For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొగత్రాగే వాళ్ళు జాగ్రత్త: ఈ భయంకరమైన జబ్బు భారిన పడే ప్రమాదం ఉంది

By R Vishnu Vardhan Reddy
|

పొగత్రాగటం ఆరోగ్యానికి హానికరం, అనే ఈ మాటను ఎన్నో సార్లు తరచుగా అందరూ వింటూనే ఉంటారు. ఈ మాట నిజమని తెలిసినా కూడా పొగత్రాగటాన్ని మానుకోవాలి అంటే కొంతమంది వ్యక్తులకు చాలా కష్టతరంగా ఉంటుంది. అయితే మీరు గనుక ఆరోగ్యంగా ఉండటానికి ఇష్టపడుతున్నట్లైతే పొగత్రాగటానికి దూరంగా ఉండటం చాలా మంచిది.

ఒక కొత్త అధ్యయనం ప్రకారం పొగ త్రాగటం వల్ల అది ప్రేగులకు తీవ్రమైన హాని కలగజేస్తుందట. అంతే కాకుండా పెద్దప్రేగు కూడా వ్యాధుల భారిన పడే అవకాశం ఉందని మరియు ఆ ప్రాంతంలో తీవ్రమైన మంటను విపరీతంగా పెంచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

సిగరెట్ మానేయాలనుకొనే వారికి అద్భుత చిట్కాలు సిగరెట్ మానేయాలనుకొనే వారికి అద్భుత చిట్కాలు

ఎలుకల పై సిగరెట్ పొగను ప్రయోగించగా, ప్రత్యేకమైన కొన్ని తెల్లరక్త కణాలు మరియు మంటను కలిగించే ప్రోటీన్లు వల్లనే పైన చెప్పబడిన స్థితి కి కారణం అవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు.

health

ఈ అధ్యయనం మంటను కలిగించే వివిధరకాల వ్యాధులు, క్రాన్ లాంటి వ్యాధులకు సంబంధించి కొత్త రకమైన చికిత్సను వృద్ధి చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతే కాకుండా పెద్దప్రేగుకి పొంచి ఉన్న ముప్పుని తెలియజేస్తూ ప్రజల్లో అవగాహనా కలిగించడానికి కూడా ఈ అధ్యయనం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇంతకముందు పరిశోధనలు ప్రకారం, పొగ త్రాగటం వల్ల విపరీతంగా మంటను కలిగించే క్రాన్ లాంటి వ్యాధుల భారినపడే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించడం జరిగింది.

అయితే సిగరెట్ పొగ జీర్ణశయాంతర వ్యవస్థ పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయం తెలియరాలేదు. ఒక అవకాశం ఏమిటంటే పొగత్రాగటం వల్ల, ఊపిరితిత్తుల్లో కలిగే మంట కలిగి అది ప్రేగుల పై తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.

" వాయునాళాలు మరియు ప్రేగు వ్యవస్థకు సంబంధించి చాలా విషయాల్లో ఒకే రకంగా ఉంటాయి " అని దక్షిణ కొరియా లోని క్యూన్గ్ హీ యూనివర్సిటీకి చెందిన హ్యుంసు భే చెప్పుకొచ్చారు. " ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సంప్రదాయబద్ధంగా ఉన్న కొరియా ఔషధాల్లో ఊపిరితిత్తులకు మరియు పెద్దప్రేగుకు సంబంధించి ఎదో ఒక సంబంధం ఉంది అనే విషయాన్ని ఎంతో కాలం ముందే కనుక్కోవడం జరిగింది " అని భే చెప్పుకొచ్చారు.

" క్రాన్ వ్యాధి, వాయునాళాలకు సంబంధించిన వ్యాధి భారినపడిన చాలా మంది వ్యక్తుల్లో వస్తుంది. అంతేకాకుండా ఊపిరితిత్తుల్లో కలిగే మంటకు, ప్రేగుల దగ్గర కలిగే మంటకు సంబంధం ఉంది " అని ఈయన చెప్పుకొచ్చాడు.వారానికి 6 రోజులు, రోజుకి 20 సిగరెట్ల చొప్పున కొన్ని వారాల పాటు సిగరెట్ పొగను ఎలుకల పై ప్రయోగించారు.

health

ఇలా చేసిన తర్వాత ఎలుకల ఊపిరితిత్తులు మరియు పెద్దప్రేగుల్లో మంట రావడాన్ని గమనించారు. సాధారణ గాలిని పీలుస్తున్న ఎలుకల కంటే కూడా సిగరెట్ పొగను పీలుస్తున్న ఎలుకల్లో ఊపిరితిత్తుల్లో మంట ఎక్కువగా ఉంది అని కనుగొన్నారు. అంతేకాకుండా పెద్దప్రేగుకు సంబంధించి, క్రాన్ వ్యాధి లక్షణాలకు దగ్గరగా ఉన్న ఒక వ్యాధి సోకినట్లు గుర్తించారు.

సిగరెట్ పొగను పీల్చిన ఎలుకల పెద్దప్రేగులో చీము మరియు మంట విపరీతంగా పెరిగిందని మరియు మలమూత్ర విసర్జనలో రక్తంపడుతుంది అనే విషయాన్ని కూడా పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా ఈ మంటని మరింత తీవ్రతరంచేసే ఒక రకమైన ప్రోటీన్లను కొన్ని తెల్లరక్తకణాలు విడుదల చేస్తున్నాయి అనే విషయాన్ని కనుగొన్నారు. ఆ ప్రోటీన్ పేరు ఇంటర్ఫెరాన్ గమ్మ.

ఆ ప్రత్యేకమైన తెల్లరక్తకణాలు తక్కువగా ఉండే ఎలుకలు మరియు ఇంటర్ఫెరాన్ గమ్మ అనే ప్రోటీన్ ను అస్సలు ఉత్పత్తి చేయని ఎలుకల పై పైన చెప్పబడిన ప్రయోగాన్ని చేసారు. ఈ రెండు సందర్భాల్లో ఆ ఎలుకలు సిగరెట్ పొగను పీలిచినప్పటికీ అవి పెద్ద ప్రేగుకు సంబంధించి ఎటువంటి వ్యాధి భారిన పడలేదు.

" సిగరెట్ త్రాగటం వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే కొన్ని ప్రత్యేకమైన తెల్లరక్తకణాలు క్రీయాశీలం అవుతాయి, అవి ఆ తర్వాత పెద్ద ప్రేగుకు చేరుతాయి. ఇందువల్ల మంట అనేది మొదలవుతుందని మా అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి " అని క్యూన్గ్ హి విశ్వవిద్యాలయానికి చెందిన జింగ్ కిమ్ చెప్పారు.

ఈ అధ్యయనం ఈ మధ్యనే ఒక ప్రముఖ వైద్య సంబంధిత పత్రికలో ప్రచురితమైంది.

పొగత్రాగటాన్ని పూర్తిగా మానివేయటానికి ఈ క్రింద కొన్ని నివారణ మార్గాలు తెలియజేయటం జరిగింది. వాటిని తెలుసుకొని పొగత్రాగేవాళ్ళు మానివేయడానికి ప్రయత్నించండి.

1. నీళ్లు :

1. నీళ్లు :

సాధారణంగా హానికరపదార్థాలను తొలగించడంలో నీళ్లు ఉత్తమమైనవి. సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు త్రాగటం వల్ల శరీరంలో ఉండే హానికరపదార్ధాలు బయటకు వెళ్లిపోతాయి. అంతే కాకుండా మీ వ్యసనం పై కూడా పోరాటం సాగించి, దానిని దూరం పెట్టడానికి సహాయపడుతుంది.

2. తేనె:

2. తేనె:

ప్రకృతిసిద్దమైన మార్గాల ద్వారా పొగత్రాగటాన్ని మానివేయాలనుకుంటే అందుకు తేనె కూడా ఎంతో ఉపయోగపడుతుంది. తేనె లో ఎన్నో రకాల పోషకాలు, ఎంజైములు మరియు ప్రోటీన్లు ఉంటాయి. ఇవి పొగత్రాగే అలవాటును మాన్పించటంలో దోహదపడతాయి. మీకు ఎప్పుడైతే పొగత్రాగలనే ఆలోచనమొదలవుతుందో, ఆ సమయంలో గోరు వెచ్చని నీటిలో తేనే వేసుకొని త్రాగండి. ఇలా చేయడం వల్ల మీరు పొగత్రాగటానికి దూరంగా ఉండవచ్చు.

3. లికోరైస్ వేరు :

3. లికోరైస్ వేరు :

సాధారణ పద్ధతుల్లో పొగత్రాగటాన్ని మానివేయాలనుకుంటే లికోరైస్ వేరు ద్వారా మానివేయడం కూడా ఒక ఉత్తమమైన మార్గం. మీకు ఎప్పుడైతే పొగత్రాగాలనిపిస్తుందో ఆ సమయంలో ఒక చిన్న లికోరైస్ వేరు ముక్కని తీసుకొని కొద్దిసేపు నమలండి. ఇలా చేయడం వల్ల మీరు పొగత్రాగటానికి దూరం కావడమే కాకుండా మీ జీర్ణ వ్యవస్థ కూడా ఎంతగానో మెరుగవుతుంది.

4. అల్లం:

4. అల్లం:

ఏ వ్యక్తులైతే పొగత్రాగటాన్ని మానివేస్తారో అలాంటి వ్యక్తులకు మొదట్లో కొద్దిగా వికారంగా మరియు వాంతులు లేదా కళ్ళు తిరిగే విధంగా ఉంటుంది. ఇలాంటి ఒక స్థితి నుండి బయటపడటానికి అల్లం ముక్కను తినండి లేదా అల్లం టీ ని త్రాగండి. ఇలా చేయడం వల్ల మీ కడుపులో జరిగే ప్రక్రియలు సాధారణ స్థితికి వస్తాయి మరియు వికారం కూడా తగ్గుతుంది. దీనికితోడు పొగత్రాగాలి అనే కోరికను నియంత్రించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

English summary

Beware Smokers! You Can Be At A Risk Of This Serious Disease

Smoking is injurious to health, you might have heard this popular saying and despite knowing the fact, quitting smoking for a few people becomes really tough. However, if you are to stay healthy then it is a must that one needs to keep away from smoking.
Desktop Bottom Promotion