For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ నాలుకను శుభ్రం చేసుకోకపోతే పొంచి ఉండే ప్రమాదాన్ని గుర్తించండి

|

నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది అంటారు. అదే విధంగా నోరూ..నాలుక మంచిగా ఉంటే ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. నోటిని శుభ్రం చేసుకోవడం ఎంత అవసరమో.. నాలుకను శుభ్రం చేసుకోవడం కూడా అంతే అవసరం. నాలుక శుభ్రంగా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. నోరు ఫ్రెష్ గా ఉండటం వల్ల ఆహారం రుచికరంగా ఉంటుంది.

నోటిని శుభ్రం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. బ్రష్ చేసుకోవడం, నోరు కడుక్కోవడం వల్ల క్యావిటీస్, చిగుళ్ల సమస్యలు రావని అందరికీ తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో నాలుకను శుభ్రం చేసుకోవడంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. చాలా సందర్భాల్లో పళ్లు క్లీన్ చేయడంలో చూపించే శ్రద్ధ నాలుక శుభ్రపరచడానికి చూపించరు.

దీనివల్ల.. చాలా సమస్యలు ఎదురవుతాయి. నాలుక శుభ్రంగా ఉంటే.. మాట్లాడటంలో క్లారిటీ ఉంటుంది, గొంతులో కిచ్ కిచ్ లాంటి సమస్యలుండవు. నాలుకను రెగ్యులర్ గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. దంతావదానం చేసేటప్పుడే నాలుకను కూడా క్లీన్ చేసుకుంటే మంచిది. ఓరల్ హెల్త్ పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుంది.

నాలుకను శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు పొంచి ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి, నోరు, దంతాలు, నాలుక ఆరోగ్యంగా ఉండేట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

గర్భణీలలో వ్యాధినిరోధకశక్తి చాలా తక్కువగా ఉంటుంది. వీరి నోట్లో బ్యాక్టీరియా చాలా త్వరగా ఏర్పడుతుంది. అలాగే నాలుక శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా ఏర్పడుతుంది. దాంతో నోటి దుర్వాసన వంటి చిన్న సమస్యల నుండి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. నాలుకను శుభ్రపరుచుకోవడానికి గంటలు గంటలు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు . 5 నిముషాలు వెచ్చిస్తే చాలు . టంగ్ క్లీనర్, టంగ్ బ్రెష్ తో నాలుకను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. నోరు శుభ్రపడుతుంది.

నోటిని, నాలుకను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురౌతాయో తెలుసుకుందాం...

1. హలిటోసిస్(నోటి దుర్వాసన )

1. హలిటోసిస్(నోటి దుర్వాసన )

నోటి దుర్వాసన అత్యంత ఇబ్బందికరమైన సమస్య. నోటి దుర్వాసనతో బాధపడేవారు రోజువారి నోటి శుభ్రతతో పాటు నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలి. నాలుకను రెగ్యులర్ గా శుభ్రం చేసుకోవడం వల్ల నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించుకోవచ్చు .

2.చిగుళ్ళ వ్యాధులు

2.చిగుళ్ళ వ్యాధులు

చిగుళ్ళను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే నాలుకకు సంబంధించిన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు . చిగుళ్ళ వ్యాధి, చిగుళ్ళ నుండి రక్త స్రావం , బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. నోటిని , నాలుకను సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల చిగుళ్ళ వాపు, చిగుళ్ళు ఎర్రగా మారడం, చిగుళ్ళ నుండి రక్త కారడం జరగుతుంది.

3. దంతాలు ఊడిపోవడం

3. దంతాలు ఊడిపోవడం

వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది? మంచి వయస్సులో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురైతే అంతకంటే ఇబ్బందికరమైన సమస్య మరొకటి ఉండదు. నోటిని, నాలుకను సరిగా శుభ్రం చేసుకోలేదంటే చిగుళ్ళు త్వరగా ఇన్ఫెక్షన్ కు గురి అవుతాయి. ఇది దంతాలు ఊడిపోయే ప్రమాధకర స్థితికి చేర్చుతాయి.

4. టేస్ట్ బడ్స్ డల్ గా మారుతాయి.

4. టేస్ట్ బడ్స్ డల్ గా మారుతాయి.

మనం రోజూ తినే ఆహారం రుచిగా ఉండాలంటే నాలుక మీద ఉండే టేస్ట్ బడ్స్ ఆరోగ్యంగా ఉండాలి. నాలుకను శుభ్రం చేసుకోకపోవడం వల్ల నాలుక మీద టేస్ట్ బడ్స్ నిర్జీవంగా మారుతాయి. టేస్ట్ బడ్స్ ను పాచి లేదా తెల్లని పదార్థంతో కవర్ చేయడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. నాలుక మీద డెడ్ స్కిన్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల టేస్ట్ బడ్స్ నిర్జీవంగా మారి రుచిని గ్రహించి సామర్థ్యాన్ని కోల్పోతాయి.

5. రంగు మారుతుంది:

5. రంగు మారుతుంది:

నాలుకు మీద తెల్లని ప్యాచ్ ను మీరు గమనించారా? గమనించినట్లైతే ఓరల్ కేర్ ను తీసుకోవాలి.నాలుక మీద ఇలా వైట్ ప్యాచ్ ఉంటే కనుక వెంటనే ఫంగల్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది.

6. ఈస్ట్ ఇన్ఫెక్షన్

6. ఈస్ట్ ఇన్ఫెక్షన్

రెగ్యులర్ గా, నాలుకను సరిగా క్లీన్ చేసుకోకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. వైద్య పరిభాషలో దీన్ని ఓరల్ థ్రస్ట్ అని పిలుస్తారు. రెగ్యులర్ గా నాలుకను శుభ్రం చేయకపోవడం వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది.

7. బ్లాక్ హైరీ టంగ్

7. బ్లాక్ హైరీ టంగ్

ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురౌవుతుందంటే, నాలుకను శుభ్రపరచుకోకపోయినప్పుడు. ఎక్కువ రోజుల నుండి నాలుకను శుభ్రపరుచుకోవడం లేదంటే నాలుక బ్లాక్ కలర్ లోకి మారుతుంది. నాలుక మీద హెయిర్ ఉండదు. కానీ చూడటానికి అటువంటి ఫీలింగ్ కలుగుతుంది.

8. అందాన్ని పాడు చేస్తుంది

8. అందాన్ని పాడు చేస్తుంది

ప్రస్తుత రోజుల్లో ఫ్యాషన్ ట్రెండ్ నడుస్తోంది. నాలుకను శుభ్రం చేసుకోకపోవడంతో నోటి దుర్వాసన, చిగుళ్ళ సమస్యలు నలుగురిలో నవ్వుల పాలు చేస్తుంది. మీ అందాని కంటే పరిశుభ్రత ముఖ్యం అని గుర్గించాలి. అందం అంటే భయట అలంకరణ మాత్రమే కాదు, శరీర అంతర్గత పరిశుభ్రత కూడా ముఖ్యమే.

English summary

What Happens When You Don't Clean Your Tongue?

Take a minute to think what happens when you don't clean your tongue regularly. Experts recommend to clean tongue while cleaning your teeth, to make your oral health complete.
Story first published:Tuesday, May 30, 2017, 12:24 [IST]
Desktop Bottom Promotion