For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసుపు టీ తాగితే వచ్చే లాభాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఇదే తాగుతారు!

ఆహారంలో ప‌సుపునకు ఎంతో ప్రాముఖ్యం ఎంతో ఉంది. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో అయితే ప‌సుపు అద్భుత ఔష‌ధం. ప‌సుపు స‌హ‌జ సిద్ద‌మైన యాంటీబ‌యాటిక్. ప‌సుపును సంస్కృతంలో హ‌రిద్రా అంటారు. పసుకు ఇంకా చాలా మారు పేర్లూ

By Y. Bharath Kumar Reddy
|
How To Prepare Turmeric Tea Which Has Miraculous Health Benefits

పసుపు మనదేశంలో ప్రతి ఇంట్లోని వంట గదిలో ఉంటుంది. మనం తినే ఆహారానికి వినియోగించే పదార్థం ఇది. ఇక మనదేశం అనే సుగంధాలకు నిలయం. పసుపు , కుంకుమ, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇలా ఎన్నో ఇక్కడ సులభంగా దొరుకుతాయి. ఇందులో పసుపునకు అధిక ప్రాధాన్యం ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం పశ్చిమ ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు దక్షిణ ఆసియా దేశాల్లో మొదట పసుపు ను కనుగొన్నారు. ఇందులో మనదేశంలో కూడా ఉంది. దీంతో పసుపులోని ఔషధ గుణాలు, దీని ప్రాముఖ్యం ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయాయి. ఇక మనదేశంలో పసుపును చాలా వాటికి వినియోగిస్తారు. హిందూసంప్రదాయంలో దీనికి ప్రాముఖ్యం చాలా ఉంది. పండుగల సమయంలో, శుభకార్యాలప్పుడు దీన్ని ఎక్కువగా వినియోగిస్తారు. ప‌సుపు ప‌విత్ర‌త‌కు చిహ్నం. అలాగే ఆహారంలో ప‌సుపు నకు ఎంతో ప్రాముఖ్యం ఎంతో ఉంది. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో అయితే ప‌సుపు అద్భుత ఔష‌ధం. ప‌సుపు స‌హ‌జ సిద్ద‌మైన యాంటీబ‌యాటిక్. ప‌సుపును సంస్కృతంలో హ‌రిద్రా అంటారు. పసుకు ఇంకా చాలా మారు పేర్లూ కూడా ఉన్నాయి. ప‌సుపున‌కు కేన్స‌ర్‌ని నిరోధించే గుణం కూడా ఉన్న‌ట్లు పలు పరిశోధనల్లో తేలింది. మరి ఇన్ని గుణాలున్న ఈ పసుపుతో టీ తయారు చేసుకుని తాగితే దానివల్ల వచ్చే ప్రయోజనాలు అమోఘం. ఆ టీని ఎలా తయారు చేయాలో చూద్దామా. అలాగే టీ తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా...

turmeric tea benefits

తయారీ విధానం

- రెండు కప్పుల నీటిని తీసుకోండి. ఆ నీటిని ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి వేడి చేయండి.
- ఒక పసుపు కొమ్ము తీసుకుని దాన్ని తురుమి ఆ మిశ్రమాన్ని నీటిలో వేయండి. - ఒక పసుపు కొమ్ము మీకు అందుబాటులో లేనట్లయితే, దాని బదులుగా పసుపు పొడిని ఉపయోగించవచ్చు.
- ఇక వేడి నీటిలో పసుపు వేసిన తర్వార గిన్నెపై మూత మూసి 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించండి.
- తర్వాత స్టవ్ ను బంద్ చేసి గిన్నెను దించండి. అందులోని నీటిని ఒక గ్లాస్ లోకి పోసుకోండి.
- అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె, చిటికెడు మిరియాల పొడి కలపండి. ఇక పసుపుతో తయారు చేసిన టీ రెడీ అయిపోయింది.
- ఇలా తయారు చేసుకునే మిశ్రమాన్ని (ద్రవాన్ని) రోజూ బ్రేక్ ఫాస్ట్ చేసే ముందు తాగుతూ ఉండండి.
- పసుపు టీ వల్ల వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఈ కింద ఇచ్చిన విధంగా చాలా వాటిని పసుపు టీ ఉపయోగపడుతుంది.

1. క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది

1. క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది

క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. దీని బారిన పడకుండా ఉండాలంటే నిత్యం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పసుపు టీ ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది.

ఇందులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు ఆమ్లజనకాలు క్యాన్సర్ ని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అందువల్ల రెగ్యులర్ గా పసుపు టీని తాగుతూ ఉండండి.

2. మతిమరుపు రాకుండా ఉంటుంది

2. మతిమరుపు రాకుండా ఉంటుంది

సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ అల్జీమర్స్ వ్యాధి వస్తుంటుంది. మెదడు పని చేసే సామర్థ్యం తగ్గినప్పుడు ఈ మతిమరుపు వస్తుంటుంది. అయితే పసుపులో ఉండే ఆమ్లజనకాలు మెదడు కణాల క్షీణతను తగ్గించడానికి పని చేస్తాయి. అలాగే మెదడులోని కణాలు ఉత్తేజంగా పని చేసేలా పసుపు టీ బాగా పని చేస్తుంది. మతిమరుపు రాకుండా ఉండాలంటే మీరు తప్పకుండా పసుపు టీ తాగుతూ ఉండండి.

3. కీళ్ల సంబంధిత వ్యాధుల నివారణకు

3. కీళ్ల సంబంధిత వ్యాధుల నివారణకు

కాస్త ఏజ్ ఎక్కువైతే సాధారణంగా కీళ్ల నొప్పులు వస్తుంటాయి. పసుపు టీలోని యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఈ నొప్పులు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. రోజూ పసుపు టీ తాగితే కీళ్ల నొప్పుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది.

4. రోగనిరోధకత పెరుగుతుంది

4. రోగనిరోధకత పెరుగుతుంది

ఈ టీలో ఉండే పసుపు, మిరియాలు, తేనెలు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మీ శరీరం వ్యాధులతో పోరాడటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

5. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది

5. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది

మీ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్స్ బయటకు పంపించే గుణాలు పసుపు టీ లో అధికంగా ఉంటాయి. కొలెస్ట్రాల్స్ వల్ల చాలా వరకు గుండె సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. అయితే పసుపు టీ కొలెస్ట్రాల్స్ ను తగ్గించి మీరు వ్యాధుల బారిన పడకుండా ఉండేలా చేస్తుంది. అందువల్ల రోజూ పసుపు టీ తాగుతూ ఉండండి.

6. యువెటిస్ కు మంచి పరిష్కారం

6. యువెటిస్ కు మంచి పరిష్కారం

కంటిలోని మధ్య పొర అయిన యువియా దురద లేదా వాపునకు గురికావడాన్ని యువెటిస్ అంటారు. యువియా అనేది చూపు స్పష్టతకు కారణమైన పొర. రెటీనాకు ఇది అత్యధిక రకాన్ని సరఫరా చేస్తుంది. పసుపు టీలో ఉండే గుణాలు మీరు యువెటిస్ బారిన పడకుండా కాపాడుతాయి.

7. ఇర్రిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ కు మంచి పరిష్కారం

7. ఇర్రిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ కు మంచి పరిష్కారం

చాలామందిని వేదించే సమస్య ఐబీఎస్ (ఇర్రిటేబుల్ బోవెల్ సిండ్రోమ్). మానసిక ఒత్తిళ్ల వల్ల ఇది ఎక్కువ అవుతూ ఉంటుంది. మలబద్ధకం, ఉబ్బరం, అతిసారం వంటి లక్షణాలు కనపడతాయి. పసుపు టీలో ఉండే ఆమ్లజనకాలు దీన్ని నివారించడానికి బాగా ఉపయోగపడతాయి.

8. డయాబెటిస్ కు ఇది బాగా ఉపయోగపడుతుంది

8. డయాబెటిస్ కు ఇది బాగా ఉపయోగపడుతుంది

ఇందులో ఉండే ఆమ్లజనకాలు మధుమేహం వ్యాధిని అదుపులో ఉంచేందుకు బాగా ఉపయోగపడతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచేందుకు కూడా పసుపు టీ బాగా సహాయపడుతుంది. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తీసుకోవడం చాలా మంచిది.

9. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది

9. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది

పసుపు టీ మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఆమ్లజనకాలు ఊపిరితిత్తులకు బాగా ఉపయోగపడతాయి. కార్బన్ డయాక్సైడ్ ను లంగ్స్ ఈజీగా ఫిల్టర్ చేసేందుకు పసుపు టీ ఉపయోగపడుతుంది.

10. వెయిట్ లాస్

10. వెయిట్ లాస్

వెయిట్ లాస్ కోసం పసుపు టీని తాగొచ్చు. రోజూ అల్పాహారం తీసుకునే ముందు పసుపు టీ తాగడం వల్ల అది మీ జీవక్రియపై ప్రభావం చూపుతుంది. అలాగే శరీరంలోని కొవ్వును కరిగించేందుకు కూడా పసుపు టీ బాగా పని చేస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలున్న పసుపు టీని మీరూ తాగండి. ఆరోగ్యంగా ఉండండి.

English summary

turmeric tea health benefits preparation methods

There is also a type of tea known as the turmeric tea, which has become popular throughout the world lately for its amazing health benefits. So, have a look at how turmeric tea is prepared and what are its health benefits here.
Story first published:Wednesday, November 15, 2017, 14:45 [IST]
Desktop Bottom Promotion