For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓస్టియోపోరోసిస్ అంటే ఏమిటి? ఓస్టియోపోరోసిస్ రిస్క్ ను తగ్గించే 8 సూపర్ ఫుడ్స్

. ఈ ఓస్టియోపోరోసిస్ వ్యాధిని అధిగమించడానికి అనేక మంచి ఆహార పదార్ధాలు ఉన్నాయి. ఓస్టియోపోరోసిస్ నిర్మూలనకు సరైన జీవన శైలి అలవాట్లను, తీసుకునే ఆహారాన్ని అనుసరిస్తే చాలు, మీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

By Lekhaka
|

ఓస్టియోపోరోసిస్ అంటే ఏమిటి? ఓస్టియోపోరోసిస్ కి అసలు అర్ధం “ఎముకలు బోలు” గా అవ్వడం. ఇది ఎముకలలో సామర్ధ్యం, సాంద్రత తగ్గడం వల్ల వచ్చే ఎముకల జబ్బు. ఎముకలు పెళుసుగా తయారయి దాని ఫలితంగా ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలలో కొంత వయసు మళ్ళిన తరువాత ఓస్టియోపోరోసిస్ అనేది రావడం చాలా సహజ౦. ఎముకల బలహీనత మనకు తెలీకుండా, క్రమంగా జరుగుతుంది, మొదట ఎముకలు విరిగే వరకు మీరు ఓస్టియోపోరోసిస్ తో బాధపడుతున్నారనే విషయం ఎప్పటికీ తెలియదు.

ఓస్టియోపోరోసిస్ అనే వ్యాధి పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో చాలా సాధారణంగా సంభవిస్తుంది, ఎందుకంటే స్త్రీల ఎముకలు పురుషుల ఎముకల కంటే చాలా బలహీనంగా ఉంటాయి. స్త్రీలలో ఎముకలను ఈస్త్రోజేన్ అనే హార్మోన్ సంరక్షిస్తుంది, ఇది ఎముకలు బలహీనానికి కారణమయ్యే మేనోపాస్ కి చేరినపుడు అది గణనీయంగా తగ్గుతుంది. స్త్రీ చాలా వరకు ఈ ఓస్టియోపోరోసిస్ ని అరికట్టడానికి మంచి ఆహారంతోపాటు మేనోపాస్ కి చేరుకోవడం లాగా ఓస్టియోపోరోసిస్ పెరిగే అవకాశం ఉంది.

Top Foods That Prevent Osteoporosis Risk

ప్రజలు ఓస్టియోపోరోసిస్ అనేది వయసు మీదపడడం వల్ల వస్తుందని అనుకుంటారు. నేడు ఈ వ్యాధిని ఎలా నిర్మూలించడం, కనుగొనడం, చికిత్స చేయడం అనేది చాలా తెలిసుకోవచ్చు. స్త్రీలు ఈ ఓస్టియోపోరోసిస్ సమస్యతో బాధపడుతుంటే దాని చికిత్సకు వివిధ రకాల సహజ చికిత్సలను ఉపయోగించవచ్చు. మీరు ఎముకలపై శ్రద్ధ చూపించడానికి చిన్నవారో, పెద్దవారో కానక్కరలేదు. ఈ ఓస్టియోపోరోసిస్ వ్యాధిని అధిగమించడానికి అనేక మంచి ఆహార పదార్ధాలు ఉన్నాయి. ఓస్టియోపోరోసిస్ నిర్మూలనకు సరైన జీవన శైలి అలవాట్లను, తీసుకునే ఆహారాన్ని అనుసరిస్తే చాలు, మీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బలమైన, దట్టమైన ఎముకల అభివృద్ధికి తగినంత కాల్షియం, విటమిన్ D అవసరం.

ప్రాణాంతకమైన ఈ ;వ్యాధి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన ఆహార పదార్ధాల గురించి చర్చిద్దాం.

చేపలు:

చేపలు:

సాల్మన్, మాకేరెల్, టున వంటి కొవ్వు కలిగిన చేపలు ఓస్టియోపోరోసిస్ కి మంచి ఆహరం. వీటిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది, వీటిని ప్రతిరోజూ తినటం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పెరుగు:

పెరుగు:

పెరుగులో అనిమల్ ప్రోటీన్, ఇతర న్యూట్రీషియన్స్ క్యాల్షియం, మెగ్నీషియం, మరియు విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఓస్టిరియోపోరోసిస్ మోనోపాజ్ లో వచ్చే సమస్య, కాబట్టి, మహిళలు తప్పని సరిగా పెరుగును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇది క్యాల్షియంను, విటమిన్స్ ను శరీరానికి అవసరమైనంత అందిస్తుంది.

పాలు :

పాలు :

ఓస్టియోపోరోసిస్ కి మంచి అత్యున్నత ఆహార పదార్ధాలు కాల్షియం అలాగే ప్రోటీన్ అధిక శాతం కలిగి ఉండి ప్రధాన పాత్రను పోషించే పాలు, పెరుగు, చీజ్ వంటి పాల పదార్ధాలు.జాతీయ ఆరోగ్య సంస్థ ప్రకారం (NHI) పెద్దవాళ్ళు రోజుకు 1000 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవాలి. 50 ఏళ్ళు పైబడిన స్త్రీలు, 70 ఏళ్ళు పైబడిన పురుషులు రోజుకు 1200 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవాలి.

గుడ్డు:

గుడ్డు:

గుడ్లలో కాల్షియం, విటమిన్ B6, B12, ఫోలేట్ అధికంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి గుడ్లు చాలా మంచివి, ఓస్టియోపోరోసిస్ నిర్మూలనకు సూచించే ఆహారపదార్ధాలలో ఇదొకటి.

క్యాబేజ్ :మీరు

క్యాబేజ్ :మీరు

ప్రతిరోజూ ఐదు రకాల ఆకుకూరలు తినాలి వాటిలో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలి. క్యాబేజ్ , కోల్లర్డ్స్, కాలే లో ప్రధానంగా కాల్షియం, ఫైబర్, విటమిన్స్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇది మీ పళ్ళను, ఎముకలను గట్టిపరచడానికి, ఓస్టియోపోరోసిస్ వల్ల వచ్చే మొత్తం ప్రమాదాలను తగ్గించడానికి సహాయపడుతుంది.

అరటి పండ్లు:

అరటి పండ్లు:

అరటి పండ్లను తినడం వల్ల శరీరం క్యాల్షియంను ఎక్కువగా గ్రహిస్తుంది. న్యూట్రీషియన్స్ ను ఎముకలకు ఆరోగ్యానికి సహాయపడుతాయి. విటమిన్స్, నేచురల్ ఆయిల్స్, జింక్, పొటాషియం, మరియు ఐరన్ లో ఎముకల ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

బీన్స్:

బీన్స్:

ఎండిన బీన్స్, బఠాణీలు, పప్పుధన్యాలు వంటి మొక్క పదార్ధాలు అద్భుతమైన ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, కాల్షియం కలిగి ఉండడం వల్ల ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి.

బాదం:

బాదం:

గింజలు, విత్తనాలు అనేక విధాలుగా మీ ఎముకలు ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తాయి. వాల్ నట్స్, ఫ్లాక్స్-విత్తనాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి. వేరుసెనగ, బాదం లో పొటాషియం ఉంటుంది, ఇది మూత్రంలో కాల్షియం లోపాన్ని తగ్గించి రక్షిస్తుంది.

English summary

Top Foods That Prevent Osteoporosis Risk

Now, age gracefully and prevent osteoporosis by including these amazing foods regularly in your diet. Read this article to find out about them.
Story first published: Tuesday, January 17, 2017, 8:11 [IST]
Desktop Bottom Promotion