For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలేరియా కేసులను తగ్గించటానికి ఈ మొక్కను తీసేయండి ; అధ్యయనం

మలేరియా కేసులను తగ్గించటానికి ఈ మొక్కను తీసేయండి ; అధ్యయనం

By Deepthi
|

దోమలు ఎక్కువుండే ప్రదేశంలో ఈ అడవిమొక్కను పెకలించి వేయటం వల్ల దోమల జనాభా 60 శాతం తగ్గి, మలేరియా కేసులు తగ్గిపోవచ్చని ఈ ఇటీవలి అధ్యయనంలో తేలింది.

దోమలు తమకి కావాల్సిన శక్తిని ప్రోసోపిస్ జూలిఫ్లోరా అనే పువ్వుల ( శాస్త్రీయ నామం ఇది; విలాయతి బాబుల్ లేదా జంగ్లీ కికార్ అని కూడా అంటారు) పుప్పొడి నుండి వచ్చే చక్కెర పదార్థాలనుండి తీసుకుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ అధ్యయనంలో, పరిశోధకులు ఈ మొక్క ప్రభావాన్ని తెలుసుకున్నారు. మెక్సికోలో పండే ఈ మొక్క విపరీతంగా పెరిగిపోయి ప్రపంచంలోనే అనవసరమైన మొక్కగా మారి మలేరియా పెంచుతోంది.

parkinsons

హెబ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు గుంథర్ ముల్లర్ మాట్లాడుతూ, " మా ఫలితాలు ఈ చెట్టును తీసేయటం వల్ల ప్రపంచంలో దోమల జనాభా ఎంత తగ్గుతుందో తెలుపుతాయి. అది కూడా మలేరియాని వ్యాప్తిచేసే ఆడ ఎనాఫిలిస్ దోమలు." అని అన్నారు.

" దీని ప్రకారం ఆ పువ్వులను తీసేయటం వల్ల ఎక్కువ మలేరియా వ్యాప్తి చెందే ప్రదేశాలను తక్కువ వ్యాప్తి చెందే ప్రదేశాలుగా మార్చేయచ్చు," అని జతచేసారు.

మలేరియా జర్నల్ లో ప్రచురితమైన ఈ దలితాలు, మాలిలోని గ్రామాల్లో ఈ ప్రోసోపిస్ జూలిఫ్లోరా పువ్వులు తీసేసాక వలల్లో దొరికిన చచ్చిన దోమల సంఖ్య సరాసరి 11 నుంచి 4.5 ఆడదోమల్లో, 6 నుంచి 0.7 మగదోమలుగా ఉన్నట్లు తేలింది.

ఈ గ్రామాల్లో మొత్తంగా పువ్వులు తీసేసాక చనిపోయిన దోమల సంఖ్య 60 శాతం వరకు ఉన్నది.

parkinsons

పువ్వులు తీసేసాక, అపాయకర ఆడదోమల జనాభా, అసలు ఆ మొక్కల్లేని గ్రామాల్లోని దోమల జనాభా అంత పడిపోయింది అని పరిశోధకులు తెలిపారు.

మియామి యూనివర్సిటీకి చెందిన జాన్ బీయెర్ మాట్లాడుతూ, "గ్రామాల్లో ప్రొసోపిస్ జూలిఫ్లోరా ఉండటం, ఉండకపోవటం దోమల జనాభాపై చాలా ప్రభావం చూపిస్తుంది, వాటి జాతి పునరుత్పత్తి, వాటి పుప్పొడి చక్కెరలు తినే స్థాయి, వయస్సు వంటి అనేక విషయాలపై దీని ప్రభావం ఉంటుంది," అని వివరించారు.

With Inputs From IANS

English summary

Remove Wild Shrub To Cut Down Malaria Cases: Study

Removing the flowers of an invasive wild shrub from mosquito-prone areas may decrease the vector population by nearly 60 per cent, helping in reducing malaria cases, a recent study said.
Desktop Bottom Promotion