For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : శరీరంలో క్యాల్షియం లోపం వల్ల వచ్చే అత్యంత ప్రమాదకర సమస్యలు

శరీరంలో క్యాల్షియం చాలా కీలకమైనది. ఎముకల ఆరోగ్యానికి అత్యంత అవసరమైనది క్యాల్షియం. ఎముకల ఆరోగ్యానికి మాత్రమే కాదు, కండరాలు, నరాల వ్యవస్థ పనితీరుకు కూడా ఇది చాలా అవసరం. అదే విధంగా శరీరంలో క్యాల్షియం లోప

|

శరీరంలో క్యాల్షియం చాలా కీలకమైనది. ఎముకల ఆరోగ్యానికి అత్యంత అవసరమైనది క్యాల్షియం. ఎముకల ఆరోగ్యానికి మాత్రమే కాదు, కండరాలు, నరాల వ్యవస్థ పనితీరుకు కూడా ఇది చాలా అవసరం. అదే విధంగా శరీరంలో క్యాల్షియం లోపిస్తే ఎముకలకు సంబంధించిన ఓస్టిరియోపోసిస్, లో బోన్ డెన్సిటి వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి.

Top Symptoms Of Calcium Deficiency In The Body

కొన్ని ప్రమాదకర కేసుల్లో, గుండె సంబంధిత వ్యాధులు, ఆర్థరైటిస్ వంటి ఆరోగ్య సమస్యలకు గురిచేస్తుంది. శరీరంలో క్యాల్షియం తక్కువైతే బోన్స్, దంతాలు చాలా వీక్ గా మారుతాయి. శరీరంలో క్యాల్షియం లోపించడం వల్ల శరీరం ఎముకల నుంచి ఇతర పోషకాలను గ్రహించడం వల్ల ఇతర అవయవాల్లో కూడా క్యాల్షియం లోపం ఏర్పడుతుంది.

క్యాల్షియంతో పాటు, ఇతర న్యూట్రీషియన్స్ ఎముకల ఆరోగ్యానికి , బలమైన కండరాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. ఇవి హానికర బ్యాక్టీరియాను శరీరంలోని భాగాలకు వ్యాప్తి చెందకుండా కవర్ చేస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్స్ ఏర్పడకుండా ఉంటాయి. వైద్యపరంగా రక్తంలో క్యాల్షియం చాలా తక్కువగా ఉండటం వల్ల శరీరంలో జీవక్రియలు సరిగా జరగవు.

సంవత్సరానికి కొన్ని వేల మంది క్యాల్షియం లోపంతో బాధపడుతున్నారు. చాలా వరకు ఎక్కువ మంది, చాలా పెద్ద సంఖ్యలో క్యాల్షియం సప్లిమెంట్ మీద ఆధారపడుతున్నారు. శరీరంలో క్యాల్షియం లోపం ఏర్పడితే కనిపించే లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలి. మరి అవేంటో చూద్దామా..

బోన్స్ వీక్ గా మారడం:

బోన్స్ వీక్ గా మారడం:

శరీరంలో క్యాల్షియం లోపం ఏర్పడిందంటే ఖచ్చితంగా ఎముకల మీద ప్రభావం చూపుతుంది. శరీరానికి అవసరమయ్యే మినిరల్స్ లో క్యాల్షియం ఒకటి. ఇది బోన్స్ బిల్డ్ చేయడానికి స్ట్రాంగ్ గా ఉంచడానికి సహాయపడుతుంది.

మజిల్ క్రాంప్స్, కండరాల నొప్పులు :

మజిల్ క్రాంప్స్, కండరాల నొప్పులు :

శరీరంలో క్యాల్షియం లోపిస్తే కండరాలు పట్టివేతకు గురి అవుతాయి. నాడీవ్యవస్థ మీద ప్రమభావం చూపుతుంది. నరాలు మరింత సెన్సిటివ్ గా మారుతాయి. ఇది మజిల్ క్రాంప్స్ కు దారితీస్తుంది. క్యాల్షియం లోపానికి ఇది ఒక ముఖ్య లక్షణం.

తరచూ జబ్బు పడటం:

తరచూ జబ్బు పడటం:

శరీరంలో ముఖ్యమైనటువంటి మినరల్ క్యాల్షియం లోపించడం వల్ల తరచూ జబ్బు పడుతుంటారు. ఇది ఇమ్యూన్ సిస్టమ్ ను వీక్ గా మార్చుతుంది. దాంతో వివిధ రకాల ఇన్ఫెక్షన్స్, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ , ఫంగస్, బ్యాక్టీరియా వంటి సమస్యలను దారితీస్తుంది. క్యాల్షియం లోపించడం ల్ల జలుబు, ఇతర ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతారు,.

దంతాలు బలహీనంగా మారడం:

దంతాలు బలహీనంగా మారడం:

క్యాల్షియం లోపం వల్ల దంతాల్లో కూడా క్యాల్షియం లోపంతో దంతాలు వీక్ గా మారుతాయి.

మెనుష్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలు :

మెనుష్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలు :

మహిళల్లో క్యాల్షియం లోపం వల్ల రుతుక్రమంలో హెచ్చుతగ్గులు ఏర్పడుతాయి. పీరియడ్స్ లో హెచ్చుతగ్గులు , దాంతో ఇతర హార్మోనల్ సమస్యలు ఎక్కువ అవుతాయి,క్యాల్షియం లోపానికి ఇది ఒక ముఖ్యమైన లక్షణం.

బరువులో హెచ్చుతగ్గులు:

బరువులో హెచ్చుతగ్గులు:

శరీంలో క్యాల్షియం లోపం వల్ల బరువు పెరగడంలో హెచ్చుతగ్గులు కనబడుతాయి. డైలీ డైట్ లో తీసుకుని క్యాల్షియం కంటెంట్ తప్పనిసరిగా ఉండేట్లు తీసుకోవాలి.మెటబాలిజంకు కావల్సిన క్యాల్షియం కంటెంట్ శరీరానికి అందినప్పుడే బరువు కంట్రోల్లో ఉంటుంది. మెటబాలిజం చురుగ్గా ఉండటం వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీని అందిస్తుంది.

నిద్రలేమి సమస్యలు :

నిద్రలేమి సమస్యలు :

శరీరంలో క్యాల్షియం లోపం వల్ల సహజంగా రిలాక్సేషన్ అందించే మెలటోనిన్ అనే కంటెంట్ తగ్గడం వల్ల నిద్ర సమస్యలు . కాబట్టి మెలటోనిన్ తగ్గకుండా మంచి నిద్రపొందాలంటే క్యాల్షియం కంటెంట్ పుష్కలంగా ఉండాలి.

అమ్మాయిల్లో :

అమ్మాయిల్లో :

అమ్మాయిల్లో క్యాల్షియం లోపం వల్ల యవ్వనారంభ దశ ఆలస్యం అవుతుంది. అలాగే రుతుసమస్యలు కూడా పెరుగుతాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యలు ఎదుర్కుంటారు. కాబట్టి, క్యాల్షియం లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

English summary

Top Symptoms Of Calcium Deficiency In The Body

Calcium is one of the most vital nutrients that is required by the body. It has been found that around 99% of calcium is stored in your teeth and bones, while the rest is found in muscles, blood and tissues.
Story first published: Monday, February 20, 2017, 13:27 [IST]
Desktop Bottom Promotion