For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ నూనెతో మీ పొట్టపై మసాజ్ చేయడం ద్వారా కొన్ని వారాలలోనే బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు!

|

సరైన శరీర సౌష్టవం చక్కటి ఆరోగ్యానికి నిదర్శనం. చక్కటి దేహం కలిగిన వారు ఎటువంటి దుస్తులనైనా ధరించగలుగుతారు.

మ్యాగజైన్ ఓపెన్ చేయగానే అందులో వివిధ ప్రకటనలలో కనిపించే మోడల్స్ శరీరాకృతి మనల్ని కూడా మన శరీరాకృతిపై దృష్టిపెట్టమని పరోక్షంగా గుర్తుచేస్తుంది. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనలో చాలా మంది 6 ప్యాక్ అబ్స్, ఫ్లాట్ బెల్లీలకు ఆకర్షితులవుతారు. మోడల్స్ శరీరాకృతితో మన శరీరాకృతిని పోల్చుకుని మనం కొంచెం నిరాశ చెందడం సహజమే.

మానసిక సౌందర్యాన్ని మించిన సౌందర్యం లేదన్న విషయం వాస్తవమే. అయితే, మనకి అందుబాటులో ఉన్న వాటితో శరీరాకృతిని చక్కగా మరల్చుకోవడం తప్పేమీ కాదు. శరీరసౌష్టవాన్ని కాపాడుకుంటే మన అప్పీయరెన్సు కంటికి ఇంపుగా ఉంటుంది.

నిజానికి, ఈ రోజులలో చాలా మంది తమ శరీరాకృతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అందువలన, అధికమైన బరువు సమస్య నుంచి తమను తాము కాపాడుకుంటున్నారు.

బెల్లీ ఫ్యాట్ ను కరిగించే చిట్కాలు

మన శరీరాన్ని మనం ప్రేమించాలి. వేరే వారిలా కనిపించాలని ప్రయత్నించి మన శరీరాన్ని హింసించుకుని డిప్రెషన్ కు లోనవకూడదు. అదే సమయంలో ఆరోగ్యంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలి. శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగించడానికి తగిన ప్రయత్నాలు చేయాలి.

అధిక బరువు కలిగి ఉండటమనేది ఒక వ్యక్తి యొక్క కాన్ఫిడెన్స్ లెవల్స్ పై దుష్ప్రభావం కలిగిస్తుంది. ప్రత్యేకించి బెల్లీ ఫ్యాట్ కలిగిన వ్యక్తులలో ఆత్మవిశ్వాస లోపం ఎక్కువగా కనిపిస్తుంది. అందరూ తమ పొట్టను చూసి తమను గేలి చేస్తారనే భావనలో వారుంటారు.

మన బెల్లీలో అనేకమైన మృదువైన టిష్యూలుంటాయి. వీటిలోని కొవ్వు చాలా సులభంగా పేరుకుని ఉంటుంది. అందుకే, బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడం కొంచెం కష్టతరం.

ఎంతో మంది ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ తో పాటు సెలెబ్రిటీలు కూడా బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకునేందుకు ఎంతో కష్టపడడం మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి వారికే బెల్లీ ఫ్యాట్ ను కరిగించడం కష్టమైనప్పుడు సామాన్యులకు బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడమనేది కొంచెం అసాధ్యంగానే కనిపిస్తుంది. అసాధ్యంగా కనిపించినా ఇది అసాధ్యం కాదు. అంకితభావంతో ప్రయత్నిస్తే బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం సాధ్యపడుతుంది.

ఇటీవలి గణాంకాల ప్రకారం, పురుషులతో పోలిస్తే మహిళలలో బెల్లీ ఫ్యాట్ అనేది సర్వసాధారణం. హార్మోనల్ సమస్యల వలన మహిళలలో బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు కలిగిన పురుషులలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. 45 సంవత్సరాలు దాటిన పురుషులలో బెల్లీ ఫ్యాట్ సహజం.

శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. బెల్లీలో పేరుకుపోయిన అధిక కొవ్వు కూడా అనారోగ్యకరమే.

ఒబెసిటీ, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, వెన్ను నొప్పి, మోకాలి కీళ్ల నొప్పి, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు ప్రధాన కారణమవుతుంది.

ఇటీవలి పరిశోధన అధ్యయనం ప్రకారం పొట్ట చుట్టూ పేర్కొనబడిన కొవ్వుని కొబ్బరినూనెను పొట్టపై మర్దనా చేయడం ద్వారా తగ్గించుకోవచ్చని తెలుస్తోంది. ఇలా ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం...

బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకునే చిట్కాలు

కొబ్బరి నూనెకు బెల్లీ ఫ్యాట్ తగ్గుదలకు మధ్య గల సంబంధం

ఇండియా వంటి దేశాలలో కొబ్బరి నూనెను ఎక్కువగా వంటలలో వాడతారు. ఈ విషయం అందరికీ తెలిసినదే.

వంట ప్రయోజనాలతో పాటు కొబ్బరి నూనెను చర్మ సౌందర్యానికి అలాగే శిరోజాల సంరక్షణకు వాడతారు. అందుకే దీనిని సహజసిద్ధమైన బ్యూటీ ప్రోడక్ట్ గా పేర్కొంటారు.

అంతే కాకుండా, భారతీయ వైద్య వ్యవస్థ అయిన ఆయుర్వేదంలో కొబ్బరినూనెకున్న స్థానం ప్రత్యేకమైనది. ఆయుర్వేదంలో కొబ్బరినూనెను అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారించడానికి వాడతారు. సోరియాసిస్, అధిక కొలెస్ట్రాల్, కీళ్ల నొప్పులు, గుండె జబ్బుల వంటి వాటిని నయం చేయడానికి కొబ్బరినూనె ఉపయోగపడుతుంది.

కాబట్టి, కొబ్బరినూనెలో అనేకరకాలైన ఆరోగ్యప్రయోజనాలున్నాయన్న విషయం స్పష్టమైంది.

ఇటీవలి పరిశోధన అధ్యయనం ప్రకారం కొబ్బరి నూనెను ప్రతి రోజూ పొట్ట చుట్టూ దాదాపు 30 నిమిషాల వరకు రబ్ చేయడం ద్వారా పొట్ట చుట్టూ పేర్కొన్న కొవ్వును కరిగించవచ్చని తెలుస్తోంది.

కొబ్బరి నూనెలో విటమిన్ ఇ తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కొబ్బరినూనె , పొట్టలోని చర్మరంధ్రాల ద్వారా చర్మంలోకి ఇంకిపోయి ఫ్యాట్ లేయర్స్ లో ప్రవేశించి ఫ్యాట్ సెల్స్ ను చాలా వేగవంతంగా కరిగిస్తుంది.

అయితే, కేవలం కొబ్బరినూనెను పొట్టపై రబ్ చేయడం ద్వారా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించాలని ఆశించవద్దు. కొబ్బరినూనె చిట్కాతో పాటు మీరు ఆహారనియమాలను పాటించాలి. తగిన వ్యాయామం చేయాలి. వీటి కాంబినేషన్లో బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం సాధ్యపడుతుంది.

ప్రతిరోజూ కనీసం గంటపాటు వ్యాయామం చేయాలి. కార్డియో మరియు అబ్డోమినల్ వ్యాయామంపై దృష్టి పెట్టాలి. కొవ్వు పదార్థాలు తక్కువగా కలిగిన ఆహారపదార్థాలను అలాగే ప్రోటీన్ తో పాటు ఫైబర్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.

కొబ్బరినూనెను పొట్టపై అప్లై చేసే విధానం:

3 లేదా 4 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను వేడి చేయాలి.

ఈ నూనెను మీ పొట్టపై మృదువుగా అప్లై చేయండి.

దాదాపు 20 నుంచి 30 నిమిషాల వరకు కొబ్బరినూనెతో మీ పొట్టను మసాజ్ చేయండి.

కనీసం మూడువారాలపాటు ప్రతిరోజూ ఈ పద్దతిని పాటిస్తే మీకు ఆశించిన ఫలితాలు అందుతాయి.

English summary

Rubbing Coconut Oil On Tummy Can Reduce Belly Fat

Belly fat can make a person look unfit, as well pose as a serious threat to his/her health. Losing belly fat can be very hard and many people get frustrated with trying! Here is a common oil which can help reduce belly fat within weeks!
Story first published:Monday, December 11, 2017, 11:54 [IST]
Desktop Bottom Promotion