For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దానిమ్మతో క్యాన్సర్ నివారణతో పాటు మరికొన్ని గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

By Mallikarjuna
|

ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో ఒకటి మధుమేహం అయితే, రెండవది క్యాన్సర్. ప్రతి సంవత్సరం క్యాన్సర్ తో కొన్ని వేల సంఖ్యలో చనిపోతున్నారు. క్యాన్సర్ ఒక దీర్ఘకాలిక వ్యాధి, అంతే కాదు మెడిసిన్స్ తో నయం చేయలలేని జబ్బుకు కూడా. ఈ ప్రాణాంతక క్యాన్సర్ కు సరైన మందును ఇప్పటి వరకూ కనుగొనబడలేదు, క్యాన్సర్ నివారణకు అనేక పరిశోధనలు చేశారు. క్యాన్సర్ నివారించడానికి లేదా క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి నయం చేయడానికి వివిధ రకాల పరిశోధనలు జరిపారు. అయితే తప్పకుండా ఎప్పుడోఒకప్పుడు క్యాన్సర్ ను పూర్తిగా నిర్మూలించే మందులు కనుగొంటారన్న నమ్మకం అయితే ఉంది

క్యాన్సర్ నివారణకు దానిమ్మ గ్రేట్ గా సహాయపడుతుంది. దానిమ్మను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ లక్షణాలను కూడా పూర్తిగా నివారించుకోవచ్చు. అందువల్ల, సైంటిస్ట్స్ కూడా యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ గా దానిమ్మను ఉత్తమమైన పండుగా చెబుతున్నారు

pomegranate health benefits

రోజూ ఉదయం దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల పొందే అమేజింగ్ బెనిఫిట్స్రోజూ ఉదయం దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల పొందే అమేజింగ్ బెనిఫిట్స్

దానిమ్మలో ఉన్న పోషక విలువలు

87గ్రాముల దానిమ్మలో

కేలరీలు 72cal

మొత్తం కొవ్వు 1gr

సంతృప్త కొవ్వు 0.1 గ్రా

కొలెస్ట్రాల్ 0mg

సోడియం 3mg

పొటాషియం 205mg

కార్బోహైడ్రేట్ 16 గ్రా

ఫైబర్ 3.5 గ్రా

చక్కెర 12 గ్రా

ప్రోటీన్ 1.5 గ్రా

కాల్షియం 9 గ్రా

ఐరన్ 1.5gr

మెగ్నీషియం 2.4 గ్రా

విటమిన్ B6 4.3 గ్రా

విటమిన్ సి 13 గ్రా

pomegranate health benefits

* రోజువారికి మనకు అవసరమయ్యే క్యాలరీ 2000 . అది మనం తీసుకునే ఆహారం మీద ఎక్కువ మరియు తక్కువ ఆధారపడి ఉంటుంది.

<strong>సూపర్ ఫుడ్స్ : క్యాన్సర్ తో పోరాడుతాయి మరియు నివారిస్తాయి</strong>సూపర్ ఫుడ్స్ : క్యాన్సర్ తో పోరాడుతాయి మరియు నివారిస్తాయి

దానిమ్మ క్యాన్సర్ ను ఎలా నివారిస్తుంది

పైన చెప్పిన విధంగా దానిమ్మ యాంటీక్యాన్సర్ గా పనిచేస్తుంది. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. దానిమ్మ యాంటీ క్యాన్సర్ గా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం..:

దానిమ్మలో ఫాలీఫినాల్స్ ఉండటం వల్ల యాంటీఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది వ్యాధుల మీద పోరాడి, శరీరంలో వ్యాధులకు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. ఈ ఫ్రీరాడికల్స్ వల్ల క్యాన్సర్ సెల్స్ కనబడుతాయి. మన శరీరంలో ఫ్రీరాడికల్స్ తొలగించడంవల్ల శరీరంలో క్యాన్సర్ సెల్స్ పెరగకుండా నివారించవచ్చు.

pomegranate health benefits

దానిమ్మలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇది వ్యాధి నిరోదకతను పెంచుతుంది. వ్యాధినిరోధకత బాగా పెరుగుతుంటే, క్యాన్సర్ సెల్స్ పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి దానిమ్మ క్యాన్సర్ నిరోదించే ఫ్రూట్ అయ్యింది.

మరో పరిశోధన ద్వారా దానిమ్మలో ఎలర్జిటానిన్స్ ను కనుగొన్నారు, ఇవి క్యాన్సర్ సెల్స్ పెరగకుండా ఆలస్యం చేస్తాయని కనుగొన్నారు. ఇంకా క్యాన్సర్ కణాలు శరీరం మొత్తం విస్తరించకుండా నివారిస్తుంది. దానిమ్మలో ఉండే న్యూట్రీషియన్స్ క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేస్తుంది. దాంతో క్యాన్సర్ నుండి ఉపశమనం కలుగుతుంది

దానిమ్మలో ఉండే ట్యానిన్ మరియు యాంథోసైనిన్ యాంటీట్యూమర్ గా పనిచేస్తాయి. ఇవి క్యాన్సర్ సెల్స్ అభివ్రుద్ది పెరగకుండా మంచి కణాలను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల వివిధ క్యాన్సర్ కణాలను తొలగిస్తుంది.

దానిమ్మ ప్రాణాంతక క్యాన్సర్ ను నివారించడంతో పాటు, ఇతర గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

1. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది

1. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది

దానిమ్మలో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధకతను పెంచుతుంది. ఫలితంగా వ్యాధులను నివారిస్తుంది.

2. యాంటీఏజింగ్

2. యాంటీఏజింగ్

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల యాంటే ఏజింగ్ గా పనిచేస్తుంది. ఇది ముడుతలను నివారించడానికి సహాయపడుతుంది. దాంతో వయస్సైన లక్షణాలను కనబడనివ్వదు.

3. యాంటీడిప్రెజెంట్

3. యాంటీడిప్రెజెంట్

దానిమ్మలో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ ప్రశాంతతను ఏర్పరుస్తుంది. ఇది మనస్సును రిలాక్స్ చేస్తుంది. ఇంకా యాంటీడిప్రెజెంట్ గా పనిచేస్తుంది. ఇది స్ట్రెస్ తగ్గించి మనస్సును ప్రశాంతపరుస్తుంది.

4. హెల్తీ స్కిన్ మెయింటైన్ చేస్తుంది

4. హెల్తీ స్కిన్ మెయింటైన్ చేస్తుంది

దానిమ్మ చర్మం అందాన్ని మెరుగుపరచడంలో గొప్పదని కొన్నిపరిశోదనల్లో కనుగొన్నారు. ఇది డ్యామేజ్ అయిన స్కిన్ ను రిపేర్ చేస్తుంది. ఇది వివిధ రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. మొటిమల పోగొడుతుంది.

5. హెల్తీ హెయిర్

5. హెల్తీ హెయిర్

దానిమ్మలో ఉండే విటమిన్స్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇంకా జుట్టుకు మంచి రంగు, మెరుపును ఇస్తాయి. కాబట్టి, హెల్తీ హెయిర్ ను మెయింటైన్ చేయడానికి దానిమ్మను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

6. కార్డియో వాస్క్యులర్ వ్యాధులను నివారిస్తుంది

6. కార్డియో వాస్క్యులర్ వ్యాధులను నివారిస్తుంది

గుండుకు రక్తంను సరఫరా చేసే ధమనుల్లో రక్తం పాచి కంటకుండా నివారిస్తుంది. దాంతో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నివారిస్తుంది. స్ట్రోక్ మరియు హార్ట్ అటాక్ వంటి లక్షణాలు దూరం చేస్తుంది.

7. డయాబెటిస్ ను నివారిస్తుంది

7. డయాబెటిస్ ను నివారిస్తుంది

దానిమ్మ గింజలు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. అందువల్ల డయాబెటిస్ పేషంట్స్ కు ఇదిఒక ప్రత్యామ్నాయ న్యాచురల్ రెమెడీ.

8. బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది

8. బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది

దానిమ్మ గింజలను రెగ్యులర్ గా తినడం వల్ల సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. యాంజీయోస్టెన్ ను నివారించడానికి పనిచేసి, ఎంజైమ్స్ గా మారుతాయి. క్రమంగా, బ్లడ్ ప్రెజర్ తగ్గించడానికి సహాయపడుతుంది.

9. కొలెస్ట్రాల్ మెయింటైన్ చేస్తుంది

9. కొలెస్ట్రాల్ మెయింటైన్ చేస్తుంది

దానిమ్మ విత్తనాల్లో ఉండే పునిసిస్ యాసిడ్ ఎల్ డిఎల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగా మంచి రక్తం హెచ్ డిఎల్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.

10. బరువు తగ్గిస్తుంది

10. బరువు తగ్గిస్తుంది

రెగ్యులర్ గా దానిమ్మను తినేవారు కొందరు బరువు తగ్గడానికి ఇది మంచి థెరఫీ వంటిదని సూచిస్తున్నారు. ఇది మెటబాలిజం రేటును వేగవంతం చేస్తుంది, ఫ్యాట్ బర్న్ చేస్తుంది, అందువల్ల శరీరం బరువు పెరగకుండా కంట్రోల్లో ఉంటుంది.

11. జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది

11. జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది

దానిమ్మ విత్తనాల్లో ఉండే విటమిన్ బి శరీరం యొక్క మెటబాలిజం రేటును మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది.

12. డయోరియాను తగ్గిస్తుంది

12. డయోరియాను తగ్గిస్తుంది

ఈ పండు యాంటీబ్యాక్టీరియాలాగా పనిచేస్తుంది. దాంతో డయోరియా తగ్గుతుంది. ఇంకా పొట్టనొప్పి తగ్గిస్తుంది. కాబట్టి, దానిమ్మ కేవలం క్యాన్సర్ ను మాత్రమే కాదు ఓవరాల్ హెల్త్ కు గ్రేట్ ఫ్రూట్స్ అని పరిశోధనల ద్వారా వెల్లడి చేశారు.

English summary

How Pomegranate Can Help Prevent Cancer

This tasty fruit loved by many has abilities which can prevent cancer naturally!
Story first published:Saturday, October 21, 2017, 16:23 [IST]
Desktop Bottom Promotion