మదర్స్ డే స్పెషల్: మీ తల్లి తప్పని సరిగా చేయించుకోవల్సిన మెడికల్ టెస్టులు..!

Posted By:
Subscribe to Boldsky

ఈ భూమి మీద స్త్రీని అద్భుతంగా మలిచాడు ఆ దేవుడు. స్త్రీకి సహనం, ఓర్పు, నేర్పరి, అన్ని గుణాలను కలిపి పుట్టించాడు. అమ్మ ఒక ఫ్రెండ్, ఫిలసఫర్, గైడ్ . స్త్రీ పుట్టినప్పటి నుండి సంవత్సరాలు గడిచే కొద్ది శరీరకంగా, మానసికంగా అనేక మార్పులు కలిగి ఉంటుంది. అంతే కాదు తల్లికి ఓర్పుతో పాటు, శక్తి కూడా ఎక్కువే. అయితే ఆ శక్తి జీవితాంత ఉండదు.

మహిళకు మద్య వయస్సు నుండి మోనోపాజ్ ప్రారంభమైన వెంటనే మహిళలో అనేక మార్పులు వస్తాయి. మోనోపాజ్ అంటే మహిళలో సహజంగా జరిగే మార్పు, మెనుష్ట్రువల్ (పీరియడ్స్ ) ఆగిపోవడంతో మహిళలో మానసికంగా మరియు ఫిజికల్ గా అనేక మార్పులు జరుగుతాయి. ఇవి ఆమె ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.

Mother's Day Special: Make Sure Your Mom Undergoes These Important Medical Tests

ఈ మోనోపాజ్ దశలో మహిళల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే ముఖ్యమైనటువంటి హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ పరిస్థితిలో మహిళలు మానసికంగా మరియు శరీరక సమస్యలను ఎదుర్కొంటారు. నిద్రలేమి సమస్యలు, చీకాకు, మూడ్ మారడం వంటి లక్షణాలు కనబడుతాయి .

ఈ లక్షణాలతో పాటు కొన్ని ఇతర వ్యాధులు , శరీరంలో మార్పులు కూడా జరుగుతాయి . ఇది 40 ఏళ్ళలో ప్రారంభమౌతుంది. ఈ మోనోపాజ్ దశను చేరుకున్న మహిళలు లంగ్ డిజార్డర్స్, హార్ట్ డిసీజ్ మరియు కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు కూడా ప్రమాదం జరగుతుంది.

మరికొద్ది రోజుల్లో ఇంటర్నేషనల్ మదర్స్ డే రాబోతున్నది. ఈ సందర్భంగా ముందు జాగ్రత్తగా మీ తల్లికి కొన్ని ముఖ్యమైన మెడికల్ చెకప్స్ చేయించండి. దాంతో సమస్యలను ప్రారంభంలోనే గుర్తించి పెద్దవి కాకుండా నివారించుకోవచ్చు. మరి ఆ మెడికల్ టెస్ట్ లు ఏంటో తెలుసుకుందాం..

మామోగ్రామ్

మామోగ్రామ్

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. కాబట్టి, 40ఏళ్ళు దాటిన మహిళలు తప్పని సరిగా మామోగ్రామ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. అడిషినల్ గా డాక్టర్స్ ఆల్ట్రాసౌండ్ కూడా సూచిస్తారు. మోనో పాజ్ తర్వాత ఈ టెస్ట్ ప్రతి సంవత్సరం చేయించుకుంటే మంచిది.

 బోన్ డెన్సిటి స్కాన్

బోన్ డెన్సిటి స్కాన్

మహిళలను వేధించే సమస్యల్లో మరొకటి బోన్ డెన్సిటి . మోనో పాజ్ తర్వాత ఎముకల్లో క్యాల్షియం తగ్గిపోవడం వల్ల త ఓస్టిరియోపోసిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. లోబాడీ వెయిట్ కలిగిన వారికి ప్రతి రెండు సంవత్సరాలకొకసారి చెక్ చేయించుకోవడం మంచిది. ఆల్కహాల్ మరియు స్మోక్ చేసే మహిళలు తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలి. లేదంటా ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువ.

కొలనోస్కోపి :

కొలనోస్కోపి :

వయస్సైన వారిలో కనిపించే మరో వ్యాధి కొలనోస్కోపి . ఈ వ్యాధి యొక్క స్థితిని తెలుసుకోవడానికి కొలనోస్కోపి చేయించుకుంటారు. మోనోపాజ్ తర్వాత వచ్చే వ్యాధుల్లో కోలన్ క్యాన్సర్ ఒకటి. అలాగే ఫామిలీ హిస్టరీలో కూడా ఎవరికైనా ఉన్నా కూడా ఎర్లీ స్టేజ్ లోనే ఈ లక్షణాలు కనబడుతాయి.

కంటి పరీక్షలు

కంటి పరీక్షలు

కంటి సమస్యలు, మయోపియా, ప్రెస్బియోపియా, గ్లూకోమా మరియు కాంటరాక్ట్ వంటి సమస్యలు మోనోపాజ్ లో ఎక్కువ అవుతాయి. కాబట్టి,మహిళలు 40ఏళ్ళ వయస్సు రాగానే రెగ్యులర్ గా కంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది. దాంతో భవిష్యత్త్ లో రాబోయే గ్లూకోమా వంటి సమస్యలను నివారించుకోవచ్చు. డయాబెటిస్ తో బాధపడే వారిలో ఇటువంటి లక్షణాలు త్వరగా భయటపడుతాయి.

దంత పరీక్ష

దంత పరీక్ష

ఓరల్ క్యాన్సర్ అరికట్టడానికి దంత పరీక్ష చాలా అవసరం. ఓరల్ క్యాన్సర్ చాలా సాధరణమైనది. ప్రారంభంలోనే గుర్తించినట్లైతే చికిత్స ద్వారా నయం చేసుకోవడం సులభమవుతుంది. దంత పరీక్ష ద్వారా దంతక్షయం, చిగుళ్ళ వ్యాధులు వంటి సమస్యలను నివారించుకోవచ్చు. అలాగే రెగ్యులర్ గా ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్కువగా తీసుకునే వారు, స్వీట్స్, షుగర్స్ ఎక్కువగా తినే వారు కూడా దంత పరీక్ష చేయించుకోవడం మంచిది.

హార్ట్ చెకప్

హార్ట్ చెకప్

మహిళలు, ముఖ్యంగా మోనోపాజ్ దశలో ఉన్నవారు హార్ట్ డిసీజ్ కు త్వరగా గురి అవుతుంటారు. మోనో పాజ్ దశలో చాలా మంది హార్ట్ సమస్యలకు గురి అవుతుంటారు. కాబట్టి, రెగ్యులర్ గా హార్ట్ చెకప్స్ చేయించుకోవడం మంచిది.ఓవర్ వెయిట్ మహిళలు, హైపర్ టెన్షన్, స్మోకర్స్, ఆల్కహాల్ తీసుకునే వారు హార్ట్ అటాక్ వచ్చే చాన్సెస్ అధికంగా ఉంటాయి కాబట్టి, రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవడం మంచిది.

సర్వికల్ క్యాన్సర్

సర్వికల్ క్యాన్సర్

సర్వికల్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది, మహిళలు ఎదుర్కొనే కామన్ డిసీజ్. కాబట్టి, 40 ఏళ్ళ తర్వాత తప్పనిసరిగా సర్వికల్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఈ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది వెంటనే చికిత్స చేయించుకోకపోత ఇది స్కర్విక్స్ ను తొలగించాల్సి వస్తుంది

లిపిడ్ ప్రొఫైల్ :

లిపిడ్ ప్రొఫైల్ :

మహిళల్లో హార్ట్ అటాక్ కు ముఖ్య కారణం కొలెస్ట్రాల్ లెవల్స్. కొలెస్ట్రాల్ ను తొలగించుకోవడం వల్ల హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ వంటి సమస్యలను నివారించుకోవచ్చు. అంతే కాదు గాల్ బ్లాడర్ సమస్యలను కూడా నివారించుకోవచ్చు. ఈ టెస్ట్ వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను గుర్తించి చికిత్స తీసుకోవచ్చు. దాంతో హై డిన్సిటి లిప్పోప్రోటీన్ మంచి కొలెస్ట్రాల్ మరియు ట్రై గ్లిజరైడ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేసుకోవచ్చు .

English summary

Mother's Day Special: Make Sure Your Mom Undergoes These Important Medical Tests

Mother's Day Special: Make Sure Your Mom Undergoes These Important Medical Tests,Listed in this article areafew of the important tests that every mother hasto undergo. It helps in preventing many of the serious health problems.
Story first published: Wednesday, May 10, 2017, 16:56 [IST]
Subscribe Newsletter