For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 10 ఉత్తమ ఇంటి చిట్కాల ద్వారా జ్ఞాన దంతం నొప్పిని తగ్గించుకోవచ్చు :

By R Vishnu Vardhan Reddy
|

కొన్ని సందర్భాల్లో జ్ఞాన దంతం వల్ల నొప్పి విపరీతంగా వస్తుంది. సాధారణంగా 17 నుండి 25 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అప్పటికే దవడల భాగంలో మరియు పక్క భాగంలో పళ్ళు ఉండటంతో సరైన విధంగా పెరగడానికి జ్ఞాన దంతానికి అవసరమైన స్థలం నోట్లో ఉండదు. దీని వల్ల విపరీతమైన నొప్పి, చిగుర్లు వాచిపోవడం, కొద్దిగా జ్వరం రావడం మరియు నోరు తెరిచేటప్పుడు మరియు దేనినైనా మింగేటప్పుడు సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు జ్ఞాన దంతం నొప్పి వల్ల కలుగుతుంటాయి.

ఈ లక్షణాలే కాకుండా విపరీతమైన తలనొప్పి, ఆహారాన్ని నమిలేటప్పుడు లేదా కొరికేటప్పుడు సమస్యలు రావడం మరియు నోటి నుండి దుర్వాసన రావడం వంటి లక్షణాలు కూడా కనపడతాయి. జ్ఞాన దంతం వచ్చే ముందు మనకు ఎటువంటి సంజ్ఞ గాని, ఎటువంటి హెచ్చరిక గని అందదు. కావున అది భరించినలేనంత నొప్పిని కలిగిస్తూ ఉంటుంది.

అయితే మీరు భరించలేనంత నొప్పిని అనుభవిస్తున్నట్లైతే , అటువంటి సమయంలో మీరు ఆ నొప్పి భారి నుండి బయట పడటానికి ఒక దంత వైద్యుడ్ని సంప్రదించాలి. మీకు గనుక కొద్దిగా నొప్పి మాత్రమే ఉండి మరియు దంత వైద్యుడి వద్దకు వెళ్ళడానికి భయపడుతున్నట్లైతే, తాత్కాలిక ఉపశమనం కోసం కొన్ని ఇంటి చిట్కాలు ఈ వ్యాసంలో చెప్పడం జరిగింది.


ఈ వ్యాసంలో జ్ఞాన దంతం నొప్పి వచ్చినప్పుడు తక్షణం ఉపశమనం పొందడానికి అవసరమయ్యే ఉత్తమ ఇంటి చిట్కాలను చెప్పడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

లవంగం :

లవంగం :

జ్ఞాన దంతం వల్ల కలిగే నొప్పిని తగ్గించడంలో లవంగం ఎంతగానో సహాయపడుతుంది. ఎందుకంటే, దానిలో మత్తుని కలిగించే మరియు బాధనివారిణిగా ఉపయోగపడే లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాల వల్ల నొప్పిని అది తక్షణమే తాత్కాలికంగా తగ్గించివేస్తుంది.

మూడు లవంగాలను మీ నోటి లోపల ఉంచుకోవడం వల్ల నొప్పి తగ్గిపోనుంది.

కొబ్బరి నూనె :

కొబ్బరి నూనె :

జ్ఞాన దంతం యొక్క నొప్పిని నయం చేసుకోవడానికి ప్రభావవంతంగా పనిచేసే మరొక చిట్కా కొబ్బరి నూనె. ఎందుకంటే, ఇందులో నొప్పి నివారిణి మరియు క్రిమి కీటకాలకు వ్యతిరేకంగా పనిచేసే లక్షణాలు కూడా ఉన్నాయి. దీనివల్ల చిగుళ్ళల్లో మంట రాకుండా మరియు అవి వాచిపోకుండా చేస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె ను నోటి లోపల వేసుకొని 20 నిమిషాల పాటు బాగా పుక్కలించి బయటకు ఊసేయండి. ఇలా చేసిన తర్వాత మీ నోటిని గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోండి.

వెల్లుల్లిపాయ :

వెల్లుల్లిపాయ :

వెల్లుల్లి పాయలో నొప్పిని తగ్గించే, యాంటీ బయోటిక్ మరియు యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల మీ యొక్క జ్ఞాన దంతం నొప్పి నుండి విముక్తులు అవుతారు. నొప్పిని తగ్గించడంలో వెల్లులిపాయ రసం అద్భుతాలను సృష్టిస్తుంది.

ఒకటి నుండి రెండు ముక్కల వెల్లుల్లిపాయలను తీసుకొని చితక్కొట్టండి. ఆ ముద్దని మీ జ్ఞాన దంతం దగ్గర పెట్టండి.

వేరుశెనగ వెన్న :

వేరుశెనగ వెన్న :

వేరుశెనగ వెన్న జ్ఞాన దంతం నొప్పిని తగ్గిస్తుంది అని మీకు తెలుసా ? మంటని తగ్గించే మరియు మత్తుని కలిగించే లక్షణాలు వేరుశెనగలో ఉండటంతో, అవి జ్ఞాన దంతం నొప్పిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి.

ఒక టీ స్పూన్ వేరుశెనగ వెన్న ను మీ వేలికి తీసుకోండి. దానిని మీ జ్ఞాన దంతం పరిసర ప్రాంతంలో రాయండి.

ఉప్పు :

ఉప్పు :

జ్ఞాన దంతం నొప్పిని చికిత్స చేయడానికి ఉత్తమైన ఇంటి చిట్కాలతో ఉప్పు కూడా ఒకటి. జ్ఞాన దంతం వల్ల చిగుళ్ల ప్రాంతంలో కలిగే మంటని తగ్గిస్తుంది మరియు సంక్రమణలు రాకుండా కాపాడుతుంది.

గోరువెచ్చటి నీటిలో ఒక టీ స్పూన్ ఉప్పుని కలపండి. ఈ మిశ్రమాన్ని పుక్కలించండి ఇలా రోజులో అనేక సార్లు చేయండి.

పొదీనా :

పొదీనా :

జ్ఞాన దంతం నొప్పిని నివారణించడంలో అతిప్రాచీనమైన కాలం నుండి వాడుతూ ప్రభావవంతమైన చిట్కాగా పొదీనాకు ప్రత్యేకస్థానం ఉంది. ఇందులో మత్తుని కలిగించే లక్షణాలు ఉండటం వల్ల మీకు నొప్పి వెంటనే తగ్గుతుంది.

పొదీనా ఆకులను నమలండి లేదా పొదీనా నూనెను నొప్పి ఉన్న ప్రాంతంలో రాయండి.

టీ ట్రీ నూనె :

టీ ట్రీ నూనె :

జ్ఞాన దంతం నొప్పి పై ప్రభావవంతంగా పనిచేసి ఆ నొప్పిని తగ్గించడంలో టీ ట్రీ నూనె కూడా ఉత్తమైన ఇంటి చిట్కాగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న సూక్ష్మ జీవుల వ్యతిరేక లక్షణాలు మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు ఇందుకు ఎంతగానో దోహదపడతాయి.

రెండు చుక్కలు టీ ట్రీ నూనె ను మీ వేళ్ళపై తీసుకొని నొప్పి ఉన్న ప్రాంతం లో చిగుళ్లకు రాయండి.

వేడి లేదా చల్లటి కాపడం పెట్టడం :

వేడి లేదా చల్లటి కాపడం పెట్టడం :

వేడి లేదా చల్లటి కాపడం వల్ల చిగుళ్లకు వచ్చే నొప్పి మరియు వాపుని తగ్గించవచ్చు. జ్ఞాన దంతం నొప్పిని తగ్గించడంలో ఈ రెండు విధానాలు ఉత్తమంగా పనిచేస్తాయి.

ఒక ఐస్ ప్యాక్ ని లేదా వేడినీటి బ్యాగ్ ని తీసుకోండి. దానిని జ్ఞాన దంతం ప్రాంతంలో ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ కాపడం పెట్టండి.

సేజ్ మొక్కను వాడటం :

సేజ్ మొక్కను వాడటం :

జ్ఞాన దంతం నొప్పిని తగ్గించి తక్షణ ఉపశమనం ఇవ్వడంలో సేజ్ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే అందులో మంటను నివారించే లక్షణాలు మరియు సూక్ష్మ క్రిములకు వ్యతిరేకంగా పనిచేసే గుణాలు ఉన్నాయి.

ఎండిన మరియు చూర్ణం చేసిన రెండు టీ స్పూన్ల సేజ్ ఆకుల పొడిని మరియు ఒక టీ స్పూన్ ఉప్పుని ఒక కప్పు నీటిలో వేయండి.

ఈ మిశ్రమాన్ని మూడు నిమిషాల పాటు నోటిలో పుక్కలించండి.

ఆతర్వాత బయటకు ఊసి, మీ నోటిని శుభ్రంగా కడుకోండి.

నిమ్మకాయ రసం మరియు ఉప్పు :

నిమ్మకాయ రసం మరియు ఉప్పు :

నిమ్మకాయలో మంటను తగ్గించే లక్షణాలు మరియు ఉప్పులో సూక్ష్మ క్రిములకు వ్యతిరేకంగా పనిచేసే గుణాలు ఉంటాయి. ఈ రెండింటి మిశ్రమం జ్ఞాన దంతం నొప్పిని నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

అర్ధ ముక్క నిమ్మకాయ నుండి రసాన్ని బయటకు తీయండి. దానికి కొద్దిగా నీటిని కలపండి.

దీనికి మరికొంత ఉప్పుని కలిపి ఆ మిశ్రమాన్ని జ్ఞాన దంతం నొప్పి ఉన్న ప్రాంతంలో రాయండి.

English summary

10 Best Home Remedies For Wisdom Tooth Pain

10 Best Home Remedies For Wisdom Tooth Pain, Wisdom teeth are very painful and these usually occur in individuals aged between 17 to 25 years. Read on to know the best home remedies for wisdom tooth pain to provide you instant relief.
Desktop Bottom Promotion