For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుండె సమస్యలకు సంబంధించి 9 అనూహ్య లక్షణాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు

గుండె సమస్యలకు సంబంధించి 9 అనూహ్య లక్షణాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు ...

By R Vishnu Vardhan Reddy
|

" గుండెకు సంబంధించిన వ్యాధులను ఓడించండి, గుండె ను ఆరోగ్యవంతంగా ఉంచుకోండి " అని ఒక ప్రఖ్యాత గాంచిన నానుడి ఉంది.

పైన చెప్పబడిన నానుడిని చాలా మంది అంగీకరిస్తారు. ఎందుకంటే శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో గుండె కూడా ఒకటి. మనకు తెలిసి తెలిసి గుండెను ప్రమాదంలోకి నెట్టివేయకూడదు.

అయితే మనలో చాలామంది ఎన్నో రకాల జీవన విధానాలకు అలవాటు చేసుకొని ఉన్నారు. ఇలాంటి ఆధునిక జీవన పద్దతిని అలవాటు చేసుకోవడం ద్వారా మనంతట మనమే గుండెను ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాం. దీంతో ఎన్నో రకాల గుండె సంబంధిత వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయి.

heart disease symptoms

ఒక్క క్షణం అలోచించి గతాన్ని గనుక గుర్తుచేసుకుంటే, ఎప్పుడో ఒకసారి మన జీవితంలో ఖచ్చితంగా ఎవరో మనకు బాగా తెలిసిన వ్యక్తే గుండెపోటుతో మరణించాడు అనే వార్తను వినే ఉంటాం. ఇది నిజమే కదా ?

చాలా సందర్భాల్లో గుండె సంబంధిత వ్యాధుల వల్ల మనకు చాలా దగ్గర వ్యక్తులను కూడా కోల్పోవలసి వస్తుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు ఎంత భయంకరమైనవో మనకు తెలుసు. ఆరోగ్యవంతమైన గుండె గనుక లేకపోతె దాని యొక్క ప్రభావం మిగతా అవయవాల పై కూడా తీవ్రంగా ఉంటుంది.

గుండె సంబంధిత వ్యాధి యొక్క లక్షణాలు

ప్రాణవాయువుతో కూడిన రక్తాన్ని శరీరంలోని వివిధ అవయవాలకు గుండె ద్వారా పంపడం జరుగుతుంది. ఇందువల్ల మనశరీరంలో జరగవలసిన అన్ని కార్యాలు సజావుగా సాగిపోతూ ఉన్నాయి.

గుండె గనుక ఏదైనా వ్యాధి భారినపడితే అటువంటి సమయంలో శరీరంలోని మిగతా భాగాలకు అందవలసిన రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. దీంతో వివిధరకాల అవయవాలు పనితనం మందగించి చతికిలపడతాయి. మరణం ముంచుకు వస్తుంది.

ఆరోగ్యవంతమైన జీవన శైలిని పాటించడం ద్వారా మన గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, ఆ ఆహారంలో కార్బో హైడ్రాట్లు, విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, పీచు పదార్ధాలు మొదలగు అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి.

ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవర్చుకోవాలి. కార్డియో వాస్క్యూలర్ వ్యాయామాలు చేయడం ద్వారా గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. పొగ త్రాగటం, అధికంగా మద్యం సేవించడం, తీవ్రమైన ఒత్తిడికి లోనుకావడం, మాదక ద్రవ్యాలు సేవించడం మొదలగు చెడు అలవాట్ల వల్ల గుండెకు తీవ్రమైన హాని కలుగుతుంది. గుండెలో నొప్పి రావడం, తీవ్రమైన అలసట ఉండటం మొదలగు లక్షణాలు గుండె సంబంధించిన వ్యాధుల గురించి మనకు తెలియజేస్తాయి. వీటి ద్వారా మన గుండెకు ఏమైంది అనే విషయమై ఒక అంచనాకు రావొచ్చు.

అయితే అనూహ్యంగా ఎవ్వరు ఊహించని విధంగా గుండెకు సంబంధించిన సమస్యల యొక్క లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇలా చేయడం ద్వారా ముంచుకొచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టి అందుకు అనుగుణంగా నడుచుకొని తమను, తమ కుటుంబ సభ్యులను కాపాడుకొనే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వీటి గురించి ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం...

1. శృంగారంలో సరిగ్గా పాల్గొనకపోవడం:

1. శృంగారంలో సరిగ్గా పాల్గొనకపోవడం:

స్త్రీ పురుషులు ఎవరికైనా పడక గదిలో సమస్యలు గనుక తలెత్తితే అది చాలా అసహనం మరియు నిరాశాజనకంగా ఉంటుంది. సాధారణంగా పురుషుల్లో అంగస్తంభన జరగకపోవడం మరియు స్త్రీలలో స్తబ్ధత నెలకొని ఉండటం అనే లక్షణాలు వివిధ కారణాల వల్ల అయి ఉండవచ్చు. అయితే గుండెకు సంబంధించిన సమస్యల వల్ల కూడా ఈ లక్షణాలు తలెత్తే అవకాశం ఉంది. బలహీనమైన గుండె సరిపడినంత రక్తాన్ని రక్తప్రసరణ ద్వారా శృంగార సమయంలో జననాంగాలకు సరఫరా చేయకపోతే ఈ సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది.

2. విపరీతమైన రక్తపోటు :

2. విపరీతమైన రక్తపోటు :

విపరీతమైన రక్తపోటు లేదా తీవ్రమైన ఒత్తిడి వల్ల గుండెలో ఉండే ధమనుల్లో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది. దీని ఫలితంగా ఎన్నో వ్యతిరేక లక్షణాలు ఏర్పడతాయి. అధిక రక్తపోటు గుండె వ్యాధులకు సంబంధించిన లక్షణంగా చాలా మంది భావిస్తారు. అయితే ఇది ఇంకొకరకంగా కూడా అయి ఉండవచ్చు. గుండె యొక్క స్థితిని ముందుగా తెలియజేసే లక్షణంగా కూడా అధిక రక్తపోటు ఉపయోగపడుతుంది.

3. తరచూ దగ్గు వస్తుండటం :

3. తరచూ దగ్గు వస్తుండటం :

సాధారణంగా ఊపిరితిత్తుల్లో ఏర్పడే సమస్యల వల్ల లేదా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల దగ్గు అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది. దగ్గుకి, గుండె సంబంధిత సమస్యలకు సంబంధం ఉందని ఎవ్వరు ఊహించి ఉండరు. అయితే ఎప్పుడైతే ఊపిరితిత్తులకు అవసరమైనంత రక్తాన్ని గుండె పంపిణి చేయదో, అటువంటి సమయంలో బాగా ఎండిపోయినట్లు అయిపోయి విపరీతమైన దగ్గు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక లక్షణం.

4. ఊపిరి తీసుకోవడం లో ఇబ్బంది ఎదుర్కోవడం :

4. ఊపిరి తీసుకోవడం లో ఇబ్బంది ఎదుర్కోవడం :

మీరు గనుక ఊపిరి తీసుకోవడం లో తరచూ ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటే మరియు గుండెల్లో ఎదో తెలియని అవస్థ ఉందని మీరు గనుక భావిస్తూ ఉంటే అది ఊపిరి తీసుకొనే సమస్య మాత్రమే అయ్యి ఉండాల్సిన అవసరం లేదు లేదా గురకకు సంబంధించిన సమస్య అయి ఉండొచ్చని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఎప్పుడైతే ఊపిరితిత్తులకు అవసరమైన రక్తాన్ని గుండె పంపించదో అటువంటి సమయంలో ఈ లక్షణాలు ఏర్పడి గుండెకు సంబంధించిన వ్యాధులు ఏవో ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేస్తుంది.

5. శరీరం పై వెంట్రుకలు లేకపోవడం :

5. శరీరం పై వెంట్రుకలు లేకపోవడం :

ఈ లక్షణం వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ? అయితే చాలా మంది స్త్రీలు తమ శరీరం పై వెంట్రుకలు లేకుండా ఉంటే బాగున్ను అని అనుకుంటూ ఉంటారు. అయితే శరీరం పై సాధారణంగా కొద్ది పాటి వెంట్రుకలు ఉంటే మీరు సాధారణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారని అర్ధం మరియు ముఖ్యంగా పురుషుల్లో గనుక శరీరం పై వెంట్రుకలు అస్సలు లేకపోతే, అనూహ్యంగా గనుక కనుమరుగవుతూ ఉంటే, సరైన రక్త ప్రసరణ జరగడంలేదని అర్ధం. ఈ లక్షణం మీకు గుండెలో ఎదో సమస్య ఉందని తెలియజేస్తుంది.

6. కాళ్ళు వాచిపోవడం:

6. కాళ్ళు వాచిపోవడం:

కాళ్ళు మరియు అరికాళ్ళు చాలా సందర్భాల్లో బాగా వాచిపోతూ ఉంటాయి మరియు బరువు కూడా పెరిగిపోతూ ఉంటాము. గర్భం దాల్చినప్పుడు, అధిక రక్తపోటు మొదలగు వాటి వల్ల ఈ లక్షణాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కానీ, మీ గుండె లో ఎదో సమస్య ఉందని కూడా ఈ లక్షణం తెలియజేస్తుంది. ఎందుకంటే గుండె ఎప్పుడైతే అవసరమైనంత రక్తాన్ని కాళ్ళ భాగానికి పంపిణి చేయదో అటువంటి సమయం లో సిరలు అధిక ద్రవాన్ని కాళ్ళు మరియు అరికాళ్ళ ప్రాంతంలోకి పంపుతాయి. ఈ కారణంగా ఆప్రాంతాలు ఎక్కువగా వాస్తు ఉంటాయి.

7. మెడ నొప్పి :

7. మెడ నొప్పి :

సరైన పద్దతిలో పడుకోకపోవడం వల్లనో, పనిచేసేటపుడు అటు ఇటు ఎక్కువగా తిరగటం వల్ల కొద్దిగా బెణుకు ఏర్పడి మొదలగు వాటి వల్ల మెడ నోపి వచ్చి ఉంటుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే మెడ నొప్పి అలానే ఉన్నా, తరచూ వస్తూ ఉన్నా గుండెకు సంబంధించిన వ్యాధి ' ఆంజినా ' సోకింది అని అర్ధం. మెడ నొప్పి లక్షణం కూడా గుండె సంబంధిత వ్యాధి గురించి తెలియజేస్తుంది.

8. వాచిన చిగుర్లు :

8. వాచిన చిగుర్లు :

సరిగ్గా నోటిని శుభ్రం చేసుకోకపోవడం లేదా కావిటీస్ వల్ల చిగుర్లు వాచిపోయి ఉంటాయని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే, గుండెకు సంబంధించిన వ్యాధి ఉండటం వల్ల సరిగ్గా రక్తప్రసరణ జగకపోవడం వల్ల కూడా చిగుర్లు ఎర్ర బడే అవకాశం ఉంది.

9. వికారం :

9. వికారం :

సాధారణముగా జీర్ణక్రియ సమస్యల వల్ల వికారం ఎక్కువగా తలెత్తుతూ ఉంటుంది. అయితే, గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయి అని కూడా ఇది తెలియజేసే అవకాశం ఉంది. ఛాతీ మరియు పై పొట్ట భాగంలో ఎప్పుడైతే రక్త ప్రసరణ సరిగ్గా జరగదో అటువంటి సమయంలో ఆ వ్యక్తికి తీవ్రమైన వికారం కలిగే అవకాశం ఉంది.

English summary

Unexpected Signs Of Heart Troubles

The heart is one of the most important organs of the body and it is important to keep it disease free. Some of signs of heart ailments are very apparent, while some are not. Here are a few silent signs of heart troubles that you must know about to be more cautious and prepared when the calamity strikes.
Story first published:Friday, December 15, 2017, 17:22 [IST]
Desktop Bottom Promotion