For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కూర్చుని ఎక్కువసేపు టీవీ చూడటం వల్ల ఈ సమస్య వస్తుంది..

|

దీర్ఘకాలంగా కూర్చోవడం వల్ల మీ జీవితంలో చైతన్యపరమైన సమస్యలకు అవకాశాలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు తెలియజేశారు.

మనం సుదీర్ఘ కాలం పాటు కూర్చుని టెలివిజన్ని చూడటం వల్ల నడకకు సంబంధించిన కష్టాలను మూడు రెట్లు పెంచుకోవడానికి ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది అని ఒక కొత్త అధ్యయనం తెలియజేసింది.

50 ఏళ్ల నుండి 71 సంవత్సరాల మధ్య సంవత్సరాల మధ్య ఆరోగ్యకరమైన వ్యక్తుల సమూహాన్ని 10 సంవత్సరాలుగా అధ్యయనం చేస్తూ, సుదీర్ఘంగా కూర్చోవటం అనేదానికి తక్కువ స్థాయి శారీరక శ్రమ తోడైనప్పుడు ఆ మనిషికి చాలా హానికరమైనదని కనుగొన్నారు.

effects of watching tv

ఎక్కువ సేపు కూర్చుంటున్నారా..?అయితే ముందుంది మొసళ్ళ పండగ..!

ఈ అధ్యయనంలో భాగంగా రోజుకు 5 (లేదా) అంతకన్నా ఎక్కువ గంటలు టీవీ చూసిన వారిని - రోజుకి 2 గంటల కన్నా తక్కువగా టీవీ చూసేవారితో పోలిస్తే వీరికి శారీరక శ్రమపరంగా 65% చైతన్యపరమైన వైకల్యం కలగటానికి ఎక్కువ హాని కలిగి ఉన్నవారిగా ఈ అధ్యయనం చివరిలో పేర్కొంది.

ఏదేమైనప్పటికీ, వారంలో 3 గంటలు లేదా తక్కువ శారీరక శ్రమను కలిగి ఉన్నవారు ఈ అధ్యయనం ముగిసే సమయానికి నడవడానికి వారు చాలా కష్ట పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

" ముఖ్యంగా వయో వృద్ధులు, సాయంత్రం వేళలో చాలాకాలం నుండి టీవీ ని ఎక్కువగా చూడటం వల్ల వారి ఆరోగ్య పరిస్థితి అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నదని " - వాషింగ్టన్, DC లోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుండి ఈ అధ్యయనం యొక్క ప్రధాన రచయిత అయిన ప్రొఫెసర్. "లారెట్టా డిపియెట్రో" అన్నారు.

రోజంతా ఏసీలలో కూర్చోవడం వల్ల చర్మానికి, జుట్టుకి కలిగే హాని..!రోజంతా ఏసీలలో కూర్చోవడం వల్ల చర్మానికి, జుట్టుకి కలిగే హాని..!

సోమరితనం కారణంగా మీ ఆరోగ్య విషయంలో దిగ్భ్రాంతిని కలిగించే సమస్యలను ఎదుర్కోవలసి ఉందని, పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ - యూకే (UK)నుండి ఈ అధ్యయనం గూర్చి ఒక ప్రకటన ఒక వారం తర్వాత విడుదల కాబోతుందని ప్రకటించింది.

6 మిలియన్లకు పైగా మధ్య-వయస్సు కలవారిలో, ఒక నెలలో 10-నిమిషాల నడకలో చురుకుగా పాల్గొనటంలో విఫలమయ్యారు. "మనం, వయస్సులో మన కండరాలను తక్కువగా ఉపయోగిస్తాము, దానివల్ల వారు పరిమాణంలోనూ - నాణ్యత పరంగా వారు అధ్వాన్నంగా మారతారు" అని బ్రిటీష్ సొసైటీ ఫర్ రీసెర్చ్ ఆన్ ఏజింగ్ కు ట్రస్తీగా ఉన్న, మరియు ఆస్టన్ యూనివర్సిటీ కి చెందిన 'డాక్టర్ జేమ్స్ బ్రౌన్' చెప్పారు.

English summary

Sitting & Watching Television For Long Can Cause This Problem

Sitting down for long periods increases your chances of mobility problems later in life, claim scientists. Know the details here on Boldsky.
Story first published:Wednesday, September 6, 2017, 11:12 [IST]
Desktop Bottom Promotion