For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవారు జాగ్రత్త!మీ పురుషాంగం వంక‌ర‌గా ఉందా? క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలెక్కువ‌!

By Sujeeth Kumar
|

పురుషాంగం ఒక్కొక్క‌రికి ఒక్కోర‌కంగా.. ప‌రిమాణం, ఆకారం, రంగులో తేడా ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే వంక‌ర‌గా పురుషాంగం ఉండే మ‌గ‌వాళ్లు క్యాన్స‌ర్ బారిన ప‌డే అవ‌కాశాలెక్కువ‌ని తాజా ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డయ్యింది. ముఖ్యంగా వ‌య‌సు మీద‌పైడిన వారిలో ఈ అవ‌కాశాలెక్కువ అని తెలిసింది.

అమెరికాలోని టెక్సాస్ న‌గ‌రంలో ఉన్న బేల‌ర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన ప‌రిశోధ‌కులు పైరోనిస్ అనే వ్యాధితో బాధ‌ప‌డే మ‌గ‌వాళ్ల‌కు ముంద‌స్తు క్యాన్స‌ర్ ప‌రీక్ష చేయించాల‌ని సూచించారు. పురుషాంగం 15 డిగ్రీల కంటే ఎక్కువ వంక‌ర‌గా ఉంటే దాన్ని పైరోసిస్ వ్యాధిగా గుర్తిస్తారు. దీంట్లో భాగంగా అంగంలోని మెత్త‌ని భాగాల్లో వాపులాంటివి ఏర్ప‌డ‌తాయి. యూకేలో ప్ర‌తి 20 మందిలో ఒక‌రు దీని బారిన ప‌డుతున్న‌ట్టు వెల్ల‌డ‌య్యింది.

<strong>పురుషాంగం యొక్క సగటు పరిమాణం & ఇతర ఆసక్తికరమైన వాస్తవాలు </strong>పురుషాంగం యొక్క సగటు పరిమాణం & ఇతర ఆసక్తికరమైన వాస్తవాలు

A curve in penis might be an indication of cancer

ఇంకా ఈ ప‌రిశోధ‌న‌లో తేలిందేమిటంటే... పైరోనీస్ వ్యాధి ఉన్న‌వాళ్ల‌ల్లో 43శాతం మందికి ఉద‌ర క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాద‌ముంద‌ని, 39శాతం మందికి టెస్టిక్యుల‌ర్ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని, 19శాతం మందికి మాత్రం చ‌ర్మ క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంద‌ని తేల్చారు. పురుషాంగంతో ఎటువంటి స‌మ‌స్య‌లు లేనివారికి ఇలా క్యాన్స‌ర్ రావ‌డం చాలా అరుద‌ని ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డయ్యింది.
A curve in penis might be an indication of cancer

పైరోనిస్ వ్యాధి వ‌ల్ల‌ పురుషాంగంలో బొడిపె మాదిరిగా ఏర్ప‌డుతుంద‌ని లండ‌న్ డాక్ట‌ర్ క్లిన్‌క్ వ్య‌వ‌స్థాప‌కుడైన డాక్ట‌ర్ సేత్ రాంకిన్ అన్నారు.

డైలి స్టార్ ఆన్‌లైన్ నివేదిక ప్ర‌కారం ఈ వ్యాధి ఉన్న‌వారికి అంగం స్తంభించ‌డంలో తీవ్ర‌మైన నొప్పి ఉంటుంద‌ని, వంక‌ర‌గా పోతుంటుంద‌ని తెలిపింది.

A curve in penis might be an indication of cancer

ప‌రిశోధ‌కులు అంగం వంక‌ర‌గా ఉండ‌డానికి, వివిధ ర‌కాల క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు చాలా పోలిక‌లున్నాయ‌ని తేల్చింది. ప‌రిశోధ‌కుల బృందం 9ఏళ్ల పాటు 17ల‌క్ష‌ల మంది మ‌గ‌వాళ్ల‌పై ప‌రిశోధ‌న‌లు చేశారు. వీళ్ల‌ల్లో కొంద‌రు పైరోనిస్ వ్యాధితో, ఎర‌క్టైల్ డిస్‌ఫంక్ష‌న్ తో బాధ‌ప‌డుతుండ‌గా మ‌రికొంత మంది ఆరోగ్యంగా ఉన్నారు.

<strong>పురుషాంగం గురించి ఈ దిమ్మతిరిగిపోయే నిజాలు మీకు తెలుసా ?</strong>పురుషాంగం గురించి ఈ దిమ్మతిరిగిపోయే నిజాలు మీకు తెలుసా ?

A curve in penis might be an indication of cancer

ఫ‌లితాల్లో తేలిన మ‌రో విష‌య‌మేమిటంటే ఇది ఎక్కువ‌గా 50ఏళ్ల వ‌య‌సు దాటిన వారిని మ‌రింత ప్ర‌భావం చేస్తుంద‌ని. అంగంలో నొప్పి ఉంటుంద‌ని, వంక‌ర‌త‌నం త‌ర్వాతి ద‌శ‌ల్లో రావొచ్చ‌ని డాక్ట‌ర్ సేత్ అన్నారు.

ఈ ప‌రిశోధ‌నల‌కు సంబంధించిన సారాన్ని అమెరిక‌న్ సొసైటీ ఫ‌ర్ రిప్రోడ‌క్టివ్ మెడిసిన్ అనే సంస్థ నిర్వ‌హించిన స‌మావేశంలో ప్ర‌స్తావించారు.

English summary

Men, Be Alert: A curve in penis might be an indication of cancer

The study found that men with Peyronie’s disease were 43% more likely to be struck down with stomach cancer, 39% more likely to develop testicular cancer and 19% more likely to get skin cancer, compared to men with no penis complaints.
Desktop Bottom Promotion