For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటి చిట్కా: గ్యాస్ట్రిక్ సమస్యకు కేవలం 5 నిముషాల్లో పరిష్కార మార్గం

By Mallikarjuna
|

పొట్టలో మంట, వాపు, ఇన్ఫ్లమేషన్ లక్షణాలను అక్యుట్ గ్యాస్ట్ర్రిటిస్ అని అంటారు. అంటే కడుపు మంట, వాపు, అల్సర్ వంటి లక్షణాలు ప్రారంభంలో ఉన్నట్లైతే అక్యూట్ గ్రాస్ట్రిక్ గా సూచిస్తారు . అక్యూట్ గ్యాస్ట్రిటిస్ కు 10 న్యాచురల్ రెమెడీస్ ను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు.

అక్యుట్ గ్యాస్ట్రిటిస్ కు కొన్ని ఆహారపు అలవాట్లు మరియు కొన్నిసహజ అలవాట్లు కారణం కావవచ్చు. ఆస్పిరిన్ టాబ్లెట్స్, పెయిన్ రిలీఫింగ్ మెడిసిన్స్ వంటివి పొట్టలైనింగ్ కు హాని కలిగిస్తాయి, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, కాఫీ, టీ, మరియు నిమ్మరసం వంటివి ఉదయం పరగడుపున తాగడం , ఎక్కువగా కారం ఉన్న ఆహారాలు తినడం వల్ల అక్యూట్ గ్రాస్ట్రిటిస్ కు కారణం అవుతుంది.

Natural Tips to Cure Acute Gastritis

కారం ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల పొట్టలోపల పల్చగా లైనింగ్ వలె ఉన్న ఇంటీరియర్ వాల్స్ దెబ్బతింటాయి. దాంతో పొట్ట కండరాలకు, కణాలకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా పొట్టలోపల ఎర్రగా, వాపు, చీకాకు, కొంత మందిలో బ్లీడింగ్ సమస్యలు రావచ్చు. ఇవన్నీ ఇలాగే దీర్ఘకాలం కొనసాగితే అల్సర్ గా మారుతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగినా అది అక్యూట్ గ్యాస్ట్రిటిస్ కు కారణం అవుతుంది. అక్యూట్ గ్యాస్ట్రిటిస్ ను నివారించుకోవడానికి మందుల కంటే కొన్ని హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

<strong>గ్యాస్ కు కారణమయ్యే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి....</strong>గ్యాస్ కు కారణమయ్యే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి....

గ్యాస్ట్రిక్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు లక్షణాలు :

వాంతులు, అప్పుడప్పు వాంతుల్లో లేదా మలంలో రక్తం పడటం.

కడుపు మండుతున్నట్లు అనిపించడం.

పక్కటెముకల వద్ద పొట్ట సరీతిన నొప్పి, వీక్ నెస్, బ్లడ్ కౌట్ తక్కువగా ఉండటం .లేదా హీమోగ్లోబిన్ తగ్గడం.

తేనె:

తేనె:

తేనెను రెగ్యులర్ గా తినడం వల్ల స్టొమక్ వాల్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.

రెండు టేబుల్ స్పూన్ల తేనెను ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో కలిపి తాగాలి. దీన్ని రోజూ పరగడుపున తాగడం వల్ల ఇది ఎసిడిటి తగ్గిస్తుంది. స్టొమక్ వాల్స్ న్యాచురల్ గా నయం చేస్తుంది.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

ఒక కప్పు హాట్ వాటర్ లేదా కప్పు పాలలో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ప్రతి రోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే పొట్టలోచీకాకు, పొట్ట మంటను తగ్గిస్తుంది.

కలోంజి సీడ్స్ :

కలోంజి సీడ్స్ :

అరటీస్పూన్ కలోంజి సీడ్స్ ను నోట్లో వేసుకుని నమిలి మింగడం వల్ల పొట్ట సమస్యలను, గ్యాస్ట్రిటిస్ ను నివారిస్తుంది. అలాగే బ్లాక్ ఆనియన్ సీడ్స్ తినడం వల్ల కూడా అల్సర్ ను తగ్గిస్తుంది.స్టొమక్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది.

<strong>ఇబ్బంది కలిగించే గ్యాస్ర్టిక్ ట్రబుల్ తగ్గించే న్యాచురల్ హోం రెమిడీస్ </strong>ఇబ్బంది కలిగించే గ్యాస్ర్టిక్ ట్రబుల్ తగ్గించే న్యాచురల్ హోం రెమిడీస్

ఓట్ మీల్ :

ఓట్ మీల్ :

ఓట్ మీల్ కు తేనె చేర్చి బ్రేక్ ఫాస్ట్ లో తప్పకుండా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ మరియు అల్సర్ తగ్గుతుంది. రెండు మూడు టేబుల్ స్పూన్ల సెల్లీనియం ను ఒక కప్పు పెరుగు , ఒక కప్పు అరటి కలిపి రోజూ బ్రేక్ ఫాస్ట్ కు అరగంట ముందు తినాలి. ఇది పొట్ట ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనది.

ఎండిన బొప్పాయి సీడ్స్ :

ఎండిన బొప్పాయి సీడ్స్ :

బొప్పాయి విత్తనాలను ఎండలో ఎండబెట్టి, పొడి చేసి, రోజూ ఒక పైనాపిల్ ముక్క మీద ఈ పొడిని చిలకరించి , పరగడపున తినాలి.

గ్రీన్ కార్డమమ్ సీడ్స్:

గ్రీన్ కార్డమమ్ సీడ్స్:

కొద్దిగా యాలకల విత్తనాలు, అలాగే సోంపు గింజలు, మరియు కొద్దిగా దాల్చిన చెక్క తీసుకుని, డ్రై పాన్ లో 30 సెకండ్లు ఫ్రై చేసి, ఆరిన తర్వాత అన్నింటినికలిపి పొడి చేసి, భోజనానికి ముందు అరటీస్పూన్ తినాలి.

బ్లాక్ సాల్ట్ :

బ్లాక్ సాల్ట్ :

రోజు మార్చి రోజు రెండు మూడు టీస్పూన్ల బ్లాక్ సాల్ట్ ను భోజనంలో తీసుకోవాలి. ఇలా ఒకటి రెండు నెలలో చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. తప్పకుండా గ్యాస్ట్రిక్ మరియు అల్సర్ తగ్గుతుంది.

ప్రతి రోజూ ఫ్రెష్ గా ఉన్న పార్ల్సే తీసుకోవాలి:

ప్రతి రోజూ ఫ్రెష్ గా ఉన్న పార్ల్సే తీసుకోవాలి:

కొత్తిమీరను కొద్దిగా తీసుకుని, జ్యూస్ తయారుచేసుకోవాలి. రెండు మూడు టేబుల్ స్పూన్లకు చిటికెడు బ్లాక్ సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్ కలిపి, రోజుకు 3సార్లు తీసుకోవాలి. ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది. పొట్ట సమస్యలను నివారిస్తుంది.

అల్లం:

అల్లం:

పొట్ట సమస్యలను తగ్గించడంలో అల్లం గ్రేట్ రెమెడీ. అల్లం, మరియు ఉల్లిపాయ రసాన్ని సమంగా తీసుకుని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రోజూ తాగాలి. రోజుకు రెండు సార్లు తాగితే కడుపులో వాపు, వికారం, పొట్టలో చీకాకును తొలగిస్తుంది.

గ్యాస్ట్రిక్ తో బాధపడుతున్నప్పడు తినాల్సినవి

గ్యాస్ట్రిక్ తో బాధపడుతున్నప్పడు తినాల్సినవి

పియర్స్: పియర్స్ లో టానిన్స్ అధికంగా ఉండటం వల్ల డయోరియా, మరియు ఇతర పొట్ట సమస్యలను (అల్సర్, గ్యాస్ట్రిటిస్ )నయం చేస్తుంది.

పెరుగు : పెరుగులో ప్రోబయోటిక్ అధికంగా ఉండటం వల్ల పొట్టకు మంట, వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

క్యారెట్ జ్యూస్: క్యారెట్ జ్యూస్ లో విటమిన్ ఎ, ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి

కోకనట్ వాటర్ : పొట్టకు ప్రశాంత పరుస్తుంది. పొట్టకు చల్లదనం కలిగించి, మంట, వాపు, అల్సర్ వంటివి తగ్గిస్తుంది.

తేనె: తేనెలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల పొట్ట సమస్యలను తగ్గిస్తుంది

ఓట్ మీల్: ఓట్ మీల్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.

ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్,

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ , లో ఫ్యాట్ ఫుడ్స్

గ్యాస్ట్రిటిస్ తో బాధపడేవారు ఖచ్ఛితంగా తినడకూడనివి:

గ్యాస్ట్రిటిస్ తో బాధపడేవారు ఖచ్ఛితంగా తినడకూడనివి:

ఆల్కహాల్, బీన్స్, కోక, కాఫీ, టీ, లెమన్ మరియు ఆరెంజ్ జ్యూస్

రెడ్ మీట్, స్పైసీ ఫుడ్స్,

ఇతర సలహాలు, సూచనలు:

ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. కాలీకడుపుతో ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యకు కారణం అవుతుంది.

రోజూ 8నుండి 10 గ్లాసుల నీళ్ళు తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల బ్యాక్టీరియాను తొలగించుకోవచ్చు.

మితాహారం తినాలి.

ఒకేసారి ఎక్కువగా తినకుండా, రోజులో మూడు నాలుగు సార్లు కొద్దికొద్దిగా తినడం మంచిది.

ఆహారంను నిధానంగా, నమిలి తినాలి. ఇలా చేయడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.

English summary

Natural Tips to Cure Acute Gastritis

Natural Tips to Cure Acute Gastritis,When hot foods enter into injured areas of the stomach, the stomach lining and the interior walls slow or stop altogether the flow of blood in the stomach walls, causing reddening, irritation, and in some cases bleeding. All of this can gradually lead to chronic ulcers. An
Story first published:Thursday, November 16, 2017, 18:05 [IST]
Desktop Bottom Promotion