For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టి.వి ని శృతిమించి చూడటం వల్ల అనేక వ్యాధుల భారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని మీకు తెలుసా?

By R Vishnu Vardhan Reddy
|

చాలా మంది వ్యక్తులు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా టి.వి ముందు కూర్చొని రిమోట్ చేతిలో పట్టుకొని, గంటల తరబడి అలా చూస్తూనే ఉండిపోతారు. మనలో ఎంతమంది ఇలా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు ? సరే కారణం ఏదైనా కావొచ్చు మీరు కూడా అలాంటి వ్యక్తి అయితే గనుక తక్షణం ఆ అలవాటుని మానివేయండి. అలానే గనుక చేస్తున్నట్లైతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తి అవి అధికం అయ్యే ప్రమాదం ఉంది.

ఒక నూతన అధ్యయనం ప్రకారం టి.వి ని చాలాసేపు గనుక చూస్తున్నట్లైతే రక్తం గడ్డకట్టే అవకాశం రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

side-effects of watching television for long

సుదీర్ఘ సమయం టి.విని చూడటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తలెత్తే అవకాశం ఉందని ఇప్పటికే అధ్యయనాలు చెప్పాయి కానీ, కాళ్లల్లో, చేతుల్లో, పొత్తికడుపు మరియు ఊపిరితిత్తుల్లో ఉండే నరాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మొదటిసారి ఈ అధ్యయనం చెబుతోంది. దీనినే సిరలోని థ్రోమ్బోంబోలిజం అని అంటారు.

" టి.వి చూడటం అనే అలవాటు చెడ్డ అని కాదు కానీ, ఆలా ఎక్కువ సేపు టి.వి చూస్తున్న సమయంలో చాలామంది విపరీతమైన చిరుతిండ్లను తింటూ టి.వి ని చూస్తూ ఉంటారని" అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ఆచార్యుడు చెప్పాడు.

పరిశోధనలో భాగంగా 45 నుండి 65 సంవత్సరాల వయస్సు గల 15,158 వ్యక్తులను పరిశోధకులు పరీక్షించారు. అస్సలు లేదా ఎప్పుడో ఒక్కసారి టి.వి చూసేవారికంటే కూడా, తరచూ టి.వి చూసే వారిలో ఈ రక్తం గడ్డకట్టడం అనే సమస్య 1.7 రేట్లు ఎక్కువగా ఉందని గుర్తించారు.

side-effects of watching television for long

టి.వి ని అస్సలు చూడని లేదా ఎప్పుడో ఒక్కసారి చూసే వారికంటే కూడా, వ్యక్తులు ఎవరైతే కావాల్సినంత శారీరిక వ్యయం చేసి మరియు తరచూ టి.వి చూస్తారో అలాంటి వారిలో ఈ సమస్య 1.8% రేట్లు అధికంగా ఉందని గుర్తించడం జరిగింది. " మీకున్న సమయాన్ని అత్యుత్తమంగా ఎలా గడపవచ్చు మరియు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఎలా కొనసాగించవచ్చు అనే విషయమై ఆలోచించడం మంచిది " అని నిపుణులు చెబుతున్నారు.

" టి.వి ముందు ఒక థ్రెడ్ మిల్ లేదా కదలని బైకుని పెట్టుకొని టి.వి చూస్తూ వాటితో మీరు వ్యాయామం చేయండి లేదా టి.వి చూడటాన్ని వాయిదా వేసి ఓ అరగంట సేపు నడకకు వెళ్ళండి " అని నిపుణలు చెబుతున్నారు.

ప్రతి సంవత్సరం అమెరికాలో 3 లక్షల నుండి 6 లక్షల ప్రజలు ఈ వ్యాధి భారిన పడుతున్నారట. గుండెనొప్పి లేదా గుండెపోటు తరువాత నాళ సంబంధిత వ్యాధుల్లో ఈ రక్తం గడ్డ కట్టే వ్యాధే అధికంగా కనపడుతుందట. సాధారణంగా ఈ వ్యాధి 60 ఏళ్ళు పై బడిన వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుందట కానీ, ఏ వయస్సు వారికైనా వచ్చే అవకాశం ఉంది.

" టి.వి ని ఎక్కువసేపు చూడటాన్ని నియత్రించడమే కాకుండా ఈ వ్యాధి భారినపడకుండా ఉండటానికి శారీరికంగా ఎప్పుడు ఉత్సాహంగా ఉంటూ మరియు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకొని సరైన బరువుతో శరీరం ఉండటం చాలా ముఖ్యం " అని చెబుతున్నారు వైద్యులు.

ఈ సహజమైన చిట్కాల ద్వారా రక్తం గడ్డకట్ట కుండా అరికట్టవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

side-effects of watching television for long

1. అల్లం :

రక్తం గడ్డకట్టకుండా అరికట్టడంలో అల్లం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఒక దివ్య ఔషధంలా పనిచేసే అత్యుత్తమ సహజ సిద్దమైన వస్తువు. యాంటిఆక్సిడెంట్ మరియు కడుపు మంట విరుగుడికి సంబంధించి ఎన్నో ఔషధ గుణాలు అల్లంలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తం గడ్డకట్టకుండా నియంత్రిస్తాయి. అల్లం ని టీ లో వేసుకో వచ్చు లేదా మీరు తినే ఆహారంలో కూడా వేసుకోవచ్చు.

side-effects of watching television for long

2. దాల్చిన చెక్క :

రక్తం గడ్డకట్టడాన్ని అరికట్టడానికి మసాలాదినుసుల్లో అత్యుత్తమమైనది దాల్చిన చెక్క. రక్తం గడ్డ కట్టడాన్ని అరికట్టడమే కాకుండా, ఇంతకు మునుపు రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం గడ్డ కట్టి ఉంటే, వాటిని కరిగించడంలో కూడా దాల్చిన చెక్క కీలకపాత్ర పోషిస్తుంది. మీరు తీసుకొనే ఆహారంలో క్రమం తప్పకుండా దాల్చిన చెక్కను వినియోగించడం వల్ల రక్తం గడ్డకట్ట కుండా పూర్తిగా అరికట్టవచ్చు.

side-effects of watching television for long

3. పసుపు :

కడుపులో మంటకు విరుగుడుగా మరియు రక్తాన్ని పలుచన చేసే గుణాలు పసుపులో అధికముగా ఉంటాయి. మీరు తినే ఆహారంలో తరచూ పసుపుని వేసుకోవడం వల్ల మీ శరీరంలో రక్తం గడ్డకట్ట కుండా అరికట్టవచ్చు.

side-effects of watching television for long

4. పిప్పరమెంటు ( పుదీనా రకానికి చెందిన మూలిక ) :

పిప్పరమెంటు లో విటమిన్ కె అధికంగా లభిస్తుంది. ఇది శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తప్రసరణ బాగా జరగడానికి మరియు గుండె ఆరోగ్యంగా ఉండటానికి పిప్పరమెంటు ఎంతగానో ఉపయోగపడుతుంది.

English summary

Watching Too Much TV Can Increase The Risk of This Disease

A new study has warned that watching television for too long may double the chances of developing blood clots. Prolonged TV viewing has already been associated with heart disease, but this is the first study to look at blood clots in veins of the legs, arms, pelvis and lungs known as venous thromboembolism (VTE).
Story first published:Sunday, November 26, 2017, 10:22 [IST]
Desktop Bottom Promotion