For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీర్యగ్రంధి ( ప్రోస్టేట్) కాన్సర్ గురించి ప్రతి ఒక్క పురుషుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు

By R Vishnu Vardhan Reddy
|

పురుషులలో చర్మ సంబంధమైన క్యాన్సర్లు కాకుండా సాధారణంగా వచ్చే క్యాన్సర్లలో వీర్యగ్రంధి ( ప్రోస్టేట్) క్యాన్సర్ ఒకటి. ఈ రకమైన క్యాన్సర్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్న వారు అధిక సంఖ్యలో ఉన్నారు. క్యాన్సర్ వల్ల మరణించే కారణాలలో ఈ వీర్యగ్రంధి ( ప్రోస్టేట్) క్యాన్సర్ రెండవ అతిపెద్ద కారణంగా నిలిచింది.

ఈ వీర్యగ్రంధి ( ప్రోస్టేట్) క్యాన్సర్లో ఉన్న అత్యంత ఘోరమైన విషయం ఏమిటంటే, చాలా సందర్భాల్లో ఆ వ్యాధికారక లక్షణాలు కొన్ని సంవత్సరాలైనా బయటపడవు.

ప్రొస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ను నివారించడం ఎలా..?ప్రొస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ను నివారించడం ఎలా..?

ఈ కారణం వల్ల వీర్యగ్రంధి ( ప్రోస్టేట్) క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ని చేపించుకొని, మనకు ఆ రకమైన క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారించుకోవడం మంచిది. మీలో ఆ క్యాన్సర్ ఉంది అనే విషయం ఎంత త్వరగా బయటపడితే, అంత సులభంగా మీకు చికిత్స చేయవచ్చు మరియు దాని భారీ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

సాధారణంగా ఏ పురుషులకైతే 50 సంవత్సరాలు దాటుతాయో అటువంటి వారు ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ఈ వ్యాధి సాధారణంగా వయస్సు పై బడ్డ పురుషుల్లో ఎక్కువగా కనపడుతుంది.కానీ మీరు మీ యొక్క వైద్యుడిని సంప్రదించి ఎప్పటి నుండి ఈ పరీక్షలో పాల్గొనాలి మరియు తరచూ ఎప్పుడెప్పుడు పాల్గొనాలి అనే విషయం తెలుసుకోవడం చాలా మంచిది.

మీరు ఎప్పుడైనా ఈ స్క్రీనింగ్ పరీక్షల్లో పాల్గొనటానికి నిర్ణయం తీసుకోవచ్చు. అయితే అత్యంత ముఖ్యమైన వీర్యగ్రంధి ( ప్రోస్టేట్) క్యాన్సర్ లక్షణాల గురించి ప్రతి ఒక్క పురుషుడు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు: నివారణ చర్యలుపురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు: నివారణ చర్యలు

ఇప్పుడు మనం చెప్పుకోబోయే లక్షణాలు, మూత్ర నాళం సంక్రమణకు సంబంధించిన వ్యాధి లక్షణాలు అయిఉండొచ్చు లేదా మీ యొక్క వీర్యగ్రంధి ( ప్రోస్టేట్) ఎక్కువగా పెరుగుతున్న స్థితిని తెలిపే లక్షణాలు కావచ్చు. కావున ఇప్పుడు మీరు చదవబోయే క్యాన్సర్ లక్షణాల గురించి తెలియగానే, ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్న వారు ఒకవేళ మీకు గనుక ఆ లక్షణాలు ఉంటే, మీకేదో క్యాన్సర్ వచ్చినట్లు భావించనవసరం లేదు. ఇది ఒక అవగాహన పెంచుకోవడానికి మాత్రమే. ఇది తెలుసుకోవడం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులని మరింత జాగ్రత్తగా చూసుకొనే అవకాశం కలుగుతుంది.

ఇప్పుడు ఆ వ్యాధికారక లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం :

1) మూత్ర విసర్జనకు తరచూ వెళ్లడం :

1) మూత్ర విసర్జనకు తరచూ వెళ్లడం :

ఈ వీర్యగ్రంధి ( ప్రోస్టేట్) క్యాన్సర్ సోకిన వారిలో అత్యంత సాధారణంగా కనపడే వ్యాధి లక్షణం ఇది. ఈ వ్యాధి గ్రస్తులు మూత్ర విసర్జనకు సాధారణంగా కంటే కూడా ఎక్కువగా వెళ్తుంటారు.

2 ) మూత్ర విసర్జనలో తొందరపాటు :

2 ) మూత్ర విసర్జనలో తొందరపాటు :

తరచుగా మూత్ర విసర్జనకు వెళ్ళాలి అనే భావన ఎక్కువగా కలుగజేస్తుంది. అది కూడా మూత్రం చాలా అధికంగా వస్తున్నట్లు ఉంటుంది మరియు అత్యవసరంగా వెళ్లాలనిపిస్తుంది.

3 ) రాత్రి పూట మూత్రవిసర్జన కోసం లేవటం :

3 ) రాత్రి పూట మూత్రవిసర్జన కోసం లేవటం :

రాత్రి సమయాలలో నిద్రపోయిన తర్వాత తరచూ ఎక్కువ సార్లు నిద్రలో లేచి మూత్ర విసర్జనకు వెళ్లడం అనేది ఈ వ్యాధి లక్షణాలలో ఒకటి.

4 ) మూత్ర విసర్జన సమయంలో క్రమపద్ధతి లేకపోవడం :

4 ) మూత్ర విసర్జన సమయంలో క్రమపద్ధతి లేకపోవడం :

మూత్ర విసర్జన చేయడానికి చాలా సమయం పడుతుంది. మూత్రం చాలా నెమ్మదిగా మరియు చుక్కలు చుక్కలుగా వస్తుంది. ఈ లక్షణాలు గనుక ఉంటే వీర్యగ్రంధి ( ప్రోస్టేట్) లో ఎదో లోపం ఉందని అర్ధం. వీర్యగ్రంధి ( ప్రోస్టేట్) క్యాన్సర్ లో ఈ లక్షణం అతి ముఖ్యమైనది.

5 )అటు ఇటు కదిలే మూత్ర ప్రవాహం :

5 )అటు ఇటు కదిలే మూత్ర ప్రవాహం :

మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు, అది ఒక ప్రవాహంలా కాకుండా అటు ఇటు కదులుతూ ఒక వైపు నుండి ఇంకొక వైపుకి తానంతట తానే మూత్ర ప్రవాహం మారిపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంది.

6 ) మూత్రంలో రక్తం రావడం :

6 ) మూత్రంలో రక్తం రావడం :

ఈ లక్షణం వీర్యగ్రంధి ( ప్రోస్టేట్) క్యాన్సర్ ప్రారంభదశలో కనపడే లక్షణం. ఇలాంటి లక్షణం మీలో గనుక ఉంటే తక్షణమే మీరు వైద్యులను సంప్రదించండి.

7 ) అంగస్తంభన మరియు స్కలించడంలో మార్పులు చోటు చేసుకోవడం :

7 ) అంగస్తంభన మరియు స్కలించడంలో మార్పులు చోటు చేసుకోవడం :

అంగస్తంభన జరగడం చాలా కష్టమవుతుంది అంతేకాకుండా స్ఖలించేటప్పుడు చాలా తక్కువ మొత్తంలో మాత్రమే వీర్య బయటకు వస్తుంది. స్ఖలించేటప్పుడు నొప్పి వస్తుంది. ఈ లక్షణం వీర్యగ్రంధి ( ప్రోస్టేట్) క్యాన్సర్ ప్రారంభదశలో కనపడుతుంది.

8) ఎముకలు మరియు అవయవాల్లో ఎక్కువగా నొప్పులు రావడం :

8) ఎముకలు మరియు అవయవాల్లో ఎక్కువగా నొప్పులు రావడం :

ఈ లక్షణం గనుక మీరు గమనించినట్లయితే వీర్యగ్రంధి ( ప్రోస్టేట్) క్యాన్సర్ ఎముకలకు కూడా వ్యాపించింది అని అర్ధం. వీర్యగ్రంధి ( ప్రోస్టేట్) క్యాన్సర్ వ్యాధిగ్రస్థుల్లో ఇది ఒక ప్రధానమైన లక్షణం.

English summary

Prostate Cancer Symptoms In Men

Symptoms of prostate cancer range from urinary frequency, urgency, etc. Read to know the main symptoms of prostate cancer.
Desktop Bottom Promotion