For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మోకింగ్ తో పొంచి ఉన్న అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు

స్మోకింగ్ ఫ్యాషన్ అని ఒకరంటే... ఒత్తిడిని దూరం చేసే ఆయుధం అని మరొకరంటారు. ఐతే అంతకంటే అది ప్రాణాన్ని తీసే యమపాశం అనే సంగతి మాత్రం చాలామందికి తెలిసినా మర్చిపోయి ఊదేస్తుంటారు.

|

స్మోకింగ్ ఫ్యాషన్ అని ఒకరంటే... ఒత్తిడిని దూరం చేసే ఆయుధం అని మరొకరంటారు. ఐతే అంతకంటే అది ప్రాణాన్ని తీసే యమపాశం అనే సంగతి మాత్రం చాలామందికి తెలిసినా మర్చిపోయి ఊదేస్తుంటారు.

నోట్లో సిగరెట్ పెట్టుకుని.. గుప్పులు గుప్పులుగా పొగ వదలడాన్ని ట్రెండ్ అంటారు, స్టైల్ అంటారు. అంతేకాదు.. ఫ్యాషన్ అని కూడా చెబుతుంటారు. మరో ఆశ్చర్యకర విషయమేంటో తెలుసా ? స్మోకింగ్ అనారోగ్యమని తెలిసినా.. దీన్నో హ్యాబిట్ గా మార్చుకోవడం పరిపాటిగా మారింది. స్మోకింగ్ వల్ల క్యాన్సర్ మాత్రమే కాదు..8 రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

పొగాకు ఎందుకు విషతుల్యం ?
నికోటియానా టొబాకమ్‌ మొక్క నుంచి ఆకులను సేక రించి కూర్చి ఎండబెడతారు. దాదాపు 7,000 రసాయనాల మిశ్రమం. నికోటిన్‌ అతి ముఖ్యమైన ముడిపదార్థం. దీనివల్లే పొగాకుకు బానిసలవుతారు. దీనిలో 45 కేన్సర్‌ కారకాలు ఉన్నాయి. దాదాపు 400 విషపదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ ఆరో గ్యానికి నష్టం చేకూర్చేవే.

These Are The Dangerous Health Risks Associated with Smoking

పొగాకు రూపాలు
ధూమపానం రూపాలు: సిగరెట్‌, బీడీ, చుట్టా, సిగార్‌, హుక్కా, పైప్‌
ధూమపాన రహిత రూపాలు: గుట్కా, ఖైనీ, మనిపురి, పొగాకు, మిశ్రీ, పాన్‌ మసాలా

వీటిలో ఏఒక్క రూపంలో పొగాకు శరీరంలోకి చేరితే చాలు ఆరోగ్యానికి జరగరాని నష్టం జరిగిపోతుందని ఎన్నో అద్యయనాలు హెచ్చరిస్తున్నాయి. స్మోకింగ్ వల్ల క్యాన్సర్ రిస్క్ పెరగడమే కాదు.. సెక్స్ లైఫ్, ఇన్ఫెర్టిలిటీ వంటి రకరకాల సమస్యలు వస్తాయని తాజా అధ్యయనాల్లో గుర్తించారు. స్మోకింగ్ సైలెంట్ కిల్లర్ లా.. ఏడు రకాలుగా మీపై దుష్ర్పభావం చూపుతుందట. మరి స్మోకింగ్ వల్ల వచ్చే భయంకరమైన ఏడు రకాల అనారోగ్య సమస్యలేంటో చూద్దామా..

 ఊపిరితిత్తుల క్యాన్సర్ :

ఊపిరితిత్తుల క్యాన్సర్ :

స్మోక్ చేసే వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. పొగాకు తయారీలో చేర్చే అనేక రకాల రసాయనాలు లంగ్ క్యాన్సర్ కు దారితీస్తాయి. ఈ కెమికల్స్ ఊపిరితిత్తుల్లోని కణాలను నాశనం చేస్తాయి. దాంతో కొత్త కణాల ఏర్పాటు పూర్తిగా క్రుశించి పోతుంది. దాంతో క్యాన్సర్ కు దారితీస్తుంది.

హార్ట్ డిసీజ్ :

హార్ట్ డిసీజ్ :

రక్తనాళాల్లో నికోటిన్ చేరడం వల్ల గుండె సంబంధిత సమస్యలను ఎదురవుతాయి. నికోటిన్ రక్తంను గడ్డకట్టేలా చేస్తాయి. అంతే కాదు ఈ గడ్డ కట్టిన రక్తం రక్తంతో ప్రవహించి గుండెకు సంబంధించిన చిన్న రక్తనాళాలను బ్లాక్ చేస్తాయి. దాంతో హార్ట్ అటాక్ ను ఎదుర్కోవల్సి వస్తుంది. హైబ్లడ్ ప్రెజర్ కు కారణమవుతుంది.

వంధ్యత్వం:

వంధ్యత్వం:

పురుషుల్లో వంద్యత్వానికి కారణం స్మోకింగ్. సిగరెట్స్ లో నికోటిన్ తో పాటు అనేక రసాయనాల కలయిక వల్ల శీఘ్రస్కలన సమస్యలు , లైంగిక సమస్యలు, లైంగికాసక్తి తగ్గడం, వీర్యకణాలు నాణ్యత, వీర్య కణాల సంఖ్య తగ్గడంతో సంతానలోపం జరగుతుంది.

గర్భస్రావం:

గర్భస్రావం:

మహిళలు స్మోకింగ్ చేస్తే గర్భస్రావం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? కాదు, వారి పార్ట్నర్ స్మోకింగ్ చేసినా గర్భస్రావం జరుగుతుంది. స్మోకింగ్ చేసే మగవారిలో వీర్యకణాల నాణ్యత తగ్గతుంది. పిండంలో జన్యుసంబందమైన సమస్యలను వస్తాయి.

ప్రీమెచ్యుర్ ఏజింగ్ :

ప్రీమెచ్యుర్ ఏజింగ్ :

స్మోకింగ్ కారణంగా క్యాపిల్లరీస్ బ్లాక్ అవ్వడం వల్ల రక్తప్రసరణ చర్మానికి సరిగా జరగకపోవడం వల్ల స్కిన్ ఎలాసిటి, కొల్లాజెన్ డ్యామేజ్ అవుతుంది. దాంతో చర్మంలో ముడతలు, కళ్లవద్ద, పెదాల చుట్టూ ముడుతలు ఎక్కువ అవుతాయి. అంతే కాదు చర్మం నిర్జీవంగా మారుతుంది. స్కిన్ పిగ్మెంటేషన్, ముడుతలు, డార్క్ స్పాట్స్ , డ్రై స్కిన్ కారణంగా, చిన్న వయస్సులోనే వయస్సైన వారిలా కనబడుతారు.

ఓరల్ క్యాన్సర్:

ఓరల్ క్యాన్సర్:

స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ మాత్రమే కాదు, నోటి క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువగా స్మోక్ చేయడం వల్ల నోటిలోని చర్మ కణాల మీద తీవ్ర దుష్ప్రభావం కలిగి , శరీరంలోని కణాలల్లో కూడా క్రమంగా మార్పులు జరగుతుంది.

 స్ట్రోక్ :

స్ట్రోక్ :

సిగరెట్స్ లో ఉండే కెమికల్స్ రక్తంలో చేరడం వల్ల రక్తం గడ్డ కడుతుంది. ఈ గడ్డ కట్టిన రక్తం, రక్తప్రసరణ ద్వారా ప్రయాణించి బ్రెయిన్ కు సంబంధించిన చిన్న రక్తనాల్లోకి చేరి, అక్కడ రక్త ప్రసరణ తగ్గడం వల్ల మెదడ పనితీరు మందగిస్తుంది, ఫలితంగా స్ట్రోక్ కు గురిచేస్తుంది.

మాస్క్యులర్ డీజనరేషన్ :

మాస్క్యులర్ డీజనరేషన్ :

లంగ్స్, లివర్ మాత్రమే కాదు.. కంటిలోని నరాల వ్యవస్థను కూడా డ్యామేజ్ చేస్తుంది స్మోకింగ్. స్మోకింగ్ వల్ల కళ్లకు కూడా హాని కలుగుతుందని.. అనేక అధ్యయనాలు వెల్లడించాయి. స్మోకింగ్ వల్ల కళ్లు పొడిబారడం, గ్లూకోమా వంటి సమస్యలు ఎదురవుతాయి.ఆప్టిక్ నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల శాశ్వతంగా కంటి చూపును కోల్పోతారు.

English summary

These Are The Dangerous Health Risks Associated with Smoking

Can you believe that tobacco smoke carries more than fifty chemicals that are found to cause cancer? Tobacco can cause many health issues that range from minor headaches to serious conditions like cancer.
Story first published: Saturday, May 27, 2017, 13:38 [IST]
Desktop Bottom Promotion