For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెంతులు లేదా మెంతి ఆకు ఖచ్చితంగా తినడానికి గల 8 ఫర్ఫెక్ట్ రీజన్స్

పచ్చటి ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో ప్రధానమైనవి. సాధారణంగా వీటిని మనం మన దైనందిన ఆహారంలో చేరుస్తూనే వుంటాం. వ్యయం తక్కువ, వీటిలో పోషకాలు ఎక్కువ.

|

పచ్చటి ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో ప్రధానమైనవి. సాధారణంగా వీటిని మనం మన దైనందిన ఆహారంలో చేరుస్తూనే వుంటాం. వ్యయం తక్కువ, వీటిలో పోషకాలు ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల వారికైతే, కొన్ని కూరలు మరింత చవకగా లేదా ఉచితంగా కూడా లభిస్తూంటాయి. పెరటిలో పెంచటం తేలిక. విత్తనాలు చల్లిన కొద్ది రోజులలో మొక్కల ఆకులను మనం ఆహారంగా వాడుకోవచ్చు. ఇటువంటి ఆకుకూరలలో, మనకు ఎంతో మేలు చేసేవాటిలో మెంతికూర ఒకటి.

Top 8 Reasons Why You Should Eat Fenugreek (Kasuri Methi)

మెంతికూరలో అతి విలువైన పోషకాలు వుంటాయి. మనదేశంలో మెంతులకంటే కూడా మెంతికూరను అధికంగా ఆహారంలో ఉపయోగిస్తారు. మనం దీనిని ఒక ఔషధంగా కూడా పరిగణిస్తాము. మెంతులను సువాసనా ద్రవ్యంగా పోపుల పెట్టె మసాలా దినుసులలో ఒకటిగా ఉపయోగిస్తాము. ఇక పచ్చటి మెంతి కూర ఆకు ఎంతో రుచికరంగాను ఔషధ విలువలు చేకూర్చేదిగాను వుంటుంది. ఈ ఆకులను ఎండబెట్టి కూడా కొన్ని ఆహార పదార్ధాలలో వాడవచ్చు. ఎండిన ఆకులుసైతం ఎంతో మేలు చేస్తాయి. తాజా మెంతి కూర కొద్దిపాటి చేదు వుంటుంది. దీనిని కందిపప్పుతో ఉడికించి మెంతికూర పప్పుగా కూడా తయారు చేస్తారు. గోంగూర ఆకు ఉడికించే రీతిలోనే దీనిని కూడా ఉడికించవచ్చు. మెంతి పరోటాలు రుచికరంగా వుంటాయి. వండే విధానం బట్టి చేదు తగ్గుతుంది.

మెంతులలో కావలసినంత పీచు వుంటుంది. మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయిఅతి తక్కువ కేలరీలు. కనుక మంచి సువాసనగాను, ఆరోగ్యంగా బరువు తగ్గేటందుకు మెంతులను వాడుకోవచ్చు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు, చెడు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. వీటితో పాటు మరెన్నో ప్రయోజనాలున్నాయి. ఇటువంటి మెంతిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడానికి కొన్ని ఫర్ఫెక్ట్ రీజన్స్ ఈ క్రింది విధంగా ..

అనీమియా నివారిస్తుంది:

అనీమియా నివారిస్తుంది:

మంతుల్లో ఐరన్ కంటెంట్ అధికం. అలాగే పొటాషియం అనే మినిరల్ అధికంగా ఉంటం వల్ల ఇది బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. అనీమియా నివారిస్తుంది. మెంతులు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది.

నోటి దుర్వాసను పోగొడుతుంది:

నోటి దుర్వాసను పోగొడుతుంది:

ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుని, నీళ్ళలో వేసి వేడి చేయాలి. దీన్ని టీలాగా తయారుచేసి, రోజుకు ఒకసారి తాగితే చాలు మంచి ఫలితం ఉంటుంది. ఇది చెడు శ్వాసను నివారిస్తుంది. దంతక్షయం, చిగుళ్ళ సమస్యలను కూడా నివారిస్తుంది.

హార్ట్ డిసీజెస్ ను నివారిస్తుంది:

హార్ట్ డిసీజెస్ ను నివారిస్తుంది:

మెంతుల్లో గాలోక్టోమన్ నే కంటెంట్ , పొటాషియంలు అధికంగా ఉండటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఇంకా హార్ట్ కు సంబంధించిన సమస్యలను కూడా నివారిస్తుంది.

డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది:

డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది:

మెంతులు మరియు మెంతి ఆకుల్లో సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని గాలక్టోమన్ అని పిలుస్తారు. ఆ కాంపౌండ్ కంటెంట్ బ్లడ్ లోని షుగర్ ను గ్రహించడం నివారిస్తుంది. షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

జీర్ణ శక్తిని పెంచుతుంది:

జీర్ణ శక్తిని పెంచుతుంది:

మెంతిఆకుల్లో పైబర్ కంటెంట్, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటం వల్ల ఇది శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జీర్ణ సమస్యలను నివారిస్తుంది. మెంతి టీ తాగడం వల్ల అజీర్థి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

. బ్లడ్ ప్రెజర్ మెరుగుపడుతుంది:

. బ్లడ్ ప్రెజర్ మెరుగుపడుతుంది:

మెంతి , మెంతి ఆకులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది బ్లడ్ ప్రెజర్ ను మెయింటైన్ చేస్తుంది. ఒక టీస్పూన్ మెంతులు తీసుకుని, పౌడర్ చేసి, గోరువెచ్చని నీటితో మిక్స్ చేసి తాగాలిజ రెగ్యులర్ గా రోజుకు రెండు సార్లు తాగుతుంటే బ్లడ్ ప్రెజర్ అండర్ కంట్రోల్లో ఉంటుంది.

కోలన్ క్యాన్సర్ నివారిస్తుంది:

కోలన్ క్యాన్సర్ నివారిస్తుంది:

మెంతిలో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంలో టాక్సిన్ ను బయటకు ఫ్లష్ అవుట్ చేయడం వల్ల టాక్సిన్స్ తో పాటు, క్యాన్సర్ కణాలు కూడా ఫ్లష్ అవుట్ అవుతాయి.

యుటిఐ డిజార్డర్స్ :

యుటిఐ డిజార్డర్స్ :

యూరినరీ డిజార్డర్స్ లో బ్యాక్టీరియల్, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అధికం. మెంతి ఆకులను శుభ్రం చేసి, నీళ్ళలో వేసి మెత్తగా ఉడికించి వడగట్టి రోజూ ఉదయం పరగడపును తాగాలి. దాంతో యూటిఐ డిజార్డర్స్ ఎఫెక్టివ్ గా నివారించబడుతాయి.

English summary

Top 8 Reasons Why You Should Eat Fenugreek (Kasuri Methi)

The bitter taste of kasuri methi or fenugreek might not be palatable and most of us do not eat it for that reason. But this bitter tasting food has innumerable nutrients and plenty of health benefits. Once you get to know about the benefits of fenugreek for our health, you will never ignore this super food.
Story first published: Wednesday, February 22, 2017, 18:12 [IST]
Desktop Bottom Promotion