For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తేనెలో ఊరించిన ఖర్జూరంలో సర్ ప్రైజ్ చేసే అద్భుత ప్రయోజనాలు..!

తేనెలో నానబెట్టిన ఎండు ఖర్జూరాలను పిల్లలు మరియు పెద్దలు ఇద్దరు కూడా తినవచ్చు. హానీలో డిప్ చేసిన ఎండు ఖర్జూరంను రోజూ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలతో పోరాడుతుంది. ఏవిధంగా తీసుకోవాలి?

|

ఖర్జూరం, తేనె ఒక అద్భుతమైన ట్రీట్ అనిచెప్పవచ్చు. ఎందుకంటే ఇది నోటికి రుచిని మాత్రమేకాదు, మన ఆరోగ్యానికి సంపూర్థ లాభాలను కూడా చేర్చుతుంది. ఈ బాదం, ఖర్జూరం, తేనెతో తయారుచేసే ఈ స్పెషల్ స్వీట్ బాల్స్ ఒక బలవర్థకరమైన ఆహారం. పిల్లలకు, పెద్దలకు ఒక మంచి పౌష్టికాహారం అని చెప్పవచ్చు. తక్షణ శక్తిని అంధించే ఒక మంచి ఈవెనింగ్ స్నాక్ గా కూడా పిలవచ్చు.

What Happens When You Eat Honey Soaked Dates Daily,

కేవలం స్నాక్ మాత్రమే కాదు, ఈ రెండింటి కాంబినేషన్ చాలా స్వీట్ గా ఉంటుంది. అంతే కాదు ఈ రెండింటిలో మెడిసినల్ గుణాలు అధికంగా ఉంటాయి. వీటిని అనేక ఆరోగ్య సమస్యలను నివారించుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ రెండు నేచురల్ పదార్థాలు ఇప్పటివి కాదు, పురాతన కాలం నుండి బాగా వాడుకలో ఉన్న పాపులర్ పదార్థాలు. ఈ రెండింటి కాంబినేషన్ లో అనేక న్యూట్రీషియనల్ బెనిఫిట్స్ దాగున్నాయి.

తేనెలో నానబెట్టిన ఎండు ఖర్జూరాలను పిల్లలు మరియు పెద్దలు ఇద్దరు కూడా తినవచ్చు. హానీలో డిప్ చేసిన ఎండు ఖర్జూరంను రోజూ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలతో పోరాడుతుంది. ఏవిధంగా తీసుకోవాలి? మూత గట్టిగా ఉన్న బాటిల్లో తేనె తీసుకుని, అందులో విత్తనాలు తొలగించిన ఎండు ఖర్జూరాల వేసి డిప్ చేయాలి. ఈ రెండూ బాగా మిక్స్ చేసి ఒక వారం రోజులు నానబెట్టాలి. తర్వాత దీన్ని రోజూ ఒక స్పూన్ నీటిలో మిక్స్ చేసి టీ రూపంలో తీసుకోవచ్చు. లేదా నేరుగా తినవచ్చు. ఈ రెండు కాంబినేషన్ తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

 దగ్గు నివారిస్తుంది:

దగ్గు నివారిస్తుంది:

తేనెలో ఉండే నేచురల్ గుణాలు దగ్గు నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. అందుకు చాలా వరకూ దగ్గు మందుల్లో తేనెను ఉపయోగిస్తుంటా. చాలా రోజుల నుండి యాంటీ వైరల్ , యాంటీబయోటిక్స్ తో దగ్గు తగ్గనప్పుడు రాత్రి నిద్రించడానికి అరగంట ముందు తేనెలో నానబెట్టి, ఖర్జూరంను ఒక టీస్పూన్ తినేసి పడుకోవాలి. ఇది గొంతులో బ్యాక్టీరియా నుండి ఉపశమనం కలిగిస్తుంది. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది.

నిద్రబాగా పడుతుంది:

నిద్రబాగా పడుతుంది:

కొంత మంది నిద్రలేమి సమస్యలు ఎదుర్కుంటుంటారు. అలాంటి వారిలో నిద్రలేమి సమస్యను దూరం చేయడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. అన్ హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల హార్మోనుల్లో అసమతుల్యతలు, మెటబాలిజం రేటు గగ్గడం వంటి లక్షణాలు కనబడుతాయి. కాబట్టి, నిద్రబాగా పట్టాలంటే నిద్రించడానికి అరగంట ముందు హానీ డేట్స్ తినడం వల్ల ఇన్సులిన్ కు కారణం అయ్యే సెరోటిన్ ఉప్పత్తి పెంచుతుంది. సెరోటిన్ సంతోషంగా ఉండటానికి..రిలాక్స్ ఉండటానికి సహాయపడుతుంది. తర్వాత సెరోటిన్ మెలటోనిన్ గా మార్పు చెంది, మంచి నిద్రకు ఉపక్రమింపచేస్తుంది.

గాయాలను మాన్పుతుంది

గాయాలను మాన్పుతుంది

తేనెలో యాంటీ బయోటిక్, యాంటీమైక్రోబయల్ గుణాలున్నాయి. అదే విధంగా ఎండుఖర్జూరంలో ఇమ్యూనిటిని పెంచే గుణాల ఉండటం వల్ల గాయాలు, బర్న్ ను తేలికగా మాన్పుతాయి. ఇన్ఫెక్షన్స్ కు గురి కాకుండా నివారిస్తాయి. ఎండుఖర్ఝూరంలో ఉండే ప్రోటీన్స్ త్వరగా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి గాయాలను మాన్పుతుంది

మెమరీ పవర్ పెంచుతుంది

మెమరీ పవర్ పెంచుతుంది

వయస్సైయ్యే కొద్ది మతిమరుపు సమస్యలకు అధికమవుతాయి. మతిమరుపు సమస్యలను నివారించుకుని, మెమెరీ పవర్ పెంచుకోవడానికి హనీ డేట్స్ గ్రేట్ ఆప్షన్,. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ బ్రెయిన్ లో సెల్యులార్ డ్యామేజ్ ను నివారిస్తుంది. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ను నివారిస్తుంది. మహిళలు రెగ్యులర్ గా తినడం వల్ల శరీరానికి కావల్సిన ఐరన్, క్యాల్షియం పుష్కలంగా అందుతుంది. మతిమరుపు నివారిస్తుంది.

అలర్జీలను నివారిస్తుంది

అలర్జీలను నివారిస్తుంది

తేనెలో డిప్ చేసిన ఖర్జూరాల్లో వ్యాధినిరోధకతను పెంచేగుణాలు అధికంగా ఉండటం వల్ల , సీజనల్ గా వచ్చే అలర్జీలను నివారిస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలోపల మరియు బయట ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

యాబెటిస్ ను మెరుగుపరుస్తుంది

యాబెటిస్ ను మెరుగుపరుస్తుంది

డయాబెటిక్ పేషంట్స్ కు ఎప్పుడూ స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఈ కోరికను హానీడేట్స్ తీర్చుతాయి. వీటిలో నేచురల్ షుగర్స్ ఉండటం వల్ల డయాబెటిస్ వారు కూడా తీసుకోవచ్చు. అయితే తేనెలో డిప్ చేయడం వల్ల మితంగా మాత్రమే తీసుకోవాలి. డయాబెటిస్ పేషంట్స్ లో ఇన్సులిన్ పెంచుతుంది. హైపర్ గ్లిసిమియాను తగ్గిస్తుంది. అందువల్ల ఇవి డయాబెటిస్ పేషంట్స్ కు మంచిదని చెప్పవచ్చు.

యాంటీఆక్సిడెంట్స్ :

యాంటీఆక్సిడెంట్స్ :

తేనెలో, ఖర్జూరంలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ప్లాక్యుతో పోరాడుతుంది. శరీరం లోపల ఉండే ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. దాంతో క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

తేనె మలబద్దకం, పొట్ట ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది. లాక్సేటివ్ గా పనిచేస్తుంది. ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాను యాక్టివేట్ చేస్తుంది. దాంతో జీర్ణ శక్తి పెరుగుతుంది. ఫుడ్ అలర్జీలను తగ్గిస్తుంది. డైజెస్టివ్ ట్రాక్ లో ఫంగస్ ను తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది

రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది

రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది

తేనె, ఖర్జూరం కాంబినేషన్ తినడం వల్ల హీమోగ్లోబిన్ , రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ పెరుగుతుంది. తేనె, ఖర్జూరంను నీటిలో మిక్స్ చేసి తాగడం వల్ల రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. తేనె పాజిటివ్ ఎఫెక్ట్ ను కలిగి ఉండటం వల్ల బ్లడ్ ప్రెజర్ ను నార్మల్ గా ఉంచుతుంది.

 కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది

కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది

తేనెలో జీరో ఫ్యాట్ అధికంగా ఉంటుంది. ఫిట్ గా ఉండాలని కోరుకునే వారికి ఇది ఒక అద్భుత ఉపాయం. తేనె శరీరంలో ఇన్పులిన్ పెంచుతుంది. ఇది గ్లూకోజ్ మెటబాలిజంకు సహాయపడుతుంది, గ్లూకోజ్ ను ఫ్యాట్ గా మారడాన్ని విచ్చిన్నం చేసి, కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనేకునే వారికి ఇది ఉత్తమం.

English summary

What Happens When You Eat Honey Soaked Dates Daily

Honey is natural sweetner and is popular as an important medical remedy for many millennia. It has been used for countless purposes over the years and has proven to be very beneficial for health.
Desktop Bottom Promotion