For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మానవ శరీరాన్ని ఆల్కలైజ్ (క్షార స్వభావాన్ని) కలుగజేసే 8 సహజమైన మార్గాలు !

|

మీ శరీరాన్ని ఆల్కలైజ్ (క్షార స్వభావము) ను ఎలా కలిగ చెయ్యాలో అని మీరు ఆలోచిస్తున్నారా? మీ శరీరము ఆమ్లము - క్షారాల సమతౌల్యాన్ని కోల్పోయినప్పుడు మీకు చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కీటక నాశని ఔషధాలు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలు, పర్యావరణ కాలుష్యం మరియు మనము అనుసరించే ఇతర జీవనశైలి కారకాలు మీ శరీర-వ్యవస్థయందు ఆమ్లమును వదిలివేసేటట్లుగా చెయ్యగలవు.

ఆమ్ల-వ్యవస్థ అనేది, మన శరీరంలో అనేక దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులకు ఆహ్వానంచేలాగా ఉంటుంది. మీరు మీ శరీరాన్ని సహజమైన క్షార-స్వభావాన్ని కలిగేదిగా ఉంచినప్పుడు, మీరు వ్యాధుల నివారణను కలిగి ఉంటారు.

మీ శరీరం యొక్క ఆమ్లాల స్థాయిలను (లేదా) క్షారాల స్థాయిలను ఎలా విశ్లేషించాలి?

అర్థమయ్యేలా చెప్పాలంటే, pH విలువ 7 కంటే తక్కువగానీ ఉంటే అది "ఆమ్లమే". pH విలువ 7 కంటే ఎక్కువ ఉంటే, మీ శరీరం "క్షార"-స్వభావాన్ని కలిగి ఉన్నట్లుగా చెప్పబడుతుంది. ఇంతకీ ఈ pH విలువను ఎలా తెలుసుకోవాలి ?

మీ ఫ్యామిలీ డాక్టర్, మీకు మూత్ర పరీక్షను చేసి ఆ విషయం గూర్చి తెలియజేయవచ్చు. ఆమ్ల-స్వభావం యొక్క లక్షణాలు ఏమిటి? మీరు గందరగోళంగా, మలబద్ధకంతో, నిద్రలేమితో, మోటిమలతో, మెదడు మొద్దుబారినట్లుగా, కడుపు ఉబ్బరముగా, ఉప్పును కలిగి ఉన్న స్నాక్స్ ను తినాలనే కోరికను మరియు కడుపు నొక్కటం వంటి వింత సమస్యలను ఎదుర్కొంటుంటే, మీరు మీ శరీరం యొక్క ఆమ్లత్వ స్థాయిని తెలుసుకొనే పరీక్షలను చేయించుకోవాలి.

మీ శరీరాన్ని ఆల్కలైజ్ (క్షార స్వభావం) గా చేయడానికి కొన్ని సహజ మార్గాలున్నాయి.

వంట సోడా :

వంట సోడా :

మీ శరీరానికి ఆల్కలైజ్ చేయడానికి ఉన్న సహజమైన మార్గాల్లో ఇది ఒకటి. ఒక టీ స్పూను బేకింగ్ సోడాను, ఒక కప్పు నీటిలో కలిపి, ఉదయాన్నే త్రాగాలి. బేకింగ్ సోడా అనేది మీ శరీర వ్యవస్థలో తక్షణమే ఆల్కలైజ్ (క్షార స్వభావం) గా మార్చి వేస్తుంది. కానీ మీరు ,ఈ పద్ధతిని ఎక్కువగా అమలు చేయవద్దు.

మొలకలు :

మొలకలు :

మొలకలు, మీ శరీరాన్ని ఆల్కలైజ్ చేసే ఆహారాలలో ఒక ప్రధాన భాగంగా ఉన్నాయి. మీ శరీరమును ఆల్కలైజ్ చేయడానికి మీరు ఉదయం వేళల్లో తీసుకునే సలాడ్లలో వీటిని కలిపి తీసుకోండి.

కొబ్బరి :

కొబ్బరి :

కొబ్బరికాయలు దొరికే అన్ని రకాల కారకాలు మీ శరీరాన్ని ఆల్కలైజ్ చేసేందుకు అనువుగా ఉంటుంది. కొబ్బరిని, మీ వంట అవసరాల కోసం కొబ్బరినూనెగా ఉపయోగించవచ్చు, దాని నుండి తీసిన రసాన్ని ఆస్వాదించవచ్చు (లేదా) పచ్చి కొబ్బరిని తినవచ్చు. ఇది మీ శరీర వ్యవస్థను ఆల్కలైజ్ (క్షార స్వభావం) గా మార్చి వేస్తుంది.

నీరు :

నీరు :

డయాబెటిస్, రక్తపోటు, యాసిడ్ రిఫ్లక్స్ మరియు అధిక కొలెస్ట్రాల్ తీవ్రతతో బాధపడుతున్న ప్రజలు ఆల్కాలైన్ నీటిని త్రాగటం చాలా మంచిది. సాధారణ నీటి యొక్క pH విలువ 7 అయితే, ఆల్కలైజ్ నీటి యొక్క pH 8 గా ఉంది.

నిమ్మకాయ నీరు :

నిమ్మకాయ నీరు :

నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ మీకు ఎలా విశ్రాంతిని కలుగజేస్తుందో అని మీరు చాలా ఆశ్చర్యపోతారు. నిమ్మరసం మీ శరీరంలో ఆల్కలైజ్ ప్రభావాన్ని సృష్టిస్తుంది. నిమ్మరసాన్ని ఉదయాన్నే పరగడుపున త్రాగాలి. ఇది మానవ శరీరానికి ఆల్కలైజ్ గా మార్చివెయ్యగలిగే సహజమైన మార్గాల్లో ఒకటి.

ఆకుపచ్చని వెజ్జీలు :

ఆకుపచ్చని వెజ్జీలు :

మీ శరీరం ఆమ్ల-స్వభావంలోకి మారినప్పుడు, ఎముకలలో ఉన్న కాల్షియం ఆమ్ల స్థాయిలను తగ్గిస్తుంది. అలా జరగటం మీ ఎముకలకు చాలా ప్రమాదకరం. కానీ మీరు బచ్చలికూర, కాలే, స్పియులినా వంటి ఆకుపచ్చ కూరగాయలను తినేటప్పుడు, మీరు మీ శరీర వ్యవస్థను ఆల్కలైజ్ చేయవచ్చు మరియు కొంత మోతాదులో కాల్షియం కూడా పొందవచ్చు.

అలోవెర (కలబంద) జ్యూస్ :

అలోవెర (కలబంద) జ్యూస్ :

మీ శరీరం కొంచెం ఆమ్ల స్వభావం వైపుగా ఉన్నప్పుడు, మరలా దానిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఉన్న ఉత్తమమైన మార్గం కలబంద రసాన్ని త్రాగటం. మీరు కలబంద యొక్క ఆకులు నుండి ఈ రసాన్ని పొందవచ్చు మరియు అలా వచ్చిన రసాన్ని త్రాగేముందు నీటిలో కలపాలి.

వ్యాయామం :

వ్యాయామం :

వ్యాయామం అనేది మీ శరీరాన్ని ఆల్కలైజ్ చెయ్యగలిగే సహజమైన మార్గాలలో ఇది కూడా ఒకటి. ఇది మీ శరీరంలో ఉన్న ఆమ్ల వ్యర్థ పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే, ఒత్తిడిని తగ్గించేందుకు -మీ జీర్ణ వ్యవస్థను తాత్కాలికంగా ప్రభావితం చేస్తుంది మరియు ఆమ్ల వ్యర్థ పదార్థాలను తొలగింపు ప్రక్రియను ఆలస్యం చేస్తుంది.

English summary

Natural Ways To Alkalise The Body

Are you wondering how to alkalise your body? Most of the health issues occur when your body loses its acid-alkaline balance. Here are some natural ways to alkalise the body.
Story first published: Tuesday, December 19, 2017, 14:00 [IST]