For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైనస్ సమస్యకు సింపుల్ ఆయుర్వేదిక్ రెమెడీ...!!

దీర్ఘకాలిక సైనస్ ను నివారించడం కోసం సింపుల్ ఆయుర్వేదిక్ రెమెడీ ఒకటి ఉంది. ఇది స్వయంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు...మరి ఆ ఎఫెక్టివ్ రెమెడీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

By Lekhaka
|

తరచూ జలుబు, ముక్కు మూసుకుపోవడం వంటి లక్షణాలను మీరు ఎదుర్కుంటుంటారా?అవును, అన్నట్లైతే ఖచ్చితంగా మీరు సైనసైటిస్ తో బాధపడుతున్నట్లే. సైనసైటిస్ వంటి లక్షణాలను ఎఫెక్టివ్ గా నివారించడంలో ఆయుర్వేదిక్ రెమెడీ గొప్పగా సహాయపడుతుంది.

సైనసైటిస్ సమస్యాత్మకమైనది.బాధించే లక్షణాలు కలది.ఇవి దినచర్యలకు అంతరాయం కలిగిస్తుంటుంది. సైనసైటిస్ కు ముఖ్యమైన లక్షణాలు తలనొప్పి, ముక్కు దిబ్బడ, నాజల్ క్యావిటి, ముక్కులో నొప్పి, గొంతు నొప్పి, ముఖంలో వాపు, జ్వరం, అలసట, దగ్గు, ముక్కు కారడం, వాసన గ్రహించకపోవడం, రుచించకపోవడం మొదలగు లక్షణాలు కనబడుతాయి.

Simple Ayurvedic Remedy To Treat Sinusitis,

సైనసైటిస్ కు కారణాలు: వ్యాదినిరోధకత తగ్గడం, తరచూ జలుబుతో బాధపడుతుండటం, కొన్ని అనారోగ్యకరమైన ఆహారాల వల్ల , ఎక్కువ సమయం ఎసిలో కూర్చోవడం వల్ల, పొల్యూషన్ కారణం, దుమ్ము, దూళి కారణంగా సైనసైటిస్ వేదిస్తుంది.

నేచురల్ గా సైనస్ ను నివారించే 12 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!!


ఇటువంటి లక్షణాలను త్వరగా చికిత్స తీసుకోకపోవడం వల్ల దీర్ఘకాలంలో సైనసైటిస్ గా మారుతుంది. ఇటువంటి దీర్ఘకాలిక సైనస్ ను నివారించడం కోసం సింపుల్ ఆయుర్వేదిక్ రెమెడీ ఒకటి ఉంది. ఇది స్వయంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు...మరి ఆ ఎఫెక్టివ్ రెమెడీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

Simple Ayurvedic Remedy To Treat Sinusitis

కావల్సిన పదార్థాలు:

అల్లం రసం: 2 టేబుల్ స్పూన్లు

పెప్పర్ పౌడర్ : 1/2 టేబుల్ స్పూన్

తేనె : 1 టేబుల్ స్పూన్


ఈ కాంబినేషన్ తో తయారుచేసిన ఆయుర్వేదిక్ చిట్కాపురాతన కాలం నుండి బాగా ప్రాచుర్యం పొందినది. సైనస్ లక్షణాలను తగ్గించుకోవడానికి మన పూర్వీకులు ఈ కాంబినేసన్ చిట్కా రెగ్యులర్ గా అనుసరించడం వల్ల గొప్ప ఫలితాలను పొందేవారు.

Simple Ayurvedic Remedy To Treat Sinusitis

అదే విదంగా ఈ హోం రెమెడీనీ తీసుకునేటప్పుడు జలుబుకు కారణం అయ్యే రిఫైండ్ కోల్డ్ ఫుడ్స్, మరియు ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. అలాగే ఎక్కువగా ఎసికి, పొల్యూషన్ కు దూరంగా ఉండాలి.


ఇటువంటి పరిస్థితిలో మాత్రమే నాజల్ కంజెషన్ (ముక్కుదిబ్బడ) నుండి ఉపశమనం కలుగుతుంది.

Simple Ayurvedic Remedy To Treat Sinusitis

రెమెడీ తయారీ:

ఒక గ్లాసు నీటిలో పైన సూచించిన పదార్థాలన్నింటీ తీసుకోవాలి. అన్ని మొత్తంగా మిక్స్ చేయాలి.


ఇప్పుడు ఈ హాట్ వాటర్ ను ఒక కప్పులో తీసుకోవాలి. సైనసైటిస్ నివారణకు ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ రెమెడీ రెడీ.

సైనస్ ఇన్ఫెక్షన్ కు సహజ నివారణోపాయాలు


ఈ హోం రెమెడీని ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు తయారుచేసుకుని రోజు ఉదయం పరగడుపున, బ్రేక్ ఫాస్ట్ తర్వాత తీసుకోవాలి.


కనీసం ఒక నెలరోజులు ఈ చిట్కా ఫాలో అయితే, సైనస్ సమస్య తిరిగి రాదు.

English summary

Simple Ayurvedic Remedy To Treat Sinusitis

Here is how Ayurveda can help you treat sinusitis effectively!
Desktop Bottom Promotion