For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో ఎర్రమాంసం మరియు పాల ఉత్పత్తులకి దూరంగా ఉండండని నిపుణులు సూచిస్తున్నారు

చలికాలంలో ఎర్రమాంసం మరియు పాల ఉత్పత్తులకి దూరంగా ఉండండని నిపుణులు సూచిస్తున్నారు..

|

చలి మెల్లగా తరుముకొస్తోంది మరియు వాతావరణం కూడా వణుకు పుట్టిస్తోంది. ఉష్ణోగ్రత హఠాత్తుగా పడిపోవడం వలన వేసవి వేడి తప్పక తగ్గి మీకు ఉపశమనం లభిస్తుంది. అదే సమయంలో మీ ఉన్ని దుస్తుల అందాలన్నీ చూపే అవకాశం దొరుకుతుంది.

ఇది ఒక కారణమైతే చలికాలం వస్తున్నప్పుడు శరీర శ్రద్ధ కూడా ముఖ్యమే. ఏం తింటున్నారో జాగ్రత్తగా తినాలి ఎందుకంటే ఈ రుతువులో కొన్ని పదార్థాలు తినటం ఆరోగ్యానికి హానికరం కావచ్చు.

మరోవైపు కొన్ని పదార్థాలను ఆహారంలో జత చేసి తినటం వలన మీ శరీరం వెచ్చబడి చలికాలంలో ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటుంది.

red meat side effects

నిపుణులు ఏమంటున్నారు?

98ఎఫ్ ఐటి స్థాపకుడు భవిష్య వధ్వాన్ మరియు న్యూట్రిషనిష్ట్ మరియు జీవనవిధాన ఎడ్యుకేటర్ నేహ రంగ్లానీల అభిప్రాయం ప్రకారం చలికాలంలో పాలు మరియు ఎర్రని మాంసం తినటం చాలా తగ్గిస్తే మంచిదని సూచిస్తున్నారు. నిపుణుల ప్రకారం, పాల వల్ల కఫం వస్తుంది లేదా ఉన్న కఫాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. దీని వల్ల గొంతులో గరగర మరియు అసౌకర్యంగా ఉంటుంది.

red meat side effects

అదనంగా, చలికాలంలో రెడ్ మీట్ కూడా అస్సలు తినవద్దు. ఇందులో ఉండే అధిక ప్రొటీన్లు మీ గొంతులో మ్యూకస్ పెంచుతాయి. ప్రాసెస్ చేసిన మాంసం మరియు అధిక కొవ్వు ఉన్న మాంసం తినకూడదు. కానీ కొవ్వులేకుండా కేవలం ప్రొటీన్లుండే చేపలలో మరియు అలాంటి మాంసం సురక్షితమైనవి.

అదేసమయంలో, చలికాలంలో తినదగ్గ మేటి ఆహార పదార్థాలను తెలుసుకోండి.

1. అల్లం

1. అల్లం

అల్లంలో ముఖ్యమైన పదార్థం జింజరాల్ ఉంటుంది, ఇది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. అదనంగా అల్లంలో వాపును తగ్గించే, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి ఎలాంటి వాపునైనా, నొప్పినుంచైనా ఉపశమనం కల్పిస్తాయి. ఎటువంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా కూడా చేస్తుంది.

మీరు చేయాల్సిందల్లా చిన్న అల్లం ముక్కను తీసుకొని చెక్కు తీసేసి నీళ్లలో మరిగించండి. 5 నిమిషాలు మరిగాక, నీరును వడగట్టి రోజుకి 2-3 సార్లు తాగి మంచి ఫలితాలు పొందండి.

2. పసుపు

2. పసుపు

పసుపు కేవలం వంటల్లో వాడే దినుసు మాత్రమే కాదు, ఆరోగ్యానికి అనేక లాభాలు ఉన్నాయి. ఇన్ని లాభాలు ఉండటం వలన పసుపును ఆయుర్వేదంలో అనేక వ్యాధులను చికిత్స చేయడానికి వాడతారు. పసుపు వాపులను తగ్గించే లక్షణాలు కూడా ఉండటం కాబట్టి పసుపును మీ ఆహారంలో రెగ్యులర్ గా వాడండి.

3. నట్’స్

3. నట్’స్

నట్లలో అధికంగా ఉండే ఒమేగా -3 -కొవ్వు పదార్థాలను మంచి కొవ్వుగా భావిస్తారు. అందులో రోగనిరోధక శక్తిని బలంగా మార్చే మరియు గాయాలను త్వరగా తగ్గించే ముఖ్యమైన అమినో యాసిడ్ కూడా కలిగి ఉంటుంది.

4. తులసి (బేసిల్);

4. తులసి (బేసిల్);

తులసిని చాలా పవిత్రమైన మొక్కగా పూజిస్తారు. ఇందులో బ్యాక్టీరియా వ్యతిరేక, వైరస్ వ్యతిరేక లక్షణాలుంటాయి.ఇది మన రోగనిరోధక శక్తిని ధృఢపరిచి అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కొన్ని తులసి ఆకులు తీసుకుని, శుభ్రంగా కడిగి నమలండి. బాగా ఉపయోగం.

5. తేనె

5. తేనె

చలికాలంలో పనికొచ్చే మరో సహజ పదార్థం తేనె. ఒక చెంచా తేనెను ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే మీ గొంతునొప్పికి ఉపశమనం లభిస్తుంది. పైగా ఇలా తాగటం వలన పేరుకుపోయిన కఫాన్ని కరిగించి బయటకి తెస్తుంది కూడా.

(ఏజెన్సీ వార్తాకథనం)

English summary

Avoid Red Meat & Dairy Products In Winters, Suggests Experts

Experts opine that it is highly important to reduce the intake of milk and red meat during the winter season.Milk causes phlegm and can lead to the thickening of phlegm already present. Red meat contains strong protein but this at the same time can cause a build-up of mucus in your throat.
Desktop Bottom Promotion