For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెవి ఇన్ఫెక్షన్ చికిత్సకి ఉత్తమమైన 10 ఎసెన్షియల్ ఆయిల్స్

చెవులు శరీరంలోని భాగాలలో చాలా సున్నితమైనవి, అవి ఇన్ఫెక్షన్ కి గురయితే, అది చాలా బాధగా ఉంటుంది. సాధారణంగా చెవి మధ్యలో వచ్చే సాధారణ చెవి ఇన్ఫెక్షన్ ని ఒటిటిస్ అని పిలుస్తారు.

By Gandiva Prasad Naraparaju
|

చెవులు శరీరంలోని భాగాలలో చాలా సున్నితమైనవి, అవి ఇన్ఫెక్షన్ కి గురయితే, అది చాలా బాధగా ఉంటుంది. సాధారణంగా చెవి మధ్యలో వచ్చే సాధారణ చెవి ఇన్ఫెక్షన్ ని ఒటిటిస్ అని పిలుస్తారు.

కొద్దిగా లేదా విపరీతంగా చెవి నొప్పి, చెవిలో ఒత్తిడిగా ఉన్నట్టు అనిపించడం, అసౌకర్యం లేదా చెవి పూడుకు పోయినట్టు ఉండడం, వినపడక పోవడం, గొంతులో మంట, జ్వరం, ఇలాంటి అనేక సమస్యలు చెవి ఇన్ఫెక్షన్ లక్షణాలు.

Best Essential Oils For Ear Infection

సహజమైన ఎసెన్షియల్ ఆయిల్స్ తో చెవి ఇన్ఫెక్షన్ ను చికిత్స చేసుకోవడం మంచి పద్ధతి, కొన్ని చుక్కల వైద్య పరిష్కారాలతో వీటిని పోగొట్టుకోవచ్చు. అనేక రుగ్మతలు అలాగే అనేక రకాల ఉపశామనాల నివారణకు ఎన్నో వైద్య ప్రయోజనాలు ఉన్నాయి.

<strong>చెవి ఇన్ఫెక్షన్, చెవి నొప్పి నివారించే వెల్లుల్లి రెమెడీస్</strong>చెవి ఇన్ఫెక్షన్, చెవి నొప్పి నివారించే వెల్లుల్లి రెమెడీస్

చిన్న వయసు పిల్లలు కూడా చివరికి చెవి ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు, దాన్ని భరించడం వారికి చాలా బాధతో కూడిన విషయం. అసౌకర్యం, జ్వరం, తలనోపి, నిద్ర సమస్య, అరగక పోవడం వంటి వాటితో వారికి చాలా కష్టంగా ఉండొచ్చు.

చెవి ఇన్ఫెక్షన్ కి ఉత్తమమైన 10 ఎసెన్షియల్ ఆయిల్స్ పై ఒకసారి దృష్టి పెడదాము.

1.ఒరేగానో ఆయిల్

1.ఒరేగానో ఆయిల్

శక్తివంతమైన యాంటీ బాక్టీరియా, యాంటీ-వైరల్ లక్షణాలు కలిగిన ఈ ఒరిగానో ఆయిల్ చెవి ఇన్ఫెక్షన్ కి అద్భుతమైన చికిత్స. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా స్వాసకోస, చెవి కెనాల్ లో మంటను తగ్గిస్తుంది.

2.రోజ్ మేరీ ఆయిల్

2.రోజ్ మేరీ ఆయిల్

చెవి ఇన్ఫెక్షన్ చికిత్సకు రోజ్ మేరీ ఆయిల్ అత్యంత బహుముఖ ఆయిల్ లో ఒకటి. ఈ ఆయిల్ మీ చెవి మధ్యలో నొప్పికి కారణమైన ఇన్ఫెక్షన్ బాక్టీరియాని త్వరగా నాశనం చేస్తుంది. రోజ్ మేరీ ఆయిల్ సైనస్ ఇన్ఫెక్షన్ ని కూడా తగ్గించే సామర్ధ్యం కలిగి ఉంది.

3.టీ ట్రీ ఆయిల్

3.టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలకు పేరుగాంచింది. ఇది చెవి ఇన్ఫెక్షన్ కోసం ఉపయోగించే అత్యధికమైన నూనేలలో ఒకటి. కొన్ని వేల సంవత్సరాలుగా, ఈ ఆయిల్ ను అన్నిరకాల ఇన్ఫెక్షన్ లకు చికిత్సగా ఉపయోగిస్తున్నారు.

4.బేసిల్ ఆయిల్

4.బేసిల్ ఆయిల్

తులసి లోని అద్భుతమైన ప్రయోజనాలు, అందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు. అయితే, బేసిల్ ఆయిల్ యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మిశ్రమాలు కలిగి ఉన్న అద్భుతమైన చికిత్స నూనె ఇది చిన్నపిల్లలు, పెద్దవారు ఇద్దరి చెవి ఇన్ఫెక్షన్ లకు అద్భుతమైన చికిత్స.

5.ఆలివ్ ఆయిల్

5.ఆలివ్ ఆయిల్

ఆయిల్ ఆయిల్ ని వంటలలో వాడతారు, కానీ దీనికి చెవి ఇన్ఫెక్షన్ ని తగ్గించే సామర్ధ్యం కూడా ఉంది. ఆలివ్ ఆయిల్ లో ఉండే శక్తివంతమైన యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ బాక్టీరియల్ లక్షణాల వల్ల సైనస్ బ్లాకేజ్ లకు ఉపశమనాన్ని ఇచ్చి, వినికిడిని బాగా మెరుగుపరుస్తుంది.

6.థైమ్ ఆయిల్

6.థైమ్ ఆయిల్

థైమ్ ఆయిల్ శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. చెవి ఇన్ఫెక్షన్ చికిత్స కోసం, థైమ్ ఆయిల్ త్వరగా ఒత్తిడి నుండి ఉపశమనాన్ని కలిగించి, చెవి మధ్యలో నొప్పిని తగ్గిస్తుంది, స్వాసకోస విధానంలో కలిగే ఇన్ఫెక్షన్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది కూడా.

7.మస్టర్డ్ ఆయిల్

7.మస్టర్డ్ ఆయిల్

చాలామంది వంటకాలలో ఎక్కువగా వాడే అత్యంత సాధారణ ఆయిల్స్ లో మస్టర్డ్ ఆయిల్ ఒకటి. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండడం వల్ల చివి ఇంఫెక్షన్ చికిత్సకు సహజ ఉపశమనంగా ఉంది.

8.లావెండర్ ఆయిల్

8.లావెండర్ ఆయిల్

లావెండర్ ఆయిల్ ఎటువంటి అనుమానం లేకుండా చెవి ఇన్ఫెక్షన్ కు ఇతర ఇన్ఫెక్షన్ల కు కూడా మంచి చికిత్స. లావెండర్ ఆయిల్ రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా త్వరగా నయంచేస్తుంది, మంట కు కారణమయిన ఇన్ఫెక్షన్ ను కూడా తగ్గిస్తుంది. ఈ ఆయిల్ సైనస్ కావితీ లో ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

9.యూకలిప్టస్ ఆయిల్

9.యూకలిప్టస్ ఆయిల్

మంటను తగ్గించే ఉత్తమమైన ఎసెన్షియల్ ఆయిల్స్ లో యూకలిప్టస్ ఆయిల్ ఒకటి. ఈ ఆయిల్ చెవిలో పెరిగే ద్రవాన్ని నిరోధించి, ద్రవం బైటికి వెళ్ళడానికి సహాయపడి, ఇన్ఫెక్షన్ తక్షణమే తగ్గేట్టు చేస్తుంది. యూకలిప్టస్ ఆయిల్ స్వాసకోస లో ఎటువంటి ఇతర ఇన్ఫెక్షన్ల కు కూడా చికిత్సగా పనిచేస్తుంది.

<strong>చెవి ఇన్ ఫెక్షన్ నివారణకి ఎఫెక్టివ్ హోం రెమెడీస్</strong>చెవి ఇన్ ఫెక్షన్ నివారణకి ఎఫెక్టివ్ హోం రెమెడీస్

10.పెప్పర్మింట్ ఆయిల్

10.పెప్పర్మింట్ ఆయిల్

పెప్పర్మింట్ ఆయిల్ చాలా సున్నితమైనది, ఇది వేగంగా మంటను తగ్గించే శక్తిని కలిగి ఉంటుంది. చెవికి సంబంధించిన నొప్పులకు ఈ ఆయిల్ ను ఉపయోగిస్తారు. ఈ నూనెను పిల్లలకు కూడా వాడవచ్చు, కానీ దీనిలో జోజోబా ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ ని కలపాలి.

ఈ ఆర్టికిల్ ని షేర్ చేయండి!

English summary

10 Best Essential Oils For Ear Infection

The common ear infection known as acute otitis media happens in the middle of the ear. The symptoms of ear infections include mild or severe ear pain, persistent feeling of pressure in the ear, discomfort or stuffiness in the ear, hearing loss, sore throat, fever and many more such problems. To cure ear infection naturally, essential oils work the best
Story first published:Wednesday, January 3, 2018, 16:12 [IST]
Desktop Bottom Promotion