For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ మూత్ర పిండాలు బాగుండాలంటే ఈ ఉల్లిపాయ చిట్కాలను తప్పక పాటించండి

By Lekhaka
|

ప్రతి ఒక్కరి శరీరంలో ప్రవహించే రక్తంలో ఉండే విషపదార్ధాలను శుద్ధి చేయడంలో మూత్రపిండాలు ముఖ్య భూమికను పోషిస్తాయి. ఈ విషపదార్ధాలు శుద్ధిచేయడం అనే ప్రక్రియ చాలా క్లిష్టమైనది. ఈ విష పదార్ధాలన్నింటిని మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు పంపివేయడం జరుగుతుంది.

కావున మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, మూత్రపిండాలు ఎల్లప్పుడూ చక్కగా పనిచేసేలా చూసుకోవాలి. ఎందుకంటే, అవి శరీరంలోని ఎలెక్ట్రోలైట్లు మరియు పోషకాలను సమతుల్యతతో ఉంచడమే కాకుండా, మరెన్నో పనులను కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తాయి.

కానీ, అసలు సమస్య ఏమిటంటే, కొన్ని సమయాల్లో చెడ్డ అలవాట్ల వల్ల అవి చేయవల్సిన పనులు అవి చేయలేకపోతాయి. ఇందు వల్ల కొన్ని తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. అవి శరీర ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.

ఇవన్నీ మొదట్లో ఎవరు గుర్తించలేకపోవచ్చు. కానీ సమయం గడిచే కొద్దీ ఈ అలవాట్ల వల్ల ఎన్నో ప్రతికూల ప్రభావాలు శరీరం పై పడతాయి. అందుకు సంబంధించిన ఎన్నో భౌతిక లక్షణాలు కంటికి కనపడుతుంటాయి.

అందుచేతనే మనమందరం మన శరీరంలో విషపదార్ధాలు బయటకు పంపించే ప్రక్రియకు చేయూతనివ్వాలి. అందుకు మనం చేయాల్సిందేమిటంటే, సరైన పోషకాహారం తీసుకోవాలి మరియు సాధారణ పద్దతుల ద్వారా ఈ ప్రిక్రియని మరింతగా పెంపొందించుకోవాలి.

ఇప్పుడు మనం ఉల్లిపాయలతో కూడిన ఒక అద్భ్యుతమైన చిట్కాను తెలుసుకోబోతున్నాం. ఈ చిట్కా ద్వారా మూత్రపిండాలు ఎంతో శక్తివంతంగా తయారవుతాయి మరియు విషపదార్ధాలు శరీరం నుండి బయటకుపంపడం జరుగుతుంది.దీనిని అందరు ప్రయత్నించండి.

ఉలిపాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాలుగా శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి.

శుద్దీకరణ, యాంటీ బయోటిక్ మరియు మూత్రవర్ధకమైన శక్తులను మూత్రపిండాలకు ఇవి అందిస్తాయి. అంతే కాకుండా అవి దెబ్బతినకుండా ఒక సంరక్షించే అడ్డంకిని సృష్టిస్తాయి మరియు చెడ్డ పదార్ధాలను దూరం పెట్టి మరియు ఏవైతే హాని చేస్తాయో అటువంటి వాటిని బయటకు పంపించేస్తాయి.

ఉల్లిపాయల సమ్మేళనంలో అత్యంత ఉత్తేజకరంగా ఉండే పదార్ధం అల్లిసిన్. ఇది ఒక అత్యంత శక్తివంతమైన మంట విరుగుడు పదార్ధం మరియు చెడు పదార్ధాలను శుద్ధి చేయడంలో ఎంతో ప్రభావం కలిగినది. దీని వల్లనే మూత్రపిండాలు అవి ఎలా పనిచేయాలో ఆలా పనిచేస్తాయి. ముఖ్యంగా ఎప్పుడైతే శరీరంలో విషపదార్ధాలు పెరిగిపోతాయో అప్పుడు మూత్రపిండాలు బాగా పనిచేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కిడ్నీలు శుభ్రపరచడానికి ఉల్లిపాయలు ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం..

ఉల్లిపాయలలో ఎన్నో పోషకాలు మరియు ఖనిజాలు ఉంటాయి :

ఉల్లిపాయలలో ఎన్నో పోషకాలు మరియు ఖనిజాలు ఉంటాయి :

శరీరంలో ఉండే వివిధరకాల ద్రవాలుసరైన మోతాదులలో ఉండేలా చూస్తాయి మరియు ఎలెక్ట్రోలైట్ స్థాయిలు సరైన రీతిలో ఉండేందుకు ఎంతగానో ఉపయుక్తం అవుతాయి.

ఉల్లిపాయలతో ఉండే ముఖ్యమైన పోషకాలు ఏమిటంటే:

ఉల్లిపాయలతో ఉండే ముఖ్యమైన పోషకాలు ఏమిటంటే:

విటమిన్లు ( ఏ, బి కాంప్లెక్స్, సి, ఈ ), ఖనిజాలు ( కాల్షియమ్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, సిలికాన్, సల్ఫర్, ఫాస్ఫరస్, ఐయోడిన్, రాగి ) ఆంథోసియానిన్, పీచుపదార్థం, ఈ పదార్ధాలన్నీ విషపు పదార్ధాల వల్ల కణాలు దెబ్బతినకుండా అడ్డుకుంటాయి మరియు దీర్ఘకాలంలో నయంకాని వ్యాధుల భారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఇంట్లో తయారుచేసుకొని చికిత్స ద్వారా మనం మూత్రపిండాలు శుద్దిచేసుకోవచ్చు.

ఇంట్లో తయారుచేసుకొని చికిత్స ద్వారా మనం మూత్రపిండాలు శుద్దిచేసుకోవచ్చు.

ఇంట్లో తయారుచేసుకొని చికిత్స ద్వారా మనం మూత్రపిండాలు శుద్దిచేసుకోవచ్చు.అందుకు ఉల్లిపాయలో ఉండే ఈ గుణాలన్నీ ఎంతగానో ఉపయోగపడతాయి. దీనికితోడు మూత్ర వర్ధకము పై ప్రభావం చూపే అజమోదము అనే మొక్క మరియు నిమ్మకాయ తో కలిపి ఉల్లిపాయను తీసుకోవడం ఎంతో మంచిది.

మంటను తగ్గించడానికి మరియు శరీరంలోని చెడు పదార్ధాలను బయటకు పంపించడానికి

మంటను తగ్గించడానికి మరియు శరీరంలోని చెడు పదార్ధాలను బయటకు పంపించడానికి

మంటను తగ్గించడానికి మరియు శరీరంలోని చెడు పదార్ధాలను బయటకు పంపించడానికి ఇది ఎంతగానో సహాయం చేస్తుంది. ఈ పానీయాన్ని చెడు వ్యర్థాల నియంత్ర పానీయంగా కూడా పిలవవచ్చు. దీనిని సేవించడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ ఎంతగానో శక్తివంతం అవుతుంది.

క్రిమిసంహారాలను సంహరించే, మంటను తగ్గించే మరియు రక్తస్రావ నివారిణిగా

క్రిమిసంహారాలను సంహరించే, మంటను తగ్గించే మరియు రక్తస్రావ నివారిణిగా

క్రిమిసంహారాలను సంహరించే, మంటను తగ్గించే మరియు రక్తస్రావ నివారిణిగా భావించే ఈ పానియంలో ఉండే పదార్ధాలు మూత్రపిండాలు అత్యంత శక్తివంతంగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఏ అంటువ్యాధుల భారిన లేదా ఇతర వ్యాధుల భారిన పడకుండా మూత్రనాళాన్ని పూర్తిగా శుద్ధి చేస్తుంది.

వాడవలసిన పదార్ధాలు:

వాడవలసిన పదార్ధాలు:

2 లీటర్ల నీళ్లు,

2 పచ్చి ఉల్లిపాయలు

3 కొమ్మల పార్స్లీ (అజమోదము మొక్క)

3 నిమ్మకాల నుండి తీసిన రసం

తయారీ విధానం :

తయారీ విధానం :

ఒక కుండలో రెండు లీటర్ల నీటిని పోసి వేడి చేయండి.

ఈ లోపు ఉల్లిపాయను తొక్కుని తీసి ముక్కలు ముక్కలుగా లేదా పొడవుగా తరగండి.

నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత నీటిని ఒక చిన్న పాత్రలోకి తీసుకొని ఆ నీటిలో ఉల్లిపాయ ముక్కలను వేయండి.

ఆ తర్వాత పార్స్లీ( అజమోదము మొక్క) మరియు నిమ్మకాయ రసాన్ని వేయండి. ఇలా వేసిన తర్వాత కనీసం రెండు గంటలు వదిలివేయండి.

ఆ సమయం తర్వాత ఆ ద్రవాన్ని అంతా బాగా కలపండి.

ఎలా సేవించాలంటే :

ఎలా సేవించాలంటే :

ఈ రెండు లీటర్ల ఉల్లిపాయ నీటిని రోజంతా త్రాగేలా సమానంగా విభజించుకోవాలి. కనీసం రోజులో 5 నుండి 6 సార్లు త్రాగేలా విభజించండి.

ఇది మూత్రవిసర్జన పై శక్తివంతమైన ప్రభావం చూపిస్తుండటంతో వారానికి మూడు సార్లు మాత్రమే వాడాలి అది కూడా రోజు విడిచి రోజు వాడాలి.

దీనిని కనీసం ఒకటి నుండి రెండు వారలు సేవించాలి. మీ మూత్రపిండాల లో ఉన్న విషపు పదార్ధాల ఆధారంగా ఎన్ని సార్లు ఈ పానీయాన్ని తీసుకోవాలి అనే విషయం ఆధారపడి ఉంటుంది.

ఈ శుద్ధి చేసే క్రమంలో సోడియం తీసుకోవడం తగ్గించండి.

ఈ శుద్ధి చేసే క్రమంలో సోడియం తీసుకోవడం తగ్గించండి.

ఈ శుద్ధి చేసే క్రమంలో సోడియం తీసుకోవడం తగ్గించండి. సాధారణ ఉప్పుని కూడా తీసుకోకండి. ఎందుకంటే ఈ విషపు పదార్ధాలను బయటకు పంపే క్రమంలో అది అడ్డు తగిలే అవకాశం ఉంది.

 వీటికి బదులుగా ఆకుకూరలు, కూరగాయలు

వీటికి బదులుగా ఆకుకూరలు, కూరగాయలు

సంతృప్తి కొవ్వు మరియు తీపి పదార్ధాలను పూర్తిగా నిషేధించడం మంచిది. ఈ రెండు శరీరంలో విషపు పదార్ధాలను విపరీతంగా పెంచేస్తాయి.

వీటికి బదులుగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవడం మంచింది. ముఖ్యంగా నీరు ఎక్కువగా ఉండే పదార్ధాలు తీసుకోవడం మంచిది.

చిక్కుళ్ళు, బఠాణి, పుట్టగొడుగు మరియు చేపలను తినవచ్చు.

ఎప్పుడు తీసుకోకూడదంటే:

ఎప్పుడు తీసుకోకూడదంటే:

దీనిని సేవించేటప్పుడు ఏ వ్యక్తుల్లో అయిన ఆమ్లం వల్ల లేదా జీర్ణకోశమునకు సంబంధించిన చికాకుతో కూడిన అనుకోని ప్రతిస్పందనలు వ్యక్తుల్లో కనిపిస్తే ఆపివేయండి.

అల్పరక్తపోటుతో బాధపడే వారు దీనిని అస్సలు సేవించకూడదు. ఎందుచేతనంటే, ఇది రక్త పోటుని తగ్గిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువ ఉన్న వ్యక్తులు కూడా ఇది వాడకూడదు. ఇది చెక్కర స్థాయిలను కూడా తగ్గించివేస్తుంది.

మీరు ఇవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా ? మీకు పైన చెప్పబడిన లక్షణాలు గనుక లేకపోతే ఈ చిట్కాను మీ ఇంట్లో తయారు చేసుకొని సేవించండి. ఇలా చేయడం వల్ల మూత్ర పిండాలు ఎంత మంచిగా ఉన్నాయి, పని చేస్తున్నాయి అనే విషయాన్ని మీరే కనుక్కొంటారు..

English summary

Onion Remedy Helps to Cleanse Your Kidneys

Onion Remedy Helps to Cleanse Your Kidneys,Read to know more about..
Story first published: Tuesday, November 14, 2017, 7:00 [IST]