For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వీట్స్ ను తినడం వల్ల జ్ఞాపక శక్తిని మనం కోల్పోతామా !

|

ఒక చమత్కారమైన వ్యాఖ్య ఇలా ఉంది -"నేను ప్రతిరోజూ కేకు తింటాను ఎందుకంటే ఈ రోజు ఇంకెవరిదో పుట్టిన రోజు కాబట్టి !"

మీరు పైన చెప్పిన వ్యాఖ్యతో సంబంధం కలిగి ఉన్న వారై ఉంటే, మీరు "తీపి వంటకాల" సమస్యలను కలిగి ఉన్నారు, ఎందుకంటే ఇది మీ రోజువారీ ఆహారంలో చక్కెర పదార్థాలను మరియు తీపి కోసం ఆరాటం పడేటట్లుగా చేస్తుంది. అప్పుడు మనము మరి కొన్ని చెడ్డ వార్తలను వినవచ్చు !

కొన్ని సంవత్సరాల పాటు నిర్వహించిన అనేక సర్వేల ప్రకారం, తీపి పదార్థాలను రోజు తినడానికి ఇష్టపడే ప్రజల సంఖ్య - తీపిని ఇష్టపడని వారి సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నది.

దీన్నిబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది తీపిని ఇష్టపడే అభిమానులు ఎంతమంది ఉన్నారో మీరే ఊహించుకోగలరు.

చాక్లెట్లు, సాంప్రదాయమైన స్వీట్లు, ఐస్ క్రీమ్, మిల్క్ షేక్స్, కుకీలు మొదలైనవంటివి నేడు అందుబాటులో ఉన్న తీపి ఆహార పదార్థాలు, మరియు ముఖ్యంగా, మనం బయటకు వెళ్లినప్పుడు ఆ రుచులను ఆస్వాదించాలన్న కోరికను అడ్డుకోవడం చాలా కష్టతరం అవుతుంది.

Can Consuming Sweets Increase The Risk Of Dementia As We Age?

భారత్ వంటి దేశాల్లో అనేక పండుగల వల్ల, ప్రతి రాష్ట్రం నుంచి ఉద్భవిస్తున్న స్వీట్లు అత్యధిక సంఖ్యలో చాలానే ఉన్నాయి. ఈ స్వీట్లను తినకుండా నివారించడమే మనకు నిత్యము ఉండే పనిగా మారుతోంది.

తీపిగా ఉన్నా (లేదా) పంచదారతో చేసిన స్వీట్లను ఎక్కువ మోతాదులో తినటం వలన మనకు మధుమేహం, డయాబెటిస్, జీర్ణ సమస్యలు, పంటి కావటీస్, మొదలైన వంటి ఆరోగ్య సమస్యల భారిన పడుతున్నాము, అవునా ?

ఏదేమైనప్పటికీ, మళ్లీ వయస్సులోనే జ్ఞాపక శక్తిని కోల్పోయేటువంటి అపాయకరమైన, ప్రమాదకరమైన వ్యాధులను అభివృద్ధి చేసే ప్రమాదం వ్యక్తులలో పెరుగుతుందని ఇటీవల పరిశోధనలో కనుగొనబడింది.

కాబట్టి, అధికమైన చక్కర పదార్థాలను వినియోగించడం వల్ల చిత్తవైకల్య ప్రమాదాన్ని ఎలా పెంచుతుందో ఈ వ్యాసంలో ఉంచబడినది, ఒకసారి మీరు చూడండి.

చిత్తవైకల్యమునకు, అధికరణ కలిగిన ఆహార పదార్థాలకు మధ్యగల సంబంధం :

మనము తప్పక వృద్ధాప్య స్థితికి వెళతామని తెలిసినప్పుడు, మనము మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం ఎంత ప్రయత్నించినసరే, వృద్ధాప్య సంకేతాలు ఎదురయినట్లుగానే, మనకు మరి కొన్ని ఆరోగ్య రుగ్మతలు కూడా తప్పనిసరిగా ఎదురవుతాయి.

Can Consuming Sweets Increase The Risk Of Dementia As We Age?

ఉదాహరణకు:- మనము ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించినప్పటికీ - నిర్దిష్టమైన మలివయస్సును, బూడిద రంగు జుట్టును, వయసు సంబంధింత అలసట వంటి మొదలైనవాటిని మనము నిరోధించలేము.

ఏది ఏమైనప్పటికీ, మనము మంచి వయస్సులో ఉన్నప్పుడు, మంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా వృద్ధాప్యంలో వచ్చే కొన్ని నిర్దిష్టమైన రుగ్మతలను - నివారించేవిగా ఉన్నాయి.

ఉదాహరణకి, మన జీవితంలో ప్రతినిత్యం సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుని, రోజువారీ వ్యాయామంతో ఆరోగ్యకరమైన బరువును క్రమంగా నిర్వహించడం వల్ల అధిక రక్తపోటు మరియు హృదయ వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయి.

Can Consuming Sweets Increase The Risk Of Dementia As We Age?

ఇప్పుడు మనము మలివయసులో ఉన్నప్పుడు, మెదడు మరియు శరీరంలోని ఇతర అవయవాల కణాలన్నీ ఒక్కొక్కటిగా క్షీణించి పోతాయి.

చిత్తవైకల్యము అనగా, ఒక వ్యక్తి యొక్క మెదడులోని కణాలు త్వరితగతిన క్షీణించడం వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనలు, జ్ఞానము, సామాజిక నైపుణ్యము వంటి ఇతర ఆలోచనా ప్రక్రియలను అడ్డుకుంటుంది.

ఈ వ్యాధి, - ఒక వ్యక్తి యొక్క సాధారణ జీవితాన్ని మరియు రోజువారీ కార్యకలాపాలను తీవ్రంగా అడ్డుకుంటుంది.


చిత్తవైకల్యము వల్ల జ్ఞాపక శక్తిని కోల్పోవటం, గందరగోళం, బ్రాంతి, నిరాశ, చిరాకు, సరిగ్గా మాట్లాడలేకపోవడం, మరియు అర్థం చేసుకోలేకపోవటం మొదలైన లక్షణాలను కలిగి ఉంటారు.

Can Consuming Sweets Increase The Risk Of Dementia As We Age?

ఇప్పుడు మీరు తీపి పదార్థాలను ఎక్కువగా తినటం వల్ల తరువాత వయసులో మీరు చిత్తవైకల్యం అనే ప్రమాదమునకు గురయ్యే అవకాశాలను పెంచుతుందని, - USA లోని, మేరీల్యాండ్లో గల, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది.


చెక్కెర కలిగిన ఆహార పదార్థాలలో కనిపించే ఎక్కువ గ్లూకోజ్ స్థాయిలు మీ మెదడులో క్రోడీకరించబడి ఉండటం వల్ల, అది మీ మెదడు లోని కణజాలమును క్రమక్రమంగా కోల్పోతుంది. ఆ కారణంగా మీ మలివయసులో చిత్తవైకల్యం వంటి ప్రమాదకరమైన వ్యాధులు ఏర్పడతాయని ఈ అధ్యయనం తెలిపింది.


ముగింపు :- అధిక మొత్తంలో స్వీట్లను మరియు పంచదార కలిగిన ఆహారాలను తినటంవల్ల, మీ మలివయసులో చిత్తవైకల్యం వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

English summary

Can Consuming Sweets Increase The Risk Of Dementia As We Age?

Can Consuming Sweets Increase The Risk Of Dementia As We Age?,Here is one of the major causes for dementia that we can avoid by reducing sugar intake when we are younger.
Desktop Bottom Promotion