For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన దంతాలు త్వరగా ఊడిపోకుండా పాటించవలసిన సహజ సిద్ధమైన పద్ధతులు

మనస్సుని కట్టిపడేయలేవు ,వయస్సుని పెరగకుండా ఆపలేవు అనేది ఒక సామెత.వయస్సు పెరుగుతన్న కొద్దీ మానవునిలో వివిధ రకాల సమస్యలు దరి చేరుతుంటాయి.

By R Vishnu Vardhan Reddy
|

మనస్సుని కట్టిపడేయలేవు ,వయస్సుని పెరగకుండా ఆపలేవు అనేది ఒక సామెత.వయస్సు పెరుగుతన్న కొద్దీ మానవునిలో వివిధ రకాల సమస్యలు దరి చేరుతుంటాయి.ఒక మనిషి శారీరికంగా,మానసికంగా ఆరోగ్యవంతంగా ఉన్నాడా లేదా అనేది, అతని నవ్వు చూసి చెప్పేయవచ్చని కొంతమంది నిపుణులు చెబుతున్న మాట.

సహజసిద్దంగా ఒక మనిషి వయస్సు మీద పడుతున్న కొద్దీ వెంట్రుకలు తెల్లబడటం,మొహం పై ముడతలు రావడం,చూపు మందగించడం,వినికిడి లోపం,పళ్ళు ఊడిపోవటం,వయస్సు సంబంధిత వ్యాధులు ఇలా శరీరంలో అనేకానేక మార్పులు చోటుచేసుకుంటూ, రకరకాల సమస్యలు చుట్టుముట్టేస్తుంటాయి.ఈ మధ్య కాలం లో మంచి వయస్సు లో ఉన్న స్త్రీ,పురుషులకు కూడా ముసలి లక్షణాలు కనపడుతుండటం ఆందోళన కలిగించే అంశం.

మన దంతాలు త్వరగా ఊడిపోకుండా పాటించవలసిన సహజ సిద్ధమైన పద్ధతులు

ఈ వయస్సు పై పడే లక్షణాలను తగ్గించుకోవటానికి,ఆ ఆవ లక్షణాలను దూరం చేసుకోవటానికి కొన్ని ఆధునిక పద్దతులను అందుబాటులోకి తెచ్చింది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం.బొటాక్స్,పేస్ లిఫ్ట్ తో పటు రకరకాల కృత్రిమ పద్దతుల తో పటు ఎన్నో రకాల క్రీములు,మనిషి నిత్య యవ్వనుడిగా కనిపించడానికి అందుబాటులోకి వచ్చాయి.

జ్ఞానదంతాల నొప్పి నివారణకు గ్రేట్ ఆయుర్వేద రెమెడీస్ ...జ్ఞానదంతాల నొప్పి నివారణకు గ్రేట్ ఆయుర్వేద రెమెడీస్ ...

కానీ సృష్టి ధర్మాన్ని ఎవరు ఆపలేరు.వయస్సు తో వచ్చే మార్పులను అందరు అంగీకరించి తీరాలి.కాకపోతే మనం కొన్ని మంచి పద్ధతులు,ఆహార నియమాలు పాటించడం వల్ల వాటి మూలంగా కలిగే నష్టాలను కృత్రిమ పద్ధతుల్లో కాకుండా ,సహజ సిద్ధమైన పద్ధతులను అవలంభించి, కొంత మేర తగ్గించుకొని ఆర్యోగ్యకరంగా జీవించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

మన దంతాలు త్వరగా ఊడిపోకుండా పాటించవలసిన సహజ సిద్ధమైన పద్ధతులు

వయస్సు పెరుగుతున్నా దాని వల్ల కలిగే దుష్ప్రభావాలను, కొంత మేర అయినా తగ్గించుకొని ఆరోగ్యకరంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.అందులో మొదటిది నాణ్యమైన పౌష్టిక ఆహరం తీసుకోవడం.మానవులు మాములుగా ఆహారాన్ని నోటి ద్వారా తీసుకొని దంతాలతో నమిలి మింగుతారు.దీని వల్ల జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది.కానీ ఈ మధ్య కాలం లో చాలా మంది మనుషులకు త్వరగా దంత సమస్యలు వస్తున్నాయి.దంతాలు కూడా త్వరగా ఊడిపోతున్నాయి.దీని వల్ల మంచి ఆహారాన్ని తీసుకొనే అదృష్టాన్ని కోల్పోతున్నారు.కృత్రిమ దంతాలను అమర్చే విధంగా వివిధ మార్గాలు అందుబాటులోకి వచ్చినా,సహజసిద్ధంగా ఏర్పడ్డ దంతాలను కాపాడుకుంటే మంచిదని,అందుకు గాను కొన్ని ఇంటి వైద్య చిట్కాలను సూచిస్తున్నారు వైద్యులు.

పంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగించే 7 హెర్బ్స్పంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగించే 7 హెర్బ్స్

ప్రతి రోజు పడుకునే ముందు రెండు టేబుల్ స్పూన్ల ఎండు ఉసిరికాయ పౌడర్ ని ,మూడు టేబుల్ స్పూన్ల పాల తో కలిపి ఒక ముద్దగా చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని చిగుళ్ల పై రాసి కనీసం 10 నిమిషాల పాటు చిగుళ్ళకు మర్దన చేయాలి.మర్దన చేసిన తరువాత ఒక 10 నిమిషాల ఆగి నోటిని గోరువెచ్చని నీటితో శుభ్రాంగా కడుక్కోవాలి .ఇలా వారానికి కనీసం మూడు సార్లు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.ఎండు ఉసిరి పొడిలో విటమిన్ సి అధికంగా ఉంటుందని ,అది చిగుళ్లలో ఉండే కండరాళ్ళను శక్తివంతగా, ఆర్యోగ్యకరంగా ఉంచడానికి తోడ్పడుతుందని చెబుతున్నారు.

మన దంతాలు త్వరగా ఊడిపోకుండా పాటించవలసిన సహజ సిద్ధమైన పద్ధతులు

గుడ్లు,పాలు,ఆకుకూరలు,వివిధ రకాల పళ్ళు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల విటమిన్ డి తో పాటు కాల్షియమ్ ఇలా ఎన్నో రకాల పోషకాలు మన శరీరానికి అంది ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడుతాయి.

రోజుకు రెండు సార్లు (పగలు-రాత్రి)కచ్చితంగా బ్రష్ చేసుకోవాలని,దంత వైద్యున్ని కూడా తరచూ కలవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్న మాట.కాబట్టి మనమందరం పైన చెప్పిన విధంగా ఆరోగ్య సూత్రాలను పాటించి ఆనందంగా జీవించుదాం.

English summary

Natural Remedy To Prevent Premature Tooth Loss!

Check out this amazing home remedy that can slow down the process of age-related tooth loss.
Story first published:Sunday, July 23, 2017, 9:50 [IST]
Desktop Bottom Promotion