For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వీట్స్ తినకూడదని ఎంత కంట్రోల్ చేయాలన్నా మీ వల్ల కావట్లేదా?అయితే ఇవి తినండి స్వీట్స్ జోలికి వెళ్ళరు

By Mallikarjuna D
|

రోజుకు ఒక్కసారైనా స్వీట్స్ లేదా షుగర్ ఫుడ్స్ తింటుంటారా?

మీరు బయట వెళ్ళినప్పుడు కూడా డిజర్ట్స్ లేదా స్వీట్ డిషెస్ ను ఆర్డర్ చేస్తుంటారా?

అవును, అయితే ఈ ఆర్టికల్ మీకోసమే మీకు స్వీట్ టూత్ లేదా స్వీట్ పర్సనాలిటీని కలిగి ఉంటారు. స్వీట్స్ లేదా షుగర్ ఫుడ్స్ తినే వారికి ఒక పరిమితం అంటూ ఉండదు!

ముఖ్యంగా, ఇండియా వంటి దేశంలో స్వీట్ డిష్ లేనిదే భోజనం ముగయదు. భోజనంలో కానీ, శుభకార్యానికి కానీ రుచికరమైన స్వీట్ అందివ్వాల్సిందే ! మరీ ఇలాంటి వారిని స్వీట్ తినకండి అని చెప్పలేము. లేదా స్వీట్ తినకూడదని చెప్పడం కూడా కష్టమే.

10 Foods That Curb Sugar Cravings

అయితే, ఎక్సెస్ షుగర్ ఫుడ్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ , స్వీట్స్ తినకూడదన్న విషయం మనలో చాలా మందికి తెలిసిందే. ఇది ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది!

ఎక్కువ స్వీట్స్ కానీ, షుగర్ ఫుడ్స్ కానీ తినడం వల్ల ఆరోగ్య పరంగా డయాబెటిస్, ఓబేసిటి, హైకొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, ఇంకా క్యాన్సర్ వంటి ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కోవల్సి వస్తుంది.

స్వీట్స్ తినకూడదని ఎంత కంట్రోల్ చేయాలన్నా మీ వల్ల కావట్లేదనేట్లైతే , ఇక్కడ కొన్ని షుగర్ కర్వింగ్ ఫుడ్స్, స్వీట్స్ తినాలనే కోరికను న్యాచురల్ గా తగ్గించే ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

1. కీరదోసకాయ

1. కీరదోసకాయ

కీరదోసకాయ కూలింగ్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటుంది. ఇది హెల్తీ వెజిటేబుల్ దీన్ని రెగ్యులర్ గా తినడం మంచిది, కీరదోసకాయలో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎసిడిటి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతే కాదు, కీరదోసకాయలో జీర్ణక్రియకు సహాయపడే యాసిడ్స్ ను ఉత్పత్తి చేస్తుంది. స్వీట్స్ తినాలనే కోరికను తగ్గిస్తుంది.

2. స్పిరిలినా

2. స్పిరిలినా

స్పిరిలినా గురించి చాలా మందికి తెలుసు, దీన్ని హెల్తీ జ్యూస్ ల తయారీలో వాడుతుంటారు ?స్పిరులినా కళ్ళ ఆరోగ్యాన్ని, జుట్టు ఆరోగ్యంతో పాటు, శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. స్పిరులినాలో టైరోసిన్ అనే ఎంజైమ్ అధికంగా ఉంటుంది. ఇది బ్రెయిన్ లో డోపమైన్ లెవల్స్ పెంచుతుంది. బ్రెయిల్ లో ఆరోగ్యకరమైన డోపమైన్ లెవల్స్ పెరిగినప్పుడు స్వీట్స్, మరియు షుగర్ ఫుడ్స్ మీద కోరికలు తగ్గుతాయి.

3. చీజ్

3. చీజ్

అవును చీజ్ , చీజ్ తింటే బరువు పెరుగుతారని చాలా మంది అభిప్రాయం, కానీ ఇది స్వీట్స్ తినాలనే కోరికను అమాంతం తగ్గిస్తుంది. చీజ్ లో కూడా టైరోసిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది బ్రెయిన్ లో డొపమైన్ లెవల్స్ ను పెంచి , స్వీట్స్ తినాలనే కోరికను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి, మీకు ఎప్పుడైన చాక్లెట్ బార్స్ తినాలనిపించినప్పుడు చీజ్ సహాయపడుతుంది!

4. గుడ్లు

4. గుడ్లు

అత్యధిక పోషకాలు కలిగి న్యూట్రీషియన్ బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ . గుడ్డులో ప్రోటీన్స్, ఎసెన్షియల్ మినిరల్స్ అధికంగా ఉండి, మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. గుడ్డులో ఉండే అధిక ప్రోటీన్లు పొట్టనిండేలా చేసి, ఎక్కువ సమయం ఆకలి కాకుండా నివారిస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు స్వీట్స్ తినాలనే కోరిక పెరుగుతుంది. దాంతో బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతాయి. అందువల్ల గుడ్డు తినడం వల్ల స్వీట్స్ తినాలనే కోరికను దూరం చేస్తుంది!

5. పండ్లు

5. పండ్లు

ఎప్పుడూ చాక్లెట్ తినాలని, చిన్న కేక్ తినాలని కోరికతో ఉండే వారు, ఒక బౌల్ మిక్స్డ్ ఫ్రూట్స్ తినడం వల్ల స్వీట్స్ తినాలనే కోరక తగ్గుతుంది. పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ పొట్టలో జీర్ణ రసాల ఉత్పత్తిని తగ్గిస్తుంది . లేదంటే స్వీట్స్ తినాలనే కోరికతో పాటు, ఆకలి కూడా పెరుగుతుంది.

6. లీన్ మీట్

6. లీన్ మీట్

మీకు తెలుసా, ఫిట్నెస్ కోరుకునే వారు, న్యూట్రీషియనిస్టులు ఎప్పుడు లీన్ చికెన్, లీన్ మీట్ ను వారిలో రెగ్యులర్ డైట్ లో చేర్చుుంటారు?ఎందుకంటే, లీన్ మీట్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల మజిల్స్ పెరుగుతాయి. ఫ్యాట్ కరుగుతుంది.. అదనంగా లీన్ మీట్ లో ఉండే ప్రోటీన్ కంటెంట్ షుగర్ తినాలనే కోరిక తగ్గించి, పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది.

7. అవొకాడో

7. అవొకాడో

ఆలస్యం అయినా, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.సూపర్ ఫుడ్స్ లో మొదటి వరుసలో ఉండే అవొకాడోలో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల బరువు తగ్గుతారు, బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపడుతుంది. ఎందుకంటే అవొకాడోలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. పరిశోధన ప్రకారం ఈ ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆకిలి కోరికలను బ్రెయిన్ కు చేరవేయడం తగ్గిస్తుంది. దాంతో మీబాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ క్రమంగా ఉంటాయి. దాంతో స్వీట్స్ మీద కోరికలు తగ్గుతాయి.

 8. ఆలివ్ ఆయిల్

8. ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ ఆరోగ్యకరమైనది, తినగలిగినది. వివిధ రకాల వంటలకు ఉపయోగిస్తుంటారు. ఆలివ్ ఆయిల్లో విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి మరియు ఇందులో చర్మ ఆరోగ్యం మెరుగుపరిచే గుణాల దగ్గర నుండి క్యాన్సర్ నివారణ లక్షణాలను కలిగి ఉంటాయి. ఆలివ్ ఆయిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఆకలిని తగ్గించే ద్రవాలను బ్రెయిన్ కు అందిస్తుంది. దాంతో షుగర్ కర్వింగ్స్ తగ్గుతుంది.

9. నట్స్

9. నట్స్

డాక్టర్స్ మరియు డైటీషియన్స్ స్నాక్స్ కు నట్స్ ను తీసుకోమని సూచిస్తుంటారు కదా? ఎందుకంటే నట్స్ లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి సహాయపడుతాయి. క్యాండీ బార్ తినడం కంటే, గుప్పెడు నట్స్ ను రెగ్యులర్ స్నాక్స్ గా తీసుకోండి,. ఇవి షుగర్ ఫుడ్స్, స్వీట్స్ మీద కోరికలు తగ్గించి, బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

10. డార్క్ చాక్లెట్

10. డార్క్ చాక్లెట్

చాక్లెట్స్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి?రెగ్యులర్ చాక్లెట్స్ లో షుగర్స్ అధికంగా ఉంటాయి. ఇవి అనారోగ్యకరమైనవి . డార్క్ చాక్లెట్ ఆరోగ్యకరమైనేవి అయినా అనారోగ్యరమైన షుగర్స్, ఫ్యాట్స్ ఉన్నా, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల డార్క్ చాక్లెట్ ను తినమని చెబుతుంటారు. డార్క్ చాక్లెట్ కూడా పొట్ట ఫుల్ గా నిండినట్లు అనుభూతి కలిగిస్తుంది. షుగర్ కర్వింగ్స్ మరియు జంక్ ఫుడ్స్ మీద కోరికలు తగ్గిస్తుంది!

English summary

10 Foods That Curb Sugar Cravings

Sugar cravings are one of the main reasons people have a hard time in losing weight. It can also cause your blood sugars to spike. Here is a list of foods that will curb sugar cravings naturally.
Desktop Bottom Promotion