For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కంటికురుపు, కళ్ళవాపు ఎందుకొస్తుంది? ఖచ్చితమైన కారణాలు ఏంటి?

కంటికురుపు ఎందుకొస్తుంది? ఖచ్చితమైన కారణాలు ఏంటి?

|

మానవ శరీరంలో అతి సున్నితమైనవి కళ్లు. కనురెప్పపై గానీ, రెప్ప కింద గానీ చిన్నచిన్న కురుపులు వేసినప్పుడు ఎంతో ఇబ్బంది పడుతుంటాం.రెప్ప వాల్చలేం. సరిగ్గా నిద్రపోలేం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కొన్ని సందర్భాల్లో కళ్ళు ఒత్తిడికి గురి అవ్వడం, కళ్ళ వాపులు, అలర్జీలు, ఇన్ఫెక్షన్స్ సోకుతుంటాయి.

కళ్ళు వాపులు ఎందుకొస్తాయో తెలియదు కానీ, కొన్ని సందర్భాల్లో ఈ వాపును తగ్గించుకోవడం కూడా కష్టం. కనురెప్ప వాపు హాని చేయకపోయినా కొన్ని సందర్భాల్లో ప్రమాదం అవుతుంది.

కనురెప్పల మీద వచ్చే చిన్న చిన్న కురుపులు రెప్పమీద బరువుగా ఇబ్బందిపెడతాయి. బ్యాక్టీరియా చేరడంవల్ల గాని, కనురెప్పలమీదున్న తైలగ్రంధి నాళం మూత పడటం వల్లగాని కంటి కురుపులు వస్తాయి. కంటికురుపు, లేదా కనురెప్ప వాపు వస్తే వెంటనే ఇంట్లోని రెమెడీస్ ను ప్రయత్నించి కంటికురుపు , వాపును తగ్గించుకోవాలి.

 కంటికురుపు, కళ్ళవాపు ఎందుకొస్తుంది? ఖచ్చితమైన కారణాలు ఏంటి?

కళ్ళ చుట్టూ ఉన్న కంటి కణాజాలాల్లో నీరు చేయడం వల్ల కనురెప్పల్లో వాపు రావడం, ఇన్ఫెక్షన్ వల్ల కంటికురుపులు ఏర్పడుతాయి. కంటి కురుపు వల్ల కనురెప్ప వాపుల్లో నొప్పి ఉన్నా, లేకపోయినా, కనురెప్ప పైన, క్రింద ప్రభావం చూపుతుంది.

కళ్ళు ఇన్ఫెక్షన్ , కంటి గాయాలు, అలర్జీల వల్ల కళ్ళు వాపులకు గురి అవుతుంది. కొన్ని సందర్భాల్లో కంటి కురుపులు ప్రమాదకరం, ఇవి భవిష్యత్ లో రాబోయే కంటి సమస్యలను, సెల్యులైట్ సమస్యలను, కళ్ళకు సంబంధించిన హెర్పస్ వంటి అనారోగ్య లక్షణాలను సూచిస్తుంది.

కంటి పవర్ ను పెంచే టాప్ 20 ఫుడ్స్ కంటి పవర్ ను పెంచే టాప్ 20 ఫుడ్స్

కంటికురుపులు వచ్చినప్పుడు, కళ్ళు దురద, కళ్ళనుండి నీరు కారడం, కళ్ళు ఎర్రబడటం, కంటి చూపు తగ్గడం, కళ్ళు మసగ్గా అనిపించడం, కళ్ళు డ్రైగా మారడం, కళ్ళ నొప్పి వంటి లక్షణాలు కనబడుతాయి. కంటి కురుపులు, కళ్ళ వాపులకు వీటితో పాటు మరికొన్ని లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1. కంటి కురుపు లేదా కంటిరెప్ప అంచున సెగగడ్డ:

1. కంటి కురుపు లేదా కంటిరెప్ప అంచున సెగగడ్డ:

స్టే అనేది కనురెప్పకు వచ్చే ఒక రకమైన ఇన్ఫెక్షన్, ఈ ఇన్ఫెక్షన్ కనురెప్పల మీద ఉండే గ్రంధులలో వస్తుంది. కంటి గ్రంధులకు ఇన్ఫెక్షన్ సోకడం వల్ల కనురెప్ప పైన కురుపులాంటిది వస్తుంది లేదా కంటిరెప్ప అంచున సెగగడ్డలా వస్తుంది. ఈ లక్షణాలున్నప్పుడు కన్ను వాపు కనబడుతుంది.

2. కనురెప్పలోని గ్రంథి యొక్క తిత్తి వాపు:

2. కనురెప్పలోని గ్రంథి యొక్క తిత్తి వాపు:

ఇది ఇన్ఫెక్షన్ వలె కనబడుతుంది, కానీ ఇది కంటి కురుపు కాదు. కంటిరెప్ప అంచున ఉండే నూనె గ్రంథులు మూసుకుపోయినప్పుడు ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఈ కంటికురుపు సైజ్ కొద్దిగా పెద్దగా పెరుగుతుంది. ఈ వాపును వార్మ్ కంప్రెసర్ తో నివారించుకోవచ్చు.

కళ్ళు మంటలు, వాపు తగ్గించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!! కళ్ళు మంటలు, వాపు తగ్గించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!!

3. అలర్జీలు:

3. అలర్జీలు:

కను రెప్ప అంచున వాపు, దురద, ఎర్రగా ఉండటం, కళ్ళలో నీళ్ళు కారడం వంటి లక్షణాలు కళ్ళు అలర్జీని సూచిస్తాయి. దుమ్ము, కాలుష్యం మరియు కళ్ళ అలర్జీకి కారణమయ్యే ఇతర అంశాలు అలర్జిక్ రియాక్షన్ కు కారణమవుతుంది. కళ్ళు ఉబ్బడానికి ఇది ఒక పెద్ద కారణం.

4. అలసట:

4. అలసట:

అలసట లేదా నీరసం కళ్ళు ఉబ్బడానికి , లేదా వాపుకు కారణమవుతుంది. కనురెప్పలకు నీరు చేరడం వల్ల కనురెప్పలకు వాపు వస్తుంది.

5. ఏడిస్తే..

5. ఏడిస్తే..

ఏడవడం వల్ల కనురెప్పల లోపల రక్తనాళాలకు అంతరాయం కలగడం లేదా చీలిక వల్ల అక్కడ నీరు చేరి , రక్త ప్రసరణను పెంచుతుంది. దాంతో కనురెప్పలు వాస్తాయి.

6. కళ్ళ వాపుకు కాస్మోటిక్స్ కారణం

6. కళ్ళ వాపుకు కాస్మోటిక్స్ కారణం

సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించునప్పుడు, పొరపాటును కళ్ళలో చేరితే కళ్ళు మంటలు, కళ్ళలో నీళ్ళు కారడం , వాపుకు కారణం అవుతుంది.

కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 8 సులభ చిట్కాలుకళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 8 సులభ చిట్కాలు

7. కంటి కణజాలం:

7. కంటి కణజాలం:

కనురెప్పలోపల కణజాలంకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కంటి వాపు వస్తుంది. వాపుతో పాటు నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది. చిన్న గాయమైనా బ్యాక్టీరియా చేరి కంటి దురద, వాపుకు కారణమవుతుంది.

8. ఎండోక్రైన్ డిజార్డర్ :

8. ఎండోక్రైన్ డిజార్డర్ :

ఈ వ్యాధిని ఎండోక్రైన్ డిజార్డర్ అని అంటారు, ఇది ఓవరాక్టివ్ థైరాయిడ్ కారణంగా వస్తుంది. ఇది థైరాయిడ్ సెల్స్ విడుదల చేసే అనవసరమైన వాటితో కళ్ళ ఇన్ఫెక్షన్ వస్తుంది. వీటి వల్ల కళ్ళులో వాపులు వస్తాయి.

9. ఓకులర్ హెర్పస్:

9. ఓకులర్ హెర్పస్:

ఇది కంటి చుట్టూ వచ్చే హెర్పస్ ఇన్ఫెక్షన్. కళ్ళు పింక్ కలర్లోకి మారి, వాపు కనిపిస్తుంది. పిల్లలో చాలా సహజంగా వచ్చే ఇన్ఫెక్షన్.

10. కనురెప్పల శోధము:

10. కనురెప్పల శోధము:

కంటి రెప్ప అంచున ఉండే బ్యాక్టీరియా కారణంగా బెల్ఫర్టిస్ (కనురెప్పల శోధము)అని పిలుస్తారు. ఈ పరిస్థితిలో ఉన్న వారి కళ్ళు నూనె గ్రంథుల్లా కనబడుతాయి. అలాగే కనురెప్పల చుట్టూ, చుండ్రు వంటి పదార్థం ఏర్పడుతుంది.

11. కంటినాళాలు లేదా కన్నీటి నాళాలు బ్లాక్ అవ్వడం:

11. కంటినాళాలు లేదా కన్నీటి నాళాలు బ్లాక్ అవ్వడం:

టియర్ డక్ట్ (కన్నీటి నాళాలు) బ్లాక్ అయినప్పుడు, నొప్పి, వాపు వస్తుంది. ఈ పరిస్థితిలో కళ్ళు మూసుకుపోయి ఉండటం వల్ల కళ్ళు తెరవడం కూడా కష్టంగా మారుతుంది.

12. పింక్ ఐస్:

12. పింక్ ఐస్:

కళ్ళు పింక్ కలర్లో మారితే , అది ఇన్ఫ్లమేషన్ కు గురైనట్లు గుర్తించాలి. ఇది కంటి లోపల ఒక పల్చటి పొర, కణజాలాల ఇన్ఫెక్షన్ వల్ల కళ్ళ వాపులు వస్తాయి. కనురెప్పలకు వార్మ్ కంప్రెసర్ ను ఉపయోగిస్తే నొప్పి, వాపు తగ్గుతుంది

English summary

Top Causes Of Swollen Eyelids That You Need To Know About

Swelling of the eyelids is most commonly associated with eye irritation, excess tear production, redness of the eyelid, obstructed vision, red eyes and inflammation of the conjunctiva, eye discharge, eyelid dryness and pain.
Desktop Bottom Promotion