For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెన్ను నొప్పిని నేచురల్ గా తగ్గించే చిట్కాలు

|

నొప్పి వచ్చే వరకూ తెలియదు.. మనకొక నడుము ఉందని! ఒకసారి నొప్పి మొదలైందంటే ఆ తర్వాత అది మనల్ని క్షణం కూడా మర్చిపోనివ్వదు. అనుక్షణం అదే కలత. కదిలితే బాధ. కదలకపోతే బాధ. నిటారుగా నిలవలేం. తీరుగా కూర్చోలేం. నాలుగు అడుగులు నడవలేం. కనీసం హాయిగా నిద్ర కూడా పోలేం. అదీ... నడుము నొప్పి అంటే!

దురదృష్టమేమంటే వెన్ను నొప్పి సమస్య ఇప్పుడు విపరీతంగా విస్తరించిపోతోంది. కుర్రకారు నుంచి వృద్ధుల వరకూ దాదాపు అందర్నీ భాధిస్తోంది. అదృష్టమేమంటే చాలాసార్లు ఈ నడుము నొప్పికి తీవ్రమైన జబ్బులు, వెన్ను లోపాలేం కారణం కాదు. ఇది చాలా వరకూ మన స్వయంకృతమే! ఈ మోడ్రన్ లైఫ్ స్టైల్లో మనం వెన్నును చాలా ఒత్తిళ్లపాలు చేస్తున్నాం. అస్సలు ఒంటికి వ్యాయామం లేకుండా గంటల తరబడి టీవీలూ, కంప్యూటర్ల ముందు కూర్చోవటం నుంచి నిరంతరం ఉరుకుల పరుగుల జీవనశైలి వరకూ.. ప్రతిదీ నడుము మీద తీవ్రమైన ఒత్తిడి పెంచేదే. ఇదే నేటి నొప్పులకు మూలం! కూర్చొనేటప్పుడు సరిగా కూర్చోకపోవడం, నిల్చున్నప్పుడు సరిగా నిలబడకపోవడం, వంగినప్పుడు ఎలా పడితే అలా వంగడం వల్ల వెన్ను దెబ్బ తింటుంది. ఇవి కూడా వెన్ను నొప్పిలో భాగాలే.

Tips To Treat Back Pain Naturally At Home

వెన్ను ఆరోగ్యంగా ఉంటే వెన్ను నొప్పి అనేది ఉండదు. అందుకు కూర్చొనే, పడుకొనే, నిల్చునే భంగిమలు సరిగా ఉండాలి. అప్పుడే కొన్ని వారాల్లోనే వెన్నునొప్పిని తగ్గించుకోవచ్చు. వెన్ను నొప్పి మెడ, లోయర్ బ్యాక్, హిప్స్ కూడా నొప్పికి గురి అవుతాయి. అసలు మొదటి నుండే ఈ వెన్ను నొప్పి రాకుండా చూసుకోవటం మరీ మంచిది. ఒకవేళ వెన్ను మొరాయిస్తుంటే వెంటనే గుర్తించి దాన్ని గాడిలోకి తెచ్చుకోవటం మరీ ముఖ్యం. ఈ రెంటికీ కూడా వ్యాయామం ఒకటే మార్గం! ఎంత బిజీగా ఉన్నా.. పనుల్లో ఎంత తల మునకలై పోయినా నిత్యం వెన్నును మరింత దృఢతరం చేసే కొన్ని తేలికపాటి వ్యాయామాలు చెయ్యాలి! అప్పుడే మన వెన్ను మనకు దన్నుగా నిలుస్తుంది. వెన్ను నొప్పి తగ్గించుకోవడానికి కొన్ని సింపుల్ చిట్కాలేంటో తెలుసుకుందాం..

1. బ్యాక్ ఎక్సర్ సైజ్ :

1. బ్యాక్ ఎక్సర్ సైజ్ :

వెన్నునొప్పికి తగ్గించుకోవడానికి ఇంట్లోనే వివిధ రకాల వ్యాయామాలు ప్రయత్నించవచ్చు. ఈ వ్యాయామాల ద్వారా వెన్ను నొప్పితో పాటు కండరాల పట్టివేత, ఆందోళన, కండరాల సలుపులు వంటి సమస్యలకు కూడా ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు.

వెన్ను నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగించే సింపుల్ టిప్స్ వెన్ను నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగించే సింపుల్ టిప్స్

2. ఏరోబిక్ వ్యాయామం:

2. ఏరోబిక్ వ్యాయామం:

వెన్ను నొప్పికి ఉపశమనం కలిగించడంలో ఏరోబిక్ ఎక్సర్ సైజ్ సహాయపడుతుంది. ఏరోబిక్ వ్యాయామం హార్ట్ రేటు పెంచుతుంది. ఈ రకమైన వ్యాయామాలు శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది.

3. మసాజ్ థెరఫీ:

3. మసాజ్ థెరఫీ:

మసాజ్ థెరఫీ చాలా ఎఫెక్టివ్ రెమెడీ. ఇది వెన్ను నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. మసాజ్ చేయించుకోవడం వల్ల వెన్ను నొప్పికి కారణమయ్యే కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది. వెన్ను నొప్పి, కండరాల నొప్పులకు డాక్టర్స్ సూచించే మందుల కంటే మసాజ్ థెరఫీ బెస్ట్ టిప్

4. మెడిటేషన్ :

4. మెడిటేషన్ :

మెడిటేషన్ తో కూడా వెన్ను నొప్పి తగ్గించుకోవచ్చు. మెడిటేషన్ క్రమం తప్పకుండా చేస్తుంటే తప్పక ఫలితం ఉంటుంది.

ఆయుర్వేదం ప్రకారం ఈ ఆహారాలు బ్యాక్ పెయిన్ వేగంగా తగ్గిస్తాయి.. ఆయుర్వేదం ప్రకారం ఈ ఆహారాలు బ్యాక్ పెయిన్ వేగంగా తగ్గిస్తాయి..

5. మంచి నిద్ర:

5. మంచి నిద్ర:

బ్యాక్ పెయిన్ తో బాధపడే వారు నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటారు. ఇది వెన్ను నొప్పికి మరింత దారితీస్తుంది. కాబట్టి, రోజూ కనీసం 7నుండి 8 గంటల నిద్రను పొందితే, తప్పకుండా వెన్ను నొప్పి తగ్గించుకోవచ్చు .

6. హాట్ అండ్ కోల్డ్ థెరఫీ:

6. హాట్ అండ్ కోల్డ్ థెరఫీ:

బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి హాట్ అండ్ కోల్డ్ థెరఫీలు గొప్పగా సహాయపడుతాయి. నొప్పి ఉన్న ప్రదేశంలో హాట్ అండ్ కోల్డ్ థెరఫీలను ప్రయత్నిస్తే తప్పకుండా నొప్పి తగ్గుతుంది. కండరాలు వదులై, వాపులు తగ్గడం వల్ల క్రమంగా వెన్ను నొప్పి కూడా తగ్గుతుంది

7. బాడీని స్ట్రెచ్ చేయడం:

7. బాడీని స్ట్రెచ్ చేయడం:

బ్యాక్ పెయిన్ తగ్గడానికి బాడీ స్ట్రెచ్చింగ్ కూడా సహాయపడుతుంది. శరీరాన్ని సాగతీత వల్ల టైట్ గా మారిన కండరాలు, కీళ్ళు , లోయర్ బ్యాక్ కండరాలు ఫ్రీ అవుతాయి. దాంతో బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. అయితే స్ట్రెచ్చింగ్ చేసేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

8. బెడ్ రెస్ట్ ను పరిమితం చేయాలి :

8. బెడ్ రెస్ట్ ను పరిమితం చేయాలి :

రోజుకు 8 గంటలు నిద్రపోయినా, రోజంతా చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. ఇలా ఉండటం వల్ల ఎంత పనినైనా ఉత్సాహంగా చేసుకోగలుగుతారు. దాంతో క్రమంగా నొప్పి తగ్గుతుంది.

వెన్ను నొప్పి పై అపోహాలు -వాస్తవాలు వెన్ను నొప్పి పై అపోహాలు -వాస్తవాలు

9. కూర్చొనే భంగిమ కరెక్ట్ గా ఉండాలి:

9. కూర్చొనే భంగిమ కరెక్ట్ గా ఉండాలి:

డైలీ యాక్టివిటీస్ తో పాటు, కూర్చొనే భంగిమ కూడా కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. కూర్చొనే భంగిమ సరిగా లేకపోతే, కండరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో వెన్ను మీద 50 శాతం ఒత్తిడి పెరిగి వెన్ను నొప్పికి దారితీస్తుంది.

10. మ్యాట్రస్(పరుపు)కొత్తది కొనాలి:

10. మ్యాట్రస్(పరుపు)కొత్తది కొనాలి:

రోజూ పడుకునే పరుపు చాలా సాఫ్ట్ గా ఉన్నట్లైతే బ్యాక్ పెయిన్ మరింత పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితే కనుకు ఎదురైతే మరో కొత్త మ్యాట్రస్ ను కొనడం మంచిది. వెన్ను నొప్పి తగ్గించుకోవడానికి ఇది ఒక సింపుల్ మార్గం .

11. కుషన్ కొనాలి:

11. కుషన్ కొనాలి:

మీరు ఆఫీస్ లోనో లేదా డ్రైవింగ్ చేయడానికి కార్లోనో లేదా ఇంట్లో సోఫాలోనో కూర్చొన్నప్పుడు వెన్నుకు సపోర్ట్ గా కుషన్స్ వాడినప్పుడు వెన్ను నొప్పిని సమస్య ఉండదు.

12. నిద్రించే సమయంలో

12. నిద్రించే సమయంలో

కూడా మంచి పొజీషన్ లో పడుకోవడం వల్ల వెన్ను నొప్పి తగ్గించుకోవచ్చు. నిద్రించే సమయంలో బ్యాడ్ పొజీషన్ వెన్ను నొప్పిని మరింత ఎక్కువ చేస్తుంది. బోర్లా(పొట్టమీద)పడుకోవడం వల్ల వెన్ను నొప్పి ఎక్కువ అవుతుంది.

English summary

Tips To Treat Back Pain Naturally At Home

Some of the top tips to treat back pain at home. Continue reading to know more on how to relieve back pain at home.
Desktop Bottom Promotion