For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 15 అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్స్..

వరల్డ్ హెల్త్ డే రాబోతున్నది. ఈ సందర్భంగా ఆరోగ్య పరంగా అనేక విషయాలను మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా బాధిస్తున్న అంత్యంత ప్రమాదకర, ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి.

|

వరల్డ్ హెల్త్ డే రాబోతున్నది. ఈ సందర్భంగా ఆరోగ్య పరంగా అనేక విషయాలను మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా బాధిస్తున్న అంత్యంత ప్రమాదకర, ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి.

క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి అని మనందరికి తెలుసు, క్యాన్సర్ వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది చనిపోతున్నారు. అలాగే తరచూ క్యాన్సర్ పేషంట్స్ సంఖ్య కూడా పెరుగుతోంది.

క్యాన్సర్ ఒక దీర్ఘకాలిక వ్యాధి దీన్ని సకాలంలో గుర్తించలేదంటే ప్రాణానికే ప్రమాదం . కొన్ని రకాల క్యాన్సర్ లక్షణాలు కూడా బయటపడకుండా ఒకే సారి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నప్పుడు మాత్రమే గుర్తిస్తుంటారు. అదే విధంగా, క్యాన్సర్లో కూడా వివిధ రకాలున్నాయి. వాటిలో కొన్ని కామన్ గా వినపడుతున్న పేర్లు బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ మరికొన్ని ..

World Health Day : 15 Major Types Of Cancer You Need To Watch Out For!

చాలా మందికి క్యాన్సర్ మీద ఏమాత్రం అవగాహన ఉండదు. ఇది ప్రాణాంతకమైన ప్రమాదకర వ్యాధి. ఇది శరీరంలో ఒక భాగంలో క్యాన్సర్ కణాలు ఏర్పడితే వేగంగా శరీరం మొత్తం వ్యాప్తి చెందుతుంది. శరీరం మొత్తం క్యాన్సర్ సెల్స్ తో నిండిపోయి, శరీరంలో రక్తకణాలను, హార్మోనులను అస్తవ్యస్థం చేసి, ప్రాణాపాయ స్థితికి తీసుకొస్తుంది.

కొన్ని రకాల క్యాన్సర్లను , క్యాన్సర్ లక్షణాలను ట్రీట్ చేయడం కూడా కష్టమే. ఈ క్యాన్సర్ కారక ఫెటలిటి రేట్స్ అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ ను నివారించడం కష్టం అవుతుంది. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కొన్ని రకాల క్యాన్సర్స్ గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం..

బ్రెస్ట్ క్యాన్సర్ :

బ్రెస్ట్ క్యాన్సర్ :

మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ , ఇది ఏ వయస్సు వారికైనా వస్తుంది. బ్రెస్ట్ లో ట్యూమర్స్ ఏర్పడటం వల్ల బ్రెస్ట్ టిష్యులను నాశనం చేస్తుంది.

లంగ్ క్యాన్సర్:

లంగ్ క్యాన్సర్:

సహజంగా ఈ క్యాన్సర్ స్మోక్ చేసే వారికి వస్తుంటుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఫెటల్ టైప్ క్యాన్సర్, ఈ క్యాన్సర్ లక్షణాలు, శ్వాస సరిగా తీసుకోకపోవడం, తరచూ ముక్కులు మూసుకుపోవడం, దగ్గు, దగ్గినప్పుడు రక్తం, కల్లెం పడటం కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు.

బ్రెయిన్ క్యాన్సర్ :

బ్రెయిన్ క్యాన్సర్ :

బ్రెయిన్ క్యాన్సర్ నే బ్రెయిన్ ట్యూమర్స్ అని కూడా అంటారు. ఈ క్యాన్సర్ లక్షణాలు, తరచూ తలనొప్పి, మతిమరుపు , గందరగోళం, మాటలు తడబడటం, వికారం , వాంతులు వంటి లక్షణాలు కనబడుతాయి.

బ్లాడర్ క్యాన్సర్:

బ్లాడర్ క్యాన్సర్:

బ్లాడర్ క్యాన్సర్ స్త్రీ, పురుషులిద్దరిలోనూ వస్తుంది. బ్లాడర్ క్యాన్సర్ కామన్ టైప్ క్యాన్సర్ లక్షణాలు కలిగి ఉంటుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పి, యూరిన్ లో రక్తం పడటం మొదలగు లక్షణాలు కణబడుతాయి.

సర్వికల్ క్యాన్సర్:

సర్వికల్ క్యాన్సర్:

సర్వికల్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా వస్తుంది. నెలలో ఒకటి రెండు సార్లు బ్లీడింగ్ అవ్వడం, ఎక్కువగా తిమ్మెర్లు పట్టేస్తుండటం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, బ్లడ్ డిశ్చార్జ్ వంటి లక్షణాలను కనబడుతాయి.

కోలన్ క్యాన్సర్ :

కోలన్ క్యాన్సర్ :

కోలన్ క్యాన్సర్ ప్రేగులకు సంబంధించినది, ఈ క్యాన్సర్ లక్షణాలు పొట్ట ఉదరంలో నొప్పి, రెక్టమ్ లో నొప్పి, ఆకలి తగ్గిపోవడం, అల్సర్, పొట్ట నొప్పి వంటి లక్షణాలు కనబడుతాయి.

కిడ్నీ క్యాన్సర్ :

కిడ్నీ క్యాన్సర్ :

కిడ్నీ క్యాన్సర్ చాలా అరుదుగా వస్తుంది. అయితే లక్షణాలు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటాయి. యూరిన్ లో రక్తం, బ్యాక్ పెయిన్, హైబిపి, పాదాల వాపులు వంటి లక్షణాలు కనబడుతాయి.

లుకేమియా:

లుకేమియా:

ఇది కూడా బ్లడ్ క్యాన్సర్, ఇది బ్లడ్ సెల్స్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అలసట, జాయింట్ పెయిన్, తరచూ లూజ్ మోషన్, వాంతులు, మోషన్ లో రక్తం పడటం వంటి లక్షణాలు కనబడుతాయి.

 లివర్ క్యాన్సర్:

లివర్ క్యాన్సర్:

లివర్ క్యాన్సర్ ఎక్కువగా ఆల్కహాల్ వల్ల పాడవుతుంటుంది. లివర్ క్యాన్సర్ లక్షణాలు పొట్టనొప్పి, అజీర్తి, పొట్టలో నీరు చేయడం, వాంతులు వంటి లక్షణాలు ఎక్కువగా కనబడుతుంటాయి.

ఓవేరియన్ క్యాన్సర్ :

ఓవేరియన్ క్యాన్సర్ :

ఓవేరియన్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కనబడుతుంది. ఓవేరియన్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా కడుపుబ్బరం, పొట్ట ఉదయంలో నొప్పి, లూజ్ మోషన్ , వికారం వంటి లక్షణాలు కనబడుతాయి.

 స్కిన్ క్యాన్సర్ :

స్కిన్ క్యాన్సర్ :

స్కిన్ క్యాన్సర్ నే మెలనోమా అని పిలుస్తారు, స్కిన్ క్యాన్సర్ వల్ల చర్మం డార్క్ గా మారుతుంది. చర్మంలో లప్స్, మోల్స్ ఏర్పడటం వంటి లక్షణాలు కనబడుతాయి.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్:

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్:

వివిధ రకాల క్యాన్సర్లలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఒకటి. పొట్ట ఉదరం మరియు బ్యాక్ పెయిన్ , మోషన్ లో రక్తం పడటం, వైట్ స్టూల్, కళ్లు పచ్చగా మారడం, అలసట వంటి లక్షణాలను చూపెడుతాయి.

ప్రొస్టేట్ క్యాన్సర్ :

ప్రొస్టేట్ క్యాన్సర్ :

ప్రొస్టేట్ క్యాన్సర్ పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. మూత్రవిసర్జనలో అసౌకర్యంగా ఉండటం, తరచూ మూత్రవిసర్జన చేయాల్సి రావడం, పొట్ట ఉదరంలో నొప్పి, అలసట లక్షణాలు కనబడుతాయి.

థైరాయిడ్ క్యాన్సర్ :

థైరాయిడ్ క్యాన్సర్ :

థైరాయిడ్ క్యాన్సర్ అనేది చాలా రేర్ గా వస్తుంటుంది. ఈ క్యాన్సర్ వల్ల గొంతుబాగంలో లంప్స్, లింప్ నోడ్స్ లో వాపు, హార్మోన్స్ అసమతుల్యత వంటి లక్షణాలు కనబడుతాయి.

యుటేరియన్ క్యాన్సర్ :

యుటేరియన్ క్యాన్సర్ :

యుటేరియన్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా ప్రభావితం అవుతుంటారు. పెల్విక్ ఏరియాలో నొప్పి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెవీ బ్లీడింగ్, రతిలో నొప్పి అనిపించడం వంటి లక్షణాలు కనబడుతాయి.

English summary

World Health Day : 15 Major Types Of Cancer You Need To Watch Out For!

'World Health Day' is round the corner and on this occasion, let us learn more about one of the deadliest diseases that can affect living beings - cancer.
Story first published: Thursday, April 6, 2017, 17:58 [IST]
Desktop Bottom Promotion