి మగత నిద్రతో ఇంటికి చేరుకున్న తర్వాత, మీ ముక్కు దిబ్బడ కారణంగా సరిగ్గా శ్వాసక్రియ ఆడకపోవడం వల్ల మీ నిద్రకు భంగపాటు తప్పదు.

ఈ ముక్కు దిబ్బడ వల్ల ఊపిరి అందక మీరు సరిగా నిద్రపోలేరు మరియు మరుసటి రోజు ఉదయానికి అలసటను, ఆయాసాన్ని కలిగినట్లుగా కనబడతారు.

భారతీయ సంప్రదాయంలో ముక్కు దిబ్బడకు సంబంధించిన అనేక చికిత్సా మార్గాలను మన పూర్వీకులు అనుసరించేవారు, ఈ చికిత్స విధానాలు పూర్తిగా ప్రకృతి సిద్ధమైనవిగాను మరియు ఒక్క రాత్రిలో మీ ముక్కు సహజమైన స్థితికి చేరుకునేలా చేసి, మిమ్మల్ని ఆశ్చర్యపరిచేదిగాను ఉన్నాయి.

ముక్కు దిబ్బడను వదలించుకొనటంలో, మీకు సహాయపడే ఇంటి చిట్కాల జాబితాలు ఇక్కడ ఉన్నాయి. అవేమిటో పరిశీలిద్దాం !

1. ఆవిరి పట్టడం :

1. ఆవిరి పట్టడం :

ఇన్ఫ్లుఎంజా (influenza) మరియు సైనస్ (sinus) వంటివి ఊపిరికి సంబంధించిన వివిధ శ్వాసకోశ వ్యాధులను చికిత్స చేయుటకు "ఆవిరిని పట్టడం" అనేది ఒక పురాతన సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. సైనస్ అనేది మీకు అనారోగ్యకరమైన తలనొప్పిని కలుగచేస్తుంది. ఆవిరి పట్టడం వల్ల అది మీ ముక్కు పనితీరును సరళతరం చేసేదిగా చాలా మంచిది మరియు ఎల్లప్పుడూ మీ ముక్కు (నాసికా రంధ్రాల పైపు) నుండి కారే అన్ని ద్రవాలను నివారిచడంలో మీకు సహాయపడుతుంది.

ఒక పెద్ద పాత్రలో వేడి చేసిన నీరును పోసి, దానిపై మీరు వంగి ఉండాలి. మీరు ఇలా చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్త వహించండి, లేదంటే ఆ వేడి నీళ్లు విరజిమ్మే ప్రమాదానికి కారణం కాగలదు. ఆ వేడి నీళ్ళ నుండి వచ్చే ఆవిరిని తప్పించుకోలేని విధంగా మీపై ఒక దుప్పటిని ఉంచండి.

మీ ముక్కు నుండి ద్రవాలు స్రవించడం ఆగేంత వరకు మీరు ఈ ఆవిరిని పీల్చడం కొనసాగించండి. మీరు సమర్థవంతమైన ఫలితాలను పొందటం కోసం థైమ్ (లేదా) పిప్పరమింట్ వంటి మూలికలను కూడా ఆ వేడి నీళ్లల్లో జోడించవచ్చు.

2. సారవంతమైన ఆయిల్స్ యొక్క వాసనను పీల్చడం :

2. సారవంతమైన ఆయిల్స్ యొక్క వాసనను పీల్చడం :

పైన చెప్పినట్లుగా మూలికలను జోడించడం వల్ల, మొత్తం తయారీ ప్రక్రియను సులభం చేసేందుకు సహాయపడుతుంది. అదే విధంగా, యూకలిప్టస్ (లేదా) థైమ్ వంటి నూనెల యొక్క సారాన్ని పీల్చడం వలన నాసికలో (ఊపిరి తీసుకోవడానికి) ఉన్న అడ్డంకులన్ని తొలగిపోతాయి.

ఈ ముఖ్యమైన నూనెలలో ఉన్న సారాన్ని కొన్ని చుక్కల రూపంలో వేడి నీటిలో కలపండి మరియు ఆ ఆవిరిని 20 నిమిషాలు వరకూ పీల్చడం వల్ల చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. పిప్పరమింట్ ఆయిల్ కూడా ముక్కు దిబ్బడను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.

3. ఉప్పునీరు :

3. ఉప్పునీరు :

కొన్ని స్పూన్ల ఉప్పును - కాస్త గోరు వెచ్చని నీటిలో వేయండి. ఇలా తయారుచేసిన సెలైన్ ద్రావణం యొక్క కొన్ని చుక్కలను మీ ముక్కులో పోయాలి. దాని యొక్క ఫలితంగా మీ యొక్క నాశికా శ్లేషము సన్నబడటానికి దారితీస్తుంది ! ఈ మిశ్రమము ఫలితంగా, మీ నాశికాలో అడ్డంకిగా ఉన్న శ్లేష్మమును మరియు ధూళిని సమర్థవంతంగా తొలగించి, మీరు శ్వాస పీల్చుకోవడానికి స్పష్టమైన మార్గాన్ని ఏర్పరుస్తుంది.

4. వెల్లుల్లి :

4. వెల్లుల్లి :

వెల్లుల్లికి అనేక ఔషధ ప్రయోజనాలున్నాయని, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మరియు ముక్కు దిబ్బడ చికిత్స విధానం కూడా వాటిలో ఒకటిగా ఉన్నది ! మీరు ముక్కు దిబ్బడను వదిలించుకోవటానికి గాను వెల్లుల్లి రెబ్బలను తినడం (లేదా) వెల్లుల్లి సూప్ను తయారుచేసుకొని త్రాగటం వల్ల సరైన ఉపశమనాన్ని పొందగలరు. దీనిలో ఉన్న అనామ్లజనకాలు - ఈ రకమైన అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి మరియు మీరు ముక్కు దిబ్బడను ఎదుర్కోవాల్సిన అసంతృప్తికరమైన పరిస్థితులకు దూరంగా ఉంచుతుంది.

5. ఉల్లిపాయలు :

5. ఉల్లిపాయలు :

మీరు ఒక ఉల్లిపాయను కోస్తున్నప్పుడు చాలామంది ప్రజలు ఎందుకు ఏడుస్తుంటారో మీరు ఒక్కసారి గుర్తుచేసుకోండి ? మీ చేతిలో ఉల్లిపాయ చచ్చిపోతోందన్న భావన వల్ల మాత్రం కాదు, ఆ ఉల్లిపాయలో ఉన్న విశేష లక్షణాల కారణంగా మీ కళ్లు మరియు ముక్కు నుంచి నీరు కారటం జరుగుతుంది. మీరు 5 నిమిషాలపాటు ఈ ఉల్లిపాయ వాసనను పీల్చడం వల్ల మీ ముక్కులో శ్వాసకు అంతరాయంగా ఉన్న అనేక అడ్డంకులను తొలగించి, పూర్తి స్థాయిలో శ్వాస తీసుకునేందుకు మీరు అనుకూలమైన అనుభూతిని చెందగలరు.

6. ఆపిల్ సైడర్ వెనిగర్ :

6. ఆపిల్ సైడర్ వెనిగర్ :

కాస్త గోరు వెచ్చని నీటిలో ఈ వెనీగర్ యొక్క మోతాదును 2 టేబుల్ స్పూన్లుగా కలపండి. ఉత్తమ ఫలితాలను పొందడానికి ఒక రోజులో మూడుసార్లు ఈ మిశ్రమాన్ని వినియోగించండి. దానికి అదనంగా తేనెను కలపడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ముక్కు దిబ్బడ కారణంగా మీ శ్వాసకు అడ్డంకిగా ఉన్న అవరోధాలను మరియు ఇతర సైనస్ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో ఇది చాలా ప్రభావవంతమైన మార్గంగా ఉంటుంది.

7. నిమ్మకాయ :

7. నిమ్మకాయ :

విటమిన్-సి మరియు వివిధ అనామ్లజనకాలు సమృద్ధిగా ఉన్న ఈ సిట్రస్సీలో చాలా అద్భుతకరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి.

మీరు చేయాల్సిందల్లా :- 2 టీ స్పూన్ల నిమ్మరసానికి, నల్ల మిరియాలను మరియు ఉప్పును ఒక మిశ్రమంగా కలపాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని మీ ముక్కు పై అప్లై చేసి, కొన్ని నిమిషాల పాటు అలానే వదిలివేయండి. ఈ మిశ్రమం చేసే మ్యాజిక్ను ప్రత్యక్షంగా చూడండి. ఇది పాక్షికంగా సహజసిద్ధమైనది అయినప్పటికీ, ముక్కు దిబ్బడ చికిత్స కోసం ఇది ఒక సభలో వంతమైన పరిష్కారంగా పనిచేస్తుంది.

8. టమోటా జ్యూస్ :

8. టమోటా జ్యూస్ :

టమోటా సూప్ తయారీ కోసం, ఒక కప్పు నీటిలో టమోటా ముక్కలను, ఉప్పును జోడించాలి. ఈ పానీయాన్ని మరింత సమర్థవంతంగా చేయడానికి అల్లం ముక్కలను జోడించండి. ఉత్తమ ఫలితాల కోసం ప్రతిరోజూ కనీసం రెండుసార్లు ఈ మిశ్రమాన్ని తాగండి. టమోటా అనేది ప్రకృతి అందించిన యాంటి ఇన్ఫ్లమేటరీగా ఉంటూ, మీ నాశికా మార్గంలో ఉన్న మంటను తగ్గించి, మీ సైనెస్ను కూడా తెరవగలదు!

9. బాసిల్ (తులసి) :

9. బాసిల్ (తులసి) :

చాలా ప్రత్యేకంగా భావించబడే బాసిల్ (తులసి)లో చాలా రకాల ఔషధ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. తాజాగా ఉండే కొన్ని తులసి ఆకులను సేకరించి, ఉదయాన్నే అల్పాహారం తీసుకునే ముందు వాటిని నమలండి. అంతేకాక మీరు ఉదయాన్నే తీసుకునే 'టీ' లో ఈ తులసి ఆకులను జోడించడం వల్ల మీ ముక్కు దిబ్బడను నయం చేయటానికి అదొక మేజిక్లా పనిచేస్తుంది.

10. అల్లం :

10. అల్లం :

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చాలా అధికంగా ఉన్నందువల్ల, మీ ముక్కులో అడ్డుగా ఉన్న అసహజమైన పరిస్థితులు కారణంగా శ్వాసలో తలెత్తిన ఇబ్బందిని నివారించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. అల్లాన్ని ప్రతిరోజూ ఒక కప్పు టీ లో జోడించి నమలటం వల్ల మీరు ఉత్తమమైన ఫలితాలను పొందగలరు. మీ నాసికా రంధ్రాలలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటని చెప్పవచ్చు. అల్లం చాలా రకాల ఔషధ విలువలను కలిగి ఉంది మరియు మీకు తక్షణ ఉపశమనమును కూడా కలిగించవచ్చు.

ఊపిరి తీసుకోవడానికి నాసిక మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించి, మీకు తేలిక అయిన శ్వాసను అందించడం కోసం, పైన మీకు చాలా రకాలైన స్పష్టమైన పరిష్కార మార్గాలను సూచించాము.

ఈ వ్యాసాన్ని ఇతరులతో భాగస్వామ్యం చేయండి!

ఈ వ్యాసం చాలా ఉపయోగకరంగా ఉందని మీరు భావిస్తే, దాన్ని ఇతరులతో పంచుకోవడానికి వెనుకాడవద్దు.

English summary

10 Incredible Ways To Get Rid Of Choked Nose At Night

No one really enjoys the sensation of a blocked or stuff nose, especially when you have come back from a long day's work and just would want to doze off, but your stuffed nose does not let you sleep because of the asphyxiation. Here is a list of those home remedies that can help in getting rid of a blocked
Story first published:Monday, January 1, 2018, 14:23 [IST]
Desktop Bottom Promotion