For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉదయాన్నే పరగడుపున రాగి పాత్రలోని నీళ్ళు తాగితే పొందే అద్భుత ప్రయోజనాలు..!!

రాగిపాత్రలో నీటిని నిల్వచేయడం ఆయుర్వేదం ప్రకారం ' తమరా జల ' అంటారు మరియు ఇలా రాగిపాత్రలో నీటిని నిల్వ చేయాలనుకున్నప్పుడు కనీసం ఎనిమిది గంటల సమయం నిల్వచేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది.

|

పురాతన కాలంలో కాపర్ వెజల్లోని నీళ్ళలను ఎక్కువగా తాగేవారు. పురాతన కాలంలో రాగి బిందెలు, రాగిపాత్రలు బాగా ప్రసిద్ది చెందినవి. రాగిపాత్రలో నీళ్ళు తాగినా, రాగి పాత్రల్లో వంటలు చేసుకుని తిన్నా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని చాలా మంది నమ్మకం. నమ్మకం మాత్రమే కాదు ఇది వాస్తవం కూడా. అందుకోసం రాగి పాత్రలో నీళ్ళు నింపి పెట్టడం వల్ల ఎన్ని రోజులైనా పాడవ్వకుండా ఉంటాయనేది పూర్వీకుల నమ్మకం. రాగిపాత్రలోని నీళ్ళు తాగడం వల్ల శరీరానికి ఇక థెరఫిటిక్ వలె పనిచేస్తుందని చాలా మంది నమ్మకం.

Why Drink Water From Copper Containers?

ఆయుర్వేదం ప్రకారం నీటిని రాగిపాత్రలో నిల్వ చేయడం ద్వారా (వాత, కఫా మరియు పిత్తాశయ) వంటి ఈ మూడు దోషాలను మీ శరీరంలో సమతుల్యం చేసే సామర్థ్యంను కలిగి ఉంటుంది. అంతే కాదు ఇది మన శరీరంలో పాజిటివ్ లక్షణాలను ఎక్కువగా కలిగిస్తుంది. రాగిపాత్రలో నీటిని నిల్వచేయడం ఆయుర్వేదం ప్రకారం ' తమరా జల ' అంటారు మరియు ఇలా రాగిపాత్రలో నీటిని నిల్వ చేయాలనుకున్నప్పుడు కనీసం ఎనిమిది గంటల సమయం నిల్వచేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది.

అందుకే ఈ పద్దతిని ఆ నాటి కాలం నుండి ఈ నాటి వరకూ అనుసరిస్తూనే ఉన్నారు. రాగి పాత్రల్లో నీళ్ళు తాగడం వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

బెనిఫిట్ # 1 :

బెనిఫిట్ # 1 :

రాగిపాత్రల్లో నీళ్ళు స్టోర్ చేయడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. మరియు శరీరంలో ఫ్యాట్ చాలా ఎఫెక్టివ్ గా కరుగుతుంది. పొట్టలో వ్యర్థాలను చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. తిన్న ఆహారం తేలికగా జీర్ణం చేస్తుంది. ఈ ప్రొసెస్ అంతా కాపర్ లో ఉండే లక్షణాల వల్ల జరగుతుంది. అందుకే చాలా మంది ఉదయం రాగి చెంబులోని నీళ్ళు తాగుతుంటారు.

బెనిఫిట్ # 2

బెనిఫిట్ # 2

రాగి పాత్రలోని నీళ్ళు తాగడం వల్ల హార్ట్ హెల్త్ కు చాలా ప్రయోజనం కలుగుతుంది. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. రక్తనాళాల్లో ప్లాక్స్ చేరకుండా రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది.

బెనిఫిట్ # 3

బెనిఫిట్ # 3

చర్మంలో వ్రుద్దాప్య ఛాయలు కనబడకుండా ఫ్రీరాడికల్ డ్యామేజ్ ను నివారిస్తుంది. దాంతో ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.

బెనిఫిట్ # 4

బెనిఫిట్ # 4

థైరాయిడ్ క్రియలు సక్రమంగా జరగాలంటే అందుకు రాగి చాలా అవసరం అవుతుంది. కాబట్టి, రాగి పాత్రలోని వాటర్ తాగడం వల్ల కాపర్ లోపంను నివారిస్తుంది.

బెనిఫిట్ # 5

బెనిఫిట్ # 5

వివిధ రకాల పోషకాల్లో కాపర్ ఒకటి ఇది బ్రెయిన్ సిగ్నల్స్ ను స్పూడ్ అప్ చేస్తుంది. బ్రెయిన్ ఫంక్స్ ను చురుగ్గా జరిగేందుకు సహాయపడుతుంది.

బెనిఫిట్ # 6

బెనిఫిట్ # 6

కాపర్ లో కొన్ని రకాల బ్యాక్టీరియాలను నాశనం చేసే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంది. ముఖ్యంగా కోలి అనే బ్యాక్టీరియాను నివారించడంలో ఇది గ్రేట్ గా సమాయపడుతుంది. ముఖ్యంగా వాటర్ తో వచ్చే వ్యాధులను నిర్మూలించడంలో కాపర్ గ్రేట్ గా సహాయపడుతుంది. వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.

బెనిఫిట్# 7

బెనిఫిట్# 7

కాపర్ లో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి, ఇది ఆర్థ్రైటిస్ లక్షణాలను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. నొప్పులను , వాపులను తగ్గిస్తుంది.

బెనిఫిట్# 8

బెనిఫిట్# 8

రాగిలో యాంటీబ్యాక్టిరాయల్ లక్షణాలతో పాటు, యాంటీ వైరల్ లక్షణాలు కూడా అధికంగా ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వల్ల వ్యాధులు త్వరగా నయం అవుతాయి . అంతే కాదు ఈ లక్షణాలన్నీ కూడా బ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. మరియు శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతాయి .

బెనిఫిట్# 9

బెనిఫిట్# 9

మనం తినే ఆహారం ద్వారా రక్తంలో ఐరన్ గ్రహించడానికి కాపర్ గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో అనీమియా సమస్యను దూరం చేసుకోవచ్చు.

English summary

Why Drink Water From Copper Containers?

Why is drinking water in copper vessel in morning considered healthy? Well, read on to know about the benefits of water storage in copper vessel...
Story first published: Monday, January 16, 2017, 17:05 [IST]
Desktop Bottom Promotion